
ఆసియా జూనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. హైదరాబాద్ ప్లేయర్ ఆర్. స్నేహిత్ సభ్యుడిగా ఉన్న భారత బృందం మయన్మార్‌లో బుధవారం జరిగిన ఫైనల్లో 0–3తో చైనా చేతిలో ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకుంది.
రన్నరప్ ప్రదర్శనతో భారత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌కు తొలిసారి అర్హత సాధించింది. ఈ ఏడాది డిసెంబర్ 2 నుంచి 9 వరకు ఆస్ట్రేలియాలో జరుగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్నేహిత్, మానవ్ ఠక్కర్, మనుశ్ షా, జీత్ చంద్రలతో కూడిన భారత జట్టు పాల్గొననుంది.