Pruthvi
-
లైలా ఈవెంట్లో పృథ్వీదే వందశాతం తప్పు: బ్రహ్మజీ
టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన లైలా మూవీ ఈవెంట్ వివాదంపై స్పందించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ మాట్లాడిన మాటలు వందశాతం తప్పని బ్రహ్మజీ అన్నారు. ఈ విషయంలో పృథ్వీని టార్గెట్ చేయడం సరైందే అని తన అభిప్రాయం వెల్లడించారు. సినిమా ఈవెంట్‌కు వచ్చి అలా మాట్లాడటం కరెక్ట్ కాదని హితవు పలికారు. బ్రహ్మజీ మాట్లాడుతూ..' లైలా ఈవెంట్లో పృథ్వీది తప్పు. సినిమా ఈవెంట్‌కు వచ్చి అలా మాట్లాడకూడదు. పృథ్వీ మీద రియాక్ట్ అయిన వాళ్లందరూ కరెక్టే. ఎలక్షన్స్ అయిపోయాయి. కొత్తగా నువ్వు ఇప్పుడు వచ్చి అలా మాట్లాడటం చాలా తప్పు. హీరో మంచి వ్యక్తి. ప్రతి చిన్న సినిమా ఫంక్షన్‌కు విశ్వక్ సేన్ వస్తాడు. పరిచయం లేకపోయినా సరే పిలిస్తే వెళ్లి సపోర్ట్ చేస్తాడు. మా బాపు సినిమా ఈవెంట్‌కు వచ్చి గంటన్నర్ర కారులోనే కూర్చున్నాడు. లైలా ప్రమోషన్లో ఉండి కూడా మాకు మద్దతు తెలిపేందుకు వచ్చాడు. అలాంటి వ్యక్తి సినిమాకు వచ్చి నువ్వేదో మాట్లాడటం సరైన పద్ధతి కాదు.' అని అన్నారు.(ఇది చదవండి: క్షమాపణలు చెప్పిన పృథ్వీరాజ్.. ఈ బుద్ధి ముందుండాలి!)ప్రస్తుతం బ్రహ్మాజీ బాపు మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో ఆమని, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే బాపు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీర బ్యానర్లపై రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించారు. -
మీ అందరికీ క్షమాపణలు.. మా సినిమాతో అతనికి సంబంధం లేదు: విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా లైలా టీమ్ హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈవెంట్లో టాలీవుడ్ నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. దీంతో ఆయన చేసిన కామెంట్స్‌పై లైలా చిత్రబృందం స్పందించింది. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి క్షమాపణలు చెప్పారు. మా ఈవెంట్లో జరిగినందువల్లే మేము క్షమాపణలు చెబుతున్నట్లు విశ్వక్ సేన్ వెల్లడించారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన లైలా మూవీ టీమ్ టాలీవుడ్ నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారు.విశ్వక్ సేన్ మాట్లాడుతూ..'మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తి మాట్లాడిన వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. పృథ్వీ మాట్లాడిన విషయం మాకు తెలీదు. ఎందుకంటే నా ఈవెంట్లో జరిగినందువల్లే మీ అందరికీ సారీ చెబుతున్నా. అతను నటించాడు సినిమాలో. రెండు రోజుల్లో మా సినిమా జనాల్లోకి వెళ్తోంది. కానీ నా సినిమాను చంపేయకండి. ఏ వ్యక్తితో మాట్లాడి మేము ఈ విషయాన్ని లాగదలుచుకోవడం లేదు. సపోర్ట్ లైలా అంతే. అతను మాట్లాడిన దానికి.. మా సినిమాకు సంబంధం లేదు. సినిమా ఈవెంట్లో పాలిటిక్స్, నంబర్స్ గురించి మాట్లాడటం తప్పే. చాలా కష్టపడి సినిమా తీశాం. నేను ఈ వివాదం ఇంతటితో ముగిస్తున్నా. మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దంటూ' అభిమానులకు విజ్ఞప్తి చేశారు.నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ..' సోషల్ మీడియాలో బాయ్‌కాట్ లైలా ట్రెండ్ అవ్వడం చూసి షాక్‌కు గురయ్యాం. అది మాకు తెలిసి జరగలేదు. సినిమాని అందరూ సినిమాగా చూడండి. గెస్ట్లుగా వచ్చిన వాళ్లు ఏమి మాట్లాడతారో మాకు తెలీదు' అని అన్నారు.పాలిటిక్స్ నంబర్స్ గురించి మాట్లాడటం తప్పే.. దానికి నేను క్షమాపణ చెప్తున్నా 🙏 - Mass Ka Das #VishwakSen#Laila #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/Ug5vuKKySM— Telugu FilmNagar (@telugufilmnagar) February 10, 2025 -
శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్
తెలుగమ్మాయి హీరోయిన్గా, నిర్మాతగా మారి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం అంటే సాధారణమైన విషయం కాదు. ‘డియర్ ఉమ’ సినిమాతో నిర్మాత, హీరోయిన్గా తెరపైకి రాబోతున్నారు. ఈ చిత్రంలో తెలుగుమ్మాయి సుమయ రెడ్డి, దియా మూవీ ఫేమ్ పృథ్వీ అంబర్ జంటగా నటించారు. ఈ మూవీని సుమయ రెడ్డి నిర్మించగా.. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా సుమయా రెడ్డి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారికి తన మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు ఇటీవలే సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేష స్పందన లభించింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించనున్నారు. -
పెళ్లి బరాత్.. డీజే వాహనం.. అదుపు తప్పి ఒక్కసారిగా..
మహబూబాబాద్: పెళ్లి బరాత్‌లో పాల్గొని వస్తున్న డీజే వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర, ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామ శివారులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం హసన్‌పర్తి మండలం పెంబర్తికి చెందిన కొయ్యడ రాకేష్, జోరుక సందీప్ , కక్కర్ల పృథ్వీ (18), పున్నంచందర్, హసన్పర్తికి చెందిన మేకల జిధ్యాన్.. ఏపీ 36 టీఏ 4854 నంబరు గల టాటా ఏస్ డీజే వాహనంతో శనివారం పరకాలలో జరిగిన ఓ పెళ్లి బరాత్‌లో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం తమ ఇళ్లకు వస్తున్న క్రమంలో కమలాపూర్ మండలం అంబాల గ్రామ శివారులో డీజే వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో వరంగల్ ఎంజీఎం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కక్కెర్ల పృథ్వీ మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుడి తండ్రి రాంబాబు ఫిర్యాదు మేరకు డ్రైవర్ కొయ్యడ రాకేశ్పె కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంజీవ్ తెలిపారు. -
యువతి ఆత్మహత్య!
భద్రాద్రి: గిరిజన యువతి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. సీఐ అశోక్ కథనం ప్రకారం.. ఉంజుపల్లికి చెందిన పాయం భూదేవి భర్త మరణానంతరం చర్లలోని గొల్లగట్టలో నివాసముంటోంది. ఆమె రెండో కుమార్తె పాయం ఆకాంక్ష (21) హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. కాగా, చర్లకు చెందిన దొడ్డా పృథ్వీరాజు, ఆకాంక్ష కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పృథ్వీరాజ్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేందుకు హైదరాబాద్‌కు వెళ్లాడు. తిరిగి రాగానే ఆకాంక్ష, పృథ్వీరాజు కలిసి చర్లలో ఇంటిని అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. కాగా, పాయం భూదేవి నెల రోజుల కిందట వారి వద్దకు వెళ్లి ఆకాంక్షను ఇంటికి రావాలని కోరినా ఆమె నిరాకరించింది. శనివారం సాయంత్రం పృథ్వీరాజు ఇంట్లో లేని సమయంలో ఆకాంక్ష కలుపుమందు తాగింది. దీంతో పృథ్వీరాజుతో పాటు అతడి తల్లిదండ్రులు ఆమెను భద్రాచలంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహిస్తుండగా మృతి చెందింది. అయితే, చికిత్స పొందుతున్న సమయంలో తన కుమార్తెతో తాను మాట్లాడానని, భర్త, అత్తమామలు వేధిస్తున్నారని, అందువల్లే కలుపుమందు తాగానని చెప్పినట్లు తల్లి భూదేవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీఐ అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆకాంక్ష మృతదేహానికి పృథ్వీరాజు కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించారు. -
ఇటీవల యాక్షన్ షూట్లో దెబ్బతిన్న హీరోస్ వీళ్లే..
స్క్రీన్‌పై విలన్లను హీరో రఫ్ఫాడిస్తుంటే ఫ్యాన్స్‌కి కిక్కో కిక్కు.. కానీ ఆ యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు స్టార్స్‌కి తగిలే గాయాలు ఒక్కోసారి ఆపరేషన్‌కి దారితీస్తాయి. ఇక ఇటీవల యాక్షన్ షూట్లో పరేషాన్ అయిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. టైగర్‌కి గాయం ఐదు కేజీల డంబెల్‌ని అమాంతంగా ఎత్తగలిగే సల్మాన్ ఖాన్‌కి ఇటీవల ఐదు కేజీల కన్నా తక్కువ బరువు ఉన్న వస్తువులు ఎత్తడం కష్టమైంది. దానికి కారణం ‘టైగర్ 3’ సినిమా. ఈ చిత్రం కోసం నెలన్నర క్రితం ఓ రిస్కీ యాక్షన్ సీన్ చేస్తుండగా సల్మాన్ గాయపడ్డారు. ‘‘ప్రపంచాన్నే మన భుజం మీద మోస్తున్న ఫీలింగ్‌లో ఉన్నప్పుడు.. ఆ ప్రపంచాన్ని వదలండి.. ఇప్పుడు కనీసం ఐదు కిలోల డంబెల్ ఎత్తడం కూడా కష్టమవుతోంది’’ అని భుజానికి అయిన గాయం తాలూకు నొప్పిని తగ్గించే పట్టీ వేయించుకుని ఉన్న ఫొటోను షేర్ చేశారు సల్మాన్. అంతే.. ‘టైగర్ (సల్మాన్‌ని ఉద్దేశించి)కి ఏమీ కాదు... తగ్గిపోతుంది’ అంటూ ఫ్యాన్స్ స్పందించారు. కింగ్ ఖాన్.. నోస్ సర్జరీ షారుక్ ఖాన్ని ఆయన ఫ్యాన్స్ కింగ్ ఖాన్ అని పిలుచుకుంటారు. ఈ కింగ్ ఖాన్ ఫ్యాన్స్‌కి కిక్ ఇవ్వడానికి రిస్కీ ఫైట్స్ చేస్తుంటారు. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఓ చిత్రం కోసం యాక్షన్ సీన్ చేస్తూ, గాయపడ్డారు షారుక్. ముక్కుకి బలమైన గాయం కావడంతో సర్జరీ జరిగిందనే వార్త మంగళవారం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో శస్త్ర చికిత్స జరిగిన అనంతరం షారుక్ ముంబై చేరుకున్నారట. ‘‘రక్త స్రావం ఆగడానికి ముక్కుకి చిన్నపాటి శస్త్ర చికిత్స చేశాం. కంగారుపడాల్సిన అవసరంలేదు’’ అని షారుక్ వ్యక్తిగత సిబ్బందికి డాక్టర్లు తెలియజేశారని బాలీవుడ్ టాక్. విక్రమ్.. రిస్కీ పోరాటమ్ విలక్షణ పాత్రలకు చిరునామా విక్రమ్. తాజాగా విక్రమ్ ఓ కొత్త లుక్‌లో నటిస్తున్న చిత్రం ‘తంగలాన్’. ఈ చిత్రం కోసం రిస్కీ ఫైట్ షూట్లో పాల్గొనే ముందు విక్రమ్ రిహార్సల్స్ చేశారు. అప్పుడు జరిగిన ప్రమాదంలో ఆయన పక్కటెముక విరిగింది. వెంటనే విక్రమ్‌ను ఆస్పత్రికి తరలించారు. రెండు నెలల క్రితం ఈ ప్రమాదం జరిగింది. కోలుకున్నాక ఆయన తిరిగి షూట్లో పాల్గొనడంతో సినిమా పూర్తయింది. పృథ్వీ.. మూడు నెలల విశ్రాంతి మలయాళ పరిశ్రమలో ఓ స్టార్ హీరోగా, దర్శకుడిగా దూసుకెళుతున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విలయత్ బుద్ధ’. పది రోజుల క్రితం ఈ సినిమా కోసం ఒక యాక్షన్ సీన్‌ని ఆర్టీసీ బస్సులో చిత్రీకరిస్తున్నప్పుడు పృ«థ్వీరాజ్ కింద పడటంతో దెబ్బ తగిలింది. బలమైన గాయం కావడంతో కాలికి సర్జరీ చేయాలని వైద్యులు పేర్కొన్నారు. శస్త్ర చికిత్స అనంతరం దాదాపు మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని పృథ్వీరాజ్‌కి సూచించారు. వరుణ్.. మూడు వారాల విశ్రాంతి వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది కానిస్టేబుల్’. ఈ చిత్రం కోసం ఇటీవల ఓ ఫైట్ సీన్ తీస్తున్న సమయంలో గాయపడ్డారు వరుణ్ సందేశ్. ఈ ప్రమాదంలో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయం అయింది. దీంతో ఆయన్ని హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స అనంతరం మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలంటూ వరుణ్‌కి సూచించారు వైద్యులు. వరుణ్ సందేశ్ గాయపడటంతో ‘ది కానిస్టేబుల్’ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది. -
అమ్మ ‘భ్రమమ్’ని ఎలా ముగిస్తావు?: కీర్తీ సురేశ్
టాలీవుడ్, కోలీవుడ్‌ల్లో టాప్ హీరోయిన్లలో ఒకరు కీర్తీ సురేశ్. ఈ భామ రెండు ఇండస్ట్రీల్లో టాప్ స్టార్స్‌తో నటిస్తూ బీజీగా మారిపోయింది. తెలుగులో ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ తన తల్లి మేనకా సురేశ్ గురించి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కీర్తిసురేశ్ తల్లి మేనకా సైతం ఒకప్పటి హీరోయినే. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ సినీయర్ నటి 2005 నుంచి వరుసగా మూవీస్‌లో నటిస్తోంది. కాగా ఆమె తాజాగా చేయనున్న మలయాళీ సినిమా ‘భ్రమమ్’. ఈ సినిమాకి సంబంధించిన తల్లి పోస్టర్ని ప్రైమ్ వీడియోలో చూస్తున్న తన పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దానికి.. ‘అమ్మ భ్రమమ్‌ని ఎలా ముగిస్తావు?’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా ‘నేను చూస్తున్నది నిజమేనా..?’ అని అడుగుతూ మాలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్‌ని ట్యాగ్ చేసింది. కాగా ‘భ్రమమ్’ బాలీవుడ్ మూవీ ‘అంధాధున్’కి రీమేక్‌గా వస్తోంది. ఇందులో పృథ్విరాజ్, రాశిఖన్నా జంటగా నటిస్తున్నారు. అక్టోబర్ 7న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. సోషల్ మీడియా పోస్ట్‌తో ఈ సినిమాలో మేనకా ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు కీర్తీ హింట్ ఇచ్చినట్లు ఉందని ఫీల్మీ దునియాలో చర్చించుకుంటున్నారు. కాగా ఈ బాలీవుడ్ మూవీనే ఇటీవల హీరో నితిన్ ‘మ్యాస్ట్రో’గా తెలుగులో రీమేక్ చేసి, ఓటీటీలో విడుదల చేశాడు. చదవండి: కమెడియన్‌కి జోడీగా కీర్తీ సురేష్..? -
అనుచిత వ్యాఖ్యలు: హీరో పృథ్వీకి భారీ మద్దతు
తిరువనంతపురం: లక్షదీవుల వ్యవహారంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ కుమారన్కి భారీ మద్దతు లభిస్తోంది. కొత్త రెగ్యులేషన్స్‌ని ఉపసంహరించుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ పృథ్వీ ఒక పోస్ట్ చేయగా.. జనం టీవీ పృథ్వీపై అనుచిత వ్యాఖ్యలతో పాటు అపవాదులు వేసింది. ఈ వ్యవహరాన్ని సెలబ్రిటీలు, రాజకీయా నాయకులు తప్పుబడుతున్నారు. పృథ్వీ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని పేర్కొంటు మద్దతు ప్రకటిస్తున్నారు. కాగా, లక్షదీవుల(లక్షద్వీప్) కొత్త అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ కొత్త రెగ్యులేషన్స్‌ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే దీనికి వ్యతిరేకంగా #SaveLakshadweep క్యాంపెయిన్ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఈ క్యాంపెయిన్‌కు మద్దతుగా పృథ్వీరాజ్ కుమారన్‌తో పాటు గీతూ మోహన్‌దాస్ పోస్టులు చేశారు. పృథ్వీరాజ్ తనకు లక్షదీవులతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. అభివృద్ధి పేరుతో స్థానికుల్ని ఇబ్బంది పెట్టడం సరికాదని తన ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేశాడు. అయితే దీనిని తప్పుబడుతూ రైట్ వింగ్‌కు చెందిన జనం టీవీ చీఫ్ ఎడిటర్ జీకే సురేష్ బాబు పృథ్వీరాజ్‌ను విమర్శిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంఘ వ్యతిరేక శక్తులతో కలిసి పృథ్వీ మొరుగుతున్నాడని, పృథ్వీతో పాటు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేసినా సరికాదంటూ పోస్ట్ చేశారు. అయితే దీనిపై దుమారం రేగడంతో ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది జనం టీవీ. నేతలు.. నటులు మరోవైపు బీజేపీ ఐటీ సెల్ గత రెండు రోజులుగా పృథ్వీపై అనుచిత పోస్టులతో విరుచుకుపడుతోంది. దీంతో కొందరు రాజకీయ నాయకులు పృథ్వీకి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల ఈ వివాదంలో సంఘ్ పరివార్ తీరును తప్పుబట్టాడు. లోక్‌సభ ఎంపీ ప్రతాపన్, ఎమ్మెల్యే సురేంద్రన్, పీవీ అన్వేలాంటి వాళ్లు పృథ్వీకి బాసటగా నిలుస్తున్నారు. ఇక నటుల్లో అజు వర్గీస్, అనూప్ మీనన్, సుబిష్ సుధీ, డైరెక్టర్ జూడ్ ఆంటోనీ పృథ్వీకి మద్దతుగా ట్వీట్లు చేశారు. -
డైలాగ్స్‌ని రింగ్ టోన్స్గా పెట్టుకోవచ్చు
‘‘రథేరా’ టీజర్ చాలా బాగుంది. ఆమిర్ ఖాన్ ‘దంగల్’ చిత్రం తరహాలో ‘రథేరా’ చిత్రం ఉండబోతోంది. ఈ సినిమాలోని డైలాగ్స్‌ను రింగ్ టోన్స్గా పెట్టుకునేంత క్యాచీగా ఉన్నాయి. లోకల్ టాలెంట్‌తో అందరూ కొత్తవారు చేసిన ఈ సినిమా హిట్ అయ్యి అందరికీ మంచి పేరు రావాలి’’ అని నటుడు పృథ్వీ అన్నారు. పూల సిద్ధేశ్వర్ రావ్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘రథేరా’. జాకట రమేష్ దర్శకత్వంలో పూల సిద్ధేశ్వర్ రావ్, నరేష్ యాదవ్, వై.ఎస్.కృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌కు నటుడు పృథ్వీ ప్రసంశలు అందించారు. ‘‘ఖోఖో నేపథ్యంలో వస్తోన్న మా సినిమా కొత్తగా ఉంటుంది’’ అన్నారు పూల సిద్ధేశ్వర్. ‘‘మా చిత్రాన్ని చూసిన కొందరు సినీ ప్రముఖులు బాగుందన్నారు.. సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి కూడా అదే మాట వస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు జాకట రమేష్. -
నీతోనే...
‘‘శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ అయిన తర్వాత నేను హాజరైన మొదటి ఆడియో ఫంక్షన్ ‘నీతోనే హాయ్ హాయ్’. ఇందులోని ఐదు పాటలు బావున్నాయి’’ అన్నారు నటుడు పృథ్వీ. అరుణ్ తేజ్, చరిష్మా శ్రీకర్ జంటగా బియన్ రెడ్డి అభినయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీతోనే హాయ్ హాయ్’. డా. యలమంచిలి ప్రవీణ్ సమర్పణలో డా. యలమంచిలి ప్రవీణ్, డా. ఏయస్ కీర్తి, డా. జి.పార్థసారధి రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. ఈ చిత్రం పాటలను పృథ్వీ ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ చూస్తుంటే దర్శకుడి ప్రతిభ ఏంటో తెలుస్తోంది. ముగ్గురు నిర్మాతలు మంచి అభిరుచితో ఈ చిత్రాన్ని నిర్మించారు. హీరో, హీరోయిన్ మంచి నటన కనబరిచారు. ‘నీతోనే హాయ్ హాయ్’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నన్ను, నా కథని నమ్మి, నిర్మాతలు రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు. ఇటీవల సెన్సార్ పూర్తయింది’’ అన్నారు బియన్ రెడ్డి అభినయ. ‘‘వైవిధ్యమైన కథాంశంతో వస్తోన్న మా సినిమాని ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు డా. ఏయస్ కీర్తి, డా. పార్థసారధి రెడ్డి. ‘‘ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు డా. యలమంచిలి ప్రవీణ్. ‘‘ఈ సినిమాతో హీరోగా మంచి బ్రేక్ వస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు అరుణ్ తేజ్. -
పోసానితో నాకెలాంటి విభేదాలు లేవు...
సాక్షి, హైదరాబాద్ : సినీనటుడు పోసాని కృష్ణమురళికి మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలను ఎస్వీబీసీ చానల్ చైర్మన్, సినీ నటుడు పృథ్వీరాజ్ ఖండించారు. ఆయన ఆదివారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ మధ్య మనస్పర్థలు ఏర్పడినట్లు వచ్చిన వార్తల్లో స్తవం లేదని, ఆయన తన సోదరుడి లాంటివారని పృధ్వీ పేర్కొన్నారు. స్వీబీసీ చానల్లో ఐడీ కార్డు వేసుకుని తాను కూడా ఓ ఉద్యోగిగా కొనసాగుతానని తెలిపారు. చానల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేసేందుకు కృషి చేస్తానని, ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి ఎస్వీబీసీ భక్తి చానల్ చైర్మన్‌గా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. చానల్ చైర్మన్‌గా కీర్తి ప్రతిష్టలు పెంచుతానన్నారు. భక్తి చానల్లో గతంలో జరిగిన అక్రమాలపై మాట్లాడుతూ.. ఎవరిపైనా ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలనే ఉద్దేశం తమ ముఖ్యమంత్రికి గానీ, తనకు గానీ లేవన్నారు. ప్రస్తుతం రోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు నెలలో 20 రోజులు అక్కడే ఉంటున్నానని చెప్పారు. ఎవరైనా గతంలో అక్రమాలు చేశారని రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. -
ప్రశ్నించడమంటే ఇదేనా..!
సాక్షి, ఉండి : గత ఎన్నికల ముందు చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పు చేస్తే ప్రశ్నిస్తానని చెప్పారని, ప్రశ్నించడమంటే ఇదేనా అని సినీనటుడు, వైఎస్సార్ సీపీ నేత పృథ్విరాజ్ ఎద్దేవా చేశారు. ఐదేళ్లూ అధికారంలో ఉండి రాష్ట్రాన్ని దోచుకుతిన్న చంద్రబాబును పల్లెత్తుమాట అనకుండా ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పవన్ కల్యాణ్ నిత్యం నిందలేస్తున్నారని, ఇదేనా ప్రశ్నంచడమంటే అని ఆయన నిలదీశారు. ఆదివారం ఉండిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నర్సింహరాజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో పృథ్విరాజ్ సినీనటుడు జోగినాయుడు తదితరులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఉండి సెంటర్లో జరిగిన సభలో పృథ్విరాజ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఏకమై వచ్చిన దొంగలు ఇప్పుడు మళ్లీ కొత్త అవతారంలో అధికారం కోసం వస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు సీనియర్ కనుక ఆయనే రాష్ట్రాన్ని బాగా పాలిస్తాడని ఆయనను మద్దతు తెలిపానని పవన్ కల్యాణ్ చెప్పారని, చంద్రబాబు తప్పు చేసిన ప్రతిసారి ప్రశ్నిస్తానని చెప్పి ఓట్లు అడిగారని గుర్తు చేశారు. ఐదేళ్లుగా జరిగిన అవినీతిపై పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని పృథ్విరాజ్ నిలదీశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు తొత్తుగా మారిన జనసేన పార్టీ వైఎస్సార్ సీపీ ఓట్లు చీల్చేందుకు పన్నాగం పన్నిందని విమర్శించారు. చంద్రబాబును గానీ, పవన్‌కల్యాణ్‌ను గానీ ఎవరు నమ్మి ఓట్లు వేసినా వారిని నట్టేట ముంచేయడం ఖాయమన్నారు. మాట చెప్పినా, సహాయం చేస్తామని ముందుకొచ్చినా చెప్పిన మాట కోసం ప్రాణాలిచ్చే వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన జగనన్నే ఈ రాష్ట్రానికి దశదిశనిర్ధేశమని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజల కోసం తాపత్రయపడే నాయకుడు అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి నర్సింహరాజు, నరసాపురం ఎంపీ అభ్యర్థి కనుమూరి రఘరామకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు మాట్లాడుతూ చంద్రబాబు లాంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ప్రజల దురదృష్టమన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా జగన్ ప్రకటించిన పార్టీ మ్యానిఫెస్టోకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని కులాల సంక్షేమానికి పెద్దపీట వేసింది ఒక్క జగన్ మాత్రమే అని చెప్పారు. గెలుపే తమకు ముఖ్యమని ఎవరు ఏమైపోయినా ఫరవాలేదని టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారన్నారు. చంద్రబాబు దుర్మార్గ అవినీతి పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు యర్రా నవీన్, పాతపాటి వాసు, పాతపాటి వర్మ, మండల పార్టీ అధ్యక్షుడు గులిపల్లి అచ్చారావు, రాష్ట్ర నాయకులు కరిమెరక చంద్రరావు, జి.సుందర్‌కుమార్, జిల్లా నాయకుడు యేడిద వెంకటేశ్వరరావు, అల్లూరి వెంకట్రాజు, చిక్కాల జగదీష్, దాకి మూర్తి, బడుగు బాలాజీ అంగర రాంబాబు, శేషాద్రి శ్రీను, రాయి సతీష్, మునుకోలు సింహాచలం, గలావిల్లి ధనుంజయ, రణస్తుల మహంకాళి, కొర్రపాటి అనిత, కమతం బెనర్జీ, నిమ్మల కేశవకుమార్(బాబు), రుద్దర్రాజు గాంధీరాజు, అల్లూరి రామరాజు(ఉప్మారాజు), ఇందుకూరి శ్రీహరిరాజు, చిన్నోడు, కెఎన్‌ఎన్ రాజు, పి.సత్యనారాయణరాజు, కరిమెరక మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు. -
పుట్టినిల్లు.. మెట్టినిల్లు..
సెలబ్రిటీలు ఎంత బిజీగా ఉన్నా సంక్రాంతి పండగకు మాత్రం సకుటుంబ సపరివార సమేతంగా సంబరాల్లో మునిగిపోవాల్సిందే. పతంగుల ఎగరవేత, పిండివంటల రుచులతో ఆనందంగా గడపాల్సిందే. కుటుంబ సభ్యులతో పండగ చేసుకోవాల్సిందే. సంక్రాంతి సంబరాలపై తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురిని ‘సాక్షి’ పలకరించగా.. వారు పండగ చేసుకునే విధానాన్ని ఇలా వివరించారు. వైజాగ్‌లో అనాథల మధ్య.. షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నాను. ఇక్కడ ఉండటం సంక్రాంతి పండగ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తు చేసుకుంటున్నాను. వైజాగ్‌లో ‘ప్రేమ సమాజం’ అనే అనాథాశ్రమం ఉంది. జాతిపిత మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేసిన సందర్భంగా దీనిని సందర్శించారు. అప్పటి నుంచి మన తెలుగు సినీ తారలు చాలా మంది ఇక్కడకు వస్తూ అనాథలతో ఆనందాలను పంచుకునేవారు. ఇప్పుడు నేను కూడా సంక్రాంతి సందర్భంగా ఇక్కడ ఉన్న 70 మంది అనాథ పిల్లలు, మరో 150 మంది వృద్ధుల మధ్య భోగీ జరుపుకొన్నాను. ఈ సంక్రాంతి నాకు ఎన్నో ఆనందాలను ఇచ్చింది. – అలీ, హాస్యనటుడు కావలిలో కార్యకర్తలతో.. ప్రతి సంక్రాంతికి నేను ఊరిలోనే ఉంటాను. ఈసారి కూడా కావలిలో ఉన్నాను. పార్టీ కార్యకర్తలతో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. చల్లని చలిలో భోగి మంటలు కాచుకుంటూ ఆనందాలను పంచుకున్నాం. సంప్రదాయంగా వస్తున్న కోడిపందేలు అంటే నాకు చాలా ఇష్టం. కానీ.. నేను అయ్యప్ప మాలలో ఉండటం వల్ల ఈసారి అవి ఆడలేకపోతున్నాను. కోడిపందేలు మినహాయించి సంక్రాంతి సంబురాలన్నీ అంబరాన్ని అంటేలా చేసుకుంటున్నాం. – పృథ్వీ, సినీనటుడు ఫ్రెండ్స్‌తో కలిసి పతంగులు ఎగరవేస్తూ.. మాది కృష్ణా జిల్లాలోని పామర్రు. ఈసారి సంక్రాంతికి అందరం ఇక్కడే ఉన్నాం. పల్లెటూరి సంక్రాంతి వాతావరణాన్ని చాలా మిస్ అవుతున్నాను. అదే సమయంలో స్నేహితులతో కలిసి అమీర్‌పేటలో పెద్ద బిల్డింగ్‌పై పతంగులు ఎగరవేస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నా. నా చిన్నప్పటి ఫ్రెండ్స్, బంధువులు అందరూ వచ్చి నాతో పాటు పతంగులు ఎగరేస్తారు. ఈసారి పండగను పతంగులతో సరిపెట్టుకుంటున్నాం. – శ్రీరామ్ ఆదిత్య, డైరెక్టర్ పుట్టినిల్లు.. మెట్టినిల్లు.. అమ్మ, అత్త, మామల మధ్య ఈ సంక్రాంతిని జరుపుకొంటున్నాను. భర్త, పిల్లలతో కలిసి బిల్డింగ్‌పై పతంగులు ఎగరవేస్తున్నాను. రెండు రోజులు అత్తగారి ఇంట్లో సంక్రాంతి జరుపుకొన్నాను. అదేవిధంగా ఫ్రెండ్స్, బంధువులు కూడా రావడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆనందాన్నిస్తోంది. మంగళవారం అమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి నోములు తీసుకుంటాం. ఈ సంక్రాంతికి ఇదే స్పెషల్. – అనసూయ, నటి చెన్నైలో సంక్రాంతి సందడి ఎక్కడ ఉన్నా సరే సంక్రాంతి సమయంలో చెన్నై వెళ్తా. అక్కడ బాగా చేస్తారు. మట్టి కుండల్లో పొంగల్ వండుతుండగా పాలు పొంగే సమయంలో అమ్మాయిలు అందరం ‘పొంగలో.. పొంగలో’ అంటూ డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తాం. ఇంటికి వచ్చిన బంధువులకు మేం చేసిన స్వీట్స్ రూచి చూపించడం, చెరకు గడలతో నోటిని తీపి చేసుకోవడం వంటివి చేస్తూ సంక్రాంతి పండగను ఆస్వాదిస్తాం. – సమీర భరద్వాజ్, సింగర్ కుటుంబ సభ్యులతో.. ప్రతి సంక్రాంతికి మా ఇంట్లో మూడు పండగలు. సంక్రాంతి, భోగీతో పాటు అమ్మ, నాన్నల పుట్టినరోజు కూడా. సో.. భోగి రోజు అమ్మ పుట్టినరోజు, సంక్రాంతి రోజు నాన్న పుట్టినరోజును సంతోషంగా కుటుంబం అంతా జరుపుకొంటాం. సాయంత్రం సమయంలో బిల్డింగ్ టెర్రస్‌పైకి వెళ్లి పతంగులను చూస్తుంటాం. బంధువులు తెచ్చిన స్వీట్స్ మేం తీసుకుని, మా స్వీట్స్ బంధువులకు ఇస్తుంటాం. – రమ్య బెహరా, సింగర్ స్నేహితుల మధ్య.. సంక్రాంతి పండగ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి ఏడాది గ్రామానికి వెళ్తుంటా. కానీ.. ఈసారి వెళ్లలేకపోయా. పల్లెల్లోని వాతావరణాన్ని ఇక్కడ సెట్ చేస్తున్నా. ఫ్రెండ్స్‌తో కలిసి ట్రెడిషనల్ దుస్తుల్లో ప్రత్యేక పూజలు చేసి, కొద్దిసేపు కైట్స్ ఎగరవేస్తా. సాయంత్రానికి బంధువులను ఇంటికి పిలిచి వారితో సంక్రాంతి సంబురాలను జరుపుకొంటాను. – ప్రిన్స్, సినీ హీరో నానమ్మతో కలిసి.. ప్రతి సంక్రాంతికి వైజాగ్ వెళ్తుంటా. కానీ.. ఈసారి నా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న కారణంగా ఇక్కడే ఉండిపోయాను. నాకు తోడుగా నానమ్మ ఇక్కడకు వచ్చింది. ఆమెతో కలిసి సంక్రాంతి పండగ చేసుకుంటున్నాను. మంగళవారం నానమ్మతో కలిసి కైట్స్ ఎగరవేస్తా. చిన్ననాటి ఫ్రెండ్స్, బంధువులందర్నీ ఇంటికి పిలిచి పండగను జరుపుకొంటాను. – సందీప్ కిషన్, సినీ హీరో సంక్రాంతి పండగ ఎంతో ఇష్టం.. బంజారాహిల్స్: సంక్రాంతి పండగ రోజున వీధుల్లో రంగవల్లులను దాటుకుంటూ హరిదాసులు వచ్చే దృశ్యాలంటే నాకెంతో ఇష్టం. గతంలో ప్రతి సంక్రాంతి పండగకు విశాఖపట్నం వెళ్లడం బాగా ఇష్టంగా ఉండేది. ఐతే ఇప్పుడు మా కుటుంబం హైదరాబాద్‌లోనే ఉంటుండటంతో పండగలకు వెళ్లడం లేదు. పండగ రోజున గారెలు తినడమంటే బాగా ఇష్టం. చిన్నప్పుడు పతంగులు ఎగరేసేవాణ్ని. సంక్రాంతి, దీపావళి అంటే మహా ఇష్టం. – కౌషల్, బిగ్‌బాస్– 2 విజేత -
మంచి చేసే మాస్టర్
‘‘నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా ‘బ్లఫ్ మాస్టర్’. మా సంస్థ ఈ సినిమాని సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది రీమేక్ చిత్రమే అయినప్పటికీ, చాలా మార్పులు చేసి, గోపి బాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరినీ ఆయన ఏరికోరి ఎంపిక చేసుకున్నారు’’ అని శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. సత్యదేవ్, నందితా శ్వేత, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ, పృథ్వి, సిజ్జు, చైతన్యకృష్ణ, ‘టెంపర్’ వంశీ, ‘దిల్’ రమేశ్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో రమేష్.పి.పిళ్లై నిర్మించారు. శ్రీదేవి మూవీస్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘బ్లఫ్ మాస్టర్’ కథకు సత్యదేవ్ పక్కాగా న్యాయం చేశారు. సినిమా విజయం పట్ల మేం చాలా నమ్మకంగా ఉన్నాం. డిసెంబర్ ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మన సినిమా ద్వారా సమాజానికి ఎంతో కొంత మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. సమాజంలో బ్లఫ్ మాస్టర్లు చాలా ఎక్కువయ్యారు. మా సినిమా చూశాక సమాజంలో మార్పు వస్తుందని అనుకుంటున్నాను’’ అని గోపీ గణేష్ పట్టాభి అన్నారు. ‘‘ఈ సినిమాకి ఎమోషనల్‌గా చాలా కనెక్ట్ అయ్యాను. నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం ఈ చిత్రంతో లభించింది’’ అన్నారు సత్యదేవ్. సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్, సినిమాటోగ్రాఫర్ దాశరది శివేంద్ర పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ: హెచ్. వినోద్, అడిషనల్ డైలాగ్స్: పులగం చిన్నారాయణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.కృష్ణకుమార్ (కిట్టు). ∙ -
ముక్కోణపు ప్రేమకథ
క్రాంతి, పృథ్వీ హీరోలుగా, అవంతిక హీరోయిన్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎటువైపో నీ పరుగు’. మద్దినేని రమేష్ బాబు దర్శకత్వంలో సాయిశాన్వి క్రియేషన్స్ పతాకంపై వి.అలేఖ్య, పి.రాంబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై తీసిన తొలి సన్నివేశానికి నిర్మాత దామోదరప్రసాద్, డైరెక్టర్ శ్రీవాస్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు క్లాప్ ఇచ్చారు. మరో దర్శకుడు వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. మద్దినేని రమేష్ బాబు మాట్లాడుతూ– ‘‘ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి మధ్య సాగే ముక్కోణపు ప్రేమకథా థ్రిల్లర్ చిత్రమిది. హైదరాబాద్, వైజాగ్‌లలో షూటింగ్ జరుపుతాం. డిసెంబర్‌కి చిత్రీకరణ పూర్తిచేసి, ఫిబ్రవరిలో సినిమా విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ‘‘మంచి కథాబలం ఉన్న ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు పృ«థ్వీ, క్రాంతి. అవంతిక, చదలవాడ శ్రీనివాసరావు, పోకూరి బాబూరావు, కల్యాణ్‌కృష్ణ, టి.ప్రసన్నకుమార్, సంగీత దర్శకుడు వి.కిరణ్ కుమార్, మాటల రచయితలలో ఒకరైన శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ మన్నం. -
చిరంజీవిగారి లుక్ కనిపిస్తోంది
‘‘యువతకు కనెక్ట్ అయ్యే చిత్రం ‘సకల కళా వల్లభుడు’. తనిష్క్ మంచి నటుడే కాదు.. అతనిలో చాలా కళలు ఉన్నాయి. ఈ సినిమా చూస్తే ఆ విషయం ప్రేక్షకులకు తెలుస్తుంది. అతని లుక్ చూస్తే ‘స్టేట్‌రౌడీ’ సినిమాలో చిరంజీవిగారి లుక్లా అనిపిస్తోంది. ఈ చిత్రంలో నేను బాబా పాత్రలో ప్రేక్షకులను నవ్విస్తాను’’ అని నటుడు పృథ్వీ అన్నారు. తనిష్క్‌రెడ్డి, మేఘనా గుప్తా జంటగా శివగణేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సకల కళా వల్లభుడు’. దీపాల ఆర్ట్స్ సమర్పణలో అనిల్, త్రినాథ్, కిషోర్, శ్రీకాంత్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను పృథ్వీ విడుదల చేశారు. నిర్మాతలు అనిల్, శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘శివ గణేష్ మాకు మంచి మిత్రుడు. మమ్మల్ని భరించి సినిమాని పూర్తి చేశాడు. ఈ సినిమా విడుదల అనంతరం ‘బుర్రకథ’ అనే చిత్రంతో రానున్నాం. మా సింహ ఫిలిమ్స్ పతాకంపై ఏడాదికి రెండు సినిమాలు వస్తాయి’’ అన్నారు. ‘‘యాక్షన్ కామెడీ జానర్లో తెరకెక్కిన చిత్రమిది. పృథ్వీగారి కామెడీ ఈ చిత్రానికి హైలైట్. తనిష్క్ రెడ్డి మంచి నటన కనబర్చారు. ఈ నెలాఖరులో లేదా నవంబర్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అని శివగణేష్ అన్నారు. ‘‘ఔట్ అండ్ ఔట్ కామెడీ యాక్షన్ మూవీ ఇది. ఇందులో చిరంజీవిగారి పోస్టర్స్, పవన్ కల్యాణ్‌గారి హెయిర్ స్టయిల్, అల్లు అర్జున్‌గారి సాంగ్ ఉంటుంది’’ అన్నారు తనిష్క్ రెడ్డి. జీవా, పృథ్వీ, సుమన్, చిన్నా, శృతి, అపూర్వ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సాయి చరణ్, సంగీతం: అజయ్ పట్నాయక్. -
పెళ్లి చేసుకోకుండా సన్యాసి అయ్యా
‘పెళ్లి చేసుకోకుండా సన్యాసి అయ్యాను.. ఈ కేసును వాదించి సన్నాసి అయ్యాను’ అంటూ పృథ్వీ డైలాగ్‌తో ‘మై డియర్ మార్తాండం’ టీజర్ ప్రారంభమవుతుంది. ‘థర్టీ ఇయర్స్ ఇక్కడ..’ అంటూ తనదైన కామెడీ మేనరిజమ్, టైమింగ్‌తో ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్న పృథ్వీ టైటిల్ పాత్రలో రూపొందిన చిత్రం ‘మై డియర్ మార్తాండం’. రాకేందు మౌళి, కల్యాణ్ విఠపు, కల్పిక గణేశ్ కీలక పాత్రల్లో నటించారు. హరీష్ కె.వి. దర్శకత్వంలో సయ్యద్ నిజాముద్దీన్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ– ‘‘హరీశ్ పక్కా స్క్రిప్ట్‌తో సినిమాను సెట్స్‌కి తీసుకెళ్లారు. ఒక్క డైలాగ్ కూడా మార్పు చేయకుండా 18 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. లాయర్ పాత్రలో నటించాను. అమాయకుడిగా ఉండే తెలివైన వాడి పాత్ర నాది. మంచి పాత్ర చేయడమే కాదు.. మంచి పారితోషికం కూడా అందుకున్నా (నవ్వుతూ). వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిగారు మా సినిమా టీజర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘మాది కోర్టు రూమ్ క్రైమ్ కామెడీ. అనుకున్న సమయంలో షూటింగ్ పూర్తి చేశామంటే అందరి సహకారమే కారణం. ఇందుకు యూనిట్ అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు హరీశ్ కె.వి. కల్పిక, రాకేందు మౌళి, కల్యాణ్ విఠపు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పవన్, కెమెరా: ర్యాండీ. -
మార్తాండం ఇక్కడ
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ...అంటూ తనదైన టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్విస్తోన్న పృథ్వీ హీరోగా రూపొందిన చిత్రం ‘మైడియర్ మార్తాండం’. హరీష్ కె.వి దర్శకత్వంలో మేజిన్ మూవీ మేకర్స్ పతాకంపై సయ్యద్ నిజాముద్దీన్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. నిర్మాత సయ్యద్ మాట్లాడుతూ– ‘‘హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ టైటిల్ పాత్రలో నటించారు. ముఫ్పై రోజుల్లో లాయర్ అవ్వడం ఎలా? అనే డిఫెన్స్ లాయర్ పాత్రలో పృథ్వీగారి నటన సినిమాకే హైలైట్. క్రైమ్ కామెడీగా కోర్ట్ రూమ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. త్వరలోనే టీజర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. మరి.. మార్తాండం ఇక్కడ అంటూ ఈ సినిమాలో సిల్వర్ స్క్రీన్‌పై పృథ్వీ ఎలా రెచ్చిపోతారో చూడాలి. జయ ప్రకాశ్‌రెడ్డి, కృష్ణ భగవాన్, రాకేందు మౌళి, గోకుల్ తదితరులు నటించిన ఈ సినిమాకు పవన్ సంగీతం అందించారు. -
పెళ్లాలు ఉన్న ఇంట్లో దెయ్యాలా?
... ఉండనే ఉండవని తన భార్యతో చెబుతున్నారు పోసాని కృష్ణమురళి. ‘మేకప్ లేని ఆడదాన్ని, బిల్డప్ లేని మగాణ్ని ఈ సొసైటీ గుర్తించదు రాజా’ అంటూ పోసాని డైలాగ్‌తో ప్రారంభమయ్యే ‘దేశముదుర్స్’ ట్రైలర్ నవ్వులు పంచుతోంది. పోసాని కృష్ణ మురళి, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘దేశ ముదుర్స్’. ‘ఇద్దరూ 420 గాళ్ళే’ అన్నది ఉప శీర్షిక. కన్మణి దర్శకత్వంలో పులిగుండ్ల సతీష్ కుమార్, వద్దినేని మాల్యాద్రి నాయుడు సమర్పణలో కుమార్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ‘ఏవండీ ఆ గదిలో దెయ్యం ఉందండీ’ అని భార్య రజిత భయపడుతుంటే.. ‘పెళ్లాలు ఉన్న ఇంట్లో దెయ్యాలు ఉండవే’ అంటున్నారు పోసాని. ‘రామ రామ.. మాది చాలా సాంప్రదాయమైన ఫ్యామిలీ అమ్మా’ అని రజిత చెబుతుంటే .. ‘మాదేమైనా సన్నీ లియోన్ ఫ్యామిలీయా’ అంటూ సెటైర్ వేస్తున్నారు పృథ్వీ. ‘‘ఈ నవ్వుల కహానీని చూడాలంటే ఈ నెల 22వరకూ ఓపిక పట్టాలి’’ అంటున్నారు దర్శక–నిర్మాతలు కన్మణి, కుమార్. పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ– ‘‘భవిష్యత్‌లో రామానాయుడుగారిలా మహీందర్ కూడా పెద్ద నిర్మాత అవుతారు’’ అన్నారు. ‘‘దేశముదుర్స్’తో కన్మణి ఏంటో నిరూపించుకుంటారు’’ అన్నారు పృథ్వీ. సంగీత దర్శకుడు యాజమాన్య, డైలాగ్ రైటర్ భవాని ప్రసాద్ పాల్గొన్నారు. -
చదరంగంలో అంతర్జాతీయ ప్రతిభ
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): సెలవుల్లో నాన్నతో ఆడిన చెస్ అతనిలో ఆసక్తిని పెంచింది. అక్క జషితారెడ్డి యోగా క్రీడాకారిణిగా అంతర్జాతీయ స్థాయిలో రాణించడం స్ఫూర్తి నిచ్చింది. చెస్ క్రీడలో ఆనతికాలంలోనే వాకాటి పృథ్వీకుమార్రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అందరినీ అబ్బురపరిచింది. నెల్లూరు నగరంలోని కొండాయపాళెం ప్రాంతంలోని వనంతోపుకి చెందిన వెంకటశేషారెడ్డి, శిరీష దంపతులిద్దరికి మొదటి నుంచే క్రీడలపట్ల అభిమానం. చదువుతో పాటు పిల్లలు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించేవారు. పృథ్వీకుమార్ ఐదో తరగతి చదువుతున్నప్పటి నుంచే చెస్ పట్ల మక్కువ పెంచుకున్నాడు. మొట్ట మొదటి సారిగా 2009లో జిల్లా స్థాయి అండర్–10 చెస్ పోటీల్లో ప్రథమస్థానం సాధించాడు. అప్పటి నుంచే జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పాల్గొన్న ప్రతి మ్యాచ్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచేవాడు. జాతీయస్థాయి పోటీల్లో రాణించి రెండు సార్లు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం తన ప్రతిభకు నిదర్శనం. అంతర్జాతీయ చదరంగంలో రాణించాలంటే ఎంతో వ్యయ, ప్రయాసాలతో కూడిన విషయం. పోటీలో పాల్గొనేందుకు అంతర్జాతీయ శిక్షణకు అయ్యే ఖర్చు సామాన్య కుటుంబం భరించడం అసాధ్యం. దాతలు ముందుకు వచ్చి తనకు సాయం చేస్తే అంతర్జాతీయస్థాయిలో రాణించి దేశానికి మరెన్నో పతకాలు సాధిస్తానని పృథ్వీకుమార్ కోరుతున్నాడు. పృథ్వీ విజయాల్లో కొన్ని ♦ 2012లో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్–14లో మూడోస్థానం ♦ 2014లో రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్ –17లో మొదటి స్థానం ♦ 2014లో జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్‌లో అండర్–17లో మూడోస్థానం ♦ 2015లో అండర్–17లో స్టేట్ ఛాంపియన్ షిప్లో మూడోస్థానం ♦ 2016లో యూఎస్ఎ మిలియనీర్ చెస్ టోర్నమెంట్లో భారతదేశానికి బంగారు పతకాన్ని సాధించాడు. ♦ ఇటీవల నేపాల్‌లో జరిగిన అంతర్జాతీయ చెస్ సీడెడ్ పోటీల్లో పాల్గొన్నారు. ఇలా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తున్న పృథ్వీకి జిల్లా కలెక్టర్ 2013లో, 2016లో ప్రశంసా పత్రాలు అందచేశారు. ప్రోత్సాహం ఉంటేఅంతర్జాతీయ స్థాయిలో రాణించగలడు పృథ్వీలో ఎంతో ప్రతిభ ఉంది. అంతర్జాతీయ స్థాయిలోరాణించాలంటే ఎక్కువ పోటీల్లో పాల్గొనాల్సి ఉంది. యూరప్, ఇంగ్లాండ్, అమెరికా వంటి దేశాల పోటీల్లో పాల్గొంటేనే అంతర్జాతీయ వేదికపై నిలదొక్కుకోగలడు. అందుకు శిక్షణ, ఎంట్రీ ఫీజులు, ప్రయాణ ఖర్చులు అధిక వ్యయంతో కూడినవి.– సుమన్, చెస్ అసోసియేషన్రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గ్రాండ్ మాస్టర్ అవుతా గ్రాండ్ మాస్టర్ అవడమే లక్ష్యం. చిన్నప్పటి నుంచే చెస్ అంటే ప్రాణం. కోచ్ సుమన్, రియాజ్‌లు శిక్షణ ఇచ్చి నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం చెన్నై ఎస్ఆర్ఎం కళాశాలలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నా. వాకాటి.పృథ్వీకుమార్,అంతర్జాతీయ చెస్ క్రీడాకారుడు -
మున్నా వాళ్ల అమ్మ
పిల్లలకు రెక్కలొస్తాయి. ఎగిరిపోతారు. ‘బడిపంతులు’ సినిమాలో... ‘రెక్కలు అలసి మేమున్నాము...’ అని తల్లితండ్రులు వాపోతారు. మున్నా అలా కాదు. రెక్కలొచ్చాయని అమ్మానాన్ననూ,వాళ్ల ఆశయాన్నీ వదిలిపోలేదు. రెక్కలు ఉన్నాయి కాబట్టే... అడవిలోకి ఎగిరిపోయాడు. చిన్నప్పుడు మున్నా తల్లితో అనేవాడు... ‘‘అమ్మా... వర్షం వస్తోంది. పిట్టలకు ఇళ్ళుండవు కదా.. మనింట్లోకి రమ్మనమ్మా...’’ అనేవాడు! రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో మున్నాను పెంచింది తల్లి. ఇప్పుడు తనే.. కొడుకును పోగొట్టుకొని... భర్త జాడ కనుమరుగై రెక్కలు తెగిన పక్షి అయింది. కన్నీటి వర్షంలో తడుస్తోంది. బిడ్డల్ని త్యాగం చేసిన విప్లవ మాతలను చూశాం. అసలు బిడ్డలే వద్దనుకున్న త ల్లితండ్రులనూ విప్లవంలో చూశాం. కానీ ప్రజాయుద్ధంతో మరణాన్ని జయించడమెలాగో నేర్పిన తండ్రి ఆర్కేనే అంటారు కొడుకు మున్నా (పృథ్వి) చేయిపట్టుకొని ఉద్యమానికి పరిచయం చేసిన కన్నతల్లి శిరీష అలియాస్ పద్మక్క. మావోయుస్టు అగ్రనేత అక్కి రాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) భార్యగా, చెట్టంత కొడుకుని తాజా ‘ఎన్కౌంటర్’లో పోగొట్టుకున్న తల్లిగా ఆమె దుఃఖాన్నీ, జ్ఞాపకాలనూ ‘సాక్షి ఫ్యామిలీ’తో పంచుకున్నారు. ‘దూరంగానే ఉన్నా మా మనసులెంతో దగ్గరగా ఉన్నాయనుకున్నా. కానీ రాజ్యం మా కుటుంబాల్ని చెదరగొట్టింది. నా కొడుకుని పొట్టనబెట్టుకుంది. నా భర్తని మాయం చేసింది. అయినా ఈ యుద్ధం ఆగదు’ అని తేల్చి చెప్పిన పద్మక్కతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. మీ భర్త, మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే ఏమయ్యాడంటారు? నా భర్త యుద్ధరంగంలోనే ఉంటే నాకు ఏదోలా కబురుపంపేవాడు. ఆర్కేని కచ్చితంగా పోలీసులే మాయం చేశారు. కోవర్టులతో కుమ్మక్కయ్యారు కనుకనే ఆర్కేనీ, నా కొడుకునీ పట్టుకోగలిగారు. లేకపోతే వాళ్ళంత ఈజీగా దొరకరని నా నమ్మకం. ఆర్కేను వెంటనే కోర్టులో హాజరుపర్చాలి. చంపివేస్తే కనీసం డెడ్బాడీనైనా బయటపెట్టాలి. ఈ కుట్రలతో ఎంతోకాలం ప్రజల్ని మోసం చేయలేరు. ప్రజలందరూ మోసగాళ్ళు కాదు. కోవర్టులుగా కొందరే మారతారు. హైకోర్టు ఆదేశాలతో ఏం జరుగుతుందని భావిస్తున్నారు? నా భర్త ఆచూకీ కోసం కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాం. నక్సలెటైై్లనా, మరెవ్వరైనా పౌరుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. తేలాల్సింది పోలీసుల అసలు స్వరూపమే. కోర్టు గురువారానికి (నవంబర్ 3కి) వాయిదా పడింది. ఈ లోపు వాళ్ళేం చేసినా చెయ్యొచ్చు. చంపేసినా చంపే యచ్చు. అయినా ఒక ఆర్కేని మట్టుపెడితే ఇంకెందరో ఆర్కేలు పుట్టుకొస్తారు. ఆర్కేని మట్టుపెట్టి యుద్ధాన్ని ఆపగలమని భావించడం వారి వెర్రితనమే. తల్లిగా మీ దుఃఖానికి కారణం? ఖచ్చితంగా రాజ్యమే. రాజ్యహింసని అత్యంత దగ్గరగా అనుభవించిన నా కొడుకు ఉద్యమమే విముక్తి మార్గమనుకున్నాడు. నా భర్త అయినా, నా కొడుకైనా, ఇంకా ఎందరో ఉద్యమకారులైనా ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించారు. నిస్వార్థంగా బతికారు. ఇప్పుడు జనం నా కొడుకు మున్నా కోసం ఏడుస్తుంటే ఇంకొంత కాలం వాడు ప్రజలకోసం పనిచేస్తే బాగుండనిపిస్తోంది. మున్నాతో జ్ఞాపకాలను మాతో పంచుకుంటారా? నా బిడ్డ మున్నా మనసు వెన్న. వర్షంలో తడుస్తున్నాయని పక్షులను సైతం ఇంట్లోకి పిలవమన్నాడు. వాటికి ఇళ్ళు లేవా, మనకంటే నాన్న లేడు. కానీ వాటికి ఇల్లు కూడా లేదే అంటూ దిగులు పడేవాడు. బడి నుంచి ఇంటికొచ్చే సరికి ఏ కోడిపిల్లకి ఏమైందోనని ఆదుర్దాపడేవాడు. బడినుంచి వాడి నడక నేరుగా ఇంట్లోకి కాదు, పక్షుల దగ్గరికీ, నోరులేని జీవాల దగ్గరికే. వాటికేదన్నా అయి చనిపోతే విలవిల్లాడేవాడు. బడికి వెళ్ళేప్పుడు మాత్రం నా బుగ్గ మీద ముద్దు మర్చిపోయేవాడు కాదు. ఎప్పుడైనా తొందరలో మర్చిపోయినా వెనక్కి తిరిగొచ్చి వాడి ముద్దుతో నా కన్నీళ్ళు తుడిచేవాడు. (ఆగని కన్నీటిని తుడిచే కొడుకు కోసం ఇంకా ఎదురుచూస్తున్నట్టుంది పద్మక్క ముఖం) మున్నా బాల్యం, చదువు ఎలా గడిచాయి? అత్యంత నిర్బంధంలో. నాన్న ఆచూకీ చెప్పమనో, నా భర్త వచ్చాడనో, లేక నా పైన నిఘా వేస్తే నా భర్త దొరుకుతాడనో పోలీసుల దాడులు, నిర్బంధం మమ్మల్ని నిత్యం భయభ్రాంతులకు గురిచేశాయి. ఈ రోజేమీ జరగదని ఊపిరి పీల్చుకున్న సందర్భాలు మా జీవితాల్లో అరుదు. అందుకే ఒంగోలులోనే రహస్యంగా వాడిని చదివించాం. నాకేమో వాడిని బాగా చదివించాలని ఉండేది. వాడికి ఇతర విషయాలపైనే వాడి దృష్టంతా. అదేంటో నాకు అర్థం కాలేదు. ఉన్నత చదువులంటే వాడి అర్థం వేరు. వాళ్ళ నాన్నని గురించి ఎప్పుడైనా అడి గేవాడా? ఓ రోజు హఠాత్తుగా అడిగాడు - అమ్మా నాన్న మనల్ని ఎందుకు వదిలివెళ్ళాడని. నాన్నకి మనమంటే ఇష్టమేరా కన్నా, జనం కోసమే మనల్ని వదిలి వెళ్ళాడని చెప్పాను. ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న గురించే ప్రశ్నించేవాడు. నా ఆగని దుఃