runner up
-
రన్నరప్ శిబి శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: చదరంగోత్సవ ఆలిండియా ఓపెన్ ఫిడే రేటేడ్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ప్లేయర్ శిబి శ్రీనివాస్ ఐన్‌స్టీన్ రన్నరప్‌గా నిలిచాడు. బెంగళూరులోని బీఎంఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో సోమవారం ముగిసిన ఈ టోరీ్నలో 21 ఏళ్ల శిబి శ్రీనివాస్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో శిబి శ్రీనివాస్‌తోపాటు మరో ఇద్దరు కరణం నాగ సాయి సార్థక్ (కర్ణాటక), అవిరత్ చౌహాన్ (మహారాష్ట్ర) 7.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... శిబి శ్రీనివాస్‌కు రెండో స్థానం, సాయి సార్థక్‌కు మూడో స్థానం, అవిరత్కు నాలుగో స్థానం ఖరారయ్యాయి. 8 పాయింట్లతో ప్రశాంత్ నాయక్ (కర్ణాటక) విజేతగా నిలిచాడు. శిబి శ్రీనివాస్ ఈ టోరీ్నలో ఏడు గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. ప్రణవ్ వసంత్ కుమార్ రావు, తోట విధు, అద్వైత్, హరి అన్నామలై, ఆనంది, వినాయక్ కులకరి్ణ, రవి గోపాల్ హెగ్డేలపై శిబి శ్రీనివాస్ గెలిచాడు. సంపత్ కుమార్ తిరునారాయణన్ చేతిలో ఓడిన శిబి... సాయి సార్థక్‌తో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. రన్నరప్‌గా నిలిచిన శిబి శ్రీనివాస్‌కు రూ. 40 వేల ప్రైజ్‌మనీతోపాటు ట్రోఫీ లభించింది. -
Nikita Porwal: టీవీ యాంకర్ టు మిస్ ఇండియా
మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన నికిత పొర్వాల్ మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది. టీవీ యాంకర్‌గా, నటిగా కెరీర్ మొదలుపెట్టి ఒక సామాన్య కుటుంబం నుంచి ఆమె ఈ గుర్తింపు పొందింది. ‘మన జీవితానికి ఒక విలువ ఉండాలి. మనం లేకపోతే నష్టాన్ని అనుభూతి చెందాలి’ అంటుంది నికిత పొర్వాల్. అక్టోబర్ 16 (బుధవారం) ముంబైలో జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా 2024’ ఫైనల్స్‌లో నికిత పొర్వాల్ కిరీటధారిగా నిలిచింది. 27 రాష్ట్రాల నుంచి మొత్తం 30 మంది పోటీ పడితే నికిత మొదటి స్థానంలో నిలిచింది. దాద్రా నాగర్ హవేలీకి చెందిన రేఖాపాండే రెండో స్థానంలో, గుజరాత్‌కు చెందిన ఆయూషీ ఢోలాకియా మూడో స్థానంలో నిలిచింది. సంగీతా బిజిలానీ, నేహా ధూపియా తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మరో నెల రోజులలో జరగనున్న ‘మిస్ వరల్డ్ 2024’ పోటీల్లో మన దేశం తరఫున నికిత ప్రపంచ దేశాల సుందరీమణులతో పోటీ పడనుంది. మిస్ వరల్డ్ కిరీటం కూడా దక్కించుకోవాలని ఆశిస్తోంది.తండ్రి ్రపోత్సాహంతో ...మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నికిత హైస్కూల్ రోజుల నుంచే మోడలింగ్‌లోకి రావాలని భావించింది. ఆమె తండ్రి అశోక్ పొర్వాల్ ఇందుకు ప్రోత్సహించాడు. కూతురి ప్రతిభ గమనించి మోడలింగ్ రంగంలోకి చిన్న వయసులోనే ప్రవేశ పెట్టాడు. తల్లి రాజ్‌కుమారి కూడా వెన్నంటే ఉంటే నికితను నడిపించింది. ‘మోడల్‌గా పని చేసి మరుసటి రోజు స్కూల్‌కి వెళితే ఆ ప్రపంచం ఈ ప్రపంచం చాలా వేరేగా ఉండేవి. అడ్జస్ట్ కావడం కష్టమయ్యేది. కాని మా స్కూల్ వాళ్లు నాకు సపోర్ట్ నిలిచారు. కాలేజీలో చదువుకుంటూ ఫ్యాషన్ ప్రదర్శనలకు వెళ్లేదాన్ని. రాత్రుళ్లు మేలుకొని సిలబస్ చదవడం, రికార్డులు పూర్తి చేయడంలో నిమగ్న మయ్యేదాన్ని. ఆ హార్డ్‌వర్క్ వృథా పోలేదు’ అంటుంది నికిత.లోపలి సౌందర్యం‘అందాల పోటీలో రాణించాలంటే లోపలి సౌందర్యాన్ని బయటకు తేవాలి. ఆ సౌందర్యానికి రూపమే మన దేహం. ముందుగా ఆ సౌందర్యాన్ని నమ్మాలి. అందుకు ధ్యానం చేయడం లాంటి ఎన్నో విధానాలు అవలంబించాను. నా మాటను, నడకను రోజుల తరబడి సాధన చేశాను. ఎదుటివారు మనలో చూసేది నిజాయితీని... మనం మనలా ఉన్నామా లేదా అనే విషయాన్ని. దాన్ని పోగొట్టుకోకూడదు’ అంటుంది నికిత. నాటకాల మీద మక్కువతో థియేటర్లో పని చేసిందామె. ‘కృష్ణలీల’ అనే నాటకాన్ని స్వయంగా రాసింది కూడా!టీవీ యాంకర్‌గా...కుటుంబానికి మద్దతుగా నిలవడం కోసం టీవ యాంకర్‌గా కూడా పనిచేసింది నికిత. అలాగే సీరియల్స్‌లో, సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించింది. తుదకు ‘మిస్ ఇండియా’ అయ్యింది. ‘ఈ గుర్తింపును ఎలా ఉపయోగిస్తారు’ అనంటే ‘యువతను మోటివేట్ చేయడానికి ఉపయోగిస్తాను. మన దేశంలోని యువతకు చాలా స్కిల్స్ ఉన్నాయి. కాని కమ్యూనికేషన్లో వెనుకబడుతున్నారు. మీ మాటే మిమ్మల్ని ముందుకు తీసుకెళుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ధ్యాస పెట్టండి అని చెబుతాను’ అంటోంది నికిత. మిస్ ఇండియా అయ్యాక సంజయ్ లీలా భన్సాలీ వంటి దర్శకుల నుంచి పిలుపు వింటోందామె. త్వరలో వెండి తెర మీద చూడొచ్చు. -
రన్నరప్ శ్రీరామ్ బాలాజీ జోడీ
ఈ ఏడాది రెండో ఏటీపీ చాలెంజర్ టూర్ డబుల్స్ టైటిల్‌ను సాధించాలని ఆశించిన భారత అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ శ్రీరామ్ బాలాజీకి నిరాశ ఎదురైంది. డొమినికన్ రిపబ్లిక్లో జరిగిన సాంటో డొమింగో ఓపెన్ టోర్నీలో శ్రీరామ్ బాలాజీ (భారత్)–ఫెర్నాండో రొంబోలి (బ్రెజిల్) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బాలాజీ–రొంబోలి జోడీ 7–6 (7/2), 4–6, 16–18తో హిడాల్గో–వరేలా (మెక్సికో) జంట చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్లో బాలాజీ కాగ్లియారి ఓపెన్‌లో విజేతగా నిలిచి... పెరూగ్లా, బ్రాన్్చవీగ్ టోరీ్నల్లో రన్నరప్‌గా నిలిచాడు. -
రన్నరప్ అంకిత–రుతుజా జోడీ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య డబ్ల్యూ50 టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో అంకిత రైనా–రుతుజా భోస్లే (భారత్) జోడీ రన్నరప్‌గా నిలిచింది. జపాన్‌లో శనివారం జరిగిన ఫైనల్లో అంకిత–రుతుజా ద్వయం 3–6, 5–7తో ఇరీనా హయాషి–సాకి ఇమామురా (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అంకిత, రుతుజా తమ సర్విస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. -
రన్నరప్ హంపి
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): అద్భుతమైన ఎత్తులతో ప్రత్యర్థుల ఆట కట్టిస్తూ... భారత చెస్ స్టార్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. గురువారం ముగిసిన మహిళల ర్యాపిడ్ ఈవెంట్లో కోనేరు హంపి విజేతను నిర్ణయించిన ‘ప్లే ఆఫ్’ టైబ్రేక్స్‌లో 1.5–2.5 పాయింట్ల తేడాతో అనస్తాసియా బొద్నారుక్ (రష్యా) చేతిలో ఓడిపోయి రజత పతకం సొంతం చేసుకుంది. ఒత్తిడిలో సంయమనంతో ఆడిన అనస్తాసియా తొలిసారి ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌గా అవతరించింది. ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నీ చరిత్రలో హంపికిది మూడో పతకం కావడం విశేషం. 2019లో విశ్వవిజేతగా నిలిచిన హంపి 2012లో కాంస్య పతకం సాధించింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత బొద్నారుక్, హంపి, టింగ్జె లె (చైనా) 8.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా బొద్నారుక్, హంపి తొలి రెండు స్థానాల్లో నిలవడంతో వీరిద్దరి మధ్య విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ నిర్వహించారు. బ్లిట్జ్ పద్ధతిలో జరిగిన తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన హంపి 56 ఎత్తుల్లో నెగ్గగా... రెండో గేమ్‌లో హంపి 38 ఎత్తుల్లో ఓడిపోయింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. దాంతో తదుపరి గేమ్‌లో గెలిచిన ప్లేయర్‌కు టైటిల్ ఖరారు చేసే ‘సడన్‌డెత్’ గేమ్‌ను నిర్వహించారు. అయితే ఈ గేమ్ 52 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. అయితే నాలుగో గేమ్‌లో బొద్నారుక్ 39 ఎత్తుల్లో హంపిపై గెలిచి టైటిల్‌ను ఖరారు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు నూతక్కి ప్రియాంక, సాహితి వర్షిణి 7 పాయింట్లతో వరుసగా 22వ, 23వ స్థానాల్లో నిలిచారు. 13 రౌండ్లపాటు జరిగిన ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ 9 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన ప్రజ్ఞానంద 9 పాయింట్లతో 8వ స్థానంలో, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 8.5 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచారు. నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ 10 పాయింట్లతో మరోసారి ప్రపంచ చాంపియన్ అయ్యాడు. -
బిగ్‌బాస్ రన్నరప్ గొప్పమనసు.. కుటుంబంతో కలిసి ఏం చేశాడంటే?
తెలుగువారి రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-7 ఈ ఏడాది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో రైతుబిడ్డ ప్రశాంత్ ట్రోఫిని దక్కించుకోగా.. అమర్దీప్ రన్నరప్‌గా నిలిచాడు. అయితే బిగ్‌బాస్ ముగియడంతో ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. తాజాగా రన్నరప్ అమర్దీప్ తన కుటుంబంతో కలిసి సొంత జిల్లా అనంతపురం వెళ్లారు. అనంతపురం వెళ్లిన అమర్దీప్ తన ఫ్యామిలీతో కలిసి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓ ట్రస్ట్ తరఫున పేద విద్యార్థులు, మహిళలకు దుప్పట్లు అందజేశారు. అక్కడే చిన్నపిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అమర్‌దీప్‌తో పాటు ఆయన భార్య తేజు, మదర్ కూడా పాల్గొన్నారు. అనంతరం అక్కడికి వచ్చన వారికి భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా.. దేవుడికి నాకు ఇచ్చిన శక్తిమేరకు తప్పకుండా సాయం చేస్తూనే ఉంటానని అమర్దీప్ తెలిపారు. కాగా.. బిగ్ బాస్ షో ముగిశాక తన ఫ్యామిలీతో కలిసి వెళ్తున్న అమర్దీప్ కారుపై రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. -
పోరాడి ఓడిన సాత్విక్–చిరాగ్ జోడీ
షెన్జెన్ (చైనా): ఈ ఏడాది ఆరో టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టికి నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సాత్విక్–చిరాగ్ ద్వయం రన్నరప్‌గా నిలిచింది. 71 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ 19–21, 21–18, 19–21తో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. విజేతగా నిలిచిన లియాంగ్–వాంగ్ చాంగ్‌లకు 85,100 డాలర్ల (రూ.70 లక్షల 92 వేలు) ప్రైజ్‌మనీ, 11 వేల ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సాత్విక్–చిరాగ్‌లకు 40,250 డాలర్ల (రూ. 33 లక్షల 54 వేలు) ప్రైజ్‌మనీ, 9350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ ఇండోనేసియా ఓపెన్, కొరియా ఓపెన్, స్విస్ ఓపెన్లలో టైటిల్స్ సాధించడంతోపాటు ఆసియా చాంపియన్íÙప్లో, హాంగ్జౌ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలిచింది. -
రన్నరప్ బోపన్న–ఎబ్డెన్ జోడీ
పారిస్: ఈ ఏడాది మూడో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీకి నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో బోపన్న–ఎబ్డెన్ ద్వయం రన్నరప్‌గా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జంట 2–6, 7–5, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–వాసెలిన్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఎనిమిది ఏస్‌లు సంధించింది. రన్నరప్‌గా నిలిచిన బోపన్న–ఎబ్డెన్‌లకు 1,48,760 యూరోల (రూ. కోటీ 32 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది బోపన్న–ఎబ్డెన్ జోడీ ఏడు టోర్నీలలో ఫైనల్ చేరి రెండింటిలో టైటిల్ సాధించి, ఐదింటిలో రన్నరప్‌గా నిలిచింది. ఈనెల 12 నుంచి 19 వరకు ఇటలీలో జరిగే సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌కు కూడా బోపన్న–ఎబ్డెన్ అర్హత సాధించారు. -
ప్రణయ్... రన్నరప్‌తో సరి
సిడ్నీ: ఈ ఏడాది రెండో టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్‌కు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో కేరళకు చెందిన ప్రణయ్ రన్నరప్‌గా నిలిచాడు. 90 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 9–21, 23–21, 20–22తో ప్రపంచ 24వ ర్యాంకర్ వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఈ ఏడాది మేలో మలేసియా మాస్టర్స్ టోర్నీ ఫైనల్లో వెంగ్ హాంగ్ యాంగ్‌ను ఓడించి టైటిల్ నెగ్గిన ప్రణయ్ ఈసారి మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయడంలో విఫలమయ్యాడు. తొలి గేమ్‌ను చేజార్చుకున్న ప్రణయ్ రెండో గేమ్‌లో తేరుకున్నాడు. పోటాపోటీగా సాగిన ఈ గేమ్‌లో పలుమార్లు స్కోర్లు సమమయ్యాయి. చివరకు స్కోరు 21–21 వద్ద వెంగ్ కొట్టిన ఫోర్‌హ్యాండ్ స్మాష్ బయటకు వెళ్లింది. అనంతరం ప్రణయ్ నెట్ వద్ద పాయింట్ గెలిచి గేమ్‌ను దక్కించుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో ప్రణయ్ దూకుడుగా ఆడి 19–14తో ఐదు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించాడు. అయితే వెంగ్ హాంగ్ యాంగ్ అసమాన పోరాటంతో కోలుకున్నాడు. స్కోరు 19–17 వద్ద ఏకంగా 71 షాట్ల ర్యాలీ సాగింది. చివరకు ప్రణయ్ కొట్టిన షాట్ నెట్‌కు తగలడంతో పాయింట్ వెంగ్ ఖాతాలోకి వెళ్లింది. అనంతరం వెంగ్ డ్రాప్ షాట్‌తో పాయింట్ గెలిచి స్కోరును 19–19తో సమం చేశాడు. ఆ తర్వాత ప్రణయ్ పాయింట్ సాధించి విజయానికి ఒక పాయింట్ దూరంలో నిలిచాడు. కానీ పట్టువదలని వెంగ్ మళ్లీ స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత వెంగ్ వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. విజేత వెంగ్ హాంగ్ యాంగ్‌కు 31,500 డాలర్ల (రూ. 26 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ ప్రణయ్‌కు 15,960 డాలర్ల (రూ. 13 లక్షల 19 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Mahati Kaumari: నాతో నేనే పోటీ పడ్డాను..!
ఇటీవల మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన మిసెస్ గ్రాండ్ సీ వరల్డ్ 2023 (29–40 ఏళ్లలోపు పెళ్లైన మహిళలకు నిర్వహించే కాంటెస్ట్) పోటీల్లో హైదరాబాద్ వాసి శ్రీమతి మహతి కౌమారి 2వ స్థానం దక్కించుకుంది. మలేషియా దక్షిణాఫ్రికా సహా 15 దేశాల నుంచి 45 మంది మహిళలు పాల్గొన్న ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం రావడం గురించి, తనను తాను కొత్తగా మెరుగు పరుచుకునే విధానాల గురించి వివరించింది మహతి కౌమారి. ‘మన పరిధిని విస్తరించుకుంటేనే అవకాశాలు పెరుగుతాయి, ఏ కిరీటాలైనా దక్కుతాయి’ నవ్వుతూ వివరించింది. ‘‘సొంతంగా ఎదగాలన్న ఆలోచనే ఈ రోజు నన్ను ఎల్లలు దాటేలా చేసింది. పదేళ్లు ఐటీ కంపెనీలలో వర్క్ చేశాను. పెళ్లి, ఇద్దరు పిల్లలు, కుటుంబం.. జీవితం ఒక దశ నుంచి మరో దశకు తీసుకెళుతూనే ఉంది. దీనితోపాటు నా కలలను కూడా తీర్చుకునే క్రమంలో నాతో నేనే పోటీపడుతుంటాను. కాలేజీ రోజుల నుంచి నా డ్రెస్సులు నేనే స్వయంగా డిజైన్ చేసుకునేదాన్ని. రీ సైక్లింగ్ మీద ఎక్కువ ఆసక్తి చూపేదాన్ని. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ కూడా నా ఈ అలవాటు మానుకోలేదు. నా స్నేహితులు, సహోద్యోగులు నా డ్రెస్సింగ్ గురించి అడిగేవారు. వాళ్లూ తమకు డ్రెస్‌లు డిజైన్ చేయమని కోరేవారు. అలా మా బంధుమిత్రుల్లో అడిగిన వారికి నాకున్న ఖాళీ సమయాన్ని కేటాయించి డిజైన్ చేసిచ్చేదాన్ని. నేను డిజైన్ చేసిచ్చిన డ్రెస్సుల్లో వారిని చూసినప్పుడు చాలా ఆనందం కలిగేది. సొంతంగా డిజైనింగ్ స్టూడియో పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే. కుటుంబం, ఉద్యోగం అనే వ్యాపకాలు ఉన్న నాకు సొంతంగా నా డిజైన్ స్టూడియో పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచన పెరగడానికి నా డిజైన్స్ ఇష్టపడే బంధుమిత్రులే కారణం. మా కుటుంబం కూడా ఆమోదం తెలపడంతో ఉద్యోగం వదిలి, డ్రెస్ డిజైనింగ్లోకి వచ్చేశాను. ఎనిమిదేళ్లుగా డిజైనింగ్ స్టూడియో నడుపుతున్నాను. మొదట ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చిన నేను, ఇప్పుడు పదిహేనుమందికి ఉపాధి చూపించగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు క్లాసులు కూడా ఇస్తుంటాను. బ్యూటీ కాంటెస్ట్‌తో మరో అడుగు ‘తెలిసిన వారికి వర్క్ చేసిస్తే సరిపోదు, నేను చాలామందికి రీచ్ అవ్వాలి. ఎక్కువ మంది మహిళలకు పని కల్పించేలా నన్ను నేను మలుచుకోవాలి..’ ఈ ఆలోచన నన్ను అవకాశాల కోసం వెతికేలా చేసింది. ఆన్లైన్లో మిసెస్ బ్యూటీ కాంటెస్ట్ అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు నా స్కూల్, కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నాను. కాంటెస్ట్‌లో పాల్గొనడానికి ఆన్లైన్లో అప్లై చేసుకున్నాను. మన దేశం నుంచే కాదు మరో పదిహేను దేశాల నుంచి చాలామంది మహిళలు ఈ పోటీలకు అప్లై చేసుకున్నారు. ఇంటర్వ్యూ తర్వాత మన దేశం నుంచి నేను ఎంపిక అయ్యాను. రెండు నెలలు ప్రత్యేక శిక్షణ తీసుకుని, పోటీల్లో పాల్గొన్నాను. ఇప్పుడు నాకు విదేశాలలోనూ స్నేహితులు పెరిగారు. పోటీలకు వచ్చిన వారందరితోనూ మంచి స్నేహం ఏర్పడింది. దీంతో నాకున్న అవకాశాలను వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తున్నాను’’ అని వివరించి ఈ బ్యూటీ. మనసును సేదతీర్చేలా... కర్ణాటక సంగీతం నాకున్న మరో హాబీ. కుటుంబం, బిజినెస్ బాధ్యతలు ఎన్ని ఉన్నా నాకు ఇష్టమైన సంగీతాన్ని నిత్యం సాధన చేస్తూనే ఉంటాను. హాబీస్‌కి నాకంటూ కొంత సమయం కేటాయించుకోవడంలో ఏ మాత్రం అలక్ష్యం చేయను. పిల్లలు కూడా నా ఇష్టాలను ప్రోత్సహిస్తుంటారు. – నిర్మలారెడ్డి -
నేను టాప్ 3 కి వస్తాను అని ఊహించలేదు
-
WTC ఫివర్ ఫేవరెట్ గా ఇండియా ఎందుకంటే..!
-
Spain Masters 2023 Final: సింధుకు నిరాశ
మాడ్రిడ్: ఈ ఏడాది ఫైనల్ చేరిన తొలి టోర్నీలో విజేతగా నిలిచి తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా తున్‌జంగ్ (ఇండోనేసియా) కేవలం 29 నిమిషాల్లో 21–8, 21–8తో సింధును ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. గతంలో సింధుతో ఆడిన ఏడుసార్లూ ఓడిపోయిన మరిస్కా ఎనిమిదో ప్రయత్నంలో తొలిసారి గెలుపొందడం విశేషం. ఫైనల్లో సింధు ఏదశలోనూ మరిస్కాకు పోటీనివ్వలేకపోయింది. విన్నర్ మరిస్కాకు 15,750 డాలర్లు (రూ. 12 లక్షల 93 వేలు), రన్నరప్ సింధుకు 7,980 డాలర్లు (రూ. 6 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
International Chess Federation: రన్నరప్ హంపి
మ్యూనిక్ (జర్మనీ): అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో జరిగిన మహిళలగ్రాండ్ప్రి సిరీస్ రెండో టోర్నమెంట్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి రన్నరప్‌గా నిలిచింది. సోమవారం ముగిసిన ఈ టోర్నీలో హంపి 7 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. తాన్ జోంగీ (చైనా)తో జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌ను హంపి 31 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. 12 మంది మేటి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి అజేయంగా నిలిచింది. ఎనిమిది గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హంపి మూడు గేముల్లో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 6 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలిచింది. 11వ రౌండ్లో నానా జాగ్‌నిద్జెతో జరిగిన గేమ్‌ను హారిక 11 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. హారిక కూడా ఈ టోర్నీలో ఒక్క గేమ్‌లోనూ ఓడిపోలేదు. 10 గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హారిక ఒక గేమ్‌లో గెలిచింది. 7.5 పాయింట్లతో అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) విజేతగా అవతరించింది. చివరి గేమ్‌లో అలెగ్జాండ్రా కొస్టెనిక్ 64 ఎత్తుల్లో జినెల్ జు (చైనా) చేతిలో ఓడిపోయింది. నాలుగు గ్రాండ్‌ప్రి సిరీస్‌లలో భాగంగా మూడో టోర్నీ వచ్చే నెలలో భారత్‌లో జరుగుతుంది. -
మిసెస్ ఇండియా రన్నరప్‌గా తెలంగాణ మహిళ
అందాల పోటీల్లో తొలిసారి తెలంగాణ మహిళ మెరిసింది. మిసెస్ ఇండియా 2023 పోటీల్లో తెలంగాణకు చెందిన కిరణ్మయి అలివేలు రన్నరప్‌గా నిలిచారు. రాజస్థాన్ వేదికగా జరిగిన పోటీల్లో ఆమె మొదటి రన్నరప్ గా నిలిచారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారిలో 50 మంది ఫైనల్ చేరుకోగా.. తుది పోటీల్లో కిరణ్మయి చక్కని ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచారు. మిసెస్ ఇండియా తెలంగాణ రీజనల్ డైరెక్టర్ మిసెస్ మమతా త్రివేదీ ఆమెకు మెంటర్‌గా వ్యవహరించారు. వీణా పుజారి కిరణ్మయికి దుస్తులు డిజైన్ చేయగా... 10 కేటగిరీల్లో 30 మందితో పోటీపడ్డారు. టాలెంట్ రౌండ్ , డాన్స్ రౌండ్ , సఫారీ రౌండ్ తో పాటు ఫ్యాషన్ రౌండ్స్‌లో గట్టిపోటీ నడిచినప్పటికీ... జడ్జీలు అడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానమిచ్చిన ఆకట్టుకున్నారు. ఇదే పోటీల్లో డైరెక్టర్ కేటగిరీకి సంబంధించి బెస్ట్ డైరెక్టర్ అవార్డును మమతా త్రివేదీ గెలుచుకున్నారు. కిరణ్మయి గతంలో 2019 మిసెస్ ఇండియా తెలంగాణ ఎట్రాక్టివ్ టైటిల్ గెలిచారు. వివాహం తర్వాత కూడా మహిళలు కుటుంబానికే పరిమితం కాకుండా ఏదైనా సాధించొచ్చు అనేది రుజువు చేసే ఉధ్ధేశంతో మిసెస్ ఇండియా పోటీలకు సిద్ధమయ్యారు. దాదాపు 8 నెలల పాటు ప్రిపేర్ అయ్యి జాతీయ పోటీలకు అర్హత సాధించారు. జాతీయ పోటీల్లో తన అందంతో పాటు మాట్లాడే తీరు, టాలెంట్, క్రియేటివిటీ వంటి అంశాల్లో ప్రతిభ కనబరిచి రన్నరప్‌గా నిలిచారు. మిసెస్ ఇండియా పోటీల్లో రన్నరప్‌గా ఒక తెలంగాణ మహిళ నిలవడం ఇదే తొలిసారి. కాగా ఈ విజయంపై కిరణ్మయి ఆనందం వ్యక్తం చేశారు. అందాల పోటీల్లో వివాహం తర్వాత కూడా మహిళలు రాణించొచ్చు అనుకునే వారికి తాను రోల్ మోడల్‌గా నిలవాలనే లక్ష్యంతోనే జాతీయ పోటీల్లో పాల్గొన్నానని కిరణ్మయి చెప్పారు. తెలంగాణ నుంచి మిసెస్ ఇండియా పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన కిరణ్మయిని పలువురు అభినందించారు. -
టీ ట్వంటీ ప్రపంచకప్ విజేత ఇంగ్లాండ్
-
Guangzhou Open 2022: గ్వాంగ్జు ఓపెన్ టోర్నీలో రన్నరప్ సాకేత్ జోడీ
ఈ ఏడాది ఏడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సాధించాలని ఆశించిన భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేనికి నిరాశ ఎదురైంది. కొరియాలో జరిగిన గ్వాంగ్జు ఓపెన్ టోర్నీలో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో సాకేత్–యూకీ జోడీ 6–2, 3–6, 6–10తో టాప్ సీడ్ బారియెంటోస్ (కొలంబియా)–రెయస్ వరేలా (మెక్సికో) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. సాకేత్–యూకీ జోడీకి 1,800 డాలర్ల (రూ. లక్షా 48 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Ultimate Kho Kho 2022: ఖో–ఖో లీగ్ విజేత ఒడిశా జగర్‌నాట్స్
పుణే: చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఒడిశా జగర్‌నాట్స్ పైచేయి సాధించి అల్టిమేట్ ఖో–ఖో లీగ్ చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఒడిశా జగర్‌నాట్స్ 46–45తో ఒక్క పాయింట్ తేడాతో తెలుగు యోధాస్ జట్టును ఓడించింది. మ్యాచ్ ముగియడానికి 14 సెకన్లు ఉన్నాయనగా తెలుగు యోధాస్ 45–43తో రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉంది. ఈ దశలో ఒడిశా ప్లేయర్ సూరజ్ అద్భుతమైన డైవ్ చేసి తెలుగు యోధాస్ ప్లేయర్ అవధూత్ పాటిల్‌ను అవుట్ చేసి మూడు పాయింట్లు స్కోరు చేశాడు. దాంతో ఒడిశాకు చిరస్మరణీయ విజయం సొంతమైంది. విజేతగా నిలిచిన ఒడిశా జట్టుకు రూ. కోటి ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్ తెలుగు యోధాస్‌కు రూ. 50 లక్షలు... మూడో స్థానంలో నిలిచిన గుజరాత్ జెయింట్స్‌కు రూ. 30 లక్షలు లభించాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు రామ్‌జీ కశ్యప్ (చెన్నై క్విక్‌గన్స్; రూ. 5 లక్షలు).. ‘బెస్ట్ అటాకర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు అభినందన్ పాటిల్ (గుజరాత్; రూ. 2 లక్షలు)... ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు దీపక్ మాధవ్ (తెలుగు యోధాస్; రూ. 2 లక్షలు)... ‘యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు మదన్ (చెన్నై క్విక్‌గన్స్; రూ. 2 లక్షలు) గెల్చుకున్నారు. -
HAMBURG: రన్నరప్ బోపన్న జంట
న్యూఢిల్లీ: తన కెరీర్లో 22వ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంది. హాంబర్గ్ యూరోపియన్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జర్మనీలో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 2–6, 4–6తో అన్‌సీడెడ్ లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్)–హెలియోవారా (ఫిన్లాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. విజేతగా నిలిచిన గ్లాస్‌పూల్–హెలియోవారా జోడీకి 1,08,770 యూరోల (రూ. 88 లక్షల 69 వేలు) ప్రైజ్‌మనీ, 500 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ బోపన్న జంటకు 58 వేల యూరోల (రూ. 47 లక్షల 29 వేలు) ప్రైజ్‌మనీ, 300 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Biel Chess Festival 2022: రన్నరప్ హరిసూర్య భరద్వాజ్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక బీల్ చెస్ ఫెస్టివల్ అంతర్జాతీయ టోర్నమెంట్లో అమెచ్యూర్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గుండేపూడి హరిసూర్య భరద్వాజ్ రన్నరప్‌గా నిలిచాడు. స్విట్జర్లాండ్‌లో జరిగిన ఈ టోర్నీలో గుంటూరు జిల్లాకు చెందిన 20 ఏళ్ల హరిసూర్య ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి భారత్‌కే చెందిన మన్మయ్ చోప్రాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా మన్మయ్కు టాప్ ర్యాంక్ ఖరారుకాగా, హరిసూర్యకు రెండో ర్యాంక్ దక్కింది. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో కేఎల్ యూనివర్సిటీ విద్యార్థి హరిసూర్య ఏడు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. ప్రణీత్‌కు రెండో జీఎం నార్మ్ బీల్ చెస్ టోర్నీ మాస్టర్స్ విభాగంలో తెలంగాణకు చెందిన వుప్పాల ప్రణీత్ ఆరు పాయింట్లతో మరో పదిమందితో కలిసి సంయక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా ప్రణీత్ కు 15వ స్థానం దక్కింది. ఈ టోర్నీలో ప్రణీత్ ఇద్దరు గ్రాండ్మాస్టర్లపై గెలిచి, మరో ఇద్దరు గ్రాండ్‌మాస్టర్ల తో ‘డ్రా’ చేసుకొని రెండో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) నార్మ్ సంపాదించాడు. మూడో జీఎం నార్మ్ సాధించి, 2500 రేటింగ్ పాయింట్ల మైలురాయి అందుకుంటే ప్రణీత్‌కు గ్రాండ్‌మాస్టర్ హోదా ఖరారవుతుంది. గుకేశ్‌కు కాంస్య పతకం బీల్ చెస్ ఫెస్టివల్ గ్రాండ్‌మాస్టర్ ట్రయాథ్లాన్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌కు కాంస్య పతకం లభించింది. తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల గుకేశ్ క్లాసికల్ విభాగంలో 15 పాయింట్లు, ర్యాపిడ్ విభాగంలో 7 పాయింట్లు, బ్లిట్జ్ విభాగంలో 7.5 పాయింట్లు సాధించి ఓవరాల్‌గా 29.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. క్వాంగ్ లియెమ్ లీ (వియత్నాం; 35.5 పాయింట్లు) విజేతగా నిలిచాడు. -
రన్నరప్ హర్ష భరతకోటి
సాక్షి, హైదరాబాద్: పారిస్ ఐడీఎఫ్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి రన్నరప్‌గా నిలిచాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హర్ష, ఆండ్రీ షెచకచెవ్ (ఫ్రాన్స్) 6.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌లను వర్గీకరించగా షెచకచెవ్కు టాప్ ర్యాంక్ దక్కగా... హర్షకు రెండో స్థానం ఖరారైంది. ఈ టోర్నీలో హర్ష నాలుగు గేముల్లో గెలిచి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. రన్నరప్ హర్షకు 1,200 యూరోలు (రూ. 97 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
షైనింగ్ సైనీ: విధిని ఎదిరించింది అందాల పోటీలో నిలిచింది
ఆమెకు డ్యాన్స్ అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి మిస్ వరల్డ్ కిరీటం ధరించాలన్న ఆశ. కానీ గుండె సరిగా కొట్టుకోదు, ఓ యాక్సిడెంట్లో ముఖం మొత్తం కాలిపోయింది. అయినా ఏమాత్రం దిగులు పడలేదు. ఒక్కో సమస్యను అధిగమిస్తూ మిస్ వరల్డ్ రన్నరప్‌గా నిలిచింది శ్రీసైనీ. అమెరికాలోని ప్యూర్టోరికోలో జరిగిన మిస్‌వరల్డ్–2021 కాంపిటీషన్లో పోలాండ్‌కు చెందిన కరోలినా బిల్వస్కా మిస్‌వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. భారత్ తరపున పోటీపడిన మానస వారణాసి టాప్–6లోకి కూడా చేరుకోలేకపోయింది. కానీ భారత సంతతికి చెందిన 26 ఏళ్ల శ్రీసైనీ అమెరికా తరపున మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడి, మొదటి రన్నరప్‌గా నిలవడం విశేషం. పంజాబ్‌కు చెందిన సంజయ్ సైనీ, ఏక్తా సైనీ దంపతులకు 1996 జనవరి 6న లుథియాణలో శ్రీసైనీ పుట్టింది. ఈమెకు షహరోజ్ సైనీ అనే తమ్ముడు ఉన్నాడు. సంజయ్‌కు వాషింగ్టన్లో గ్యాస్ స్టేషన్ ఉండడంతో ఆమె కుటుంబం మొత్తం అమెరికాలో స్థిరపడ్డారు. దీంతో ఐదేళ్ల వయసులో శ్రీసైనీ భారత్ వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అక్కడే ఇండో అమెరికన్‌గా పెరిగింది. పన్నెండేళ్ల వరకు శ్రీ గుండె స్పందనలు సరిగా లేవు. నిమిషానికి డెభ్బై సార్లు కొట్టుకోవాల్సిన గుండె కేవలం ఇరవై సార్లు మాత్రమే కొట్టుకునేది. శ్రీని పరీక్షించిన డాక్టర్లు ఆమె గుండెలో పూడిక ఏర్పడిందని నిర్ధారించారు. ఇందుకోసం శాశ్వత పేస్‌మేకర్‌ను అమర్చి ఆమె గుండెను సాధారణంగా పనిచేసేలా చేశారు. మూడేళ్ల వయసు నుంచే డ్యాన్స్‌ను ఎంతో ఇష్టంగా చేసే శ్రీకి పేస్‌మేకర్ అమర్చిన తరువాత డ్యాన్స్ చేయకూడదని డాక్టర్లు సూచించారు. అయినా వెనక్కు తగ్గలేదు. తన బలాన్ని మరింత పెంచుకునేందుకు ప్రారంభంలో చిన్నగా డ్యాన్స్ ప్రారంభించి, తరువాత రోజుకి ఆరుగంటలపాటు డ్యాన్స్ చేసేది. ఇలా ఏళ్లపాటు డాన్స్ సాధన చేస్తూ తనలోని ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకుంది.బ్యాలే, జాజ్ డ్యాన్స్‌లు నేర్చుకుంది.అంతేగాక కాలేజీ హిప్అప్ టీమ్‌తో కలిసి డ్యాన్స్ చేసేది. ముఖం కాలిపోయినా.. చిన్నప్పటి నుంచి మిస్‌వరల్డ్ అవ్వాలనుకునే శ్రీసైనీ, ఆరేళ్లున్నప్పుడే మిస్ వరల్డ్‌గా తయారై బాగా మురిసిపోయేది. అప్పట్లో ఆమెకు మిస్‌వరల్డ్ అంటే సూపర్ హీరోలా కనిపించేది. దీంతో స్కూలు చదువు పూర్తయ్యాక.. వాషింగ్టన్ యూనివర్సిటీలో జర్నలిజం డిగ్రీ చేసింది. తరువాత మోడలింగ్‌లోకి అడుగు పెట్టింది. హార్వర్డ్ యూనివర్సిటీ, యాలే స్కూల్ ఆఫ్ డ్రామా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మోడలింగ్ కోర్సులు చేసింది. యూనివర్సిటీలో చదువుతోన్న రోజుల్లో అప్పుడు శ్రీకి పంతొమ్మిదేళ్లు ఉంటాయి. ఒకరోజు అనుకోకుండా కారు ప్రమాదం జరిగి ముఖం బాగా కాలిపోయింది. తన ముఖం తనే గుర్తుపట్టలేనంతగా మారింది. అయినా ఏమాత్రం దిగులుపడలేదు. ఎలాగైనా అందాల పోటీల్లో పాల్గొనాలన్న సంకల్పంతో ఏడాదిలోపే కోలుకుని, తన ముఖాన్ని పూర్వంలా అందంగా మార్చుకుంది. అనేక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ తొలిసారి 2017లో మిస్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని గెలుచుకుంది. మరుసటి ఏడాది మిస్‌వరల్డ్ ఇండియా వరల్డ్‌వైడ్ కిరీటాన్ని గెలుచుకుంది. ఆ తరువాత 2019లో మిస్ వరల్డ్ అమెరికా కాంపిటీషన్లో పాల్గొన్నప్పటికీ తన హృదయ సంబంధ సమస్యతో మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. ట్రీట్మెంట్ తరువాత 2020లో మిస్ వరల్డ్ అమెరికా కాంపిటీషన్లో పాల్గొని టాప్ ఇన్ఫ్లుయెన్సర్ నేషనల్ విన్నర్, ఏ పర్పస్ నేషనల్ అంబాసిడర్, పీపుల్స్ ఛాయిస్ నేషనల్ విన్నర్, టాలెంట్ ఆడియెన్స్ చాయిస్ నేషనల్ అవార్డు, బ్యూటీ విత్ పర్పస్ విన్నర్ అవార్డులను గెలుచుకుంది. 2021లో మిస్‌వరల్డ్ అమెరికా కిరీటాన్ని గెలుచుకుని ఈ కిరీటం గెలుచుకున్న తొలి భారతసంతతి వ్యక్తిగా పేరు పొందింది. ఇటీవల నిర్వహించిన 2021 మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొని టాప్–6 కంటెస్టెంట్స్‌లో ఒకటిగా నిలిచింది. కానీ వెంట్రుకవాసిలో కిరీటం తప్పిపోయి మొదటి రన్నరప్‌గా నిలిచింది. మోటివేషనల్ స్పీకర్‌గానూ.. పన్నెండేళ్ల వయసు నుంచి మానసిక భావోద్వేగాలపై ఆర్టికల్స్ రాసే అలవాటు ఉంది శ్రీకి. తను రాసిన చాలా ఆర్టికల్స్ అమెరికన్ మీడియాలో పబ్లిష్ అయ్యాయి. చిన్నప్పటి నుంచి ఆమె చేస్తోన్న సామాజిక సేవాకార్యక్రమాలను ప్రముఖులు ప్రశంసించేవారు. ఎనిమిది దేశాల్లోని వందకుపైగా నగరాల్లో తను ఎదుర్కొన్న అనేక మానసిక సంఘర్షణలను వివరిస్తూ ఎంతోమంది యువతీ యువకుల్లో స్ఫూర్తిని నింపుతోంది. అందాల రాణిగానేగాక మెంటల్, ఎమోషనల్ హెల్త్ యాక్టివిస్ట్‌గా, మోటివేషనల్ స్పీకర్‌గా పనిచేస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది శ్రీసైనీ. -
సబ్ జూనియర్ రోలర్ హాకీ టోర్నీలో రన్నరప్‌గా తెలంగాణ
మొహాలి: జాతీయ సబ్ జూనియర్ రోలర్ హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు రన్నరప్‌గా నిలిచింది. పంజాబ్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో తెలంగాణ బాలికల జట్టు 1–2 గోల్స్ తేడాతో పంజాబ్ చేతిలో ఓడిపోయింది. మనాల్ సుల్తానా, నిదా ఖాన్, తనుశ్రీ, అక్షిత, హజ్రా, తర్పణ, హరిణి, మెహక్, అఫీరా, శరణ్య, రిషిక తెలంగాణ జట్టులో సభ్యులుగా ఉన్నారు. -
సిరికి కనెక్ట్ అవ్వడం వల్లే ఓడిపోయాను : షణ్నూ
Shannu Shocking Comments On Relationship With Siri: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్.. అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ సీజన్-5లో ఎంట్రీ ఇచ్చి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత సిరితో రిలేషన్, పదేపదే హగ్గులతో విపరీతమైన నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. హగ్గులు నచ్చడం లేదని స్వయంగా సిరి తల్లి వచ్చి చెప్పినా ఇద్దరూ తీరు మార్చుకోలేదు. పదేపదే ఫ్రెండిష్ హగ్గంటూ శృతిమించి ప్రవర్తించారు. దీంతో సోషల్‌మీడియాలో వీరిద్దరూ విపరీతంగా ట్రోల్స్ బారిన పడ్డారు. షణ్నూతో ఫ్రెండిష్ సిరికి ఓటింగ్ విషయంలో కాస్త కలిసి వచ్చినా షణ్నూకి మాత్రం బాగా దెబ్బతీసింది. సిరితో రిలేషన్ వల్లే విన్నర్ అవ్వాల్సిన షణ్నూ..రన్నరప్ అయ్యాడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే విషయాన్ని బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో అరియానా ప్రశ్నించగా ఫణ్నై సైతం అంగీకరించడం విశేషం. సిరితో కనెక్ట్ కావడం వల్లే రన్నరప్‌గా బయటకు వచ్చాను అని అనుకుంటున్నారా అని అరియానా ప్రశ్నించగా.. అదే జరిగింది అంటూ తన మనసులో మాటను బయటపెట్టేశాడు. సిరితో రిలేషన్ వల్ల టైటిల్ కోల్పోతానని తనకి ముందే తెలిసినా తన ఎమోషన్స్‌ని ఫేక్ చేయలేనని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. చదవండి: షణ్నూ చాలా స్పెషల్, బయట కూడా అలాగే ఉంటాం: సిరి సిరికి చుక్కలు చూపించిన అరియానా.. ప్రతి ప్రశ్నలో కౌంటర్ అటాక్ -
BWF World Championships 2021 Finals: పోరాడి ఓడిన శ్రీకాంత్..
హుఎల్వా (స్పెయిన్): వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను నెగ్గే సువర్ణావకాశాన్ని తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ తృటిలో చేజార్చుకున్నాడు. హోరాహోరీ సాగిన ఫైనల్లో ప్రపంచ 22వ సీడ్ ఆటగాడు, సింగపూర్‌కు చెందిన లో కియోన్ యో చేతిలో 15-21, 20-22 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. 42 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో 15వ సీడ్ శ్రీకాంత్ అద్భుతంగా పోరాడినప్పటికీ.. కీలక సమయాల్లో ప్రత్యర్ధి పైచేయి సాధించాడు. ఫలితంగా, శ్రీకాంత్ రజతంతో సరిపెట్టుకోగా, కియోన్ కెరీర్లో తొలి టైటిల్ నెగ్గి.. ఈ ఘనత సాధించిన తొలి సింగపూర్ షట్లర్‌గా చరిత్ర సృష్టించాడు. కాగా, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ నుంచి పీవీ సింధు మాత్రమే స్వర్ణం గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా రెండు సార్లు రజతాలు గెలిచిన సింధు.. 2019లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా కెప్టెన్‌గా యశ్ దుల్, ఆంధ్రా కుర్రాడికి వైస్ కెప్టెన్సీ -
రోడ్డు ప్రమాదంలో మాజీ మిస్ కేరళ, రన్నరప్ దుర్మరణం
Former Miss Kerala Ansi Kabeer, Runner Up Anjana Died In Car Accident: మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్(25), రన్నరప్ అంజనా షాజన్(26)ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఎర్నాకుళం బైపాస్‌లోని హాలిడే ఇన్ ముందు సోమవారం తెల్లవారుజామున ఒంటి గంటకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి వారి కారు అదుపుతప్పినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. చదవండి: పెళ్లి మండపంలోనే పునీత్‌కు నివాళి అర్పించిన కొత్తజంట ప్రయాణానికి కాసేపటి ముందే అన్సీ..తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ‘ఇట్స్ టైమ్ టు గో’అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. అయితే దురదృష్టవశాత్తూ ఆమె పోస్ట్ చేసిన కాసేపటికి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మిస్ కేరళ 2019 కాంపిటీషన్ నుంచి అన్సీ, అంజనా క్లోజ్ ఫ్రెండ్స్‌గా మారారు. ఈ పోటీలో అన్సీ విజేతగా నిలవగా, అంజనా రన్నరప్‌గా నిలిచింది. దురదృష్టశాత్తూ ఈ ప్రమాదంలో ఇద్దరూ స్పాట్లోనే చనిపోయారు. కాగా కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చదవండి:పునీత్ మరణం: లైవ్‌లో న్యూస్ చదువుతూ ఏడ్చేసిన యాంకర్ Halloween 2021: దెయ్యాల్లా మారిన మన స్టార్స్‌ని గుర్తుపట్టారా? View this post on Instagram A post shared by Ansi Kabeer (@ansi_kabeer) -
French Open: క్వీన్ క్రిచికోవా
సింగిల్స్ విభాగంలో ఆడుతున్న ఐదో గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బర్బోర క్రిచికోవా అద్భుతం చేసింది. ఎంతోమందికి తమ కెరీర్లో కలగానే మిగిలిపోయే ‘గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్’ను క్రిచికోవా సాకారం చేసుకుంది. డబుల్స్ స్పెషలిస్ట్ అయిన క్రిచికోవా గతంలో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సింగిల్స్ విభాగంలో ఆడినా నాలుగో రౌండ్‌ను దాటలేకపోయింది. పారిస్: వరుసగా ఆరో ఏడాది ఫ్రెంచ్ కోటలో కొత్త రాణికి కిరీటం లభించింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగిన చెక్ రిపబ్లిక్ టెన్నిస్ క్రీడాకారిణి బర్బోర క్రిచికోవా సూపర్ ఫినిషింగ్ ఇచ్చింది. మహిళల సింగిల్స్ విభాగంలో ఆమె తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ 33వ ర్యాంకర్, అన్‌సీడెడ్ క్రిచికోవా 6–1, 2–6, 6–4తో ప్రపంచ 32వ ర్యాంకర్, 31వ సీడ్ అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా)పై గెలిచింది. గంటా 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో క్రిచికోవా కీలకదశల్లో పైచేయి సాధించి విజయాన్ని దక్కించుకుంది. విజేత క్రిచికోవాకు 14 లక్షల యూరోలు (రూ. 12 కోట్ల 41 లక్షలు)... రన్నరప్ పావ్లుచెంకోవాకు 7 లక్షల 50 వేల యూరోలు (రూ. 6 కోట్ల 65 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. నేడు జరిగే మహిళల డబుల్స్ ఫైనల్లో సినియకోవాతో కలిసి విజేతగా నిలిస్తే 2000లో మేరీ పియర్స్ (ఫ్రాన్స్) తర్వాత ఒకే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో సింగిల్స్, డబుల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణిగా క్రిచికోవా గుర్తింపు పొందుతుంది. పావ్లుచెంకోవాతో జరిగిన ఫైనల్లో క్రిచికోవా కచ్చితమైన సర్వీస్‌లు, డ్రాప్ షాట్లు, డబుల్ బ్యాక్‌హ్యాండ్ షాట్లు, ఫోర్‌హ్యాండ్ షాట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచింది. హానా మాండ్లికోవా, నొవోత్నా, క్విటోవా తర్వాత చెక్ రిపబ్లిక్ తరఫున గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన నాలుగో ప్లేయర్ క్రిచికోవా. ఒస్టాపెంకో (లాత్వియా–2017), స్వియాటెక్ (పోలాండ్–2020) తర్వాత అన్‌సీడెడ్ హోదాలో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన మూడో క్రీడాకారిణి క్రిచికోవా. ఓవరాల్‌గా క్రిచికోవా కెరీర్లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. తన దేశానికే చెందిన సినియకోవాతో కలిసి క్రిచికోవా 2018లో ఫ్రెంచ్ ఓపెన్‌లో, 2018 వింబుల్డన్ ఓపెన్‌లో మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించింది. -
భారత మహిళా క్రికెటర్లకు ‘ఆ మొత్తం’ అందనేలేదు
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా గత సంవత్సరం జరిగిన టి20 ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఐదు లక్షల డాలర్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. అయితే 14 నెలలు పూర్తయినా... రన్నరప్ ప్రైజ్‌మనీ ఇప్పటికీ భారత మహిళా క్రికెటర్ల చేతికందనేలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రన్నరప్ ప్రైజ్‌మనీ మొత్తం 5 లక్షల డాలర్లను (రూ. 3 కోట్ల 64 లక్షలు) భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి గత సంవత్సరం ఏప్రిల్‌లోనే అందజేసినప్పటికీ బోర్డు మాత్రం అమ్మాయిలకు ఆ మొత్తాన్ని ఇప్పటిదాకా ఇవ్వనే లేదు. మహిళా క్రికెటర్లపై బోర్డు శీతకన్నుకు ఇదో నిదర్శనమనే విమర్శలు వస్తున్నాయి. ఏదైనా ఐసీసీ టోర్నమెంట్ ముగిసిన ఏడు రోజుల్లోనే ఐసీసీ ప్రైజ్‌మనీ నిధుల్ని ఆయా దేశాల బోర్డులకు పంపిస్తుంది. అయితే సంబంధిత దేశాల బోర్డులే తమ జట్లకు పంపిణీ చేయాలి. నిధులందిన రెండు వారాల్లోపే అమ్మాయిలకు పంపిణీ చేయాల్సి ఉన్నా బీసీసీఐ మాత్రం ఖజానాలోనే అట్టిపెట్టుకుంది. క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టుకు గత సంవత్సరం ఏప్రిల్‌లో... ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్టుకు గత ఏడాది మేలోనే ప్రైజ్‌మనీని పంపిణీ చేశాయి. వారం రోజుల్లో ఇస్తాం: బీసీసీఐ బ్రిటన్ దినపత్రికలో వచ్చిన ఈ కథనం, దరిమిలా విమర్శలపై బోర్డు స్పందించింది. ఇంతవరకు అమ్మాయిలకు ప్రైజ్‌మనీ మొత్తాన్ని పంపిణీ చేయకపోవడం నిజమేనని అంగీకరించిన బోర్డు వారం రోజుల్లో దానిని మహిళా క్రికెటర్లకు ఇస్తామని తెలిపింది. ‘కరోనా కారణంగా ఈ ఒక్క ప్రైజ్‌మనీయే కాదు... పురుషుల, మహిళల కాంట్రాక్టు ఫీజులు, దేశవాళీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు, వార్షిక చెల్లింపులు అన్నీ ఆలస్యమే అవుతున్నాయి’ అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. -
మిస్ యూనివర్స్ థర్డ్ రన్నరప్.. సవాళ్ల శిఖరం
మహిళలు తమ కలలను నిజం చేసుకోవడానికి వారి జీవితంలో ప్రతిరోజూ అసమానతల సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. అడ్లైన్ కాస్టెలినో సవాళ్లను ఎదుర్కొంటూనే విజయపథం వైపుగా పయనిస్తోంది. కర్ణాటకకు చెందిన ఈ 22 ఏళ్ల మిస్ ఇండియా సోమవారం జరిగిన 69వ మిస్ యూనివర్స్ పోటీలో థర్డ్ రన్నరప్ (నాలుగో స్థానం)గా నిలిచి దేశం గర్వించేలా చేసింది. ఎవరీ అడ్లై్లన్ కాస్టెలినో... కువైట్‌లో పుట్టి పెరిగిన భారతీయ యువతి అడ్లైన్ కాస్టెలినో. కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని ఉదయరాకు చెందిన ఆల్ఫోన్స్, మీరా కాస్టెలినో దంపతులు ఉద్యోగరీత్యా కువైట్‌లో ఉండేవారు. అక్కడే అడ్లై్లన్ పుట్టింది. కువైట్‌లోని ఇండియన్ సెంట్రల్ స్కూల్లో చదువుకుంది. . ‘అమ్మాయిల ఎదుగుదలకు ఎలాంటి దారి లేని దేశం అది. అలాంటి చోట పుట్టి, పెరిగిన నేను మిస్‌యూనివర్స్‌గా గెలుపొందిన వారిని విస్మయంగా చూసేదాన్ని. ప్రతిష్టాత్మక వేదిక మీద మిస్‌యూనివర్స్ కిరీటం అందుకోవాలన్నది నా కల’’ అంటూ తన జీవన ప్రయాణాన్ని వివరిస్తోంది అడ్లైన్ కాస్టెలినో. ఆమె ఆకాంక్షను తెలుసుకున్న తల్లిదండ్రులు 15 ఏళ్ల వయసులో భారతదేశానికి తిరిగి వచ్చారు. అక్కడ నుంచి ముంబై వెళ్లారు. సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో చదువుకున్న అడ్లైన్ ఆ తర్వాత విల్సన్ కాలేజీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పూర్తి చేసింది. మాతృభాష కొంకణితో పాటు ఇంగ్లిష్, హిందీ, కన్నడ భాషలలో నిష్ణాతురాలు. 2020లో జరిగిన లివా మిస్ దివా యూనివర్స్ పోటీలో విజేతగా నిలిచిన అడ్లైన్కు ఇప్పుడు 22 ఏళ్లు. ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీలో భారత ప్రతినిధిగా నిలిచింది. సాధనే ధ్యేయంగా ముందడుగు ‘మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకోవాలన్న ఆకాంక్ష సౌకర్యవంతంగా ఉండే జీవనం నుంచి నన్ను బయటకు తోసేసిందనే చెప్పాలి’ అంటారు అడ్లైన్. ఇప్పుడు ఇండియాలో అడ్లైన్ ఒక టాప్ మోడల్. ప్రముఖ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తోంది. ఫ్యాషన్, లైఫ్‌సై ్టల్ బ్రాండ్లు, మ్యాగజైన్ కవర్లు, టెలివిజన్, డిజిటల్ ప్రచారాలలో కనిపిస్తోంది. మరిన్ని సృజనాత్మక రంగాలలో అవకాశాలను పొందడానికి కృషి చేస్తోంది. స్మైల్ ట్రెయిన్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉంది. మహిళల ఆరోగ్య సంరక్షణకు అందించే స్నేహ అనే ఎన్జీవోతో కలిసి పనిచేస్తోంది. రైతుల హక్కుల కోసం, అణగారిన గ్రామీణ వర్గాలకు చేయూతనందించే సంస్థలతో కలిసి పనిచేస్తోంది. జీవనం గడవడానికి కొన్నాళ్లు షూస్ తయారుచేసి, అమ్మకాలు కొనసాగించింది. టాప్మోడల్గా, స్వచ్ఛంద సేవకురాలిగా ఎదగడానికి ముందు తనలో ఉన్న నత్తి సమస్యను అధిగమించడానికి కొన్నేళ్లపాటు సాధన చేసింది అడ్లైన్. ఇండియా నుంచి మిస్‌యూనివర్స్ కిరీటానికి పోటీపడి థర్డ్ రన్నరప్‌గా నిలిచింది.. దేశ మహిళల తరపున.. ‘ఎప్పుడూ సాహసోపేత వ్యక్తిగా ఉండటానికి ఇష్టపడతాను. ఎంతటి కష్టమైనా వెనుకంజ వేయను. వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయత్నించడానికి సిద్ధంగా ఉంటాను’ అంటున్న ఈ నవీన యువతి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే అనిపించకమానదు. ‘నిన్నటి వరకు నన్ను నేను ఒక అమ్మాయిలా భావించాను. కానీ, ఇప్పుడు నేను సమాజానికి మద్దతు ఇచ్చే ఒక మహిళను. ఈ ప్రయాణం నాకు ఎంతో నేర్పించింది. ఈ దేశం ఇచ్చే ప్రేమను నేను ఎప్పటినుంచో పొందుతున్నాను. నాకు మద్దతుగా నిలిచి నేను థర్డ్ రన్నరప్(నాల్గవ స్థానంలో)గా నిలిచేందుకు సాయం చేసిన దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు’ అని తెలిపింది అడ్లైన్ కాస్టెలినో. -
మిసెస్ ఇండియా రన్నరప్‌గా ఖమ్మంకు చెందిన వివాహిత
సాక్షి, ఖమ్మం: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈనెల 21న జరిగిన వీపీఆర్ మిసెస్ ఇండియా సీజన్–2లో ఖమ్మం నగరానికి చెందిన వివాహిత మహ్మద్ ఫర్హా రన్నరప్‌గా నిలిచారు. ఫొటోజెనిక్ విభాగంలో మిసెస్ ఇండియాగా ఆమె ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 912 మంది వివాహితలు ఈ పోటీలకు దరఖాస్తు చేసుకోగా.. 41 మంది ఫైనల్‌కు అర్హత సాధించారు. వీరిలో తెలంగాణ నుంచి ఫర్హా మాత్రమే ఎంపికయ్యారు. ఎంబీఏ చదివిన ఫర్హా, హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్ మిషన్, మహిళా సాధికారత సంస్థలకు ఖమ్మం కార్య దర్శిగా సేవలందిస్తున్నారు. భర్త, కుటుంబ సభ్యుల సహకారంతో ఈ విజయం సాధిం చానని, మహిళా హక్కుల కోసం పోరాడటమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. -
జయహో జొకోవిచ్
తనకెంతో కలిసొచ్చిన వేదికపై ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ మళ్లీ చెలరేగాడు. రికార్డుస్థాయిలో తొమ్మిదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ చాంపియన్‌గా నిలిచాడు. రష్యా యువతార డానిల్ మెద్వెదేవ్‌ను ఆద్యంతం హడలెత్తించి... వరుస సెట్లలోనే చిత్తు చేసి... ఈ మెగా టోర్నీ ఫైనల్స్‌లో తన అజేయ రికార్డును కొనసాగించాడు. కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన మెద్వెదేవ్ తన ప్రత్యర్థి దూకుడుకు ఎదురు నిలువలేక మరోసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. మెల్బోర్న్: ఎలాంటి సంచలనం చోటు చేసుకోలేదు. ఊహించిన ఫలితమే వచ్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్న సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ రికార్డుస్థాయిలో తొమ్మిదోసారి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 7–5, 6–2, 6–2తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)ను ఓడించాడు. తాజా గెలుపుతో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను అత్యధికసార్లు గెల్చుకున్న ప్లేయర్‌గా తన పేరిటే ఉన్న రికార్డును జొకోవిచ్ సవరించాడు. ► 113 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో జొకోవిచ్ కు తొలి సెట్లో మినహా ఎక్కడా గట్టిపోటీ ఎదురుకాలేదు. కచ్చితమైన సర్వీస్, బుల్లెట్‌లాంటి రిటర్న్ షాట్లు,బేస్‌లైన్ వద్ద అద్భుత ఆటతీరుతో జొకో విచ్ చెలరేగడంతో మెద్వెదేవ్‌కు ఓటమి తప్పలేదు. ► తాజా విజయంతో 33 ఏళ్ల జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్‌లో తన విజయాల రికార్డును 9–0తో మెరుగుపర్చుకున్నాడు. గతంలో జొకోవిచ్ 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020లలో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు చాంపియన్‌గా నిలిచాడు. ► విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 27 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 15 కోట్ల 71 లక్షలు), 2000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్‌గా నిలిచిన మెద్వెదేవ్‌కు 15 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 కోట్ల 57 లక్షలు), 1200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ► ఫైనల్ చేరే క్రమంలో కేవలం రెండు సెట్లు మాత్రమే కోల్పోయిన మెద్వెదేవ్ ఆటలు తుది పోరులో మాత్రం సాగలేదు. తొలి సెట్ రెండో గేమ్‌లోనే మెద్వెదేవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని 3–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆలస్యంగా తేరుకున్న మెద్వెదేవ్ ఐదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 3–3తో సమం చేశాడు. అయితే 6–5తో ఆధిక్యంలోకి వెళ్లిన జొకోవిచ్ 12వ గేమ్‌లో మెద్వెదేవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. ► రెండో సెట్ బ్రేక్ పాయింట్లతో మొదలైంది. ఇద్దరూ తమ సర్వీస్‌లను చేజార్చుకోవడంతో స్కోరు 1–1తో సమంగా నిలిచింది. ఆ తర్వాత జొకోవిచ్ జోరు పెంచడంతో మెద్వెదేవ్ డీలా పడ్డాడు. రెండుసార్లు మెద్వెదేవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ సెర్బియా స్టార్ సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ► మూడో సెట్ ఆరంభంలోనే జొకోవిచ్ బ్రేక్ పాయింట్ సాధించి 3–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. మెద్వెదేవ్ తేరుకునేందుకు ప్రయత్నించినా జొకోవిచ్ దూకుడు ముందు సాధ్యంకాలేదు. ► తాజా టైటిల్‌తో జొకోవిచ్ మార్చి 8వ తేదీ వరకు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాడగం ఖాయమైంది. తద్వారా అత్యధిక వారాలపాటు నంబర్‌వన్‌గా నిలిచిన ప్లేయర్‌గా (311 వారాలు) జొకోవిచ్ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఫెడరర్ (310 వారాలు) పేరిట ఉంది. ► 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో జొకోవిచ్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న ఫెడరర్, నాదల్ (20 చొప్పున)కు చేరువయ్యాడు. జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒకసారి... వింబుల్డన్‌లో ఐదుసార్లు... యూఎస్ ఓపెన్‌లో మూడుసార్లు విజేతగా నిలిచాడు. కొత్త తరం ఆటగాళ్లు తెరపైకి వచ్చారని, తమ ఆటతో మా ముగ్గురిని (ఫెడరర్, నాదల్, జొకోవిచ్) వెనక్కి నెట్టేస్తారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నాకు మాత్రం అలా అనిపించడంలేదు. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లంటే గౌరవం ఉంది. కానీ వారు ‘గ్రాండ్’ విజయాలు సాధించాలంటే మాత్రం చాలా కష్టపడాలి. రెండు వారాలపాటు క్వారంటైన్లో ఉండటం... టోర్నీ మధ్యలో గాయపడటం... మొత్తానికి నా కెరీర్లో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఆడిన గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఇది. ఈ టోర్నీతో నేను కొత్త పాఠాలు నేర్చుకున్నాను. – జొకోవిచ్ విన్నర్స్, రన్నరప్ ట్రోఫీలతో జొకోవిచ్, మెద్వెదేవ్ -
మిస్ నాటా 2020 రన్నరప్‌గా తారిక
సాక్షి, లక్డీకాపూల్: మిస్ నాటా 2020 ప్రథమ రన్నరప్‌గా ప్రవాస భారతీయురాలు తారిక యెల్లౌలా నిలిచారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ సినీనటి ప్రియమణి, యాంకర్ శ్యామలు వ్యవహరించారు. అమెరికాలోని నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) ఎంతో మంది ప్రతిభావంతులను, కొత్త వారిని ప్రోత్సహించే క్రమంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఈ క్రమంలో నాటా ప్రపంచ స్థాయి మిస్ నాటా పోటీలను నిర్వహించింది. ప్రత్యేకంగా తెలుగు వారి కోసం ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో అమెరికాలోని న్యూజెర్సీలో నివాసముంటున్న పదహారేళ్ల తారక యెల్లౌలా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. (పులికి, గద్దకు పురస్కారం! ) మిస్ నాటా 2020 రన్నరప్‌గా నిలిచిన ఆమె తన చదువును కొనసాగిస్తూనే నటనను, నృత్యాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తన తల్లిదండ్రులు వెంకట్, రోజా, గురువు మాళిని అయ్యర్ ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చినట్లు పేర్కొంటున్నారు. చిన్నప్పటి నుంచే నాట్యం, అభినయం వంటి కళల్లో శిక్షణ తీసుకుంటూ తన సోదరి తాన్వికతో కలిసి ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో నటనతో పాటు నృత్యాన్ని కొనసాగిస్తానని ఆమె వివరించారు. (శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు జాతీయ అవార్డులు) -
రన్నరప్ హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్: కరోనా క్లిష్ట సమయంలో నాలుగు నెలల విరామం తర్వాత జరిగిన తొలి ముఖాముఖి అంతర్జాతీయ టోర్నమెంట్ బీల్ చెస్ ఫెస్టివల్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రన్నరప్‌గా నిలిచాడు. స్విట్జర్లాండ్‌లోని బీల్ నగరంలో బుధవారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 34 ఏళ్ల హరికృష్ణ 36.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. 37 పాయింట్లతో పోలాండ్ గ్రాండ్‌మాస్టర్ రాడోస్లా వొజ్తాసెక్ ఓవరాల్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ర్యాపిడ్, బ్లిట్జ్, క్లాసికల్ విభాగాల్లో టోర్నీలు నిర్వహించి... ఈ మూడు కేటగిరీల్లో ఆటగాళ్లు సాధించిన మొత్తం పాయింట్ల ఆధారంగా ఫైనల్ ర్యాంకింగ్స్‌ను నిర్ధారించారు. హరికృష్ణ ర్యాపిడ్ విభాగంలో 10 పాయింట్లు ... బ్లిట్జ్ విభాగంలో 6 పాయింట్లు... క్లాసికల్ విభాగంలో 20.5 పాయింట్లు స్కోరు చేశాడు. బుధవారం జరిగిన చివరిదైన ఏడో రౌండ్ క్లాసికల్ గేమ్‌లో ప్రపంచ 26వ ర్యాంకర్ హరికృష్ణ 31 ఎత్తుల్లో డేవిడ్ గిజారో (స్పెయిన్)పై గెలుపొందాడు. అయితే మరోవైపు వొజ్తాసెక్ కూడా తన చివరి రౌండ్ గేమ్‌లో తన ప్రత్యర్థి నోయల్ స్టుడెర్ (స్విట్జర్లాండ్)ను ఓడించడంతో హరికృష్ణ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకవేళ వొజ్తాసెక్ గేమ్ ‘డ్రా’ అయిఉంటే హరికృష్ణకు టైటిల్ లభించేంది. ఈ టోర్నీ నిబంధనల ప్రకారం క్లాసికల్ విభాగంలో విజయానికి 4 పాయింట్లు, ‘డ్రా’కు ఒకటిన్నర పాయింట్లు... ర్యాపిడ్ విభాగంలో విజయానికి 2 పాయింట్లు, ‘డ్రా’కు ఒక పాయింట్... బ్లిట్జ్ విభాగంలో విజయానికి 1 పాయింట్, ‘డ్రా’కు అరపాయింట్ కేటాయించారు. చాంపియన్ వొజ్తాసెక్కు 10 వేల స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 8 లక్షల 20 వేలు), రన్నరప్ హరికృష్ణకు 7,500 స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 6 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఓవరాల్ ఫైనల్ ర్యాంకింగ్స్ 1. రాడోస్లా వొజ్తాసెక్ (పోలాండ్–37 పాయింట్లు); 2. పెంటేల హరికృష్ణ (భారత్–36.5 పాయింట్లు); 3. మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్–35.5 పాయింట్లు); 4. విన్సెంట్ కీమెర్ (జర్మనీ–28 పాయింట్లు); 5. అర్కాదిజ్ నైదిష్ (అజర్బైజాన్–22.5 పాయింట్లు); 6. డేవిడ్ గిజారో (స్పెయిన్–22 పాయింట్లు); 7. రొమైన్ ఎడువార్డో (ఫ్రాన్స్–17.5 పాయింట్లు); 8. నోయల్ స్టుడెర్ (స్విట్జర్లాండ్–15 పాయింట్లు). ఆడటంలోనే ఆనందం దక్కింది... బీల్ టోర్నీలో రెండో స్థానంలో నిలవడం సంతోషం. త్రుటిలో ఓవరాల్ చాంపియన్‌షిప్ కోల్పోయాను. అయితే ఎలాంటి నిరాశా లేదు. మూడు ఫార్మాట్లలో (ర్యాపిడ్, బ్లిట్జ్, క్లాసికల్) కూడా బాగా ఆడాను. బ్లిట్జ్‌లో మాత్రం కాస్త వెనుకబడటంతో ఓవరాల్ టైటిల్ చేజారింది. మొత్తంగా నా ప్రదర్శన అయితే చాలా బాగుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీ విజయాలు, ఫలితాలకంటే ముఖాముఖి చెస్ ఆడటంలో నాకు కలిగిన ఆనందం చాలా ఎక్కువ. ఫిబ్రవరిలో చివరి టోర్నమెంట్ బరిలోకి దిగాను. బీల్ నుంచి ‘సాక్షి’తో హరికృష్ణ ► కోవిడ్–19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా మా టోర్నీలు కూడా రద్దు కావడంతో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ సమయంలో అనేక కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు ఓపెనింగ్స్‌పై ఒక పుస్తకం కూడా రాశాను. త్వరలో అది ప్రచురితమవుతుంది. ► ప్రస్తుతం ప్రాగ్ (చెక్ రిపబ్లిక్ రాజధాని)లో ఉంటున్నా. కరోనాకు సంబంధించి స్విట్జర్లాండ్ ప్రభుత్వ నిబంధనలను నిర్వాహకులు పూర్తిగా పాటించారు. మాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు వారే చూసుకోవడం వల్ల మేం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం రాలేదు. బ్లిట్జ్ మినహా మిగిలిన ఫార్మాట్లకు ఇద్దరు ఆటగాళ్ల మధ్య మందమైన ప్లాస్టిక్ తెరలాంటిది ఉంచారు. బ్లిట్జ్ చాలా వేగంగా ముగిసిపోతుంది కాబట్టి మాస్క్‌లు వేసుకొని ఆడామంతే. ► కరోనా విరామం సమయంలో మూడు ఆన్లైన్ టోర్నీల్లో పాల్గొన్నాను. అయితే అవి నాకు సంతృప్తినివ్వలేదు. కంప్యూటర్ ముందు కూర్చుంటే పోటీ పడుతున్నట్లుగా అనిపించలేదు. ఆన్లైన్ ఆడగలిగే అవకాశం చెస్‌కు ఉన్నా... ఎదురుగా మరో ఆటగాడు కూర్చొని ఉంటేనే ఆ అనుభూతి లభిస్తుంది. ప్రత్యర్థిని చూస్తూ, అతని ముఖకవళికలను పరిశీలించడం కూడా చెస్ వ్యూహప్రతివ్యూహాల్లో భాగమే. అందుకే బీల్ నిర్వాహకులు పిలవగానే ఆడేందుకు సిద్ధమయ్యా. ► మొత్తంగా బీల్ టోర్నీ భిన్నమైన అనుభవమే అయినా మరీ కొత్తగా అనిపించలేదు. ఇప్పుడు సంతృప్తిగా వెనుదిరుగుతున్నా. ఇప్పుడు ఒలింపియాడ్ కోసం సన్నద్ధమవుతా. భారత్ ఉన్న గ్రూప్ మ్యాచ్‌లు ఆగస్టు 19 నుంచి ఉన్నాయి కాబట్టి నాకు తగినంత సమయం ఉంది. ఒలింపియాడ్ కూడా తొలిసారి ఆన్లైన్లో నిర్వహించబోతున్నారు. జట్టుగా ఇది ఎలా ఉండబోతోందో అని నేనూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. -
బ్యూటిఫుల్ ఇండియా
నల్ల సౌందర్యానికి మళ్లీ కితాబు దక్కింది. శ్వేతవర్ణం వెనక్కు తగ్గింది. ‘మిస్ యూనివర్స్ 2019’ కిరీటం నల్లజాతి వనితకు దక్కిన కొద్ది రోజుల్లోనే ‘మిస్ వరల్డ్ 2019’ కిరీటం కూడా మరో నల్లవజ్రానికే దక్కింది. జమైకాకు చెందిన టోని ఆన్‌సింగ్ శనివారం లండన్‌లోని ఎక్సెల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన భారీ వేడుకలో మిస్ వరల్డ్ కిరీటాన్ని శిరస్సుపై ధరించి ఈ ఘనతను సాధించింది. 23 ఏళ్ల టోని ఆన్‌సింగ్ తండ్రి ఇండియన్ కరేబియన్. తల్లి ఆఫ్రికన్ కరేబియన్. కనుక ఆమె సౌందర్యంలో భారతీయ మూలాలు ఉన్నందుకు భారతీయ సౌందర్యప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో టాప్ 3లో నిలిచి సెకండ్ రన్నరప్‌గా మిస్ ఇండియా సుమన్ రావు స్థానం పొందడం కూడా భారతీయులకు సంతోషం కలిగిస్తోంది. 111 దేశాలు ఈ కిరీటం కోసం పోటీ పడగా టోని ఆన్‌సింగ్ మొదటి స్థానంలో, సుమన్ రావు మూడో స్థానంలో నిలిచి భారతీయ సౌందర్య కేతనాన్ని రెపరెపలాడించారు. నవంబర్ 20 నుంచి మొదలైన ఈ పోటీలు దాదాపు నాలుగు వారాలపాటు కొనసాగాయి. 70 దేశాల పార్టిసిపెంట్స్ రకరకాల దశల్లో వెనుకకు మరలగా టాప్ 40లో నిలిచిన అందగత్తెలు కిరీటం కోసం హోరాహోరి తలపడ్డారు. జమైకా బాలిక ‘ఈ విజయం ఆ జమైకా బాలికకు అంకితం’ అని కిరీటం దక్కించుకున్నాక టోని ఆన్‌సింగ్ వ్యాఖ్యానించింది. ఆ బాలిక ఎవరో కాదు తనే. ఈ విజయం తనూ తనలాంటి నల్లజాతి బాలికలకు సొంతమని టోని పేర్కొంది. ‘స్త్రీల సమానత్వం కోసం నేను చేయదగ్గ పనంతా చేస్తాను’ అని కూడా ఆమె అంది. టోని కుటుంబం ఆమెకు తొమ్మిదేళ్ల వయసు ఉండగా అమెరికాకు వలస వచ్చింది. ఫ్లోరిడా యూనివర్సిటీలోనే టోని విమెన్స్ స్టడీలో గ్రాడ్యుయేషన్ చేసింది. సెకండ్ రన్నరప్ సుమన్‌రావు రాజస్థాన్ అమ్మాయి రాజస్థాన్‌కు చెందిన సుమన్ రావు ‘మిస్ వరల్డ్ 2019’కు హాజరయ్యే ముందు ‘మిస్ రాజస్థాన్’, ‘మిస్ ఇండియా ఫెమినా’ టైటిల్స్ గెలుచుకుంది. ప్రస్తుతం ఆమె కుటుంబం నవీ ముంబైలో ఉంటోంది. చార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేసే పనిలో ఉన్న సుమన్ రావు ఇప్పటికే మోడలింగ్‌లో బిజీగా ఉంది. సినిమాలలో అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటోంది. కథక్ నృత్యకారిణి కావడం వల్ల మిస్ వరల్డ్ పోటీలలో ఆనవాయితీగా జరిగే డాన్స్ కాంపిటీషన్లో ‘పద్మావత్’ సినిమాలోని ‘ఝమర్’ పాటకు నృత్యం చేసి ఆహూతులను ఉర్రూతలూగించింది. ‘భారతదేశంలో స్త్రీలకు కట్టుబాట్లు ఎక్కువ. నా తల్లి అటువంటి కట్టుబాట్లు చాలా ఎదుర్కొంది. అయినప్పటికీ నన్ను నా కలల వెంట వెళ్లేలా చేసింది’ అని సుమన్ రావు చెప్పింది. మిస్ వరల్డ్ పోటీలో సుమన్ రావు మూడో స్థానంలో నిలిచిందని తెలియగానే ఆమె స్వగృహంలో వేడుకలు మొదలయిపోయాయి. ‘నా కూతురు అనుకున్నది సాధించింది’ అని తండ్రి రతన్ సింగ్ రావు పొంగిపోతూ చెప్పాడు. మొత్తం మీద ఈ శీతాకాలం భారతీయ సౌందర్యానికి మంచి సంతోషాన్ని తెచ్చిందని చెప్పుకోవాలి. ‘పద్మావత్’ సినిమాలోని పాటకు నృత్యం చేస్తున్న సుమన్ రావు -
మిస్ వరల్డ్‌గా జమైకా సుందరి
-
మిస్ వరల్డ్‌గా జమైకా సుందరి
లండన్: జమైకాకు చెందిన టోనీ–ఆన్ సింగ్ మిస్ వరల్డ్–2019 కిరీటం దక్కించుకున్నారు. లండన్‌లోని ఎక్సెల్ లండన్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఆమెను ఈ కిరీటం వరించింది. గత ఏడాది మిస్ వరల్డ్‌గా నిలిచిన మెక్సికో సుందరి వనెస్సా పొన్స్.. టోనీ–ఆన్ సింగ్ తలపై మిస్ వరల్డ్ కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీలో ఫస్ట్ రన్నరప్‌గా ఫ్రాన్స్‌కు చెందిన ఒఫ్లి మెజినో, సెకండ్ రన్నరప్‌గా భారత్‌కు చెందిన సుమన్ రావ్ నిలిచారు. నవంబర్ 20వ తేదీ నుంచి మొదలైన 69వ మిస్ వరల్డ్–2019 పోటీలో 120 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్నారు. పలు వడబోతల అనంతరం ఫైనల్స్ కోసం 10 మందిని ఎంపిక చేశారు. అంతిమంగా ఎంపికైన ఐదుగురికి ప్రముఖ వ్యాఖ్యాత పియర్స్ మోర్గాన్ నేతృత్వంలోని బృందం పలు ప్రశ్నలు సంధించింది. అందగత్తెల సమాధానాల ఆధారంగా విజేతలను ఎంపిక చేసింది. తన సొంతూరుతోపాటు ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం కోసం పోరాడతానని ఈ సందర్భంగా భారత్‌కు చెందిన రన్నరప్ సుమన్ రావ్ అన్నారు. జమైకా నుంచి మిస్ వరల్డ్ గెలుచుకున్న నాలుగో మహిళగా టోనీ–ఆన్ చరిత్ర సృష్టించారు. తొమ్మిదేళ్ల వయస్సులో ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లి, ఫ్లోరిడాలో స్థిరపడింది. సుమన్ రావ్ ► జననం: 1998 నవంబర్ 23 ► స్వస్థలం: రాజస్తాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్ సమీపంలోని అయిదానా ► తల్లి: సుశీలా కున్వర్ రావ్, గృహిణి ► తండ్రి: రతన్ సింగ్, నగల వ్యాపారి ► విద్య: నవీముంబైలోని మహాత్మా స్కూల్ ఆఫ్ అకాడెమిక్స్ అండ్ స్పోర్ట్స్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు, ప్రస్తుతం ముంబై యూనివర్సిటీలో చార్టెర్డ్ అకౌంటెన్సీ చదువుతున్నారు. ► భాషలు: ఇంగ్లిష్, హిందీతోపాటు మాతృభాష మేవారీ ► వృత్తి: మోడల్, డ్యాన్సర్(కథక్) ► 2018లో మిస్ నవీముంబై పోటీలో పాల్గొని మొదటి రన్నరప్‌గా నిలిచారు. అనంతరం రాజస్తాన్ తరఫున పాల్గొని ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ –2019ను, ఆ పోటీల్లోనే మిస్ ర్యాంప్‌వాక్ అవార్డు గెలుచుకున్నారు. -
రన్నరప్‌తో సరి
ఈ ఏడాది తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు నిరాశ ఎదురైంది. ఈ సీజన్లో తొలిసారి ఫైనల్ ఆడిన ఆమె ఇండోనేసియా ఓపెన్‌లో తుది మెట్టుపై బోల్తా పడింది. తన ఫైనల్ ప్రత్యర్థిపై పదిసార్లు నెగ్గిన రికార్డు ఉన్నప్పటికీ కీలక తరుణంలో తప్పిదాలతో సింధు మూల్యం చెల్లించుకొని రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గతంలో సింధుపై పద్నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగుసార్లే నెగ్గిన అకానె యామగుచి ఈ సీజన్లో అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ మూడో టైటిల్‌ను సాధించింది. జకార్తా: క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులపై అలవోక విజయాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైనల్లో మాత్రం తడబడింది. ఈ సీజన్లో తొలి టైటిల్‌ను గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సింధు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 15–21, 16–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడిపోయింది. విజేత అకానె యామగుచికి 87,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 60 లక్షల 28 వేలు)తోపాటు 12,000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సింధుకు 42,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 29 లక్షల 28 వేలు)తోపాటు 10,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గత డిసెంబర్లో సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో చాంపియన్‌గా నిలిచిన అనంతరం సింధుకు ఇండోనేసియా ఓపెన్ రూపంలో ఈ ఏడాది తొలి టైటిల్ సాధించే అవకాశం వచ్చింది. కానీ 51 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సింధు కీలకదశలో తప్పిదాలు చేసి విజయానికి దూరమైంది. వివిధ టోర్నీల్లో యామగుచితో ఆడిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గిన సింధు ఈసారి మాత్రం అదే ఫలితం రాబట్టలేకపోయింది. క్వార్టర్ ఫైనల్లో రెండో ర్యాంకర్, ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై, సెమీఫైనల్లో మూడో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా)పై అలవోకగా నెగ్గిన సింధు తుది సమరంలో మాత్రం వరుస గేముల్లో ఓటమి చవిచూసింది. ఈ ఏడాది జర్మన్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లలో విజేతగా నిలిచిన యామగుచి ఫైనల్లో ప్రణాళిక ప్రకారం ఆడింది. పలుమార్లు వెనుకపడ్డా ఒత్తిడికి లోనుకాకుండా ఆడి సింధు ఆట కట్టించింది. తొలి గేమ్‌లో సింధు 14–12తో రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నదశలో... యామగుచి అద్భుత ఆటతీరుతో వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి 20–14తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత సింధు ఒక పాయింట్ సాధించగా... వెంటనే యామగుచి మరో పాయింట్ నెగ్గి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో స్కోరు 4–4 వద్ద ఉన్నపుడు యామగుచి రెండు పాయింట్లు గెలిచి 6–4తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ యామగుచి విజయాన్ని ఖాయం చేసుకుంది. ‘అకానె యామగుచి అద్భుతంగా ఆడింది. సుదీర్ఘంగా సాగిన ర్యాలీల్లో ఆమెనే పైచేయి సాధించింది. తొలి గేమ్‌లో నేను రెండు, మూడు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నదశలో తప్పిదాలు చేశాను. ఈ అవకాశాలను ఆమె అనుకూలంగా మల్చుకుంది. నేను తొలి గేమ్‌లో గెలిచిఉంటే తుది ఫలితం మరోలా ఉండేది. రెండో గేమ్‌లో యామగుచికి నేను ఆరేడు పాయింట్ల ఆధిక్యం ఇచ్చాను. దాంతో నేను కోలుకునే అవకాశం లేకుండా పోయింది. తుది ఫలితం నిరాశపరిచినా ఓవరాల్‌గా ఈ టోర్నీలో నా ఆటపట్ల సంతృప్తిగా ఉన్నాను. తదుపరి జపాన్ ఓపెన్ టోర్నీలో ఆడనున్నాను. అక్కడ మరింత మెరుగైన ఫలితం సాధిస్తానన్న నమ్మకం ఉంది.’ –పీవీ సింధు -
మిస్ యూనివర్స్‌గా ఫిలిప్పీన్స్ భామ
బ్యాంకాక్: మిస్ యూనివర్స్ 2018 కిరీటాన్ని ఫిలిప్పీన్స్ యువతి కాట్రియానా గ్రే సొంతం చేసుకుంది. 93 దేశాలకు చెందిన యువతులు ఈ కిరీటం కోసం పోటీపడగా కాట్రియానా విజేతగా నిలిచింది. సోమవారం బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్లో న్యాయనిర్ణేతలు ఆమెను విజేతగా ప్రకటించారు. తొలి రన్నరప్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన తామరిన్ గ్రీన్, రెండో రన్నరప్‌గా వెనెజెవిలాకు చెందిన స్టీఫనీ గుటీరెజ్ నిలిచారు. సింగర్, మోడల్‌గా పేరొందిన కాట్రియానా వేదికపై ఎరుపు రంగు గౌనులో తళుక్కుమంది. ఓ అగ్నిపర్వతాన్ని ప్రేరణగా తీసుకుని తాను ఎరుపు రంగు గౌనును ధరించానని కాట్రియానా చెప్పింది. గతేడాది మిస్ యూనివర్స్‌గా నిలిచిన డేమీ లీ నీల్పీటర్స్ కాట్రియానాకు కిరీటాన్ని అలంకరించింది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె కాట్రియానాకు అభినందనలు తెలిపారు. -
రన్నరప్ ప్రజ్నేశ్
న్యూఢిల్లీ: నింగ్బో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ రన్నరప్‌గా నిలిచాడు. చైనాలో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 170వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 6–7 (4/7), 6–4, 3–6తో ప్రపంచ 131వ ర్యాంకర్ థామస్ ఫాబియానో (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ తొలి సెట్లో ఎనిమిది బ్రేక్ పాయింట్లను వృథా చేసుకోవడం గమనార్హం. రన్నరప్ ప్రజ్నేశ్‌కు 12,720 డాలర్ల (రూ. 9 లక్షల 32 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 65 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
చెంగ్డూ ఓపెన్ రన్నరప్ జీవన్ జంట
కెరీర్లో రెండో ఏటీపీ టోర్నమెంట్ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ క్రీడాకారుడు జీవన్ నెడుంజెళియన్‌కు నిరాశ ఎదురైంది. ఆదివారం చైనాలో ముగిసిన చెంగ్డూ ఓపెన్‌లో జీవన్–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో జీవన్–ఆస్టిన్ ద్వయం 2–6, 4–6తో టాప్ సీడ్ ఇవాన్ డోడిగ్–మ్యాట్ పావిక్ (క్రొయేషియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. రన్నరప్ జీవన్–ఆస్టిన్ జంటకు 30,490 డాలర్ల (రూ. 22 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
మళ్లీ రన్నరప్‌గా నయోమి ఒసాకా
స్వదేశంలో తొలిసారి టైటిల్ సాధించాలని ఆశించిన జపాన్ టెన్నిస్ కొత్త సంచలనం నయోమి ఒసాకాకు రెండోసారీ నిరాశే ఎదురైంది. టోక్యోలో ఆదివారం ముగిసిన పాన్ పసిఫిక్ ఓపెన్ టోర్నీలో ప్రపంచ ఏడో ర్యాంకర్ ఒసాకా రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో మాజీ నంబర్‌వన్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–4, 6–4తో ఒసాకాను ఓడించి విజేతగా నిలిచింది. రెండేళ్ల క్రితం ఇదే టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ఒసాకా ఇటీవలే యూఎస్ ఓపెన్‌లో సెరెనాను ఓడించి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి జపాన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. -
సింగిల్స్ రన్నరప్ వృశాలి
సాక్షి, హైదరాబాద్: పోలిష్ ఓపెన్ అంతర్జాతీయ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి గుమ్మడి వృశాలి రన్నరప్‌గా నిలిచింది. పోలాండ్‌లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో వృశాలి 11–21, 14–21తో భారత్‌కే చెందిన రితూపర్ణ దాస్ చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్స్‌లో వృశాలి 23–21, 21–9తో ప్రిస్కిలా(జర్మనీ)పై, రితూపర్ణ 21–19, 21–11తో జోర్డాన్ హార్ట్ (వేల్స్)పై గెలుపొందారు. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్ హర్షీల్ డాని విజేతగా నిలిచాడు. ఫైనల్లో హర్షీల్ 21–19, 21–13తో నాలుగో సీడ్ లూ చియా హంగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. -
రన్నరప్ పేస్ జంట
న్యూఢిల్లీ: కెరీర్లో 55వ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు నిరాశ ఎదురైంది. అమెరికాలో జరిగిన విన్స్టాన్ సాలెమ్ ఓపెన్ టోర్నీలో పేస్–సెరెటాని (అమెరికా) జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో పేస్ ద్వయం 4–6, 2–6తో రోజర్ (నెదర్లాండ్స్)–టెకావ్ (రొమేనియా) జంట చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన పేస్ జోడీ ఖాతాలో 20,040 డాలర్ల (రూ. 14 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు చేరాయి. -
స్నేహిత్ బృందానికి రజతం
ఆసియా జూనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. హైదరాబాద్ ప్లేయర్ ఆర్. స్నేహిత్ సభ్యుడిగా ఉన్న భారత బృందం మయన్మార్‌లో బుధవారం జరిగిన ఫైనల్లో 0–3తో చైనా చేతిలో ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకుంది. రన్నరప్ ప్రదర్శనతో భారత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌కు తొలిసారి అర్హత సాధించింది. ఈ ఏడాది డిసెంబర్ 2 నుంచి 9 వరకు ఆస్ట్రేలియాలో జరుగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్నేహిత్, మానవ్ ఠక్కర్, మనుశ్ షా, జీత్ చంద్రలతో కూడిన భారత జట్టు పాల్గొననుంది. -
రన్నరప్ జయరామ్
హో చి మిన్ సిటీ (వియత్నాం): సీజన్లో తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత అగ్రశ్రేణి షట్లర్ అజయ్ జయరామ్‌కు నిరాశ ఎదురైంది. వియత్నాం ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో జయరామ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న అజయ్ ఫైనల్ పోరులో మాత్రం చేతులెత్తేశాడు. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో 30 ఏళ్ల భారత ఆటగాడు 14–21, 10–21తో రుస్తవిటో (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. కేవలం 28 నిమిషాల్లోనే భారత ప్లేయర్ ఆట ముగిసింది. ‘ఫైనల్లో ఏ దశలోనూ నేను నిలకడగా ఆడలేదు. అనవసర తప్పిదాలు చాలా చేశాను. నెట్ వద్ద తడబడ్డాను. సుదీర్ఘ ర్యాలీలకు సరైన ఫినిషింగ్ కూడా ఇవ్వలేదు. గాయం నుంచి కోలుకున్నాక గత రెండు నెలల్లో మంచి ప్రదర్శనే చేశాను. రెండు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచాను’ అని జయరామ్ వ్యాఖ్యానించాడు. -
సుమీత్ జంటకు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: లాగోస్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్‌కు చెందిన సుమీత్ రెడ్డి పురుషుల డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. నైజీరియాలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి ద్వయం 21–12, 21–12తో భారత్‌కే చెందిన వైభవ్–ప్రకాశ్ రాజ్ జంటను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను హైదరాబాద్ అమ్మాయి కె.మనీషా, మనూ అత్రితో కలిసి దక్కించుకుంది. ఫైనల్లో మనీషా–మనూ జంట 21–17, 22–20 తో కుహూ గార్గ్–రోహన్ (భారత్) ద్వయంపై గెలిచింది. మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి శ్రీకృష్ణప్రియ రన్నరప్‌గా నిలిచింది. మూడో సీడ్ సెనియా పోలికర్పోవా (ఇజ్రాయెల్)తో జరిగిన ఫైనల్లో శ్రీకృష్ణప్రియ 22–20, 16–21, 25–27తో పోరాడి ఓడిపోయింది. -
రన్నరప్ రామ్‌కుమార్
న్యూపోర్ట్ (అమెరికా): రెండు దశాబ్దాలుగా భారత క్రీడాకారులను ఊరిస్తోన్న అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్ సింగిల్స్ టైటిల్ నిరీక్షణ ఇంకా కొనసాగనుంది. ఆదివారం ముగిసిన న్యూపోర్ట్ ఓపెన్ ‘హాఫ్ ఆఫ్ ఫేమ్’ ఏటీపీ–250 టోర్నమెంట్లో భారత ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ రన్నరప్‌గా నిలిచాడు. రెండు గంటలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 161వ ర్యాంకర్ రామ్‌కుమార్ 5–7, 6–3, 2–6తో ప్రపంచ 48వ ర్యాంకర్, మూడో సీడ్ స్టీవ్ జాన్సన్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. రామ్‌కుమార్ 10 ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. విజేతగా నిలిచిన స్టీవ్ జాన్సన్‌కు 99,375 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 68 లక్షల 29 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ రామ్‌కుమార్‌కు 52,340 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 35 లక్షల 97 వేలు)తోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. శనివారం జరిగిన సెమీఫైనల్లో చెన్నైకు చెందిన 23 ఏళ్ల రామ్‌కుమార్ 6–4, 7–5తో టిమ్ స్మిజెక్ (అమెరికా)పై గెలుపొంది తన కెరీర్లో తొలిసారి ఏటీపీ–250 టూర్ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించాడు. 2009లో చెన్నై ఓపెన్‌లో, 2011లో దక్షిణాఫ్రికా ఓపెన్‌లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఫైనల్‌కు చేరిన తర్వాత భారత్ నుంచి రామ్‌కుమార్ రూపంలో మరో ప్లేయర్ ఏటీపీ టూర్ టోర్నీలో టైటిల్ పోరుకు చేరడం ఇదే ప్రథమం. సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఆ రెండు టోర్నీల ఫైనల్స్‌లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. భారత్ తరఫున చివరిసారి ఏటీపీ టూర్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించిన ఆటగాడు లియాండర్ పేస్. 1998 న్యూపోర్ట్ ఓపెన్‌లో లియాండర్ పేస్ విజేతగా నిలిచాడు. ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో సుకోవా, స్టిక్ అంతర్జాతీయ టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో వింబుల్డన్ మాజీ సింగిల్స్ చాంపియన్ మైకేల్ స్టిక్ (జర్మనీ), 14 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గిన హెలెనా సుకోవా (చెక్ రిపబ్లిక్)లకు చోటు కల్పించారు. స్టిక్ 1991 వింబుల్డన్ టోర్నీలో బోరిస్ బెకర్ (జర్మనీ)పై వరుస సెట్లలో గెలిచాడు. 1994 యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఆండ్రీ అగస్సీ (అమెరికా) చేతిలో... 1996 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో కఫెల్నికోవ్ (రష్యా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. 1997లో రిటైరయిన స్టిక్ కెరీర్ మొత్తంలో 18 సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. సుకోవా, మైకేల్ స్టిక్ -
ఫుట్‌బాల్ విశ్వ విజేత ఫ్రాన్స్
-
ఫ్రెంచ్ ఫెస్టివల్
ఫ్రెంచ్ కిక్ అదిరింది. విశ్వ వేదికపై ఫ్రాన్స్ త్రివర్ణం ఉవ్వెత్తున ఎగిరింది. రెండు దశాబ్దాల తర్వాత ఫుట్‌బాల్ వరల్డ్ కప్ మళ్లీ ‘ది బ్లూస్’ చెంత చేరింది. అగ్రశ్రేణి జట్టుగా తమపై ఉన్న అంచనాలకు ఎక్కడా తగ్గకుండా టోర్నీలో అజేయంగా దూసుకెళ్లిన ఫ్రాన్స్ చివరకు శిఖరాన నిలిచి సత్తా చాటింది. ఫైనల్ పోరులో అత్యద్భుత ఆట తీరు కనబర్చకపోయినా, తమ బలాన్ని నమ్ముకొని తెలివిగా, వ్యూహాత్మకంగా ఆడిన ఫ్రెంచ్ బృందం కూసింత అదృష్టం కూడా కలిసొచ్చి సంచలనాల క్రొయేషియా ఆట కట్టించింది. రెండో సారి వరల్డ్ కప్ విన్నర్‌గా నిలిచి తమ స్థాయిని ప్రదర్శించింది. గ్రీజ్మన్, పోగ్బా, ఎంబాపెలాంటి స్టార్లు ఆఖరి పోరులో గోల్స్‌తో చెలరేగగా... 1998లో కెప్టెన్‌గా ప్రపంచ కప్ అందించిన దిదియర్ డెచాంప్స్ ఇప్పుడు కోచ్‌గా మళ్లీ ట్రోఫీని ముద్దాడగలిగాడు. అటు మాస్కోలో ఆఖరి విజిల్ మోగగానే ఇటు ఈఫిల్ టవర్ సాక్షిగా పారిస్ వీధుల నిండా విరామం లేకుండా ‘ఫ్రెంచ్ వైన్’ పొంగిపొర్లడం ప్రారంభమైపోయింది. మ్యాచ్ ఆసాంతం బంతిపై పట్టు... అటాకింగ్‌తో తిరుగులేని ఆట... ప్రత్యర్థి ఏరియాలోకి పదే పదే దూసుకుపోయిన ఫార్వర్డ్లు ... కానీ గోల్స్ లెక్కలో మాత్రం వెనుకబడిపోయిన క్రొయేషియాకు గుండెకోత తప్పలేదు. తొలిసారి ఫైనల్ చేరి ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన ఈ జట్టుకు తుది ఫలితం చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. టైటిల్ పోరులో దురదృష్టం దగ్గరి బంధువులా క్రొయేషియా వెంట పరుగెత్తుకు వచ్చింది. ముందుగా సెల్ఫ్ గోల్, ఆపై రిఫరీ తప్పుడు నిర్ణయంతో ప్రత్యర్థికి పెనాల్టీ అవకాశం ఒక్కసారిగా జట్టును వెనుకంజ వేసేలా చేశాయి. ఆ తర్వాత ఎంత పోరాడినా అది మాజీ చాంపియన్‌ను నిలువరించడానికి సరిపోలేదు. మూడు నాకౌట్ మ్యాచ్‌లను కూడా అదనపు సమయంలో గెలుచుకొని పవర్ ప్రదర్శించిన ఈ టీమ్‌కు ఫైనల్ మాత్రం నిరాశనే పంచింది. ‘హృదయాలు గెలిచారు’ అనే ఓదార్పు మాట తప్ప ఇక రన్నరప్ ముద్రతోనే ఆ జట్టు వచ్చే నాలుగేళ్లు సహవాసం చేయాల్సిందే. మాస్కో: ఫ్రాన్స్ రెండోసారి ఫుట్‌బాల్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. 2018 టోర్నీలో ఒక్క మ్యాచ్ ఓడకుండా అజేయంగా ముందుకు సాగిన ఫ్రెంచ్ బృందం ఫైనల్లోనూ చెలరేగింది. లుజ్నికి స్టేడియంలో జరిగిన తుది పోరులో ఫ్రాన్స్ 4–2 గోల్స్ తేడాతో క్రొయేషియాను చిత్తు చేసింది. క్రొయేషియా ఆటగాడు మాన్‌జుకిచ్ (18వ నిమిషం) సెల్ఫ్ గోల్‌తో ఫ్రాన్స్ ఖాతా తెరవగా... గ్రీజ్మన్ (38వ ని.లో), పోగ్బా (59వ ని.లో), ఎంబాపె (65వ ని.లో) తమ జట్టు తరఫున గోల్స్ కొట్టారు. క్రొయేషియా తరఫున పెరిసిచ్ (28వ ని.లో), మాన్‌జుకిచ్ (69వ ని.లో) గోల్స్ సాధించారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఫ్రాన్స్ 2–1తో ఆధిక్యంలో నిలవగా... ఆ తర్వాత మరో రెండు గోల్స్‌తో ఫ్రాన్స్ తమ ప్రత్యర్థికి అవకాశం లేకుండా చేసింది. చివర్లో క్రొయేషియా ఎంత పోరాడినా లాభం లేకపోయింది. ఫ్రాన్స్‌తో పోలిస్తే ఏకంగా 61 శాతం క్రొయేషియా బంతిని నియంత్రణలో ఉంచుకున్నా... తుది ఫలితం విషయంలో మాత్రం అది ప్రతిఫలించలేదు. క్రొయేషియా బ్యాడ్‌లక్... తొలిసారి ఫైనల్ ఆడుతున్న క్రొయేషియా ఆరంభంలో చెలరేగింది. ప్రత్యర్థి దూకుడుగా ఆడటంతో తొలి 15 నిమిషాల పాటు ఫ్రాన్స్‌కు ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు. ఏ దశలో కూడా ఫ్రాన్స్ ఆటగాళ్లు వరుసగా మూడు పాస్‌లు కూడా ఇవ్వలేకపోయారు. అయితే మంచి జోష్‌లో కనిపించిన క్రొయేషియా అదే జోరులో చేసిన పొరపాటు ఫ్రెంచ్ జట్టుకు కలిసొచ్చింది. గ్రీజ్మన్ కొట్టిన ఫ్రీ కిక్ కోసం అతని సహచరుడు రాఫెల్ వరాన్ సిద్ధమయ్యాడు. అయితే దానిని అడ్డుకునే ప్రయత్నంలో నియంత్రణ కోల్పోయిన మాన్‌జుకిచ్ తమ గోల్ పోస్ట్లోకే బంతిని పంపించేశాడు. ప్రపంచ కప్ ఫైనల్లో నమోదైన తొలి సెల్ఫ్ గోల్ ఇదే కావడం విశేషం. అయితే కొద్దిసేపటికే పెరిసిచ్ గోల్ చేసి క్రొయేషియా ఆశలకు ఊపిరి పోశాడు. ఫ్రాన్స్ పెనాల్టీ ఏరియాలో ప్రతీ ఒక్కరు బంతిపై పట్టుకోసం ప్రయత్నిస్తున్న దశలో పెరిసిచ్ ప్రశాంతంగా అందు కొని ఏమాత్రం తడబాటు లేకుండా గోల్ కొట్టాడు. ఆ తర్వాత పెరిసిచ్ను దురదృష్టం పలకరించింది. అతను చేతితో బంతిని అడ్డుకున్నాడని రిఫరీ పెనాల్టీ ఇచ్చేశాడు. ముందుగా పెనాల్టీకి అంగీకరించని రిఫరీ ‘వీఏఆర్’ ద్వారా సుదీర్ఘ సమయం తీసుకొని దానిని నిర్ధారించడం వివాదాస్పదమైంది. పెరిసిచ్ చేతికి బంతి తగలడం వాస్తవమే కానీ అది ఉద్దేశ పూర్వకంగా చేయలేదనే క్రొయేషియా వాదన చెల్లలేదు. గ్రీజ్మన్ అలవోకగా కీపర్‌ను బోల్తా కొట్టించడంతో ఫ్రాన్స్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఫ్రాన్స్ దూకుడు... రెండో అర్ధభాగంలో కూడా క్రొయేషియా దూకుడుగానే ఆడే ప్రయత్నం చేయగా, ఫ్రాన్స్ తడబాటు కొనసాగింది. ల్యుకా మోడ్రిచ్, ఇవాన్ రాకిటిచ్ పదే పదే ఫ్రాన్స్ ఏరియాలో చొరబడినా గోల్ చేయడంలో మాత్రం సఫలం కాలేకపోయారు. ఈ దశలో ఒక్కసారిగా వ్యూహం మార్చిన ఫ్రాన్స్ ఫలితం సాధించింది. కౌంటర్ అటాక్‌తో ఆ జట్టు కీలక గోల్ నమోదు చేసింది. ముందుగా క్రొయేషియా డిఫెండర్ల నుంచి బంతిని లాక్కున్న పోగ్బా ఆ తర్వాత ఎంబాపెకు పాస్ ఇచ్చాడు. ఎంబాపె నుంచి పాస్ గ్రీజ్మన్కు వెళ్లి మళ్లీ పోగ్బాకు వచ్చింది. పోగ్బా కొట్టిన షాట్‌ను మోడ్రిచ్ అడ్డుకోవడంతో బంతి మళ్లీ వెనక్కి వచ్చింది. ఈసారి పొరపాటుకు చాన్స్ లేకుండా పోగ్బా గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. ఇదే జోరులో మరో ఆరు నిమిషాలకే ఎంబాపె సునాయాస గోల్ సాధించాడు. క్రొయేషియా ఏరియాలో అడ్డుకోవడానికి ఎవరూ లేకపోగా, కీపర్ కూడా అచేతనంగా మారిపోవడంతో... పీలే (1958లో) తర్వాత అతి పిన్న వయసులో వరల్డ్ కప్ ఫైనల్లో గోల్ కొట్టిన ఆటగాడిగా ఎంబాపె నిలిచాడు. తమ జట్టు ఆశలు కోల్పోయిన దశలో మాన్‌జుకిచ్ గోల్ కొట్టి ఊపు తెచ్చాడు. ఫ్రాన్స్ కీపర్ లోరిస్ తన వద్దకు వచ్చిన బంతిని కిక్ కొట్టకుండా అక్కడే డ్రిబ్లింగ్ చేస్తుండగా పైకి దూసుకొచ్చి మాన్‌జుకిచ్ అనూహ్యంగా గోల్ సాధించడం విశేషం. అయితే ఆ వెంటనే ఫ్రాన్స్ కోచ్ ముగ్గురు డిఫెండర్లను సబ్స్టిట్యూట్లుగా బరిలోకి దించి రక్షణాత్మక ప్రదర్శనకే మొగ్గు చూపాడు. దాంతో క్రొయేషియా ఎంత ప్రయత్నించినా మరో గోల్ సాధించడంలో విఫలమై కన్నీటితో నిష్క్రమించింది. మా యువ జట్టు అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే టాప్ జట్టుగా నిలిచింది. మా చాంపియన్లలో కొందరికైతే 19 ఏళ్లే! నిజానికి మేం అంత గొప్పగా ఆడలేదు. కానీ మానసిక నైపుణ్యాన్ని కనబరిచాం. మొత్తానికి నాలుగు గోల్స్ చేశాం. గెలిచేందుకు మా వాళ్లకే అర్హత ఉంది. మా బృందమంతా చాలా కష్టపడింది. ఈ గెలుపుదారిలో ఎన్నో క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంది. రెండేళ్ల క్రితం ‘యూరో’ గెలవలేకపోవడం బాధించింది. కానీ గుణపాఠాలెన్నో నేర్పింది. ఇది నా విజయం కాదు. ఆటగాళ్లు 55 రోజులుగా పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ ప్రపంచకప్. దీన్నిప్పుడు ఫ్రాన్స్‌కు తీసుకెళ్తున్నందుకు గర్వంగా ఉంది. –ఫ్రాన్స్ కోచ్ డెచాంప్స్ ► 1970 (బ్రెజిల్) తర్వాత ఫైనల్లో 4 గోల్స్ కొట్టిన తొలి జట్టు ఫ్రాన్స్ ► 2002 నుంచి నాలుగు ప్రపంచకప్ ఫైనల్స్‌లో కలిపి 6 గోల్స్ నమోదు కాగా... ఈ ఒక్క మ్యాచ్‌లోనే 6 గోల్స్ వచ్చాయి. 1958 ఫైనల్ తర్వాత ఒకే మ్యాచ్‌లో 6 గోల్స్ నమోదు కావడం కూడా ఇదే మొదటిసారి. ► జగాలో (బ్రెజిల్), బ్రెకన్‌బాయర్ (జర్మనీ) తర్వాత అటు కెప్టెన్‌గా, ఇటు కోచ్‌గా కూడా వరల్డ్ కప్ సాధించిన మూడో ఆటగాడు దిదియర్ డెచాంప్స్. 1998 అతని నాయకత్వంలోనే సొంతగడ్డపై ఫ్రాన్స్ వరల్డ్ కప్ గెలిచింది. ఎవరికెంత వచ్చాయంటే...? ► విజేత ఫ్రాన్స్ జట్టుకు 3 కోట్ల 80 లక్షల డాలర్లు (రూ. 260 కోట్లు) ► రన్నరప్ క్రొయేషియా జట్టుకు 2 కోట్ల 80 లక్షల డాలర్లు (రూ. 191 కోట్లు). ► మూడో స్థానం పొందిన బెల్జియం జట్టుకు 2 కోట్ల 40 లక్షల డాలర్లు (రూ. 164 కోట్లు). ► నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌కు 2 కోట్ల 20 లక్షల డాలర్లు (రూ. 150 కోట్లు). ► క్వార్టర్స్‌లో ఓడిన జట్లకు కోటీ 60 లక్షల డాలర్లు చొప్పున (రూ. 109 కోట్లు). ► ప్రిక్వార్టర్స్‌లో ఓడిన జట్లకు కోటీ 20 లక్షల డాలర్లు చొప్పున (రూ. 82 కోట్లు). ► లీగ్ దశలోనిష్క్రమించిన జట్లకు 80 లక్షల డాలర్లు చొప్పున (రూ. 54 కోట్లు). విశేషాలు ప్రపంచకప్‌లో నమోదైన మొత్తం గోల్స్ -169 జరిగిన మ్యాచ్‌లు -64 ఎల్లో కార్డులు -219 రెడ్ కార్డులు -4 టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన జట్టు బెల్జియం -16 ఒకే మ్యాచ్‌లో నమోదైన అత్యధిక గోల్స్ (బెల్జియం 5–ట్యూనిషియా 2; ఇంగ్లండ్ 6–పనామా 1).- 7 గోల్స్ లేకుండా ‘డ్రా’గా ముగిసిన మ్యాచ్‌లు (ఫ్రాన్స్–డెన్మార్క్).- 1 లీగ్ దశలో ‘డ్రా’గా ముగిసిన మ్యాచ్‌లు -8 నాకౌట్ దశలో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం తేలిన మ్యాచ్‌లు- 3 రన్నరప్ క్రొయేషియా జట్టు ఫెయిర్ ప్లే అవార్డు: స్పెయిన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ సంబరం -
అందం ఒక్కటే సరిపోదు..
జూబ్లీహిల్స్: ఫెమినా మిస్ ఇండియా–2018 రన్నరప్ శ్రేయారావు కామవరపు బుధవారం నగరంలో సందడి చేసింది. ఐటీసీ కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మీడియాతో తన విజయాన్ని పంచుకున్నారు. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాల్లో ఆడిషన్స్ నిర్వహించి తుది వడపోతలో 30 మందిని ఎంపిక చేసారన్నారు. దక్షిణాది నుంచి తనతో పాటు 15 మంది ఎంపికయ్యారన్నారు. మెంటార్‌గా రకుల్‌ప్రీత్.. అందాల పోటీల్లో కేవలం అందం ఒక్కదానితోనే నెగ్గుకు రాలేమని, ఆత్మవిశ్వాసం, అంతః సౌందర్యం చాలా ముఖ్యమన్నారు. దక్షిణాది నుంచి పోటీపడ్డ అమ్మాయిలకు ప్రముఖ నటి రకుల్‌ప్రీత్ సింగ్ మెంటార్‌గా వ్యహరించి విలువైన సలహాలు, సూచనలు అందించారన్నారు. ఇక సినిమాలు, మోడలింగ్.. తాను ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నాని, ఉన్నతవిద్యకు లండన్ వెళ్లే ఆలోచనలో ఉండగా అనుకోకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అందాల పోటీల్లో పాల్గొని, ఇప్పుడు ఫెమినా మిస్ ఇండియా రన్నరప్‌గా నిలవడం ఆనందంగా ఉందన్నారు. సినిమాలు, మోడలింగ్ రంగాల్లో నిలదొక్కుకోవడం కష్టమైనా మంచి అవకాశాలు వస్తే తప్పక ప్రయత్నిస్తానన్నారు. తాను ఎప్పుడూ జిమ్‌కు వెళ్లలేదని, పోటీలు ప్రారంభమైన తర్వాతే ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకున్నానన్నారు. -
భారత్... చేజేతులా
బ్రెడా (నెదర్లాండ్స్): వరుసగా రెండోసారి చాంపియన్స్ ట్రోఫీలో భారత పురుషుల హాకీ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ పెనాల్టీ షూటౌట్లో 1–3తో పరాజయం పాలైంది. నిర్ణీత సమయం ముగిసేవరకు రెండు జట్లు 1–1తో సమంగా ఉండటంతో విజేతను షూటౌట్ ద్వారా నిర్ణయించారు. 2016 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ భారత్ షూటౌట్లోనే 1–3 స్కోరుతో ఆస్ట్రేలియా చేతిలోనే ఓడిపోవడం గమనార్హం. నిర్ణీత సమయంలో 24వ నిమిషంలో బ్లేక్ గోవర్స్ గోల్‌తో ఆసీస్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది, అనంతరం వివేక్ ప్రసాద్ (42వ నిమిషంలో) గోల్‌తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. -
మా పేరెంట్స్ చాలా భయపడ్డారు
సాక్షి, ముంబై: ఫెమినా మిస్ ఇండియా-2018 పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రేయా రావు కామవరపు(23) రెండో రన్నరప్‌గా నిలిచి సత్తా చాటారు. ఆర్కిటెక్చర్ అయిన శ్రేయా.. ఓ స్నేహితురాలు పట్టుబట్టడంతో అడిషన్స్‌కు వెళ్లి మరీ ఈ అదృష్టాన్ని అందుకున్నారంట. అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం అందాల పోటీలనగానే ముందు భయపడ్డారని ఆమె చెబుతున్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. ‘అర్కిటెక్ అయిన నాకు మిస్ ఇండియా పోటీలకు యత్నించటం తొలుత కష్టంగానే అనిపించింది. ర్యాంప్ వాక్ అంటే ఏంటో నాకు అస్సలు తెలీదు. పైగా మేకప్ వేసుకోవటం కూడా నాకు రాదు. దీనికితోడు అందాల పోటీలు అనగానే నా పెరెంట్స్ ఒక్కసారిగా భయపడ్డారు. వారిలో తెలీని ఏదో ఆందోళన. నా అడిషన్స్ అన్నీ చూశాక వాళ్ల అభిప్రాయం మారింది. ఇది కేవలం ఒక్క అందాల పోటీలే కాదని, నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానన్న నమ్మకం వారికి ఏర్పడింది. అందుకే చివర్లో మంచి ప్రోత్సాహం అందించారు. సాధ్యమైనంత వరకు నా వ్యవహారాలు నేనే చూసుకున్నా’ని ఆమె తెలిపారు. ఇప్పుడు తన ముందున్న లక్ష్యం ఒక్కటేనని, ఇంత కంటే పెద్ద విజయాన్ని తన దేశానికి అందించాలనుకున్నట్లు శ్రేయా ధీమాతో చెబుతున్నారు. ‘నా కల తీరాక తిరిగి నా ప్రొఫెషన్‌కు వెళ్లిపోతా. విద్యాసంస్థలు నెలకొల్పటం నా కల. అది నెరవేరే దాకా కృషి చేస్తా. అంతేగానీ గ్లామర్ వరల్డ్‌లో మాత్రం అడుగుపెట్టదల్చుకోలేదు’ శ్రేయా రావు స్పష్టం చేశారు. కాగా, రెండో రన్నరప్ అయిన శ్రేయా.. మిస్ యునైటెడ్ కాంటీనెంట్స్ 2018 పోటీలకు భారత్ తరపున ప్రాతినిధ్యం వహించబోతున్నారు. -
మొనాకో చాంప్ రికియార్డో
మొనాకో: రెడ్‌బుల్ డ్రైవర్ డానియెల్ రికియార్డో ఎట్టకేలకు మొనాకో గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. ఇక్కడ మూడేళ్లుగా టైటిల్ కోసం తన స్పీడుకు పదును పెడుతున్నప్పటికీ... అందని టైటిల్ ఈసారి మాత్రం చేతికందింది. పోల్ పొజిషన్ సాధించిన ఈ రెడ్‌బుల్ డ్రైవర్ టైటిలే లక్ష్యంగా ఆదివారం తన జోరు చూపెట్టాడు. మొదటి స్థానం నుంచి రేసును ఆరంభించిన రికియార్డో 78 ల్యాప్‌ల రేసును గంటా 42 నిమిషాల 54.807 సెకన్లలో పూర్తి చేశాడు. కేవలం 7.7336 సెకన్ల తేడాతో గత విజేత, ఫెరారీ డ్రైవర్ వెటెల్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. హామిల్టన్ మూడో స్థానంలో నిలిచాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్ ఆరో స్థానంలో నిలువగా, సెర్గియో పెరెజ్ 12వ స్థానం పొందాడు. సీజన్‌లోని తదుపరి రేసు కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 10న జరుగుతుంది. -
చాలెంజ్‌గా తీసుకోండి
‘‘అనుకున్నవన్నీ అనుకున్న వెంటనే అయిపోవు. కొన్నిసార్లు ఒకటికి రెండు మూడుసార్లు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నం చాలా పట్టుదలగా, అంకితభావంతో ఉండాలి. జరగట్లేదని వదిలేయకుండా ఒక చాలెంజ్‌గా తీసుకుంటేనే మనం సక్సెస్ అవ్వగలం’’ అంటున్నారు పూజా హెగ్డే. ఈ విషయం గురించి ఆమె ఇంకా వివరంగా మాట్లాడుతూ– ‘‘స్కూల్లో టామ్‌బాయ్‌లా ఉండేదాన్ని. షార్ట్ హెయిర్‌తో, స్నీకర్ షూ వేసుకొని తిరిగేదాన్ని. ఎక్కువగా సోషల్‌గా మూవ్ అయ్యేదాన్ని కాదు. నా లోకంలో నేను ఉండేదాన్ని. బట్ 15 ఏళ్లు వచ్చాక మనం ఇలా ఉండకూడదు. మారాలి అని గట్టిగా అనుకున్నాను. చాలెంజ్‌గా తీసుకున్నాను. కాలేజ్‌లో జాయిన్ అయ్యాక కాలేజ్‌లో జరిగిన ప్రతి ఫంక్షన్లో, ఫెస్ట్‌లో పాల్గొనేదాన్ని. నా సిగ్గుని, మొహమాటాన్ని పోగొట్టడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత ఓసారి మాధురీ దీక్షిత్ ‘ఆజా నాచ్లే’ షోలో డ్యాన్స్ చేయాలంటే కాళ్లు చేతులు ఆడలేదు. అంతమంది ఆడియన్స్‌ని ఎదురుగా చూడగానే ఫ్రీజ్ అయిపోయాను. బట్ వెంటనే ఇలాంటి సిచ్యువేషన్స్నే మనం చాలెంజ్‌గా తీసుకోవాలి కదా అని ముందు దూసుకువెళ్లాను. డ్యాన్స్ చేశాను. ఆ తర్వాత మిస్ ఇండియా కాంపిటీషన్లో ఫస్ట్ టైమ్ నా అప్లికేషన్‌ను రిజెక్ట్ చేశారు. అలా జరిగిందని నేను డిజప్పాయింట్ అవ్వలేదు. చాలెంజ్‌గా తీసుకున్నాను. 2010లో మళ్లీ ట్రై చేశాను. ఈసారి మిస్ యూనివర్స్ కాంపిటేషన్‌లో రన్నరప్‌గా నిలిచాను. సో.. ఏదైనా పని జరగట్లేదని డిజప్పాయింట్ అవ్వకండి. చాలెంజ్‌గా తీసుకోండి. సక్సెస్ వస్తుంది’’ అని పేర్కొన్నారు పూజా. -
రెండోసారీ రన్నరప్‌తో సరి
హామిల్టన్: నాలుగు దేశాల అంతర్జాతీయ హాకీ రెండో అంచె టోర్నమెంట్లోనూ భారత్ రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియంతో ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా పెనాల్టీ షూటౌట్లో 0–3తో పరాజయం పాలైంది. తొలి అంచె టోర్నమెంట్ ఫైనల్లోనూ భారత్‌కు బెల్జియం చేతిలో ఓటమి ఎదురైన సంగతి విదితమే. రెండో అంచె టోర్నీ లీగ్ దశలో బెల్జియంపై సంచలన విజయం సాధించిన భారత్ ఈసారి ఫైనల్లోనూ ఆ జట్టుకు గట్టిపోటీనే ఇచ్చింది. నిర్ణీత సమయానికి రెండు జట్లు 4–4తో సమఉజ్జీగా నిలువడంతో ఫలితం తేలడానికి షూటౌట్‌ను నిర్వహించారు. షూటౌట్లో బెల్జియం తరఫున ఫెలిక్స్, సెబాస్టియన్, అర్థుర్ వాన్ డోరెన్ సఫలమయ్యారు. భారత్ తరఫున ఎవరూ గోల్ చేయలేదు. అంతకుముందు నిర్ణీత సమయంలో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయి. పోటా పోటీగా సాగిన పోరులో ఎక్కువ శాతం భారత్‌దే పైచేయి అయింది. భారత్ తరఫున రమణ్‌దీప్ సింగ్ (29వ, 53వ ని.లో) రెండు గోల్స్, నీలకంఠ శర్మ (42వ ని.లో), మన్దీప్ సింగ్ (49వ ని.లో) చెరో గోల్ చేశారు. బెల్జియం తరఫున తాంగై కాసిన్స్ (41వ ని.లో), కెడ్రిక్ చార్లైర్ (43వ ని.లో), అమౌరి కౌస్టర్స్ (51వ ని.లో), ఫెలిక్స్ (56వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. -
మళ్లీ నిరాశ
జకార్తా: కొత్త సీజన్‌ను టైటిల్‌తో ప్రారంభించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది. ఇండోనేసియా మాస్టర్స్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సైనా 9–21, 13–21తో ఓడిపోయింది. కేవలం 27 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనా తన ప్రత్యర్థికి ఏదశలోనూ పోటీనివ్వలేకపోయింది. రెండు గేముల్లోనూ ఆరంభం నుంచే తై జు యింగ్ జోరు కొనసాగింది. సైనాపై తై జు యింగ్‌కిది వరుసగా ఏడో విజయం కావడం విశేషం. తై జు యింగ్‌పై సైనా చివరిసారి 2013 స్విస్ ఓపెన్‌లో గెలుపొందడం గమనార్హం. విజేతగా నిలిచిన తై జు యింగ్‌కు 26,250 డాలర్లు (రూ. 16 లక్షల 69 వేలు)... రన్నరప్ సైనాకు 13,300 డాలర్లు (రూ. 8 లక్షల 45 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
రన్నరప్ నీల్ జోషి
బర్మింగ్హమ్: బ్రిటిష్ ఓపెన్ జూనియర్ స్క్వాష్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుడు నీల్ జోషి రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన బాలుర అండర్–15 సింగిల్స్ ఫైనల్లో నీల్ జోషి 8–11, 16–14, 0–11, 12–14తో టాప్ సీడ్ సామ్ టాడ్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయాడు. అండర్–17 బాలుర సెమీఫైనల్లో తుషార్ సహాని 11–9, 2–11, 3–11, 8–11తో టాప్ సీడ్ ఒమర్ టోర్కీ (ఈజిప్ట్) చేతిలో పరాజయం చవిచూశాడు. -
రన్నరప్ కృష్ణ రోహిత్ జంట
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ అండర్-16 టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణకు చెందిన కృష్ణ రోహిత్ రన్నరప్‌గా నిలిచాడు. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన డబుల్స్ బాలుర ఫైనల్లో కృష్ణరోహిత్ (తెలంగాణ)-దక్షిణేశ్వర్ (తమిళనాడు) ద్వయం 2-6, 2-6తో సిద్ధాంత్ (మహరాష్ట్ర)- మేఘ్ పటేల్ (గుజరాత్) జోడీ చేతిలో ఓడిపోయి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. -
హైదరాబాద్‌కు రన్నరప్
సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఎస్జీఎఫ్) తెలంగాణ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్ జిల్లా జట్టు సత్తాచాటుకుంది. మెదక్ జిల్లా జహీరాబాద్‌లో జరిగిన ఈ అండర్-19 బాలుర టోర్నీలో హైదరాబాద్ రన్నరప్ సాధించింది. బుధవారం జరిగిన ఫైనల్ పోరులో రంగారెడ్డి జట్టు 1-0తో హైదరాబాద్‌పై గెలుపొందింది. దీంతో రంగారెడ్డి జిల్లా జట్టు చాంపియన్‌గా నిలిచింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో హైదరాబాద్ 2-0తో వరంగల్‌ను ఓడించింది. హైదరాబాద్ జట్టుకు సయ్యద్ వికార్ అహ్మద్ కోచ్‌గా వ్యవహరించారు. -
గోల్ఫర్ శుభమ్ సంచలనం
భారత కుర్రాడు శుభమ్ జగ్లాన్ సంచలనం సృష్టించాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఐఎంజీ అకాడమీ ప్రపంచ జూనియర్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో పదేళ్ల ఈ ఢిల్లీ బాలుడు విజేతగా నిలిచాడు. గతేడాది రన్నరప్‌గా నిలిచిన శుభమ్ ఈసారి చాంపియన్‌గా అవతరించడం విశేషం. -
తనకంటే అందంగా ఉందన్న అసూయతో..!
-
రన్నరప్ శ్రీనివాస్
విశాఖపట్నం, న్యూస్‌లైన్: జాతీయ ఇంటర్ స్టేట్ క్యారమ్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో కె.శ్రీనివాస్ రన్నరప్‌గా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీనివాస్ పీఎస్పీబీకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. స్థానిక కేపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం జరిగిన ఫైనల్లో శ్రీనివాస్ 10-23, 15-11, 10-20తో యోగేశ్ డోంగ్రే (విదర్భ) చేతిలో పరాజయం పొందాడు. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో రియాజ్ అక్బర్ అలీ (ఎయిరిండియా) 25-10, 10-25, 25-2తో ఎండీ గుఫ్రాన్ (ఎయిరిండియా)పై విజయం సాధించాడు. మహిళల విభాగం ఫైనల్లో రష్మీ కుమారి (పీఎస్‌పీబీ) 19-12, 24-2తో వినీత (పీఎస్‌పీబీ)పై నెగ్గి టైటిల్ దక్కించుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో కవిత సోమంచి (ఆర్బీఐ) 22-25, 25-22, 25-14తో తూబా సెహర్పై గెలిచింది. వెటరన్ పురుషుల విభాగంలో బాలకోటయ్య (తమిళనాడు) 16-23, 25-12తో బాబులాల్ శ్రీమల్ (మహారాష్ట్ర)పై నెగ్గి టైటిల్ సాధించాడు. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో నరేష్ రాథోడ్ (ఎంపీఎస్సీబీ) జేఐకు చెందిన అన్సార్ సలీం అక్బర్‌పై గెలుపొందాడు. వెటరన్ మహిళల విభాగం ఫైనల్లో శోభా కామత్ (మహారాష్ట్ర) 25-10, 24-4తో ప్రభా నాయుడు (చండీగఢ్)ను ఓడించి ప్రథమ స్థానంలో నిలిచింది. మరోవైపు పార్వతి రమాభట్ (కర్ణాటక) 25-0, 24-4తో వీఎస్ దేశ్కర్ (ఆర్బీఐ)పై నెగ్గి మూడో స్థానంలో నిలిచింది.