నిరుద్యోగులను మోసం చేసిన ఫార్చ్యూన్ కంపెనీ డైరెక్టర్ వెంకట్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొమ్మద్ది ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: నిరుద్యోగులను మోసం చేసిన ఫార్చ్యూన్ కంపెనీ డైరెక్టర్ వెంకట్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొమ్మద్ది ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని సీపీఐ కార్యాయలంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కంపెనీలో దాదాపు రెండు వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేయడం తగదన్నారు. అసలు కంపెనీలో ఏ ఉద్యోగాలు ఉన్నాయో విద్యార్హతలకు సంబంధించిన వివరాలను నోటీస్ బోర్డులో ఎక్కడా పెట్టలేదని విమర్శించారు. కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతులు కావాల్సి ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఇందులో భాగం కావడంతో కంపెనీ మోసంపై నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ప్రసాద్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.