సాక్షి, హైదరాబాద్: చదరంగోత్సవ ఆలిండియా ఓపెన్ ఫిడే రేటేడ్ చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణ ప్లేయర్ శిబి శ్రీనివాస్ ఐన్‌స్టీన్ రన్నరప్‌గా నిలిచాడు. బెంగళూరులోని బీఎంఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో సోమవారం ముగిసిన ఈ టోరీ్నలో 21 ఏళ్ల శిబి శ్రీనివాస్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో శిబి శ్రీనివాస్‌తోపాటు మరో ఇద్దరు కరణం నాగ సాయి సార్థక్ (కర్ణాటక), అవిరత్ చౌహాన్ (మహారాష్ట్ర) 7.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... శిబి శ్రీనివాస్‌కు రెండో స్థానం, సాయి సార్థక్‌కు మూడో స్థానం, అవిరత్‌కు నాలుగో స్థానం ఖరారయ్యాయి. 8 పాయింట్లతో ప్రశాంత్ నాయక్ (కర్ణాటక) విజేతగా నిలిచాడు.
శిబి శ్రీనివాస్ ఈ టోరీ్నలో ఏడు గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. ప్రణవ్ వసంత్ కుమార్ రావు, తోట విధు, అద్వైత్, హరి అన్నామలై, ఆనంది, వినాయక్ కులకరి్ణ, రవి గోపాల్ హెగ్డేలపై శిబి శ్రీనివాస్ గెలిచాడు. సంపత్ కుమార్ తిరునారాయణన్ చేతిలో ఓడిన శిబి... సాయి సార్థక్‌తో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. రన్నరప్‌గా నిలిచిన శిబి శ్రీనివాస్‌కు రూ. 40 వేల ప్రైజ్‌మనీతోపాటు ట్రోఫీ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment