venkat
-
హరుడు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన డైరెక్టర్ ఆర్జీవీ.. ఫోటోలు
-
‘శివరామరాజు’ ఫేమ్ వెంకట్ హీరోగా ‘హరుడు’... ఆకట్టుకుంటున్న గ్లింప్స్
శివరామరాజు ఫేమ్ వెంకట్ తొలిసారి మాస్ హీరోగా నటిస్తున్న చిత్రం హరుడు. డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తాళ్ళూరి దర్శకుడు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్న హరుడు చిత్రం గ్లింప్స్ శనివారంనాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు.అనంతరం నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, సినిమా ఈ స్థాయికి రావడానికి కారణం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. ఈ సినిమా దర్శకుడు రాజ్ తాళ్లూరి రాత్రింబవళ్ళు పనిచేశారు. హీరో వెంకట్, శ్రీహరి, సలోని, హెబ్బా పటేల్ నటించారు. ఇందులోని పాటలు ఆదరణ పొందేలా వున్నాయి. జెన్నా పాటలకు సంగీతం బాగా సమకూర్చారు. ఈరోజు విడుదలైన గ్లింప్స్ చాలా బాగున్నాయి. మంచి విజయం సాధించాలని కోరుకుంటన్నా అన్నారు.దర్శకుడు రాజ్ తాళ్ళూరి మాట్లాడుతూ, ముందుగా నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డి కి థ్యాంక్స్. ఐదు నిముషాల్లోనే కథ విని ఓకే చేశారు. వెంకట్ గారితో ఐదేళ్ళ జర్నీ వుంది. లవర్ బాయ్ గా చేసిన ఆయన మాస్ హీరోగా ఇందులో చేశారు. నటశాసింగ్ కూడా నటించింది. సంగీత దర్శకుడు జిన్నా, ఎడిటర్ మారుతీ బాగా పనిచేశారు. నాకు దర్శకుల టీమ్ సపోర్ట్ గా వుండడంతో అవుట్ పుట్ బాగా వచ్చింది అన్నారు.హీరో వెంకట్ మాట్లాడుతూ, హరుడు చిత్రం కమర్షియల్ ఎలిమెంట్ తో మాస్ ఎంటర్ టైనర్ గా వుంటుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా 60 శాతం పూర్తయింది. నిర్మాత డాక్టర్ అయినా... సినిమా పై తపనతో వచ్చారు. ఆయనకు మంచి హిట్ పడాలని ఆశిస్తున్నాను. నాకు పవర్ ఫుల్ రోల్ దర్శకులు ఇచ్చారు. మాస్ పాత్ర నేను మొదటిసారి చేశాను. నా పాత్రకు ధీటుగా హెబ్బాపటేల్ పాత్ర వుంటుంది. డబ్బింగ్ లో ఆమె నటన చూశాను. అలాగే నటశాసింగ్ మరో పాత్ర చేసింది. స్పెషల్ సాంగ్ లో సలోని చేశారు. ఇందులో ఐదు పాటలున్నాయి. సంగీత దర్శకుడు మణి జెన్నా మంచి బాణీలు ఇచ్చారు. మాస్ సినిమాకు ఫైట్స్ కీలకం. శివరాజ్ మాస్టర్ బాగా కంపోజ్ చేశారు. లోగడ షూటింగ్ లో నాకు గాయాలు అయ్యాయి. అందుకే కొంత గేప్ కూడా తీసుకున్నాను. ఈ సినిమాలో తగు జాగ్రత్తలు తీసుకుని ఫైట్స్ చేశాను. వచ్చే నెలలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు. -
హారర్ సినిమాలు అంటే అమెరికా వాళ్ళు పడి చస్తారు..
-
తెలుగు కామెడీ సినిమాలు చూస్తే నాకు అసలు నవ్వు రాదు..
-
మాస్ హరుడు
‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు’ వంటి సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వెంకట్ కమ్ బ్యాక్ ఇస్తున్న చిత్రం ‘హరుడు’. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్, సలోని, శ్రీహరి, నటషా, అలీ, సుమన్, రవి వర్మ, సుభశ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈట ప్రవీణ్ రెడ్డి, ఈట దిక్కల లక్ష్మణరావు నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ– ‘‘కంప్లీట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ‘హరుడు’ రూపొందుతోంది. వెంకట్‌గారికి ఇది మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుంది. నవంబర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నా హాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మని జీన్న, కెమెరా: డి, సన్నీ, ఆనంద్. -
కొడుకుని కత్తితో పొడిచాడని.. భర్తపై భార్య ఘాతుకం!
పశ్చిమగోదావరి: భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో భర్త మృత్యువాత పడగా, కుమారుడు కత్తిపోటు గాయానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాడేపల్లిగూడెంకు చెందిన గుల్లంకి వెంకట్ (44), ఉండ్రాజవరం గ్రామానికి చెందిన పార్వతికి 20 ఏళ్ల క్రితం వివాహం కాగా, వారికి కొడుకు, కూతురు ఉన్నారు. అయితే పది ఏళ్లుగా భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. వెంకట్ తన స్వగ్రామం తాడేపల్లిగూడెంలో ఉంటుండగా, పార్వతి తన ఇద్దరు పిల్లలతో ఉండ్రాజవరంలో ఉంటోంది. వెంకట్ అప్పుడప్పుడూ వచ్చి పార్వతిని తనతో వచ్చేయమని గొడవ పడుతుండేవాడు. ఇటీవల కుమార్తె పెళ్లి కారణంగా వచ్చిన వెంకట్ పది రోజుల నుంచి ఉండ్రాజవరంలోనే ఉంటున్నాడు. బుధవారం రాత్రి పార్వతిని తనతో వచ్చేయాలంటూ మళ్లీ గొడవకు దిగాడు. దీంతో భార్య పార్వతి, కొడుకు కృష్ణవంశీతో తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కృష్ణవంశీని వెంకట్ కత్తితో పొడిచాడు. కొడుకు కత్తిపోటుకు గురికావడంతో చలించిన పార్వతి ఒక్కసారిగా భర్తపై ఇటుకతో దాడికి పాల్పడింది. వెంకట్ దాడిని ప్రతిఘటించే క్రమంలో తల్లీకొడుకు ఇద్దరూ కలిసి ఇటుకలతో వెంకట్ తలపై కొట్టడంతో వెంకట్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే తేరుకున్న పార్వతి గాయపడిన భర్త, కొడుకును తణుకు ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా వెంకట్ పరిస్థితి విషమంగా ఉండటంతో తణుకు నుంచి ఏలూరు, అక్కడ నుంచి విజయవాడకు తరలించారు. గురువారం తెల్లవారుజామున వెంకట్ ఆసుపత్రిలో మృతి చెందాడు. కొడుకు కృష్ణవంశీ ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉండ్రాజవరం ఎస్సై వి.అప్పలరాజు కేసు నమోదు చేయగా, నిడదవోలు సీఐ కె.వెంకటేశ్వరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇవి చదవండి: వివాహానికి హాజరై తిరిగొస్తుండగా.. -
జడ్జి కుమారుడిపై ఫిర్యాదు తీసుకోరా?
