Naa Venta Paduthunna Chinnadevadamma Trailer Out - Sakshi
Sakshi News home page

Naa Venta Paduthunna Chinnadevadamma: ప్రేమంటే ఇదేనా.. ఈ ఫీలింగేంటి ఇంత బాగుంది

Published Wed, Aug 24 2022 10:27 AM | Last Updated on Wed, Aug 24 2022 11:12 AM

Naa Venta Paduthunna Chinnadevadamma Trailer out - Sakshi

తేజ్‌ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటించిన చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్‌వందెల దర్శకుడు. ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరావు  నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు బి. గోపాల్‌ విడుదల చేసి, ‘‘ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్స్‌  బాగున్నాయి.ఈ కథ పై ఉన్న నమ్మకంతో దర్శకుడు వెంకట్ చాలా కాన్ఫిడెంట్ గా తీశాడు. అలాగే ఈ సినిమా కథను, దర్శకుడిని నమ్మి తీసిన నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి’అన్నారు.

‘‘ఇది ఒక అందమైన రియలిస్టిక్‌ ప్రేమకథ. ఓషోలోని తత్త్వం, బుద్ధునిలోని సహనం, శ్రీశ్రీలోని రెవలిజం, వివేకానందుడిలోని గుణం ఉండేలా తనికెళ్ల భరణిగారి పాత్రను  డిజైన్‌ చేయడం జరిగింది. నటీనటులు, టెక్నీషియన్స్‌ ఫుల్‌ సపోర్ట్‌ చేశారు’’ అన్నారు  వెంకట్‌ వందెల. ‘‘నేను సోలో హీరోగా నటించిన తొలి చిత్రం ఇది’’ అన్నారు తేజ్‌ కూరపాటి. ‘‘ద్వారకా తిరుమలైన చిన్న తిరుపతిలో ఈ చిత్రం షూటింగ్‌ చేశాం. అనుకున్న టైమ్‌కు, అనుకున్న బడ్జెట్‌లో సినిమా పూర్తి చేశాం’’ అన్నారు ముల్లేటి కమలాక్షి.

ఇక ట్రైలర్‌ విషయానికొస్తే..‘చరిత్ర మనకెప్పుడో చెప్పింది సాల్మన్‌ రాజుగారు.. మనకు కావాల్సింది దాని కోసం ఎన్ని యుద్ధాలైనా చేయమని. వదిలే ప్రసక్తే లేదు’.‘ప్రేమంటే ఇదేనా.. ఈ ఫీలింగేంటి ఇంత బాగుంది’.‘గుళ్లో దైవం..బళ్లో పుస్తకం తప్ప ఏ ధ్యాసలేని నా జీవితంలోకి ఒక్కడొచ్చాడు. వాడొవడో కూడా నాకు తెలియదు. అసలు ప్రేమంటే ఏంటి అది ఎలా ఉంటుంది. ఒక్కసారి నాకు కనబడితే నెత్తిపై ఒక్కటిచ్చి ఏడ్చేలోపే పీక పిసిగి చంపేయాలని ఉంది’ లాంటి డైలాగ్స్‌తో  ఆకట్టుకుంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement