compound
-
అర్ధరాత్రి భూ అక్రమార్కుల అరాచకం!
రైల్వేకోడూరు అర్బన్: కూటమి ప్రభుత్వం వచి్చన తరువాత భూ అక్రమార్కులు రెచి్చపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన క్షణం నుంచే టీడీపీ శ్రేణులు పేట్రేగిపోతున్నాయని జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తున్నది. అదే రీతిలో కొంతమంది భూ అక్రమార్కులు అదివారం అర్ధరాత్రి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని చర్చి ప్రాంగణంలోని ఓ భవనాన్ని కూల్చి వేసేందుకుయతి్నంచి అరాచకం సృష్టించారు. స్థానికులు ప్రతిఘటించడంతో పలాయనం చిత్తగించిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.రైల్వేకోడూరు పట్టణంలోని టోల్గేట్ వద్ద పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న లూథరన్ చర్చి ప్రాంగణంలోని చర్చి బంగ్లాపై పోలిన సుబ్బరాయుడు అలియాజ్ తిమోతీ టీడీపీకి చెందిన మరికొంతమంది కబ్జాదారుల కన్ను పడింది. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత వీరంతా 4 జేసీబీలు, నాలుగు ట్రాక్టర్లతో దాదాపు 50 మంది అనుచరులతో వచ్చి ఆ బంగ్లాను కూలి్చవేసేందుకు యతి్నంచి నానా బీభత్సం సృష్టించారు. భవనం పాక్షికంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలోనే చర్చి కాంపౌండ్‌ను పూర్తిగా కూలి్చవేశారు. అక్కడ నిద్రిస్తున్న వారిపై దాడికి దిగారు.దాడుల్లో రత్నం, రామచంద్రయ్యకు గాయాలయ్యాయి. అరుపులు, కేకలు వినబడడంతో స్థానికంగా ఉన్న చర్చి సభ్యులంతా చేరుకుని కూలి్చవేతలను అడ్డుకుని ప్రతిఘటనకు దిగడంతో.. అక్కడినుంచి పరారయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐలు వెంకటేశ్వర్లు, బాబు ఘటనా స్థలానికి చేరుకుని తిమోతి, మరో ఆరుగురిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, రైల్వేకోడూరు పట్టణం, మండలంలోని రాఘవరాజపురం, మైసూరావారిపల్లి, ప్రధాన రహదారికి ఇరువైపులా భూములు ఎకరా కోట్ల రూపాయల విలువ పలుకుతున్నాయి.దీనికితోడు ప్రభుత్వం మారగానే చర్చి భూములు, ప్రభుత్వ భూములు, ఇరిగేషన్భూములు, వంకపోరంబోకులు, ఆర్అండ్బీ స్థలాలపై అక్రమార్కులు కన్నేశారు. నెల క్రితం రాఘవరాజపురంలో కోట్ల విలువచేసే ఆర్అండ్బీ జాగాను కబ్జా చేయడానికి ప్రయతి్నంచి గ్రామంలోని యువకులు అడ్డుకోవడంతో వెనుతిరిగారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా చర్చి భవనాన్ని ఆక్రమించుకునేందుకు తెగబడడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మనిషికి చిరాయువు ఇక సాధ్యమే?
సాధారణంగా ఎవరైనా ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షు కోరుకుంటారు. ఇందుకోసం అనేక ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. శాస్త్రవేత్తలు, వైద్య పరిశోధకులు కూడా మనిషి జీవిత కాలం పొడిగించేందుకు పలు పరిశోధనలు సాగిస్తుంటారు. ఈ నేపధ్యంలో అనేక సిద్ధాంతాలు, ప్రక్రియలు పుట్టుకొచ్చాయి. అయితే అవేవీ ఆశించినంత ఫలితాన్ని అందించలేదు. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తల నూతన పరిశోధనలు మనిషి దీర్ఘాయువుకు గట్టి హామీని ఇచ్చేలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు యాంటీ ఏజింగ్ డ్రగ్ కోసం పలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో వారు మనిషి దీర్ఘాయువుకు దోహదపడేలా పలు పరిష్కార మార్గాలను కనుగొంటున్నారు. వృద్ధాప్య కణాలను తొలగించి, అదే సమయంలో వాటి స్థానంలో కొత్త కణాలను సృష్టించడం ద్వారా దీర్ఘాయువు పొందవచ్చని చాలామంది భావిస్తుంటారు. తాజాగా బక్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఏజింగ్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు కెనోరబ్డిటిస్ ఎలిగాన్స్ అనే నెమటోడ్లు (నీటిలో నివసించే సూక్ష్మజీవులు)లను ఎలుకలలో ప్రవేశపెట్టి వాటి జీవితకాలాన్ని పొడిగించడంలో విజయం సాధించారు. ఈ ప్రయోగాలు మనిషికి దీర్ఘాయువును అందించేందుకు చేస్తున్న పరిశోధనలకు దోహదపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కెనోరబ్డిటిస్ ఎలిగాన్స్ నెమటోడ్లు పుష్కలంగా మైక్రోఫాగీలను కలిగివుంటాయి. మైక్రోఫాగీ అనేది ఒకరరమైన తెల్లరక్త కణం. ఇది మనిషి రోగ నిరోధకశక్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మృత కణాలను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. మైక్రోఫాగీ అనేది యాంటీఆక్సిడెంట్ కావడానికి తోడు న్యూరోప్రొటెక్టివ్ ప్రయోజనాలను అందిస్తుంది. కెనోరబ్డిటిస్ ఎలిగాన్స్ నెమటోడ్లు అందించే ప్రయోజనాలను కొమారిన్లో కూడా ఉన్నాయని కనుగొన్నారు. ఇవి మొక్కలలో కనిపిస్తాయి. ముఖ్యంగా దాల్చినచెక్కలో అధికంగా ఉంటాయి. దాల్చిన చెక్క అనేది సెల్యులార్ ఆటోఫాగి, లైసోసోమల్ ఫంక్షన్లను నిర్దేశించడంలో కీలకంగా ఉండే ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ కార్యాచరణను ప్రోత్సహిస్తున్నదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొమారిన్ అనేది శరీరంలో కణాంతర రీసైక్లింగ్ వ్యవస్థను చక్కగా నిర్వహిస్తుంది. దీని కారణంగా వయస్సు పెరిగే ప్రక్రియ మందగించడం ప్రారంభమవుతుంది. శాస్త్రవేత్త, పరిశోధకులు శంకర్ చింతా.. న్యూరోనల్ కణాలపై సహజ సమ్మేళనాల ప్రభావం గురించి అధ్యయనం సాగిస్తున్నారు. ఈ పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయని ఈ అధ్యయనానికి సారధ్యం వహిస్తున్న శాస్త్రవేత్త జూలీ ఆండర్సన్ చెప్పారు. మైక్రోఫాగీ ప్రేరేపిత సమ్మేళనాలు యాంటీ ఏజింగ్ థెరపీకి కీలకంగా ఉపయుక్తమవుతాయి. ఇవి ఎలుకల కండరాల కణాలలో మైటోకాన్డ్రియల్ పనిచేయకపోవడాన్ని కూడా నిరోధించాయని పరిశోధనల్లో తేలింది. మైటోకాండ్రియా అనేది ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. లోపభూయిష్టమైన మైటోకాన్డ్రియల్ ఫంక్షన్ పార్కిన్సన్స్, అల్జీమర్స్ , అనేక హృదయ సంబంధ వ్యాధులు, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, జీవక్రియ వ్యాధులు, వయసు సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. మైటోకాన్డ్రియల్ కార్యకలాపాలు సవ్యంగా సాగాలంటే మైక్రోఫాగీ ప్రేరేపిత సమ్మేళనాలు అవసరం అవుతాయి. సమర్థవంతమైన మైటోఫాగి.. జీవుల జీవితకాలం పొడిగించిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిపై జరుగుతున్న పరిశోధనలు మనిషికి చిరాయువును ప్రసాదించే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఇది కూడా చదవండి: రికార్డు ధరకు నెపోలియన్ టోపీ -
రాబడిమీద రాబడి .. కాంపౌండింగ్ గురించి విన్నారా?
పెట్టుబడులపై రాబడి ఎంతన్నది ఇన్వెస్టర్లు ముందుగా చూసే అంశం. రాబడితోపాటు.. కాంపౌండింగ్ను కూడా చూసే స్మార్ట్ ఇన్వెస్టర్లు కూడా ఉంటారు. పెట్టుబడులపై రాబడిని ప్రతిఫలంగా పరిగణిస్తే.. కాంపౌండింగ్ (రాబడులపై రాబడి) అన్నది బోనస్ అవుతుంది. అందుకే కాంపౌండింగ్ను ప్రపంచంలో ఎనిమిదో అద్భుతంగా చెబుతుంటారు. ఈక్విటీ పెట్టుబడులపై కాంపౌండింగ్ ప్రయోజనం ఏ మేరకు అనేది దీర్ఘకాలంలోనే తెలుస్తుంది. అది కూడా విజయవంతమైన పెట్టుబడుల విషయంలోనే కాంపౌండింగ్ ప్రయోజనాన్ని రుచి చూడగలరు. కానీ, డెట్ పెట్టుబడులపై అలా కాదు.. కాంపౌండింగ్ ప్రయోజనాన్ని ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్లు పరిశీలించుకోవచ్చు. స్పష్టంగా చెప్పుకోవాలంటే.. డెట్ పెట్టుబడుల్లో కాంపౌండింగ్ స్థిరంగా ఉంటుంది. ఈక్విటీల్లో అస్థిరంగా ఉంటుంది. డెట్ సాధనాల్లో పెట్టుబడులపై దీర్ఘకాలంలో (మీ లక్ష్యానికి అవసరమైన వ్యవధిపై) ఎంత మేర సమకూరుతుందన్నది ముందుగానే ఓ స్పష్టమైన అంచనాకు రావచ్చు. కానీ, ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి ఈ విధమైన ముందస్తు అంచనాలు సఫలం కావాలని లేదు. కేవలం అంచనాలకే పరిమితం కావాలి. కనుక ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో కొంత డెట్ పెట్టుబడులకు చోటివ్వడం ద్వారా స్థిరమైన.. రిస్క్ లేని రాబడులను, రాబడులపై రాబడులతో కూడిన ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఈక్విటీలు లేదా ఫండ్స్‌లో అయితే... ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్ రూపంలో ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టినట్టయితే అప్పుడు కాంపౌండింగ్ చాలా తక్కువగా ఉంటుంది. కాంపౌండింగ్ రేటు ఎక్కువా లేక తక్కువా అన్నది పెట్టుబడులు పెట్టిన సమయం ఎటువంటిది..? ఎంత కాలం పాటు అందులో పెట్టుబడులను కొనసాగించారన్న అంశాలపై ఆధారపడి ఉంటుంది. గడిచిన 20 ఏళ్ల కాలంలో నిఫ్టీ 50 టీఆర్ఐ (టోటల్ రిటర్న్ ఇండెక్స్) రోలింగ్ రిటర్నులను (నిర్ణీత కాలంలో వార్షిక సగటు రాబడులు) విశ్లేషించినట్టయితే.. ఐదేళ్ల కాలంలో కాంపౌండెడ్‌గా వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 13 శాతం సందర్భాల్లో 7 శాతాన్ని మించి లేదు. కనీసం పదేళ్ల పెట్టుబడుల కాలాన్ని పరిగణనలోకి తీసుకుని చూసినా.. అధిక సీఏజీఆర్‌కు హామీలేని పరిస్థితి. 2007 చివర్లో నిఫ్టీ–50 ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి 2017 వరకు కొనసాగించి ఉంటే వచ్చిన రాబడి.. ఫిక్స్డ్ డిపాజిట్ సీఏజీఆర్ 7 శాతం కంటే తక్కువగానే ఉంది. కానీ, డెట్ పెట్టుబడులు అలా కాదు. కాంపౌండింగ్ విషయంలో ఎంతో స్పష్టత ఉంటుంది. అందుకే చిన్నారుల ఉన్నత విద్య, పిల్లల వివాహాలు, రిటైర్మెంట్ వంటి దీర్ఘకాల లక్ష్యాలకు పెట్టుబడుల ప్రణాళిక వేసుకునే వారు.. డెట్ సాధనాలకూ చోటివ్వడం అర్థవంతంగా ఉంటుంది. డెట్ : డెట్ పెట్టుబడుల్లో కాంపౌండింగ్ స్థిరంగా ఉంటుంది. ఈక్విటీ పెట్టుబడులను తీసుకున్నట్టయితే.. ఒక ఏడాది పెట్టుబడులపై రాబడి రేటు 30 శాతంగా ఉండొచ్చు. మరుసటి ఏడాది 15 శాతం నష్టాన్ని ఇవ్వొచ్చు. తర్వాతి సంవత్సరంలో తిరిగి 20 శాతం ప్రతిఫలం రావచ్చు. ఈ విధమైన క్రమబద్ధం లేని రాబడుల వల్ల పెట్టుబడులపై స్థిరమైన కాంపౌండింగ్‌కు అవకాశం ఉండదు. ఈక్విటీల్లోనూ అద్భుతమైన కాంపౌండింగ్ ప్రయోజనాన్ని అందుకోవచ్చనే ఇన్వెస్టర్లు తప్పకుండా మన చుట్టూ ఉంటారు. నిజమే.. అది ఎప్పుడంటే.. గొప్ప వ్యాపార నమూనాలు, పోటీ సంస్థలు వచ్చినా చెక్కుచెదరని పటిష్టత (ఉదాహరణకు పిడిలైట్, ఏషియన్ పెయింట్స్) తదితర బలాలు, నైపుణ్యాలు కలసిన సంస్థలు కొన్నే ఉంటాయి. అటువంటి కంపెనీలలో దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు, మంచి కాంపౌండింగ్ను ఆశించొచ్చు. వ్యాపారంలో వచ్చిన లాభాలను తిరిగి వ్యాపారంపై ఇన్వెస్ట్ చేస్తూ రాబడులను పెంచుకోవడం ద్వారా అధిక కాంపౌండింగ్ను ఇచ్చే కంపెనీలు ఇలాంటి కొన్నే ఉంటాయి. అటువంటి కంపెనీలను గుర్తించి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రయోజనాలు పొందాలనుకుంటే.. అందుకు గొప్ప నైపుణ్యాలకుతోడు అదృష్టం తోడవ్వాలి. ఎంపికలు: డెట్ సాధనాల్లోనూ అన్నింటిలో కాంపౌండింగ్ స్థిరత్వం ఉంటుందని భావించడం సరికాదు. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసినా.. లేక నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్‌లో ఇన్వెస్ట్ చేసినా కాంపౌండింగ్ను ముందే అంచనా వేయవచ్చు. వీటిల్లో పెట్టుబడులు పెట్టే సమయంలో క్యుములేటివ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. దీనికి బదులు ఇన్కమ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే పెట్టుబడిపై వడ్డీ రాబడి ఎప్పటికప్పుడు క్రమంగా మీ చేతికి అందుతుంది. దీనివల్ల కాంపౌండింగ్ ప్రయోజనం నెరవేరదు. పెట్టుబడి కాలవ్యవధి తీరేంత వరకూ ఈ విధానంలో స్థిరమైన ఆదాయం వస్తుంది అంతే. అందుకే డెట్ సాధనాల్లో కాస్తంత రాబడి తక్కువగా ఉన్నప్పటికీ.. కాంపౌండింగ్ ఆప్షన్ ఉన్న సాధనాలను ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఏడేళ్ల గవర్న్మెంట్ ఆఫ్ ఇండియా ఫ్లోటింగ్ రేటు సేవింగ్స్ బాండ్ 7.15 శాతం రేటును ఆఫర్ చేస్తోంది. ఆకర్షణీయమైన డెట్ ఆప్షన్లలో ఇది కూడా ఒకటి. కాకపోతే ఇందులో ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్‌కు వడ్డీ ఆదాయాన్ని చెల్లించే ఆప్షన్ మాత్రమే ఉంది. మెరుగైన, ప్రభుత్వ హామీతో కూడిన సాధనం కనుక ఇందులో ఇన్వెస్ట్ చేయాలని భావించే వారు.. ఎప్పటికప్పుడు క్రమంగా చేతికి అందే వడ్డీ ఆదాయాన్ని తిరిగి రికరింగ్ డిపాజిట్ సాధనంలోకి మళ్లించడం ద్వారా మరింత మెరుగైన కాంపౌండింగ్ రాబడిని అందుకోవచ్చు. ఇందుకు బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డెబిట్ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. దీర్ఘకాల లక్ష్యాల కోసం డెట్ సాధనాలను పరిగణించే వారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) మెరుగైన ఎంపిక అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో రాబడిపై పన్ను ఉండదు. పదిహేనేళ్ల సాధనం. రాబడి అసలుకు ఏటా కలుస్తూ ఆ మొత్తంపై మరుసటి ఏడాది రాబడి జమ అవుతుంది. దీంతో పదిహేనేళ్ల కాలంలో మెరుగైన నిధిని సమకూర్చుకోవచ్చు. కావాలంటే 15 ఏళ్ల తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. కాంపౌండింగ్ కోసం చూసే వారు డెట్‌లో సార్వభౌమ హామీతో కూడిన సాధనాలు లేదా ఏఏఏ రేటింగ్ ఉన్న సాధనాలనే పరిగణనలోకి తీసుకోవాలి. అంతేకానీ, అధిక రాబడుల కోసం తక్కువ క్రెడిట్ రేటింగ్ సాధనాల జోలికి వెళితే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉంటుంది. ఎన్సీడీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు తదితర సాధనాల్లో క్యుములేటివ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటున్నారంటే.. మీ పెట్టుబడిని నిర్దేశిత కాలం వరకు సంబంధిత సంస్థ వద్దే అట్టి పెట్టుకునేందుకు అనుమతిస్తున్నట్టు గుర్తుంచుకోవాలి. కనుక రాబడి కోసం నాణ్యత లేని డెట్ పేపర్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీ అసలు పెట్టుబడిని ప్రమాదంలో పడేసుకోవద్దు. ఇక రాబడులపై ఎంత పన్ను అన్నది మీ ఆదాయంపైనే ఆధారపడి ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎన్‌సీడీల్లో క్యుములేటివ్ ఆప్షన్ ఎంపిక చేసుకున్నప్పటికీ.. వచ్చే ఆదాయం ఏటేటా మీ వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. దాన్ని ఆదాయపన్ను రిటర్నుల్లో చూపించి మీకు వర్తించే రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. ఏ సాధనంలో ఏ మేరకు..: కాంపౌండింగ్ వడ్డీ కోసం చూస్తున్నవారికి పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు పథకాలు కూడా ఆకర్షణీయమైనవే. భద్రతకుతోడు, మెరుగైన రాబడులను ఇవి ఆఫర్ చేస్తున్నాయి. ఐదేళ్ల టైమ్ డిపాజిట్, నెలవారీ ఆదాయ పథకం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) పథకాలు ఎప్పటికప్పుడు వడ్డీని చెల్లించే ఆప్షన్లతో కూడినవి. వీటిల్లో క్యుములేటివ్కు అవకాశం లేదు. పెద్ద బ్యాంకులు, మంచి రేటింగ్ కలిగిన ఎన్‌బీఎఫ్‌సీల ఫిక్స్డ్ డిపాజిట్లకు క్యుములేటివ్ ఆప్షన్లు ఉన్నప్పటికీ.. పన్ను కోణం నుంచి చూస్తే అవి అంత మెరుగైన ఆప్షన్లు కావు. 3-5 ఏళ్ల కోసం అక్రూయల్ డెట్ ఫండ్స్ (కార్పొరేట్ బాండ్ ఫండ్స్, పీఎస్‌యూ అండ్ బ్యాంకింగ్ ఫండ్స్, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్), ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లు మంచి ఎంపికలు అవుతాయి. 5-7 ఏళ్ల కోసం పోస్టాఫీసు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌ను పరిశీలించొచ్చు. పదేళ్లకు పైన కాలానికి అయితే పీపీఎఫ్ మంచి కాంపౌండింగ్ ఆప్షన్ అవుతుంది. రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకోవాలనుకునే వారికీ పీపీఎఫ్ మంచి సాధనమే. రిటైర్మెంట్ కోసమే అయితే ఎన్‌పీఎస్‌లో డెట్ విభాగం ఎంపిక చేసుకుంటే దీర్ఘకాలంలో అధిక కాంపౌండింగ్ రేటును సొంతం చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో డెట్ విభాగంలో కార్పొరేట్, ప్రభుత్వ బాండ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. క్యుములేటివ్ ఆప్షన్ లేని డెట్ సాధనాలను ఎంపిక చేసుకుంటే మాత్రం.. ఎప్పటికప్పుడు వచ్చే రాబడిని తిరిగి పెట్టుబడులకు మళ్లించడం కచ్చితంగా చేయాలి. లేదంటే ఆశించిన ప్రయోజనం నెరవేరదు. ఎంపిక చేసుకునే సాధనం ఏదైనా కానీయండి.. మీ లక్ష్యాలకు, రిస్క్ సామర్థ్యానికి అనుకూలంగా ఉందా అన్న స్పష్టత ఎంతో ముఖ్యమని మర్చిపోవద్దు. అదే విధంగా డెట్‌కు ఎంత మేరకు కేటాయించుకోవచ్చు.. తదితర అంశాల్లో స్పష్టత లేకపోతే పెట్టుబడుల సలహాదారులు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ల సాయాన్ని తీసుకోవడం మరవద్దు. -
హెచ్‌పీఎస్ స్థలాలను కాపాడండి
పంజగుట్ట: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు సంబంధించిన స్థలాలను కబ్జాల నుంచి ప్రభుత్వం కాపాడాలని హెచ్‌పీఎస్ వైస్ చైర్మన్ గుప్తి నోరియా కోరారు. గురువారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్కూల్‌కు 90 సంవత్సరాల చరిత్ర ఉందని, ఈ స్కూల్లో మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలతో పాటు ఎంతో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు విద్యనభ్యసించారన్నారు. ఇంత చరిత్ర ఉన్న తమ విద్యాసంస్థ స్థలాలను కొందరు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. తమ స్కూల్ సర్వే నంబర్ 147/1లోని 2.26 ఎకరాల భూమిని కొందరు ప్రజాప్రతినిధులు, స్థానికులు కబ్జా చేశారన్నారు. దీంతో తమ స్థలాలపై హక్కులను సూచిస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారని, గత ఏడాది ఆగస్టులో వాటిని తొలగించి కబ్జా చేశారని దీంతో తాము హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చామని తెలిపారు. ఈ ఏడాది హైకోర్టు సెలవులు ఉన్న క్రమంలో ఏకంగా తమ స్థలంలో ప్రహరీ నిర్మించారని, కోర్టు కేసు ఉన్న స్థలంలో ఎలా నిర్మాణాలు చేపడతారని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో హెచ్‌పీఎస్ రిజిస్ట్రార్ కల్నల్ శర్మ, కార్యదర్శి ఫయాజ్‌ఖాన్ పాల్గొన్నారు. -
కల్తీ కల్లు నివారణకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: కల్తీకల్లు కారణంగా ఇటీవల మహారాష్ట్రలో సంభవించిన మరణాల నేపథ్యంలో రాష్ట్రంలో కల్లు విధానాన్ని మరింత పటిష్టంగా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని కొన్ని కల్లు కాంపౌండ్లలో అల్ప్రాజోలం, డైజోఫాం, క్లోరల్ హైడ్రేడ్ వంటి మానసికంగా మత్తుకు బానిసలను చేసే విషతుల్యమైన పదార్థాలను వినియోగిస్తున్నట్లు పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సహజసిద్ధమైన కల్లును మాత్రమే కాంపౌండ్లలో విక్రయించేలా చూసేందుకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రంలో 4,478 కల్లు గీత సహకార సంఘాలు(టీసీఎస్) ఉండగా, 3,762 గీత వృత్తి సంఘాలు(టీఎఫ్టీ) ఉన్నాయని, వీటి నేతృత్వంలో కల్లు దుకాణాలు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయని పేర్కొన్నారు. కల్తీ కల్లు వల్ల అనారోగ్యం పాలు కావడం, దీనికి బానిసలుగా మారి పిచ్చివాళ్లుగా తయారవడం వంటి విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. మహారాష్ట్ర తరహా ఘటనలు రాష్ట్రంలో జరిగితే ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని, అందుకు భిన్నంగా అక్రమ కల్లు అమ్మకాలపై నిషేధం, విషతుల్య పధార్థాలు కల్లులో వినియోగించకుండా చట్టం తేవడం కోసం సర్కారు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, డీజీ(డ్రగ్స్), సహకార సంఘాల రిజిస్ట్రార్, ప్రెస్ అకాడమీ చైర్మన్, అమ్రిత ఫౌండేషన్ సొసైటీ , ఎక్సైజ్ కమిషనర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కమిటీ కల్లు విధానంపై ఇచ్చే నివేదిక , సూచనల ఆధారంగా కల్తీకల్లు నిరోధానికి చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. -
20 నుంచి ఒంగోలులో అంగన్వాడీల రాష్ట్ర సమ్మేళనం
ఒంగోలు టౌన్: ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో ఒంగోలులోని మల్లయ్యలింగం భవనంలో రాష్ట్ర స్థాయి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ వెల్లడించారు. ఒంగోలులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు రోజులపాటు జరగనున్న మహా సమ్మేళనానికి రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 200 మంది ప్రతినిధులు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమ్మేళనంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్టు తెలిపారు. -
మేయర్ భర్త, బంధువు మధ్య ప్రహరీ వివాదం
చిత్తూరులో ఉద్రిక్తత.. స్వల్ప లాఠీచార్జి చిత్తూరు (అర్బన్): చిత్తూరు కార్పొరేషన్ మేయర్ కఠారి అనురాధ భర్త కఠారి మోహన్, ఆయన మేనల్లుడు చింటూకు మధ్య బుధవారం తగాదా నెలకొంది. నగరంలోని ఆర్టీసీ డిపో రోడ్డులో ఉన్న చింటూకు సంబంధించిన స్థలంలో ప్రహరి కూల్చేయడంతో ఈ వివాదం నెలకొంది. తన స్థలంలో ప్రహరీ నిర్మిస్తుంటే కఠారి మోహన్ కూల్చేశాడని చింటూ, అందరికీ సంబంధించిన దారిలో ప్రహరీ నిర్మిస్తున్నారని మేయర్ కుమారుడు ప్రవీణ్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మరోవైపు ప్రహరీని కూల్చేయడంతో ఆగ్రహించిన చింటూ వర్గీయులు మేయర్ పేరుతో వెలసిన బ్యానర్లను చించేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టూటౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్వల్ప లాఠీచార్జ్ చేశారు. చింటూను స్టేషన్‌కు తరలించి సొంత పూచికత్తుపై విడుదల చేశారు. అధికార బలంతో తన కొడుకుపై దౌర్జన్యం చేస్తున్నారంటూ కఠారి మోహన్ అక్క, చింటూ తల్లి సక్కూబాయమ్మ మేయర్ వర్గంపై మండిపడ్డారు. ఇరువర్గాలు టీడీపీకి చెందిన వాళ్లే కావడం, రక్త సంబంధీకులు కావడంతో నగరంలో ఈ విషయం చర్చనీయంశంగా మారింది. -
సమస్యల బడులు!
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలల్లో బాల, బాలికలకు మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ప్రహరీ, ప్రయోగశాలలు, గ్రంథాలయం వంటి సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం ఏటా దశల వారీగా నిధులు మంజూరు చేస్తోంది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క పాఠశాలలోనూ కనీసం 70 శాతం సౌకర్యాలు కూడా అందుబాటులోకి రాకపోవడం శోచనీయం. పేద పిల్లలు చదువుతున్న పాఠశాలలు అంటే అధికారులకు అంత చులకన ఎందుకో అనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో చిన్న సమస్య ఎదురైతే నిలదీసే రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి గురించి ఎక్కడా కూడా నోరు మెదపకపోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల అభివృద్ధి పనుల్లో పలువురు రాజకీయ నాయకులే భాగస్వాములు కావడం కూడా నిర్లక్ష్యానికి కొంతమేర కారణమవుతోందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎంత మేరకు సౌకర్యాలు కల్పించారో తెలుపుతున్నటువంటి పూర్తి సమాచారంతో జూన్ ఏడో తేదీన హాజరు కావాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. జిల్లాలో విద్యావ్యవస్థ జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 3,084, ప్రాథమికోన్నత పాఠశాలలు 444, ఉన్నత పాఠశాలలు 543 ఉన్నాయి. వీటిలో ఏటా ఒకటి నుంచి పదో తరగతి వరకు సుమారు రెండున్నర లక్షల మంది బాల, బాలికలు చదువుకుంటారు. సౌకర్యాలు ఇప్పటి వరకు జిల్లాలోని పాఠశాలలకు 10,910 తరగతి గదులు ఉన్నాయి. 1,176 పాఠశాలల్లో మాత్రమే ఫర్నిచర్ ఉంది. 2,769 మరుగుదొడ్లు బాలురకు, 3,813 మరుగుదొడ్లు బాలికలకు, 960 పాఠశాలల్లో బాలురకు తాగునీరు, 1,132 పాఠశాలల్లో బాలికలకు తాగునీరు, బాలురకు 2,012 మూత్రశాలలు, బాలికలకు 1,875 మూత్రశాలలు నిర్మించారు. ప్రతి 40 మంది విద్యార్థులకు కనీసం ఒక మరుగుదొడ్డి, మూత్రశాల ఉండాలని ఆదేశాలు ఉన్నాయి. ఈ మేరకు ఒక్కో పాఠశాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నిధులు మంజూరవుతున్నాయి. ఈ నిధులతో ఎన్ని చర్యలు తీసుకున్నా కేవలం పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో మాత్రమే కొంత మేరకు సౌకర్యాలు ఉన్నాయి. కానీ మూరుమూల ప్రాంతాల్లోని సగం వరకు పాఠశాలల్లో సౌకర్యాలు లేనేలేవని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిర్వహణ లోపం కొత్తవి నిర్మాణం లేకపోయినా పరవాలేదు. కనీసం నిర్మించిన మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలను ప్రతి రోజు సక్రమంగా విద్యార్థులకు అందుబాటులో ఉంచలేకపోతున్నారు. నిర్వహణ లోపం దాదాపు ప్రతి పాఠశాలలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. బోధనేతర సిబ్బంది ఏ ఒక్క పాఠశాలలోనూ సరిపడా లేకపోవడంతో నిర్వహణ లోపం కచ్చితంగా ఉంటోంది. తాగునీరు పాఠశాల సమయంలో సరఫరా చేయాలంటే పగటి పూట గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండదనేది జగమెరిగిన సత్యం. దీంతో నీటి కోసం వేసిన బోరు పనిచేయదు. ఈ నేపథ్యంలో విద్యార్థులు సమీప ఇళ్లలోకి వెళ్లాల్సిందే. అదేవిధంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉపయోగించాలంటే నీటి వసతి తప్పనిసరి. వీటిని శుభ్రంగా ఉంచాలంటే నీటితో పాటు, స్కావెంజర్లు కావాలి. నీటి వసతి, స్కావెంజర్లు లేకపోవడంతో మరుగుదొడ్లు, మూత్రశాలలు నిరుపయోగంగా మారాయి. పాఠశాల గదులను రోజువారీగా శుభ్రం చేయడానికి చాలా చోట్ల ఆయాలు లేకపోవడంతో పిల్లలతో పనులు చేయిస్తున్నారు. బోధనేతర సిబ్బంది 70 శాతం పాఠశాలల్లో లేకపోవడంతో ఉన్న సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులోకి రాక నిరుపయోగంగా మారాయి. పనిభారం జిల్లాలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగానే ఉం ది. దీనికి తోడు బోధనేతర సిబ్బంది పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ప్రధానోపాధ్యాయు లే అన్నీ తామై చేసుకోవాల్సిన దుస్థితి నెలకొం ది. పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మండల విధ్యాధికారి, ఉప విద్యాధికారి, జిల్లా విద్యాశాఖాధికారి, ఆర్వీఎం, జిల్లా కలెక్టర్, క్లస్టర్ సమావేశాలు అంటూ అధిక సమయం వీటికే పడుతోంది. దీంతో సౌకర్యాల నిర్వహణ బాధ్యతలు కనుమరుగై పోతున్నాయనడానికి ఇది కూడా కారణంగా కనిపిస్తోంది. ఇన్ని కారణాల నేపథ్యంలో విద్యార్థులు మాత్రం సమస్యల మధ్యే చదువులు వెల్లదీస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ పరిస్థితులు మారేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముక్తకంఠంతో కోరుతున్నారు. -
బళ్లారి గ్యారేజీల్లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి,బళ్లారి: బళ్లారిని అనంతపురం రోడ్డులోని ఎంజీ పెట్రోలు బంకు సమీపంలోని గ్యారేజీల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగి దాదాపు రూ.20 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో గ్యారేజీల్లో పెద్ద శబ్ధం రావడంతో ఆ ప్రాంత వాసులు ఉలిక్కిపడ్డారు. శబ్ధం వచ్చిన నిమిషాల్లోనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశం చేసి మంటలను ఆర్పివేశారు. అయితే అంతలోపే భారీ నష్టం సంభవించింది. కార్లు, లారీలు, బస్సులు, ద్విచక్ర వాహనాలకు రిపేరీతో జీవనం సాగించే శ్యాంప్రసాద్, రాజుప్రసాద్, సత్య, మాబు, షాదిక్, భాష తదితరులకు చెందిన గ్యారేజీలు మొత్తం కాలిపోయాయి. కళ్ల ముందే తమకు జీవనోపాధి కల్పించే యంత్రాలు కాలిబూడిదవుతుండటంతో గ్యారేజీ యజమానులు లబోదిబో మంటున్నారు. ఆరుగురికి చెందిన గ్యారేజీల్లో దాదాపు రూ.20లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ గ్యారేజీ కాంపౌండ్‌లో దాదాపు 30 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో ఆయా కుటుంబాల వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది వారిని ఇళ్ల నుంచి బయటకు పంపి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై గాంధీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా సాంస్కృతిక సమ్మేళనం.. బతుకమ్మ
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యూలో... బంగారు బతుకమ్మ ఉయ్యూలో అంటూ జాగృతి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వేడుకలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించాయి. సంస్థ అధ్యక్షురాలు కవితతోపాటు వేలాది మంది మహిళలు బతుకమ్మలతో తరలిరాగా.. హన్మకొండలోని వడ్డేపల్లి చెరువు కట్ట జనసంద్రాన్ని తలపించింది. కాజీపేట, న్యూస్‌లైన్ : బతుకమ్మ పాటలు.. మహిళల కోలాటాలు.. కళాకారుల విన్యాసాలతో వడ్డేపల్లి చెరువు పండుగ కళ సంతరించుకుంది. వేలాదిమందితో జనసంద్రమైంది. ఫాతిమానగర్ వడ్డేపల్లి చెరువు వద్ద సోమవారం నిర్వహించిన బంగారు బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని మహిళలు, కళాకారులతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పాటలో తెలంగాణ సాహిత్యం, ఆటలో తెలంగాణ జానపద నాట్యం, బతుకమ్మ కూర్పులో నేర్పు.. తెలంగాణ మహిళలకే సొంతమన్నారు. కాకతీయుల పౌరుషాన్ని పుణికి పుచ్చుకున్న ఓరుగల్లు మహిళలు తెలంగాణ ఉద్యమం, ఆటపాటల్లోనూ ఆదర్శంగా నిలిచారన్నారు. బతుకమ్మ పండుగలో పర్యావరణం, సామాజిక అంశాలు మిళితమై ఉన్నాయన్నారు. యువత, మహిళ, సంస్కృతి, సాహిత్యం.. తదితర విభాగాల్లో తెలంగాణ జాగృతి కృషి చేస్తోందని తెలిపారు. వేడుకల్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ బంగారు బతుకమ్మ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వేలాదిగా తరలివచ్చిన మహిళలను నియంత్రించేందుకు పోలీసులు చెమటోడ్చాల్సి వచ్చింది. బతుకమ్మ ఆట ముగిసిన అనంతరం కవిత..మహిళలతో కలిసి వెళ్లి బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు. నాగవెల్లి అరుణ తయారుచేసిన తెలంగాణ బతుకమ్మ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాగృతి యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ విజయభాస్కర్, రాష్ట్ర సాంస్కృతిక మహిళ కన్వీనర్ ఎడవెల్లి విజయ, టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, కేయూ విద్యార్థి జాక్ నేత వాసుదేవరెడ్డి, బోడడిన్నా, కొలి పాక రమాదేవి, కృష్ణ, రహీమున్నీసా, ఉపేంద్ర, విజయ పాల్గొన్నారు.