సాక్షి, న్యూఢిల్లీ: ఫేమ్ ఇండియా పథకం రెండో దశలో భాగంగా తె లంగాణకు 300 ఎలక్ట్రి క్ బస్సులు మంజూరు చేశామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ తెలిపారు.
2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు 6 వరకు తెలంగాణకు ఒక్క ఎలక్ట్రిక్ బస్సును కూడా ఇవ్వలేదని శుక్ర వారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కు మార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఫేమ్ రెండో దశలో దేశ వ్యాప్తంగా మొత్తం 6,862 ఎలక్ట్రిక్ బస్సులను వివిధ రాష్ట్రాలకు అందించాల్సి ఉండగా, 4,901 బస్సులను అందించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment