![Vishwak Sen Reacts On Pruthvi Comments In Pre Release Event](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/viswaksen.jpg.webp?itok=dy-UY6HA)
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా లైలా టీమ్ హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అయితే ఈవెంట్‌లో టాలీవుడ్ నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. దీంతో ఆయన చేసిన కామెంట్స్‌పై లైలా చిత్రబృందం స్పందించింది. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి క్షమాపణలు చెప్పారు. మా ఈవెంట్‌లో జరిగినందువల్లే మేము క్షమాపణలు చెబుతున్నట్లు విశ్వక్ సేన్ వెల్లడించారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన లైలా మూవీ టీమ్ టాలీవుడ్ నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారు.
![పృథ్వీ వ్యాఖ్యలపై సారీ చెప్పిన విశ్వక్ సేన్](https://www.sakshi.com/s3fs-public/inline-images/con_2.jpg)
విశ్వక్ సేన్ మాట్లాడుతూ..'మా ఈవెంట్‌లో జరిగింది. ఆ వ్యక్తి మాట్లాడిన వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. పృథ్వీ మాట్లాడిన విషయం మాకు తెలీదు. ఎందుకంటే నా ఈవెంట్‌లో జరిగినందువల్లే మీ అందరికీ సారీ చెబుతున్నా. అతను నటించాడు సినిమాలో. రెండు రోజుల్లో మా సినిమా జనాల్లోకి వెళ్తోంది. కానీ నా సినిమాను చంపేయకండి. ఏ వ్యక్తితో మాట్లాడి మేము ఈ విషయాన్ని లాగదలుచుకోవడం లేదు. సపోర్ట్ లైలా అంతే. అతను మాట్లాడిన దానికి.. మా సినిమాకు సంబంధం లేదు. సినిమా ఈవెంట్‌లో పాలిటిక్స్, నంబర్స్ గురించి మాట్లాడటం తప్పే. చాలా కష్టపడి సినిమా తీశాం. నేను ఈ వివాదం ఇంతటితో ముగిస్తున్నా. మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దంటూ' అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
![laila](https://www.sakshi.com/s3fs-public/inline-images/laia.jpg)
నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ..' సోషల్ మీడియాలో బాయ్‌కాట్ లైలా ట్రెండ్ అవ్వడం చూసి షాక్‌కు గురయ్యాం. అది మాకు తెలిసి జరగలేదు. సినిమాని అందరూ సినిమాగా చూడండి. గెస్ట్‌లుగా వచ్చిన వాళ్లు ఏమి మాట్లాడతారో మాకు తెలీదు' అని అన్నారు.
పాలిటిక్స్ నంబర్స్ గురించి మాట్లాడటం తప్పే.. దానికి నేను క్షమాపణ చెప్తున్నా 🙏 - Mass Ka Das #VishwakSen#Laila #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/Ug5vuKKySM
— Telugu FilmNagar (@telugufilmnagar) February 10, 2025
Comments
Please login to add a commentAdd a comment