మాస్‌ హరుడు | Hero Venkat Harudu Movie Tittle launch by Producer Ram Talluri | Sakshi
Sakshi News home page

మాస్‌ హరుడు

Published Sun, Sep 15 2024 1:02 AM | Last Updated on Sun, Sep 15 2024 1:02 AM

Hero Venkat Harudu Movie Tittle launch by Producer Ram Talluri

‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు’ వంటి సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వెంకట్‌ కమ్‌ బ్యాక్‌ ఇస్తున్న చిత్రం ‘హరుడు’. రాజ్‌ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్, సలోని, శ్రీహరి, నటషా, అలీ, సుమన్, రవి వర్మ, సుభశ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈట ప్రవీణ్‌ రెడ్డి, ఈట దిక్కల లక్ష్మణరావు నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్‌. ఈ సందర్భంగా రాజ్‌ తాళ్లూరి మాట్లాడుతూ– ‘‘కంప్లీట్‌ మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ‘హరుడు’ రూపొందుతోంది. వెంకట్‌గారికి ఇది మంచి కమ్‌ బ్యాక్‌ మూవీ అవుతుంది. నవంబర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు సన్నా హాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మని జీన్న, కెమెరా: డి, సన్నీ, ఆనంద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement