పుణె: ఆరోగ్యంతోనే ఉంటే క్రీడల్లో ఆడాలి. కబడ్డీ, ఖోఖో, క్రికెట్ వంటి ఆటల్లో జాగ్రత్తగా పాల్గొనాలి. లేకపోతే దారుణ పరిస్థితులు వస్తాయి. తాజాగా ఓ క్రికెటర్ క్రీజులో ఉండగానే కుప్పకూలిపోయాడు. తోటి ఆటగాళ్లు వచ్చి చూడగానే మృతిచెందాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. దీంతో తోటి ఆటగాళ్లంతా విషాదంలో మునిగారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
పుణేలోని జున్నార్ మండలంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. బ్యాట్స్‌మన్ బంతిని కొట్టగా పరిగెత్తేందుకు ప్రయత్నించగా ఫీల్డర్ చేతిలోకి బంతి రావడంతో వెనుతిరిగారు. అయితే నాన్-స్ట్రైక్ వైపు నిలబడి ఉన్న బ్యాట్స్‌మెన్ బాబు నల్వాడే వెనక్కి తిరిగొచ్చేసి నిలబడ్డాడు. ఈ సమయంలో కొద్దిసేపటి తర్వాత బాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీన్ని చూసిన ఎంపైర్ ఆటగాళ్లను పిలిచారు. వారు వచ్చి చూసేసరికి నల్వాడే ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో హృదయాలను పిండేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బ్యాట్ పట్టుకుని మోకాళ్లపై కూర్చుని ఉండి ఆ కొద్దిసేపటికి కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. ఏమైందో అర్థంకాక అందరూ కంగారుపడ్డారు. వెంటనే అతడిని దగ్గర్లోని వైద్యుడి వద్దకు తీసుకువెళ్లగా అప్పటికే అతను మరణించినట్లు ధృవీకరించారు. అయితే గుండెపోటు కారణంగానే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
फलंदाजी करताना मैदानावरच आला हार्ट अटॅक... पुणे जिल्ह्यातील स्थानिक क्रिकेटपटूचा उपचारापुर्वीच मृत्यू... अंगावर काटा आणणारा व्हायरल व्हिडिओ... pic.twitter.com/fHuvTSygrb
— Pranali Kodre (@Pranali_k18) February 17, 2021
Comments
Please login to add a commentAdd a comment