బైక్ బోల్తాపడి ఏలూరుకు చెందిన యువకుడు దుర్మరణం చెందిన ఘటన గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం రాత్రి ఒంటి గంటకు (తెల్లవారితే మంగళవారం) చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై కె.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరుకు చెందిన వెంకట్ (28) అనే యువకుడు బైక్‌పై ఏలూరు నుంచి రెంటచింతల మండలం సత్రశాలకు వస్తుండగా మార్గమధ్యంలో బెల్లంకొండ క్రాస్‌రోడ్డు వద్ద గల ప్రసన్నాంజన
బైక్ ప్రమాదంలో ఏలూరు వాసి మృతి
Aug 31 2016 12:21 AM | Updated on Sep 4 2017 11:35 AM
బెల్లంకొండ (గుంటూరు): బైక్ బోల్తాపడి ఏలూరుకు చెందిన యువకుడు దుర్మరణం చెందిన ఘటన గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం రాత్రి ఒంటి గంటకు (తెల్లవారితే మంగళవారం) చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై కె.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరుకు చెందిన వెంకట్ (28) అనే యువకుడు బైక్‌పై ఏలూరు నుంచి రెంటచింతల మండలం సత్రశాలకు వస్తుండగా మార్గమధ్యంలో బెల్లంకొండ క్రాస్‌రోడ్డు వద్ద గల ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం సమీపంలో బైక్ బోల్తా కొట్టి మృతి చెందినట్టు తెలిపారు. బైక్ వేగంగా వచ్చి బోల్తా కొట్టడంతో వెంకట్ అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు సేకరించిన ఎస్సై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
Advertisement
Advertisement