Chiranjeevi Helps Out Ailing Die Hard Fan Venkat - Sakshi
Sakshi News home page

chiranjeevi: దటీజ్ మెగాస్టార్.. అభిమాని కోసం ఫ్లైట్ టికెట్స్ పంపి మరీ..

Published Sun, Oct 24 2021 11:34 AM | Last Updated on Sun, Oct 24 2021 2:33 PM

Chiranjeevi Helps Out Ailing Die Hard Fan Venkat - Sakshi

మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎంతలా అభిమానిస్తారో, అభిమానులను కూడా చిరంజీవి అంతేలా ప్రేమిస్తారు. వారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతారు.  తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమాని విషయంలో చేసిన ఒక పని ఇప్పుడు మెగా అభిమానులనే కాక తెలుగు ప్రేక్షకులకు కూడా మనసుకు హత్తుకునేలా చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక అభిమాని.. తనను కలవాలని కోరగా..  ప్లైట్ టికెట్ బుక్ చేసి మరీ ఇంటికి పిలిపించుకున్నారు.స్వయంగా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడమే కాదు.. చికిత్స కోసం ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఫేమస్ ఆస్పత్రికి తరలించారు. అవరమైతే మరింత మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. 


వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ వీరాభిమాని, విశాఖపట్నానికి చెందిన వెంకట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే వెంకట్  ట్విటర్‌ ద్వారా చిరంజీవిని కలవాలని ఆయనతో మాట్లాడాలనే విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. ‘నా ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు, నేను మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను’ అని ట్విటర్ వేదికగా చిరంజీవి వెంకట్ అభ్యర్థించారు. ఈ విషయం మీద చిరంజీవి వెంటనే స్పందించి వెంకట్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు వాకబు చేసి వెంటనే వచ్చి తనను కలవాల్సిందిగా కోరారు. 

కానీ వెంకట్ అనారోగ్యం కారణంగా కదిలే పరిస్థితి లేకుండా పోయిందని చిరంజీవి దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో చిరంజీవి ఎలా అయినా వెంకట్ ను కలవాలని భావించి వెంకట్, వెంకట్ భార్యకు విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు ఫ్లైట్ టికెట్స్ తీయించి హైదరాబాద్ రప్పించారు. శనివారం నాడు చిరంజీవి.. వెంకట్ ఆయన భార్య సుజాతను తన నివాసంలో కలిశారు. ఇద్దరితో దాదాపు 45 నిమిషాల సమయం కూడా గడిపారు చిరంజీవి. వెంకట్ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. వెంకట్ మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన చిరంజీవి, మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాద్ ఓ ప్రైవేట్‌ హాస్పిటల్స్ లో చెకప్ కోసం పంపించారు.
 
అక్కడ అన్ని రకాల పరీక్షలు చేయించి, అక్కడి వైద్యులను సంప్రదించిన ఆయన దీనికి వెంకట్ సొంత ప్రాంతం అయిన విశాఖపట్నంలో హాస్పిటల్ లో చేర్చే విషయం గురించి మాట్లాడారు. విశాఖ హాస్పిటల్ లో ఖర్చులు తానే చూసుకుంటానని చిరంజీవి పేర్కొన్నారు. అవసరమైతే చెన్నై హాస్పిటల్ కి తరలించి అక్కడ వైద్యం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తన వీరాభిమానిని కాపాడుకోవడానికి వెనుకాడేది లేదని చిరంజీవి వెంకటట్‌ భార్య సుజాతకు భరోసా ఇచ్చారు. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు అందరూ మెగాస్టార్ మంచి మనసు తమకు తెలుసని, అది మరోసారి ప్రూవ్ అయింది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ నిర్ణయం తమకు చాలా ఆనందం కలిగిస్తోందని, ఆయన అభిమానులుగా ఉన్నందుకు గర్వంగా ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ తోటి అభిమాని అయిన వెంకట్ అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి మామూలు మనిషి అవ్వాలని కూడా మెగా అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement