'మా మధ్య కాంపౌండ్స్ వేయకుర్రి'.. విశ్వక్ సేన్‌ అదిరిపోయే రిప్లై | Tollywood Hero Vishwak Sen Comments On Laila Movie Trailer Event | Sakshi
Sakshi News home page

Vishwak Sen: 'మాకు ఉన్నది ఒక్కటే కాంపౌండ్'.. విశ్వక్‌ సేన్‌ మాస్‌ రిప్లై

Published Thu, Feb 6 2025 6:54 PM | Last Updated on Thu, Feb 6 2025 7:10 PM

Tollywood Hero Vishwak Sen Comments On Laila Movie Trailer Event

మాస్‌ కా దాస్‌ విశ్వక్ సేన్‌ లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం రోజున అభిమానులను పలకరించనున్నారు. విశ్వక్‌ విభిన్నమైన పాత్రతో ఫ్యాన్స్‌ను అలరించనున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన రొమాంటిక్‌ అండ్ యాక్షన్‌ మూవీలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ట్రైలర్ విడుదల చేశారు.

అయితే ఈవెంట్‌లో విశ్వక్‌ సేన్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. మీరు ఈవెంట్స్‌కైనా నందమూరి హీరోలను పిలుస్తుంటారు కదా? సడన్‌గా మెగాస్టార్‌(బాస్‌)ను పిలిచారు? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి విశ్వక్ సేన్ తనదైన స్టైల్లోనే అదిరిపోయే సమాధానం ఇచ్చారు. మాకు ఉన్నది ఒక్కటే కాంపౌండ్‌ అని విశ్వక్ సేన్ స్పష్టం చేశారు. మీరే మా మధ్య ఏదేదో సృష్టించవద్దని కోరారు.  

విశ్వక్ సేన్ మాట్లాడుతూ..' మా మధ్యలో కాంపౌండ్లు వేసేది మీరే. మాకు ఉన్నది ఇంటి కాంపౌండ్ ఒక్కటే. ఇక్కడ కంపౌండ్ లాంటివి ఏం లేవు. ఇండస్ట్రీ అంతా ఒక్కటే. బాస్ ఇజ్ బాస్. ప్రతిసారి వారిని ఇబ్బంది పెట్టి మా ఈవెంట్స్‌కు పిలవం కదా. మా నాన్న గారికి రాజకీయాల నుంచి చిరంజీవితో పరిచయం ఉంది. ఆ టైమ్‌లో  మా డాడీ మలక్‌పేట్‌ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నా చిన్నప్పటి నుంచి వారి మధ్య మంచి రిలేషన్ ఉంది. కానీ మీరు వచ్చి ఇక్కడ లేనీ పోనీ కాంపౌండ్స్ వేయకండి. మీరు వచ్చి మధ్యన లేనివీ సృష్టించకండి. ఇండస్ట్రీలో ఎప్పటికైనా మేమంతా ఒక్కటే. మేము మంచి ఉద్దేశంతో సినిమాను ప్రమోట్‌ చేసుకునేందుకు వారిని పిలుస్తాం. అంతే తప్ప ఇక్కడ అలాంటివే ఉండవు. మీరొచ్చి దాంటో ఏమీ వేయకుర్రి ' అని కాస్తా గట్టిగానే బదులిచ్చారు.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement