20 నుంచి ఒంగోలులో అంగన్‌వాడీల రాష్ట్ర సమ్మేళనం | anganvadis the compound in ongole from 20th onwards | Sakshi
Sakshi News home page

20 నుంచి ఒంగోలులో అంగన్‌వాడీల రాష్ట్ర సమ్మేళనం

Published Wed, Jun 17 2015 6:35 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM

anganvadis the compound in ongole from 20th onwards

ఒంగోలు టౌన్: ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో ఒంగోలులోని మల్లయ్యలింగం భవనంలో రాష్ట్ర స్థాయి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ వెల్లడించారు. ఒంగోలులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు రోజులపాటు జరగనున్న మహా సమ్మేళనానికి రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 200 మంది ప్రతినిధులు, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమ్మేళనంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement