ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు జరగనున్న ఈ పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
డీఎంహెచ్‌వో, విశాఖపట్నంలో 67 మెడికల్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విశాఖ పట్నం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. నేషనల్ హెల్త్ మిషన్(ఎన్ హెచ్‌ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 67
► పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‌లు–05, మెడికల్ ఆఫీసర్లు–19, స్టాఫ్ నర్సు–25, ల్యాబ్ టెక్నీషియన్–02, పారామెడికల్ స్టాఫ్–09, సపోర్ట్ స్టాఫ్–06.
► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్), డీఎంఎల్ /టీఎంఎల్‌టీ/బీఎస్సీ(ఎంఎల్‌టీ), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ /ఎంఏ(సోషల్ వర్క్), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021
► వెబ్‌సైట్: http://visakhapatnam.ap.gov.in
డీఎంహెచ్‌వో, గుంటూరులో 86 మెడికల్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్‌ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 86
► పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్స్–02, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్–01, జనరల్ ఫిజిషియన్–01, కార్డియాలజిస్ట్–01, మెడికల్ ఆఫీసర్లు–27, స్టాఫ్ నర్సులు–35, సైకియాట్రిక్ నర్స్–05, ఫిజియోథెరపిస్ట్–02, ఆడియోమెట్రీషియన్–03, సోషల్ వర్కర్–04, కన్సల్టెంట్–క్వాలిటీ మానిటర్–01, హాస్పిటల్ అటెండెంట్–02, శానిటరీ అటెండెంట్–02.
► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్‌ఎం /బీఎస్సీ(నర్సింగ్), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 చెల్లించాలి.
► ఎంపిక విధానం: అర్హత పరీక్ష లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021
► వెబ్‌సైట్: https://guntur.ap.gov.in
డీఎంహెచ్‌వో, కడప జిల్లాలో 43 పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్ ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 43
► పోస్టుల వివరాలు: ఫోరెన్సిక్ స్పెషలిస్ట్–01, జనరల్ ఫిజిషియన్–01, కార్డియాలజిస్ట్–01, మెడికల్ ఆఫీసర్లు–20, స్టాఫ్ నర్స్–13, ల్యాబ్ టెక్నీషియన్–01, ఫిజియోథెరపిస్ట్–01, ఆడియోమెట్రీషియన్–01, సోషల్ వర్కర్–01, కన్సల్టెంట్–01, హాస్పిటల్ అటెండెంట్–01, శానిటరీ అటెండెంట్–01.
► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 చెల్లించాలి.
► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, కడప, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021
► వెబ్‌సైట్: https://www.kadapa.nic.in
డీఎంహెచ్‌వో, విజయనగరంలో 36 మెడికల్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయన గరం జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్ ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 36
► పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్–01, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్–01, జనరల్ ఫిజిషియన్–01, కార్డియాలజిస్ట్–01, వైద్యాధికారులు–13, స్టాఫ్ నర్సులు–07, నర్స్‌లు–04, ల్యాబ్ టెక్నీషియన్‌లు–01, ఆక్యుపేషిన్ థెరపిస్ట్–01, ఆడియో మెట్రీషియన్–01, సోషల్ వర్కర్–02, కన్సల్టెంట్ క్వాలిటీ మానిటర్–01, హాస్పిటల్ అటెండెంట్–01, శానిటరీ అటెండెంట్–01.
► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
► వయసు: 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021
► వెబ్‌సైట్: https://vizianagaram.ap.gov.in
Comments
Please login to add a commentAdd a comment