నెల్లూరు జిల్లా తడ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందగా, మరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.
తడ : నెల్లూరు జిల్లా తడ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందగా, మరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. చెన్నై నుంచి సుమారు 20 మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఆదివారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ ఆలయానికి బైక్‌లపై బయల్దేరారు. ఈ క్రమంలో తడ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్‌పైనున్న గువ్వా నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్ అనే వ్యక్తి కాలు నుజ్జునుజ్జు అయింది. అతడిని శ్రీసిటీ ఆస్పత్రికి తరలించారు. మృతుడు నాగరాజు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం దామెర గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.