Former Miss Kerala Ansi Kabeer And Runner Up Anjana: Died In Car Accident - Sakshi
Sakshi News home page

Former Miss Kerala: 'వెళ్లాల్సిన సమయం వచ్చేసింది' అంటూ ఇన్‌స్టా పోస్ట్‌

Published Mon, Nov 1 2021 1:43 PM | Last Updated on Mon, Nov 1 2021 3:19 PM

Former Miss Kerala Ansi Kabeer And Runner Up Anjana Died In Car Accident - Sakshi

Former Miss Kerala Ansi Kabeer, Runner Up Anjana Died In Car Accident: మాజీ మిస్‌ కేరళ అన్సీ కబీర్‌(25), రన్నరప్‌ అంజనా షాజన్‌(26)ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఎర్నాకుళం బైపాస్‌లోని హాలిడే ఇన్ ముందు సోమవారం  తెల్లవారుజామున ఒంటి గంటకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి వారి కారు అదుపుతప్పినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. చదవండి: పెళ్లి మండపంలోనే పునీత్‌కు నివాళి అర్పించిన కొత్తజంట

ప్రయాణానికి కాసేపటి ముందే అన్సీ..తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ‘ఇట్స్​ టైమ్​ టు గో’అంటూ ఓ ఫోటోను షేర్‌ చేసింది. అయితే దురదృష్టవశాత్తూ ఆమె పోస్ట్‌ చేసిన కాసేపటికి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మిస్‌ కేరళ 2019 కాంపిటీషన్‌ నుంచి అన్సీ, అంజనా క్లోజ్‌ ఫ్రెండ్స్‌గా మారారు.

ఈ పోటీలో అన్సీ విజేతగా నిలవగా, అంజనా రన్నరప్‌గా నిలిచింది. దురదృష్టశాత్తూ ఈ ప్రమాదంలో ఇద్దరూ స్పాట్‌లోనే చనిపోయారు. కాగా కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

చదవండి:పునీత్‌ మరణం: లైవ్‌లో న్యూస్‌ చదువుతూ ఏడ్చేసిన యాంకర్‌
Halloween 2021: దెయ్యాల్లా మారిన మన స్టార్స్‌ని గుర్తుపట్టారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement