రంగారెడ్డి జిల్లా కీసరలో శనివారం ఉదయం కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో 8 మంది సాఫ్టవేర్ ఉద్యోగులు గాయపడ్డారు.
కీసర : రంగారెడ్డి జిల్లా కీసరలో శనివారం ఉదయం కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో 8 మంది సాఫ్టవేర్ ఉద్యోగులు గాయపడ్డారు. సాఫ్ట్ వేర్ ట్రావెల్ లో ఉద్యోగం చేస్తున్న యువకులు భోగారం నుంచి వస్తుండగా కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని కీసర ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సాఫ్ట్ వేరో్ ఉద్యోగులు ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.