సాక్షి,బళ్లారి: బళ్లారిని అనంతపురం రోడ్డులోని ఎంజీ పెట్రోలు బంకు సమీపంలోని గ్యారేజీల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగి దాదాపు రూ.20 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో గ్యారేజీల్లో పెద్ద శబ్ధం రావడంతో ఆ ప్రాంత వాసులు ఉలిక్కిపడ్డారు.
శబ్ధం వచ్చిన నిమిషాల్లోనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశం చేసి మంటలను ఆర్పివేశారు. అయితే అంతలోపే భారీ నష్టం సంభవించింది. కార్లు, లారీలు, బస్సులు, ద్విచక్ర వాహనాలకు రిపేరీతో జీవనం సాగించే శ్యాంప్రసాద్, రాజుప్రసాద్, సత్య, మాబు, షాదిక్, భాష తదితరులకు చెందిన గ్యారేజీలు మొత్తం కాలిపోయాయి.
కళ్ల ముందే తమకు జీవనోపాధి కల్పించే యంత్రాలు కాలిబూడిదవుతుండటంతో గ్యారేజీ యజమానులు లబోదిబో మంటున్నారు. ఆరుగురికి చెందిన గ్యారేజీల్లో దాదాపు రూ.20లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ గ్యారేజీ కాంపౌండ్‌లో దాదాపు 30 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో ఆయా కుటుంబాల వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది వారిని ఇళ్ల నుంచి బయటకు పంపి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై గాంధీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బళ్లారి గ్యారేజీల్లో భారీ అగ్నిప్రమాదం
Published Fri, Nov 29 2013 5:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
Advertisement
Advertisement