spot dead
-
హన్మకొండ జిల్లా కాజీపేటలో కారు ఆక్సిడెంట్..మహిళ అక్కడిక్కడే..!
-
రోడ్డు ప్రమాదంలో మాజీ మిస్ కేరళ, రన్నరప్ దుర్మరణం
Former Miss Kerala Ansi Kabeer, Runner Up Anjana Died In Car Accident: మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్(25), రన్నరప్ అంజనా షాజన్(26)ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఎర్నాకుళం బైపాస్‌లోని హాలిడే ఇన్ ముందు సోమవారం తెల్లవారుజామున ఒంటి గంటకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి వారి కారు అదుపుతప్పినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. చదవండి: పెళ్లి మండపంలోనే పునీత్‌కు నివాళి అర్పించిన కొత్తజంట ప్రయాణానికి కాసేపటి ముందే అన్సీ..తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ‘ఇట్స్ టైమ్ టు గో’అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. అయితే దురదృష్టవశాత్తూ ఆమె పోస్ట్ చేసిన కాసేపటికి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మిస్ కేరళ 2019 కాంపిటీషన్ నుంచి అన్సీ, అంజనా క్లోజ్ ఫ్రెండ్స్‌గా మారారు. ఈ పోటీలో అన్సీ విజేతగా నిలవగా, అంజనా రన్నరప్‌గా నిలిచింది. దురదృష్టశాత్తూ ఈ ప్రమాదంలో ఇద్దరూ స్పాట్లోనే చనిపోయారు. కాగా కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చదవండి:పునీత్ మరణం: లైవ్‌లో న్యూస్ చదువుతూ ఏడ్చేసిన యాంకర్ Halloween 2021: దెయ్యాల్లా మారిన మన స్టార్స్‌ని గుర్తుపట్టారా? View this post on Instagram A post shared by Ansi Kabeer (@ansi_kabeer) -
మామ చితి వద్దే కుప్పకూలిన అల్లుడు
సాక్షి, సిద్దిపేట: ఇంటి పెద్ద మరణించి పుట్టెడు దుఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని విధి వక్రికరించింది. అంత్యక్రియలు నిర్వహిస్తున్న క్రమంలో అస్వస్థకు గురైన అల్లుడు చితి వద్దే కుప్పకూలాడు. దీంతో రెండు ఇళ్లలో విషాదం నెలకొంది. ఈ ఘటన గురువారం నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బద్దిపడగ గ్రామానికి చెందిన పండగ నారాయణ (65) సింగరేణి బొగ్గు గనిలో పని చేసి ఉద్యోగ విరమణ పొందాడు. ఉపాధి కోసం సిద్దిపేటలో ప్రైవేట్ జాబ్ చేస్తూ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. బుధవారం రాత్రి అస్వస్థకు గురై నారాయణ మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం బుద్దిపడగలో అంత్యక్రియలు నిర్వహిస్తున్న క్రమంలో అతని అల్లుడు(కూతురు భర్త) తుపాకుల శ్రీధర్‌బాబు (36) చితి వద్దే సొమ్మసిల్లి పడిపోయాడు. ఇది గమణించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే శ్రీధర్‌బాబు మృతి చెందినట్లు తెలిపారు. సిద్దిపేటలకు చెందిన శ్రీధర్‌బాబు డ్రైవర్‌గా పని చేస్తుండగా అతని భార్య సుజాత ప్రైవేట్ స్కూల్లో పని చేస్తోంది. ఆయనకు ఇద్దరు కూతుళ్లు లతిక, కీర్తికలున్నారు. బుధవారం సుమోలో ముంబాయికి కిరాయకు వెళ్తుండగా అతని మామయ్య నారాయణ వార్త తెలియడంతో బుధవారం రాత్రి శ్రీధర్‌బాబు ఇంటికి చేరుకొని అంత్యక్రియలకు దగ్గరుండి ఏర్పాటు చేశాడు. మామ మృతదేహాన్ని చితిపై ఉంచి కుటుంబ సభ్యులతో కలసి చితి చుట్టూ తిరుగుతుండగా ఉన్నట్లుండి శ్రీధర్‌బాబు కిందపడిపోయాడు. ఒకేసారి తండ్రి, భర్త మరణించడంతో విలపిస్తున్న సుజాతను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. ఈ హృదయవిదారక ఘటనను అందరిని కలిచివేసింది. -
‘బతుకమ్మ’... బలిగొంది..
బొలేరో వాహనం అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని, బతుకమ్మ చీరలే బలిగొన్నాయా...? ఆ చీరెలకు, ఈ ప్రమాదానికి సంబంధమేమిటి..? అసలేం జరిగిందంటే.... సాక్షి, పెనుబల్లి: మహిళలను ట్రక్కులో ఎక్కించుకొని వెళ్ళుతున్న బొలేరో వ్యాను అదుపు తప్పి బోల్తా కొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా , ఆరుగురు మహిళలకు తీవ్ర గాయాలైన సంఘటన పెనుబల్లి మండల పరిధిలోని మండాలపాడు వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెనుబల్లి బీసీ కాలనీకి చెందిన ఎనిమిదిమంది మహిళలు సత్తుపల్లి వెళ్లేందుకని బుధవారం ఉదయం విఎంబంజర్ వచ్చారు. అంతలోనే, హైదరాబాద్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లావైపు బొలేరో వెళుతోంది. హైదరాబాద్‌లో కొబ్బరి బోండాలను అన్లోడ్ చేసి వస్తున్న ఈ వాహనంలో ఆ ఎనిమిదిమంది మహిళలు ఎక్కారు. పెనుబల్లి మండలంలోని మండాలపాడు వద్ద, వ్యాన్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో, ఆ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న భూక్యా రాంలీ(35), తేజావత్ రుక్మిణి(50) అక్కడికక్కడే మృతిచెందారు. దారవత్ లక్ష్మి, తేజావత్ అరుణ్, అజ్మీర పద్మ, తేజావత్ లలిత, తేళ్ళూరి వరలక్ష్మి, తోట అంజమ్మ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని ఆటోలలో పెనుబల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. వ్యాన్ డ్రైవర్ పరారయ్యాడు. సత్తుపల్లి ఎందుకు వెళుతున్నారంటే... ఈ ఎనిమిదిమంది మహిళలు నిరుపేదలు. బతుకమ్మ పండగ సందర్భంగా వీరికి ప్రభుత్వం చీరెలు పంపిణీ చేసింది. ఇవి నాసిరకంగా ఉండడంతో అనేకమంది ఇష్టపడలేదు. కొందరు మాత్రం.. పట్టరాని కోపంతో ఆ చీరెలను 2017, సెప్టెంబర్ 18న రోడ్డుపై వేసి నిప్పంటించారు. వియంబంజర్ పోలీసులకు ఇది ‘నేరం’గా, ‘ఘోరం’గా అనిపించింది. మొత్తం 18 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై సత్తుపల్లి కోర్టులో విచారణ సాగుతోంది. బుధవారం రోజున కోర్టు వాయిదా ఉండటంతో, కేసుతో సంబంధమున్న ఈ ఎనిమిదిమంది మహిళలు సత్తుపల్లికి బొలేరో వాహనంలో బయల్దేరారు. ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు గాయపడ్డారు. ఎమ్మెల్యే సండ్ర చొరవ... ప్రమాద వార్త తెలియగానే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పందించారు. క్షతగాత్రులను పెనుబల్లి ఆసుపత్రికి, అక్కడి నుంచి ఖమ్మం వైద్యశాలకు తరలించేంత వరకు పోలీసులతో, పెనుబల్లి వైద్యులతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నారు. ఖమ్మం ఆసుపత్రికి క్షతగాత్రులు చేరుకున్న తరువాత, అక్కడి వైద్యులతోనూ ఫోన్లో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రమాద స్థలాన్ని కల్లూరు ఏసీపీ బి.ఆంజనేయులు, సత్తుపల్లి రూరల్ సీఐ టి.రవికుమార్, వియంబంజర్ ఎస్సై తోట నాగరాజు పరిశీలించారు. పెనుబల్లి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృత దేహాలను కుటుంబీకులకు అప్పగించారు. కేసును ఎస్సై తోట నాగరాజు నమోదు చేశారు. ఊపిరందిస్తా... కాపాడుకుంటా... పెనుబల్లి: ఈ ప్రమాదంలో, తలకు తీవ్ర గాయాలవడంతో భూక్యా రామ్లీ(35) అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాద వార్త చెవిన పడడంతోనే ఆమె భర్త భూక్యా రాము, పరుగు పరుగున ప్రమాద స్థలానికి వచ్చాడు. రోడ్డు పక్కన అచేతనంగా పడిపోయిన తన భార్య రామ్లీని చూసి చలించాడు. ఆమెకు ఊపిరి అందడం లేదనుకున్నాడేమో...! ఆమెను తన ఒడిలోకి తీసుకుని, తన నోటితో ఊదుతూ శ్వాసను అందించేందుకు ప్రయత్నించాడు. అప్పటికే ఆమె ప్రాణాలు పోయాయని అక్కడున్న పోలీసులు, స్థానికులు చెప్పినప్పటికీ నమ్మలేకపోయాడు. కొద్దిసేపటి వరకు తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. ఆ తరువాత కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఈ దృశ్యం... చూపరులకు కూడా కంట తడి పెట్టించింది. -
పాన్ మసాలా ఇవ్వలేదని కొట్టిచంపారు..
లక్నో: దేశవ్యాప్తంగా మూక దాడులు కొనసాగుతున్నాయి. పాన్ మసాలా ఇచ్చేందుకు నిరాకరించిన 60 ఏళ్ల సీనియర్ సిటిజన్‌పై స్ధానికులు మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. అప్పుపై పాన్ మసాలా ఇవ్వలేదనే కోపంతో వారు వృద్ధుడిని కొట్టి చంపారు. యూపీలోని హర్దోయ్ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. మూక దాడిలో బాధితుడు ఘటనా ప్రదేశంలోనే మరణించాడని, నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని డీఎస్పీ శైలేంద్ర సింగ్ తెలిపారు. మరోవైపు దేశరాజధాని ఢిల్లీలో జనసమ్మర్ధ కన్నాట్‌ప్లేస్‌లో సిగరెట్లు ఇవ్వలేదని ఇద్దరు యువకులపై అల్లరి మూకలు దాడికి తెగబడ్డాయి. మూక దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరో వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
విషాదం: మైదానంలో కుప్పకూలిన క్రికెటర్
సాక్షి,తిరువనంతపురం: కేరళలోని కాసరగాడ్‌లో స్టేడియంలోనే ఓ క్రికెటర్ గుండె పోటుతో కుప్పకూలాడు. బౌలింగ్ ఎండ్ నుంచి బంతి వేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో 20 ఏళ్ల పద్మనాభ్ అనే క్రికెటర్ ఉన్నపళంగా కిందపడ్డాడు. తీవ్ర గుండెపోటుతో కుప్పకూలడంతో అంపైర్ సహా తోటి క్రీడాకారులు ఆస్పత్రికి తరలించేందుకు పూనుకున్నారు. గుండెపోటుకు గురైన పద్మనాభ్ స్పాట్లోనే మరణించినట్టు అధికారులు చెప్పారు. దీనికి సంబంధించి మంజేశ్వర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు సమాచారం. బౌలింగ్ చేసేందుకు సిద్ధమైన పద్మనాభ్ కుప్పకూలడాన్ని న్యూస్ 9 వెల్లడిస్తూ తన ఫేస్బుక్ ఫేజ్‌లో వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతోంది. 2015లో బెంగాల్ క్రికెటర్ అంకి కేసరి ఫీల్డింగ్ చేస్తూ సహచరుడిని ఢీ కొనడంతో తలకు గాయమై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అంతకుముందు 2014లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఫిల్ హ్యూస్ తలకు బౌన్సర్ తగలడంతో అతడని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించినా ప్రాణాపాయం నుంచి కాపాడలేకపోయారు. -
బైక్ ప్రమాదంలో ఏలూరు వాసి మృతి
బెల్లంకొండ (గుంటూరు): బైక్ బోల్తాపడి ఏలూరుకు చెందిన యువకుడు దుర్మరణం చెందిన ఘటన గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం రాత్రి ఒంటి గంటకు (తెల్లవారితే మంగళవారం) చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై కె.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరుకు చెందిన వెంకట్ (28) అనే యువకుడు బైక్‌పై ఏలూరు నుంచి రెంటచింతల మండలం సత్రశాలకు వస్తుండగా మార్గమధ్యంలో బెల్లంకొండ క్రాస్‌రోడ్డు వద్ద గల ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం సమీపంలో బైక్ బోల్తా కొట్టి మృతి చెందినట్టు తెలిపారు. బైక్ వేగంగా వచ్చి బోల్తా కొట్టడంతో వెంకట్ అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు సేకరించిన ఎస్సై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం
తడ : నెల్లూరు జిల్లా తడ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందగా, మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. చెన్నై నుంచి సుమారు 20 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆదివారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ ఆలయానికి బైక్‌లపై బయల్దేరారు. ఈ క్రమంలో తడ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్‌పైనున్న గువ్వా నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్ అనే వ్యక్తి కాలు నుజ్జునుజ్జు అయింది. అతడిని శ్రీసిటీ ఆస్పత్రికి తరలించారు. మృతుడు నాగరాజు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం దామెర గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.