సాక్షి, హైదరాబాద్: ‘పోలీస్‌స్టేషన్.. ఏమన్నా పర్యాటక కేంద్రం అనుకుంటున్నారా? ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కాకుండా సందర్శనకు వస్తుంటారా? జ్యుడీషియల్ అధికారి కుమారుడిపై ఫిర్యాదు చేస్తే తీసుకోరా? దేశంలో ఎవరిపై ఫిర్యాదు చేసినా తీసుకోవాల్సిన బాధ్యత మీకుందని తెలియదా? ఓ మహిళ పోలీస్ స్టేషన్‌కు వచ్చి వేధింపుల ఆరోపణలు చేసి.. ఆ విషయంలో కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కుమారుడిపై ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదో శుక్రవారం నేరుగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వండి. ఏ కారణాలతోనైనా న్యాయస్థానం ముందు హాజరుకాకుంటే బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం’ అని కరీంనగర్ టూటౌన్ ఎస్హెచ్ఓ ఓదెల వెంకట్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను శుక్ర వారానికి వాయిదా వేసింది. సెషన్స్ జడ్జి కుమారుడిపై ఎఫ్ఐఆర్కు ఆదేశాలు కరీంనగర్ జిల్లాకు చెందిన రమ్య కోర్టులో ఆఫీస్ సబార్డి నేట్‌గా నియమితురాలయ్యారు. అయితే సెషన్స్‌జడ్జి కుమారుడు తనను వేధిస్తున్నాడంటూ ఆమె ఉన్నతాధికా రులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తన విద్యార్హత, ఉద్యోగావకాశాలకు సంబంధించిన సమాచారాన్ని దాచి పెట్టిందంటూ ఆమెను సర్వీసు నుంచి తొలగించారు. ఇదే విషయంపై ఆమె రెండు రోజుల క్రితం హైకోర్టును ఆశ్ర యించారు. సీజే ధర్మాసనం ముందుకు ఈ అంశం రావడంతో సదరు సెషన్స్ జడ్జి కుమారుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఎస్హెచ్ఓకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ న్యాయవాది రూపేందర్కు హైకోర్టు స్పష్టం చేసింది. జిల్లా జడ్జి కుమారుడు.. చట్టానికి అతీతుడా? ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తాము ఆదేశించినా ఎఫ్ఐఆర్ నమోదు చేయక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కోర్టు ఆదేశాలను ఎస్హెచ్ఓకు సరిగా తెలియజేయలేదా? లేక ఆ మహిళ పీఎస్‌కు వచ్చినా ఫిర్యాదు తీసుకోలేదనే కారణంతో ఎస్హెచ్ఓను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారా అని జీపీపై అసహనం వ్యక్తం చేసింది. ‘కోర్టు ఆదేశాలున్నా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో కరీంనగర్ టూటౌన్ ఎస్హెచ్ఓ నిర్లక్ష్యం ప్రదర్శించారు. పీఎస్‌లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మహిళను వేచి ఉండాల్సిందిగా కోరడం రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలను ఉల్లంఘించడమే. ఇది సమాజంలో అత్యంత దారుణమైన పరిస్థితి. నిందితుడు జిల్లా జడ్జి కుమారుడన్న కారణంగా ఎస్హెచ్ఓ నిందితుడిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అతను చట్టానికి అతీతుడా? చట్టం ప్రకారం పరిపాలించే సమాజంలో ఇలాంటి వాటికి తావు లేదు. ఈ ఘటన మా మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసింది’ అని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏఏజీని పిలిపించిన ధర్మాసనం..: విచారణ సందర్భంగా అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ)ని ధర్మాసనం కోర్టు హాల్‌కు పిలిపించింది. ‘కొందరు జీపీలపై ఆధారపడవద్దు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించినా.. ఎస్హెచ్ఓ ఉల్లంఘించారు. అంతేకాదు ఫిర్యాదు దారుని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీఎస్‌లో నిరీక్షించేలా చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయమని సూచించే ధైర్యం కూడా మీ న్యాయాధికారులకు లేదు. ఇది నిజంగా దిగ్భ్రాంతికర విషయం’ అని వ్యాఖ్యానించింది. ఎస్హెచ్ఓను తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేసింది. -
అనూహ్యంగా తెరపైకి బల్మూరి వెంకట్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగరావు పేరు తెరపైకి వచ్చింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ పేరు దాదాపు ఖరారైందని ప్రచారం జరిగినా, మంగళవారం అనూహ్యంగా వెంకట్ రేసులోకి వచ్చారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌తో పాటు వెంకట్‌ను రెండో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం నుంచే ప్రచారం జరిగినా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఇద్దరికీ ఏఐసీసీ నుంచి వ్యక్తిగతంగా సమాచారం అందిందని, నామినేషన్లు సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలిసింది. ఈ నెల 18న నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఏ క్షణమైనా ఈ ఇద్దరి పేర్లను ఏఐసీసీ అధికారికంగా ప్రకటిస్తుందని తెలుస్తోంది. నిజానికి మంగళవారమే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందని, బుధవారం అధికారిక ప్రకటన వస్తుందని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. జగ్గారెడ్డికి బీ ఫారాలపై సంతకాల అధికారం ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు సమర్పించనున్న బీఫారాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి సంతకాలు చేయనున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో బీఫారాలిచ్చే అధికారాన్ని ఏఐసీసీ జగ్గారెడ్జికి ఇచి్చంది. ఇక నామినేషన్ల దాఖలు, ఎమ్మెల్యేల చేత ప్రతిపాదిత సంతకాలు చేయించే వ్యవహారాలను సమన్వయం చేసే బాధ్యతను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించినట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో అతిపిన్న వయస్కుడిగా మండలిలో అడుగుపెట్టే ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్ రికార్డు సృష్టించనున్నారు. దేశంలోనే శాసనమండలికి ఎన్నికైన వారిలో ఇంత చిన్న వయస్సు ఉన్న వారెవరూ లేరు. ప్రస్తుతం వెంకట్ వయసు 30 సంవత్సరాల 9 నెలలు. ఇప్పటివరకు 33 ఏళ్ల వయసులో ఒకరు గుజరాత్ శాసనమండలికి ఎన్నిక కావడమే రికార్డు అని, ఇప్పుడు ఆ రికార్డును వెంకట్ అధిగమిస్తారని గాంధీభవన్ వర్గాల సమాచారం. -
Tikamaka Thanda: ఊరందరికీ మతిమరుపు ఉంటే..?
ఊరందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్న సినిమా తికమకతాండ. ఆ ఊరికి ఒక అమ్మవారు ఉండడం అమ్మవారి విగ్రహం మాయమవడం తిరిగి ఊరు వారు ఆ విగ్రహాన్ని పట్టుకున్నారా లేదా అనే కథాంశం.ఈ నెల 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాత తిరుపతి శ్రీనివాస్ మాట్లాడుతూ : ట్విన్స్ రామ్ హరి హీరోలుగా ఒక కొత్త ప్రయోగంతో ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. వేరే బిజినెస్ లు చేస్తున్న మా పిల్లలకి సినిమా పైన ఉన్న మక్కువతో వెంకట్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాని నిర్మించాం. ఊరందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకుని వచ్చాడు. మనందరికీ తెలుసు ఊరంతా మతిమరుపు ఉంటే ఎలా ఉంటుంది వాళ్ళు పడే ఇబ్బందులు బాధలు ఎలా ఉంటాయి. కామెడీగా ఉంటూనే మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమా ఇది’అన్నారు. దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ : తెలంగాణలోని ఒక మంచి విలేజ్ నెట్వర్క్ లేని చోట అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సినిమాని చిత్రీకరించాం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి మంచి స్పందన వస్తుండడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ నెల 15న థియేటర్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న మా సినిమాని ప్రేక్షకులు అందరూ చూసే ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అన్నారు. -
దీపావళి మనసుని హత్తుకుంటుంది
‘‘ఇప్పుడు ప్రేక్షకులు పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా చూస్తున్నారు. మా ‘దీపావళి’ చిన్నదైనా అందమైన సినిమా. ఇందులోని భావోద్వేగాలు ప్రేక్షకుల మనసులను హత్తుకుంటాయి’’ అని నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ అన్నారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘కీడా’ (తెలుగులో ‘దీపావళి’). కృష్ణ చైతన్య సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా 38 ఏళ్ల జర్నీలో దాదాపుగా నేను చేసిన సినిమాలన్నీ సంతృప్తినిచ్చాయి. నేను డబ్బుల గురించి ఆలోచించను. ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అవుతుందా? లేదా అని మాత్రమే ఆలోచిస్తా. కథ పూర్తయ్యాకే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళతాను. ఓ సినిమా పూర్తయ్యాకే మరొకటి చేస్తాను. నేను తక్కువ సినిమాలు చేయడానికి కారణం అదే. ‘దీపావళి’ కథనిప్రాణం పెట్టి రాశాడు వెంకట్. చెప్పిన కథను చెప్పినట్లు స్క్రీన్ మీదకు తీసుకొచ్చాడు. మా సినిమా ఇండియన్ పనోరమాకి ఎంపికవడం గొప్ప అనుభూతి. చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శించడం సంతోషంగా ఉంది. ఇక రామ్ హీరోగా ఓ సినిమా చేసేందుకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అలాగే రామ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఉంది. ఇందుకు సరైన కథ కుదరాలి’’ అన్నారు. -
ఇరవై ఏళ్లకు నా కల నెరవేరింది
‘‘ఒకసారి ఫ్రెండ్స్‌తో కలిసి సినిమా చూస్తున్నప్పుడు నాకు ‘దీపావళి’ కథ ఆలోచన పుట్టింది. పల్లెటూరు, అక్కడి ఓ ముసలి వ్యక్తి, మనవడు, వారు ప్రేమగా పెంచుకునే మేక పిల్ల.. ఈ అంశాలను కనెక్ట్ చేస్తూ భావోద్వేగాలతో ‘దీపావళి’ తీశాను’’ అని దర్శకుడు ఆర్ఏ వెంకట్ అన్నారు. ‘స్రవంతి’ రవికిశోర్ తొలిసారి తమిళంలో నిర్మించిన చిత్రం ‘కీడా’. తెలుగులో ‘దీపావళి’ పేరుతో అనువదించారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ఆర్ఏ వెంకట్ మాట్లాడుతూ– ‘‘మాది తమిళనాడు. 2003లో చెన్నైలో ఆఫీస్ బాయ్‌గా నా జీవితం ప్రారంభించి, అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా చేశాను. దర్శకునిగా ‘దీపావళి’ నా తొలి సినిమా. 20 ఏళ్ల తర్వాత నా కల నిజమైంది. రవికిశోర్‌గారి తొలి తమిళ సినిమాకు నేనే డైరెక్టర్ అని చెప్పుకోవటం ఎంతో గర్వంగా ఉంది. నా తర్వాతి సినిమా కోసం ఎమోషనల్ పాయింట్‌తోనే ఓ కథను సిద్ధం చేస్తున్నాను. రవికిశోర్‌గారికి నచ్చింది. ఈ సినిమాని ఓ స్టార్ హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాం’’ అన్నారు. -
Madhapur: డ్రగ్స్‌తో పాటు వ్యభిచారం కూడా!
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో మరో కోణం బయటపడింది. డ్రగ్స్ పార్టీలతో పాటు వ్యభిచారం దందా కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో కేసులో దర్యాప్తులో లోతుకు పోయే కొద్దీ మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. మాదాపూర్‌లోని విఠల్ రావు నగర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులకు.. దర్యాప్తులో కీలక విషయాలు తెలుస్తున్నాయి. గతంలోనూ వెంకట్, బాలాజీలపై వ్యభిచార నిర్వహణ కేసులు ఉన్నట్లు తేలింది. తాజాగా మాదాపూర్‌లోని అపార్ట్మెంట్లో డ్రగ్స్ పట్టుబడగా.. ఫ్లాట్‌లో ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులు ఉండడంతో వ్యభిచార దందా గుట్టురట్టయ్యింది. పలు చిత్రాలకు ఫైనాన్షియర్‌గా వ్యవహరించిన వెంకట్ ఈ డ్రగ్స్ సప్లై ప్రధాన సూత్రధారిగా తేలింది. సినిమా వెంకట్‌తో పాటు బాలాజీలు ఆ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సినిమా అవకాశాల పేరిట ఆ ఇద్దరినీ రెండు రోజులుగా అదే అపార్ట్మెంట్లో ఉంచినట్లు సమాచారం. ఈ అసాంఘిక కార్యకలాపాల కోసం రూమ్ నెంబర్ 804ను ఉపయోగించుకుంటున్నారు. వారానికి చొప్పున సర్వీస్ అపార్ట్‌మెంట్‌ను రెంటుకు తీసుకొని డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ దందాలతో పాటు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అయితే.. గతంలోనూ వ్యభిచారం నిర్వహిస్తుండగా రెండుసార్లు ఈ ఇద్దరిని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక తాజా సోదాల్లో అధికారులు వెంకట్ దగ్గర నుంచి 15 గ్రాముల ఎండిఎంఏ, 30 ఎల్ ఎస్ టి పిల్స్ తొ పాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తెప్పించి వెంకట్.. తాను ఉపయోగించడంతో పాటు మరికొందరికి అమ్ముతున్నట్లు గుర్తించారు. వెంకట్, బాలాజీ డ్రగ్ కస్టమర్లు ఎవరు? సినీ పరిశ్రమలో ఎవరైనా ఉన్నారా? అనేదానిపై నార్కోటిక్ టీమ్ ఆరాలు తీస్తోంది. -
సీఎంను కలిసిన ‘గల్ఫ్ సమన్వయకర్తలు’
సాక్షి, అమరావతి: గల్ఫ్ దేశాలకు చెందిన పలువురు ఏపీఎన్ఆర్టీఎస్ సమన్వయకర్తలు, వైఎస్సార్సీపీ కన్వినర్లు గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. గల్ఫ్ దేశాల్లోని ఏపీ వాసులకు అందిస్తున్న సాయం.. వారి సంక్షేమా చర్చించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందుతున్నట్లు వివరించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం(మైనార్టీ వెల్ఫేర్) అంజాద్ బాషా, ఏపీ ఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ వెంకట్ ఎస్.మేడపాటి, కువైట్ ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్లు నాయని మహేష్‌రెడ్డి, ఎంవీ నరసారెడ్డి, దుబాయ్ కోఆర్డినేటర్ సయ్యద్ నాసర్ వలీ, వైఎస్సార్సీపీ గల్ఫ్ కన్వినర్ బీహెచ్ ఇలియాస్, కువైట్ కన్వి నర్ ముమ్మడి బాలిరెడ్డి, ఖతార్ కన్వి నర్ డి.శశికిరణ్, దుబాయ్ కన్వినర్ సయ్యద్ అక్రమ్, సౌదీ అరేబియా కన్వినర్ రెవెల్ ఆంథోని తదితరులు పాల్గొన్నారు. సీఎంకు హజ్ పవిత్ర జలం డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్ బాషా, హజ్ కమిటీ చైర్మన్ బీఎస్ గౌస్ గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి హజ్ పవిత్ర జలాన్ని అందజేశారు. -
ప్రకృతి సిద్ధ వైద్యుల నేపథ్యంతో వస్తున్న 'బెల్'
ప్రొగన్ మూవీస్ పతాకంపై పీటర్ రాజ్ నిర్మించి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం 'బెల్'. వెంకట్ భువన్ దర్శకత్వం వహించిన ఇందులో నటుడు గురుసోమసుందరమ్, శ్రీధర్ మాస్టర్, నితీష్ వీరా, దుర్గ, శ్వేతా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భరణీ కన్నన్ ఛాయాగ్రహణం, రాబర్ట్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. (ఇది చదవండి: డింపుల్ హయాతి వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్!) ఈ సందర్భంగా మంగళవారం చైన్నెలో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు వెంకట్ భువన్ మాట్లాడుతూ చిత్రానికి నిర్మాతనే ముఖ్యమన్నారు. ఈ చిత్ర నిర్మాత పీటర్ రాజ్ తనకు మంచి మిత్రుడన్నారు. తాను చిత్రాన్ని నిర్మిస్తాను మీరు దర్శకత్వం వహించండి అని చెప్పడంతో ముందుగా కాస్త భయం అనిపించిందన్నారు. దీంతో కథపై దృష్టి పెట్టి చాలా పరిశోధనలు చేసి బెల్ చిత్ర కథను సిద్ధం చేసినట్లు చెప్పారు. పీటర్ రాజ్ ఈ చిత్రానికి నిర్మాత మాత్రమే కాకుండా, ఒక సహాయ దర్శకుడిగా తనతోనే ఉంటూ ఎంతగానో సహకరించారని చెప్పారు. ఇది ప్రకృతి సిద్ధ వైద్యుల నేపథ్యంలో సాగే విభిన్న కథా చిత్రమని చెప్పారు. కాగా ఇందులో ప్రతి నాయకుడిగా ప్రధాన పాత్రను పోషించిన నటుడు గురు సోమసుందర్ మాట్లాడుతూ ఈ చిత్రం నిర్మాత పీటర్రాజ్కు పెట్టిన పెట్టుబడి తిరిగిరావాలన్నారు. చాలా పోటాన్షియల్ ఉన్న కథ కావడం, తన పాత్ర కొత్తగా ఉండటంతో నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. చిత్ర సంగీతం కూడా బాగా వచ్చిందనీ, కచ్చితంగా బెల్ చిత్రం సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. (ఇది చదవండి: ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం..వారి కోసమే!) -
ప్రేమంటే ఇదేనా.. ఈ ఫీలింగేంటి ఇంత బాగుంది
తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటించిన చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్‌వందెల దర్శకుడు. ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరావు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ విడుదల చేసి, ‘‘ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్స్ బాగున్నాయి.ఈ కథ పై ఉన్న నమ్మకంతో దర్శకుడు వెంకట్ చాలా కాన్ఫిడెంట్ గా తీశాడు. అలాగే ఈ సినిమా కథను, దర్శకుడిని నమ్మి తీసిన నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి’అన్నారు. ‘‘ఇది ఒక అందమైన రియలిస్టిక్ ప్రేమకథ. ఓషోలోని తత్త్వం, బుద్ధునిలోని సహనం, శ్రీశ్రీలోని రెవలిజం, వివేకానందుడిలోని గుణం ఉండేలా తనికెళ్ల భరణిగారి పాత్రను డిజైన్ చేయడం జరిగింది. నటీనటులు, టెక్నీషియన్స్ ఫుల్ సపోర్ట్ చేశారు’’ అన్నారు వెంకట్ వందెల. ‘‘నేను సోలో హీరోగా నటించిన తొలి చిత్రం ఇది’’ అన్నారు తేజ్ కూరపాటి. ‘‘ద్వారకా తిరుమలైన చిన్న తిరుపతిలో ఈ చిత్రం షూటింగ్ చేశాం. అనుకున్న టైమ్‌కు, అనుకున్న బడ్జెట్లో సినిమా పూర్తి చేశాం’’ అన్నారు ముల్లేటి కమలాక్షి. ఇక ట్రైలర్ విషయానికొస్తే..‘చరిత్ర మనకెప్పుడో చెప్పింది సాల్మన్ రాజుగారు.. మనకు కావాల్సింది దాని కోసం ఎన్ని యుద్ధాలైనా చేయమని. వదిలే ప్రసక్తే లేదు’.‘ప్రేమంటే ఇదేనా.. ఈ ఫీలింగేంటి ఇంత బాగుంది’.‘గుళ్లో దైవం..బళ్లో పుస్తకం తప్ప ఏ ధ్యాసలేని నా జీవితంలోకి ఒక్కడొచ్చాడు. వాడొవడో కూడా నాకు తెలియదు. అసలు ప్రేమంటే ఏంటి అది ఎలా ఉంటుంది. ఒక్కసారి నాకు కనబడితే నెత్తిపై ఒక్కటిచ్చి ఏడ్చేలోపే పీక పిసిగి చంపేయాలని ఉంది’ లాంటి డైలాగ్స్‌తో ఆకట్టుకుంటుంది. -
దేనికీ పనికిరానన్నారు, ఆ ప్రమాదంలో తీవ్రగాయాలు: నటుడు
'సీతారాముల కల్యాణం' సినిమాతో నటుడిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు వెంకట్. ఈ సినిమా మంచి హిట్ సాధించినప్పటికీ అతడికి గుర్తింపు వచ్చింది మాత్రం 'అన్నయ్య' మూవీతో! ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడిగా నటించాడు వెంకట్. ఇందులో మెగాస్టార్ అతడిని జెమ్స్ అని పిలుస్తుంటాడు. దీంతో చాలామంది ఇప్పటికీ వెంకట్‌ను జెమ్స్ అనే పిలుచుకుంటారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉన్నాడీ యాక్టర్. తాజాగా అతడు ఓ టీవీ షోకు హాజరై వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించాడు. చదువు మీద ధ్యాస లేదన్న వెంకట్ మోడలింగ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చానని తెలిపాడు. ఒక డ్యాన్స్ మాస్టర్ అందరిముందు తనను అవమానించాడని, తాను దేనికీ పనికిరానని, ఎక్కడినుంచి పట్టుకొచ్చారని విసుగు ప్రదర్శించాడని వెల్లడించాడు. ఒకసారైతే ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు చెంప చెల్లుమనిపించాడని చెప్పుకొచ్చాడు. ఆ ఐదుగురు సినిమా షూటింగ్ సమయంలో పెద్ద ప్రమాదం జరిగిందని తెలిపాడు వెంకట్. రాడ్ల మీద ఎక్కి పైకి దూకాల్సిన సీన్ ముందుకు దూకబోయి వెనక్కు పడ్డట్లు తెలిపాడు. ఆ ప్రమాదంలో పెద్ద గాయాలే అయ్యాయన్న ఆయన మూడు నెలలపాటు ఆస్పత్రి బెడ్‌కే పరిమితమైనట్లు పేర్కొన్నాడు. ఈ యాక్సిడెంట్ వల్ల చాలా సినిమాలు మిస్ అయ్యాయని చెప్తూ బాధపడ్డాడు. -
దటీజ్ మెగాస్టార్.. అభిమాని కోసం ఫ్లైట్ టికెట్స్ పంపి మరీ..
మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎంతలా అభిమానిస్తారో, అభిమానులను కూడా చిరంజీవి అంతేలా ప్రేమిస్తారు. వారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమాని విషయంలో చేసిన ఒక పని ఇప్పుడు మెగా అభిమానులనే కాక తెలుగు ప్రేక్షకులకు కూడా మనసుకు హత్తుకునేలా చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక అభిమాని.. తనను కలవాలని కోరగా.. ప్లైట్ టికెట్ బుక్ చేసి మరీ ఇంటికి పిలిపించుకున్నారు.స్వయంగా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడమే కాదు.. చికిత్స కోసం ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఫేమస్ ఆస్పత్రికి తరలించారు. అవరమైతే మరింత మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ వీరాభిమాని, విశాఖపట్నానికి చెందిన వెంకట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే వెంకట్ ట్విటర్ ద్వారా చిరంజీవిని కలవాలని ఆయనతో మాట్లాడాలనే విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. ‘నా ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు, నేను మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను’ అని ట్విటర్ వేదికగా చిరంజీవి వెంకట్ అభ్యర్థించారు. ఈ విషయం మీద చిరంజీవి వెంటనే స్పందించి వెంకట్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు వాకబు చేసి వెంటనే వచ్చి తనను కలవాల్సిందిగా కోరారు. కానీ వెంకట్ అనారోగ్యం కారణంగా కదిలే పరిస్థితి లేకుండా పోయిందని చిరంజీవి దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో చిరంజీవి ఎలా అయినా వెంకట్ ను కలవాలని భావించి వెంకట్, వెంకట్ భార్యకు విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు ఫ్లైట్ టికెట్స్ తీయించి హైదరాబాద్ రప్పించారు. శనివారం నాడు చిరంజీవి.. వెంకట్ ఆయన భార్య సుజాతను తన నివాసంలో కలిశారు. ఇద్దరితో దాదాపు 45 నిమిషాల సమయం కూడా గడిపారు చిరంజీవి. వెంకట్ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. వెంకట్ మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన చిరంజీవి, మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాద్ ఓ ప్రైవేట్ హాస్పిటల్స్ లో చెకప్ కోసం పంపించారు. అక్కడ అన్ని రకాల పరీక్షలు చేయించి, అక్కడి వైద్యులను సంప్రదించిన ఆయన దీనికి వెంకట్ సొంత ప్రాంతం అయిన విశాఖపట్నంలో హాస్పిటల్ లో చేర్చే విషయం గురించి మాట్లాడారు. విశాఖ హాస్పిటల్ లో ఖర్చులు తానే చూసుకుంటానని చిరంజీవి పేర్కొన్నారు. అవసరమైతే చెన్నై హాస్పిటల్ కి తరలించి అక్కడ వైద్యం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తన వీరాభిమానిని కాపాడుకోవడానికి వెనుకాడేది లేదని చిరంజీవి వెంకటట్ భార్య సుజాతకు భరోసా ఇచ్చారు. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు అందరూ మెగాస్టార్ మంచి మనసు తమకు తెలుసని, అది మరోసారి ప్రూవ్ అయింది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ నిర్ణయం తమకు చాలా ఆనందం కలిగిస్తోందని, ఆయన అభిమానులుగా ఉన్నందుకు గర్వంగా ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ తోటి అభిమాని అయిన వెంకట్ అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి మామూలు మనిషి అవ్వాలని కూడా మెగా అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
మోదీ, యోగి ప్రభుత్వాల పతనం ఖాయం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో మోదీ, యూపీలో యోగి, హరియాణాలో ఖట్టర్, అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మల ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారం దేశ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని అఖిల భారత వ్యవసాయ కార్మికుల యూనియన్ (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ ఆరోపించారు. మోదీ, యోగి ప్రభుత్వాల పతనం ఖాయమని, త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు ప్రభుత్వాలను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. లఖీమ్‌పూర్ ఘటనను నిరసిస్తూ సోమవారం ఢిల్లీలోని యూపీ భవన్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. చదవండి: (లఖీమ్‌పూర్ ఖేరిపై.. రాజకీయ ప్రకంపనలు) హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రైతులను కొట్టండి... నేనున్నాను, చూసుకుంటానని కార్యకర్తలను ఉసిగొల్పిన తరువాత కూడా ఆయనను ముఖ్యమంత్రిగా ఎలా కొనసాగించగలుగుతున్నారని వెంకట్ ప్రశ్నించారు. మోడీ, అమిత్ షా మద్దతు లేకుండా ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడుతారా? అని వ్యాఖ్యానించారు. 11 నెలలుగా జరుగుతున్న రైతు ఉద్యమాన్ని హత్యల ద్వారా అణచివేయాలని కుట్రలు పన్నుతున్నారని వెంకట్ ధ్వజమెత్తారు. అయితే ఇది వారికి ఏమాత్రం సాధ్యం కాదని, యూపీ ప్రభుత్వం వేసిన విచారణ కమిటీపై తమకు నమ్మకం లేదని తెలిపారు. యూపీలో రాజ్యాంగం అమలవ్వటం లేదని, అధికారులు, ప్రభుత్వం ప్రజల పక్షాన పని చేయని కారణంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు ఉద్యమానికి ముప్పాళ్ల సంఘీభావం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులకు సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూననేని సాంబశివరావు , బీకేఎంయూ జాతీయ కార్యదర్శి జెల్లి విల్సన్‌లు సంఘీభావం తెలిపారు. -
హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్
సాక్షి, న్యూఢిల్లీ: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం తమ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నర్సింగరావును ప్రకటించింది. గత ఆరేళ్లుగా ఆయన భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బల్మూరి వెంకట్‌తో పాటు స్థానిక నేతలు రవీందర్‌రెడ్డి, కృష్ణారెడ్డిల పేర్లు ప్రతిపాదిస్తూ టీపీసీసీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన కాంగ్రెస్ అధిష్టానం ఈసారి వెలమ సామాజిక వర్గానికి చెందిన వెంకట్‌ను బరిలో నిలపాలని నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బల్మూరి వెంకట్ పేరును ఖారారు చేసినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా... 2015, 2018లో జరిగిన ఎన్ఎస్యూఐ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన వరుసగా రెండుసార్లు గెలుపొందారు. 2017లో ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఎంబీబీఎస్ చదివిన వెంకట్‌ది పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాం పూర్ మండలం తారుపల్లి గ్రామం. అవివాహితుడయిన వెంకట్ (29) విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఆయనను పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించడం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పట్ల నిబద్ధత, విధేయత కలిగి క్రమశిక్షణతో పనిచేసే యువనాయకత్వానికి కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవం ఇస్తుందన్న విషయం వెంకట్ ఎంపికతో మరో మారు నిరూపితమయిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్జీ వినోద్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అధినాయకత్వానికి ధన్యవాదాలు: వెంకట్ హుజూరాబాద్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిగా అవకాశమిచ్చిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎంపీ రాహుల్‌గాంధీ, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ నాయకులకు వెంకట్ ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. -
ఆర్ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ కన్నుమూత
RR Movie Makers Venkat Passed Away: ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత ఆర్ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.చదవండి: ఆర్థిక ఇబ్బందుల్లో 'లగాన్' నటి.. ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ.. ఆర్.ఆర్ బ్యానర్స్‌పై ఆంధ్రావాలా, కిక్, ప్రేమ కావాలి, డాన్ శీను, మిరపకాయ్, బిజినెస్మెన్, డమరుకం, పైసా వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో 'డైవర్స్ ఇన్విటేషన్' అనే ఒక హాలీవుడ్ సినిమాని కూడా నిర్మించారు. వెంకట్ మృతి పట్ల హీరో రవితేజ, డైరెక్టర్లు శ్రీను వైట్ల, సురేందర్ రెడ్డి సమా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. Really sad to hear about R.R Venkat garu's passing away. One of the best producers I've worked with. Heartfelt condolences to his family and loved ones. 🙏 — Ravi Teja (@RaviTeja_offl) September 27, 2021 Extremely saddened to hear about the demise of senior producer #RRVenkat Garu. My deepest condolences to the family. — SurenderReddy (@DirSurender) September 27, 2021 Sad to know about RR Venkat garu's demise. Met him a couple of times and found him to be very passionate about movies. He was a man of guts and ambition. Praying for the strength to his family🙏 — Sreenu Vaitla (@SreenuVaitla) September 27, 2021 -
ఎన్ఎస్యూఐ దీక్ష విరమణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను వాయిదా వేయాలని కోరుతూ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ శనివారం విరమించారు. వెంకట్ దీక్ష చేపట్టి మూడు రోజులు కావడంతో ఉదయం గాంధీభవన్‌లోని దీక్షా శిబిరానికి వచ్చిన వైద్యులు ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ లెవల్స్ ప్రమాదకర స్థాయికి పడిపోయాయని నిర్ధారించారు. ఈ విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు తెలియజేయడంతో మాజీ ఎంపీ వీహెచ్‌తో కలిసి ఆయన దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఆరోగ్య పరిస్థితి విషమించినందున దీక్ష విరమించాలని వెంకట్‌కు సూచించిన ఉత్తమ్, విద్యార్థుల పక్షాన పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. దీంతో దీక్ష విరమణకు వెంకట్ అంగీకరించారు. మధ్యాహ్నం దీక్ష విరమించిన వెంకట్‌ను అంబులెన్స్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరీక్షలు వాయిదా వేయాలి: ఉత్తమ్ విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థుల కోసం దీక్ష చేపట్టిన వెంకట్‌ను ఆయన అభినందించారు. దేశవ్యాప్తంగా జేఈఈ, నీట్ పరీక్షలను కూడా వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. చలో రాజ్‌భవన్‌తో ఉద్రిక్తత వెంకట్ ఆరోగ్యం క్షీణించడంతో ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యవర్గం ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమానికి పిలుపు నిచ్చింది. దీంతో గాంధీభవన్ నుంచి ఎన్ఎస్యూఐ కార్యకర్తలు రాజ్ భవన్‌కు బయలుదేరారు. కానీ పోలీసులు వారిని గాంధీభవన్ గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
రాయలసీమ ప్రేమకథ
‘‘రాయలసీమ లవ్‌స్టోరీ’ ట్రైలర్లో ‘ఇడియట్’ సినిమా యాటిట్యూడ్ కనపడుతోంది. కర్నూల్లో షూట్ చేసిన ఏ సినిమా అయినా హిట్ అవుతుందనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. అలాంటిది కర్నూల్ నేపథ్యంలో వస్తున్న ‘రాయలసీమ లవ్‌స్టోరీ’ ఇంకెంత హిట్ అవుతుందో ఊహించుకోవచ్చు. రామ్‌లో మంచి ప్రతిభ, పవర్ కనపడుతున్నాయి. ఈ సినిమాకి పనిచేసిన వారందరికీ మంచి భవిష్యత్ ఉండాలి’’ అని డైరెక్టర్ జి.నాగేశ్వర్ రెడ్డి అన్నారు. వెంకట్, హృశాలి, పావని ప్రధాన పాత్రల్లో రణధీర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయలసీమ లవ్‌స్టోరీ’. రాయల్ చిన్నా, నాగరాజు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్, ఆడియో బిగ్ సీడీలను జి.నాగేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. రామ్ రణధీర్ మాట్లాడుతూ– ‘‘మొదటి నుంచి మమ్మల్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తూ వచ్చిన నాగేశ్వర్ రెడ్డిగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఒక్క లైన్ చెప్పగానే నన్ను నమ్మి పది రోజుల్లోనే షూటింగ్ స్టార్ట్ చేయించారు నిర్మాతలు. వారు నాకు జీవితం ఇచ్చారు. కథకు తగ్గ కరెక్ట్ టైటిల్ ‘రాయలసీమ లవ్‌స్టోరీ’’ అన్నారు. ‘‘రాయలసీమ అనగానే అందరికీ బాంబులు, ఫ్యాక్షన్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ వాళ్ల ప్రేమ ఎలా ఉంటుందో తెలియజేయడానికే ఈ చిత్రం నిర్మించాం’’ అన్నారు రాయల్ చిన్నా. ‘‘అను కున్న సమయానికి సినిమా పూర్తయింది. ఔట్పుట్ కూడా బాగా వచ్చింది. ఈ నెల 27న సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు నాగరాజు. ‘‘నిర్మాతల సహకారం వల్లే మ్యూజిక్ ఇంత బాగా వచ్చింది’’ అన్నారు సంగీత దర్శకుడు సాయి ఎలేంద్ర. వెంకట్, హృశాలి మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్ మహేందర్. -
వ్యూహాలు ఫలించాయా?
సుమన్ రంగనాథన్, ముమైత్‌ఖాన్, బెనర్జీ, వెంకట్, సంజీవ్‌కుమార్ ముఖ్య తారలుగా కేటీ నాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘దండుపాళ్యం 4’. వెంకట్ నిర్మించిన ఈ సినిమా అదే పేరుతో తెలుగులో ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ– ‘‘జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా? లేక విజయం సాధించారా? అనే అంశాలతో రూపొందిన చిత్రమిది. ఏడుమంది ఉన్న గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటించారు. ప్రస్తుతం సెన్సార్ పనులు జరుగుతున్నాయి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆగస్టు 15న విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘దండుపాళ్యం 1,2’ చిత్రాలకు మా సినిమాకి సంబంధం లేదు. ఇందులో కథ, కథనాలు కొత్తగా ఉంటాయి’’ అన్నారు కె.టి.నాయక్. -
సమ్మర్ ‘జిమ్‌దగీ’
సాక్షి, సిటీబ్యూరో :ఓ వైపు ఫిట్నెస్ ఫీవర్ కారణంగా సిటీటెంపరేచర్తో ఉంది. మరోవైపు సమ్మర్ సీజన్ శరీరాల్ని హీటెక్కించేస్తోంది. వారంలో రెండు మూడు రోజులతో సరిపెట్టేవారు మాత్రమే కాదు ఒక్క రోజు కూడా జిమ్‌కి డుమ్మా కొట్టడానికి ఇష్టపడని వారూ సిటీలో ఎక్కువే.ఈ నేపథ్యంలో.. హాట్ సమ్మర్లో ‘జిమ్‌దగీ’ ఎలా ఉండాలో వివరిస్తున్నారు నగరానికి చెందిన ఫిట్నెస్ ట్రైనర్ ఎం.వెంకట్. వెయిట్‌లాస్‌కి ప్లస్... చలికాలం, వానాకాలంతో పోలిస్తే వేసవిలో శరీరం త్వరగా వార్మప్ అవుతుంది. ‘శారీరక శ్రమ, మరో వైపు వేడిగాలి బాడీ టెంపరేచర్‌ను పెంచుతాయి. ఈ వేడి దేహమంతా విస్తరించేందుకు చర్మం ద్వారా రక్తం అధికంగా సరఫరా అవుతుంది. ఇది గుండె కొట్టుకునే స్థాయిని పెంచుతుంది. దీంతో బాడీ టెంపరేచర్ సాధారణ స్థాయికన్నా పెరుగుతుంది. ఈ పరిస్థితి కేలరీలు అధికంగా ఖర్చయ్యేందుకు, మరింత వేగంగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. కాబట్టి ఈ సీజన్ వెయిట్ లాస్ కోరుకునేవారికి ప్లస్ అవుతుంది. నిదానమే సరైన విధానం... ఈ సీజన్లో వ్యాయామం స్లోగానే స్టార్ట్ చేసి దశలవారీగా వేగం పెంచాలి. ఏదేమైనా కొంత వేగాన్ని నియంత్రించడం అవసరమే. ముఖ్యంగా కార్డియో వ్యాయామాలు అధికంగా చేసేవాళ్లు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. దాహం అనిపించకపోయినా సరే వ్యాయామ సమయంలో తరచూ నీళ్లు తాగుతుండాలి. వెదర్.. చూడాలి బ్రదర్.. మిట్టమధ్యాహ్నపు ఎండలో ఏసీ జిమ్‌లో అయినా సరే ఎక్సర్సైజ్లు చేయడం అంతగా మంచిది కాదు. వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లోనే వ్యాయామం చేయడం సముచితం. బలహీనత, తలనొప్పి, తలతిరగడం, ఒళ్లు పట్టేయడం వాంతులు, గుండె మరీ ఎక్కువగా కొట్టుకోవడం, తీవ్రమైన అలసటకు సంబంధించిన సూచనలు కనిపించినట్లయితే వెంటనే వ్యాయామం ఆపేసి, చల్లని ప్రదేశంలో, నీడలో సేదతీరడం అవసరం. వ్యాయామానంతరం చన్నీటి స్నానం చేస్తే అలసిన కండరాలకు చక్కగా సేదతీరే అవకాశం లభిస్తుంది. సీజన్‌కి...నప్పేవి ఈ సీజన్లో శరీరం సహజంగానే కొంత ఒత్తిడికి గురవుతుంటుంది. కాబట్టి బాగా ఒత్తిడికి గురిచేసే క్రాస్ ఫిట్ శైలి వ్యాయామాలు టైర్, హామర్తో, బాటిల్ రోప్‌తో చేసే వర్కవుట్స్‌ని బాగా తగ్గించేయాలి. శరీరం వార్మప్ అయి ఉంటుంది కాబట్టి మజిల్ టోనింగ్ మీద దృష్టి పెట్టాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తూనే కార్డియో వ్యాయామాలకు బదులుగా క్రంచెస్, పుషప్స్, బర్పీస్, ఇంచ్వామ్, మౌంటెయిన్ క్లైంబర్స్, స్పాట్ జాగింగ్ వంటివి ఎంచుకోవాలి. డీహైడ్రేషన్ దరిచేరకుండా... రోజు మొత్తం మీద కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని తీసుకోవాలి. చెమట ద్వారా కోల్పోయే సోడియం, పొటాíషియం, క్లోరైడ్లను భర్తీ చేసేందుకు వ్యాయామానికి ముందు పొటాసియం అధికంగా ఉండే అరటి, దానిమ్మ పండ్లు వంటివి తీసుకోవాలి. అవసరమైతే ఓఆర్ఎస్ వంటి సప్లిమెంట్స్‌ని వర్కవుట్స్ చేసే సమయంలో వినియోగించడం మంచిది. స్పోర్ట్స్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను ఆశ్రయించవచ్చు. కాఫీ, టీ, ఆల్కహాల్ వల్ల దేహంలోని నీటిస్థాయి ఆవిరై వ్యాయామ సమయంలో త్వరగా అలసిపోతాం. వాటికి ఈ సీజన్లో తప్పనిసరిగా గుడ్‌బై చెప్పాల్సిందే. వెయిట్‌లాస్‌కి బెస్ట్... కొంత మంది వేసవి సీజన్లో వేడికి భయపడి వర్కవుట్స్ మానేస్తారు. అయితే సరిగ్గా వినియోగించుకుంటే ఇది మజిల్ టోనింగ్‌కి, ముఖ్యంగా వెయిట్‌లాస్‌కి అత్యంత ఉపయుక్తమైన సీజన్. డ్రైఫిట్ దుస్తులు ధరించడం దగ్గర్నుంచి స్వల్ప మార్పు చేర్పులతో ఈ సీజన్లో వర్కవుట్స్‌ని ఎంజాయ్ చేయవచ్చు. – ఎం.వెంకట్, ట్రైనర్, టార్క్ ఫిట్నెస్ స్టూడియో -
హిజ్రాలపై కక్ష పెంచుకొని..
బంజారాహిల్స్: హిజ్రాలపై దాడులకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటూ అటు పోలీసులకు, ఇటు హిజ్రాలకు చుక్కలు చూపిస్తూ తప్పించుకు తిరుగుతున్న నిందితుడు కురుమ వెంకటేష్ అలియాస్ గ్రానైట్ వెంకట్ అలియాస్ వెంకట్‌యాదవ్ అలియాస్ వెంకట్ అలియాస్ చిన్నాను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఆర్.కళింగరావు, డీఐ కె. రవికుమార్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా, రాప్తాడు మండలం, కక్కాలపల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకట్ యాదవ్‌కు 2009లో ఎల్బీనగర్లో దివ్య అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఏడాది పాటు సహజీవనం చేశారు. అనంతరం వెంకట్‌కు వివాహం జరిగింది. తనను వదిలి భార్యతో కాపురం చేస్తున్న వెంకట్‌పై కోపం పెంచుకున్న దివ్య అతడి గ్రామానికి వెళ్లి గొడవ చేసింది. తన పరువు తీసిందని దివ్యపై పగబట్టిన వెంకట్ ఆమెను హత్య చేసేందుకు నగరానికి వచ్చాడు. దివ్య ఆచూకీ తెలుసుకునే ప్రయతత్నంలో కూకట్‌పల్లిలో ప్రవళ్లిక అనే మరో హిజ్రాను బండరాయితో మోది దారుణం హత్య చేశాడు. తన జీవితాన్ని నాశనం చేసిందన్న కసితో హిజ్రాలపై కక్ష పెంచుకొని వారినే లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డాడు. తరచూ వారిపై లైంగిక దాడులకు పాల్పడటమేగాక నగదు, నగలు దోచుకునేవాడు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ రోడ్‌నెం. 2లోని ఇందిరానగర్‌లో మకాం వేసిన అతను గతేడాది ఇందిరానగర్‌లోనే ఓ హిజ్రాతో మాట్లాడుతున్న బ్రహ్మం అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను హత్య చేశాడు. గత ఏడాది సెప్టెంబర్ 27న యాస్మిన్ అనే హిజ్రా ఇంట్లో చొరబడి ఆమెపై దాడి చేసి రూ. 2 లక్షల నగదు, బంగారు దోచుకెళ్లాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న వెంకట్ పోలీసుల కళ్లుగప్పి వివిధ రాష్ట్రాల్లో మకాం వేశాడు. పక్కా నిఘా వేసిన బంజారాహిల్స్ డీఐ రవికుమార్ రెండు రోజుల క్రితం అనంతపురంలోని ఓ లాడ్జీలో స్నేహితులతో కలిసి పేకాట ఆడుతున్న వెంకట్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో వెంకట్ క్రిమినల్ చిట్టా వెలుగు చూసింది. ప్రతినెలా హిజ్రాల నుంచి హఫ్తాలు వసూలు చేయడం, తనకు నచ్చిన హిజ్రాపై లైంగిక దాడులకు పాల్పడటం, హిజ్రాల ఇళ్లల్లోకి చొరబడి నగదు ఎత్తుకెళుతున్నట్లు గుర్తించారు. నిందితుడిపై గోపాలపురం, మాదాపూర్, కేపీహెచ్‌బీ, సనత్‌నగర్, బంజారాహిల్స్, బాలానగర్, ఎల్బీ నగర్, కూకట్పల్లి పోలీస్ స్టేషన్లలో పది క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, నాన్‌బెయిలబుల్ వారెంట్లు కూడా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఎంతో కష్టపడి వెంకట్ యాదవ్‌ను పట్టుకున్న బంజారాహిల్స్ పోలీసులను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్.రావు సూచనలు, సమాచారంతో డీఐ రవికుమార్ లక్ష్యాన్ని ఛేదించారని కొనియాడారు.