సాక్షి,తిరువనంతపురం: కేరళలోని కాసరగాడ్‌లో స్టేడియంలోనే ఓ క్రికెటర్ గుండె పోటుతో కుప్పకూలాడు. బౌలింగ్ ఎండ్ నుంచి బంతి వేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో 20 ఏళ్ల పద్మనాభ్ అనే క్రికెటర్ ఉన్నపళంగా కిందపడ్డాడు. తీవ్ర గుండెపోటుతో కుప్పకూలడంతో అంపైర్ సహా తోటి క్రీడాకారులు ఆస్పత్రికి తరలించేందుకు పూనుకున్నారు.
గుండెపోటుకు గురైన పద్మనాభ్ స్పాట్‌లోనే మరణించినట్టు అధికారులు చెప్పారు. దీనికి సంబంధించి మంజేశ‍్వర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు సమాచారం. బౌలింగ్ చేసేందుకు సిద్ధమైన పద్మనాభ్ కుప్పకూలడాన్ని న్యూస్ 9 వెల్లడిస్తూ తన ఫేస్‌బుక్ ఫేజ్‌లో వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతోంది.
2015లో బెంగాల్ క్రికెటర్ అంకి కేసరి ఫీల్డింగ్ చేస్తూ సహచరుడిని ఢీ కొనడంతో తలకు గాయమై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అంతకుముందు 2014లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఫిల్ హ్యూస్ తలకు బౌన్సర్ తగలడంతో అతడని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించినా ప్రాణాపాయం నుంచి కాపాడలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment