
యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ 'లైలా'. వాలంటైన్స్ డే కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి తొలి ఆటకే డిజాస్టర్ టాక్ వచ్చింది. దానికి తోడు క్రింజ్ కామెడీ పేరుతో కంటెంట్ అయితే మరీ ఘోరం. అలాంటి ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బోల్తా కొట్టిన ఈ సినిమాలో విశ్వక్ సేన్.. సోనూ మోడల్ అనే కుర్రాడి పాత్రతో పాటు అమ్మాయి గెటప్ లోనూ కనిపించాడు. అయితే లేడీ గెటప్ లో చెప్పిన డైలాగ్స్ డబుల్ మీనింగ్ తో ఉండటం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటానని విశ్వక్.. అందరికీ క్షమాపణలు చెప్పాడు.
(ఇదీ చదవండి: భర్త కాదు కూతురితో సమస్య.. సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నంలో బయటపడుతున్న నిజాలు)
సరే అదంతా పక్కనబెడితే ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైన 'లైలా'.. మూడు వారాలు తిరిగేసరికే అంటే మార్చి 7నుంచి ఆహా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
లైలా మూవీతో భారీ డిజాస్టర్ అందుకున్న విశ్వక్ సేన్.. ప్రస్తుతం జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కేవీ తీస్తున్న ఫంకీ అనే సినిమాలో నటిస్తున్నాడు. మరి దీనితోనైనా హిట్ కొట్టి కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)

Comments
Please login to add a commentAdd a comment