
ప్రమాదానికి గురైన కారు (ఇన్‌సెట్‌లో మృతదేహాలు)
సాక్షి, హైదరాబాద్ : నగర శివారులో ఘోర ప్రమాదం సంభవించింది. చేవెళ్ల వద్ద ఓ కారు చెట్టుకు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ఆదివారం వేకువజామున చేవెళ్ల మండలం మీర్జాగూడా మలుపు వద్ద ఆల్టో కారు మర్రిచెట్టును ఢీ కొట్టింది. కారులో ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతులను ప్రవీణ్, డేవిడ్, అర్జున్‌లుగా గుర్తించారు. గాయపడిన వ్యక్తి పేరు శ్రావణ్ అని.. అతని రెండు కాళ్లు విరిగిపోయినట్లు తెలుస్తోంది. వీరంతా ఫేస్‌బుక్ సంస్థలో పనిచేసే ఉద్యోగులని పోలీసులు నిర్ధారించారు. ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment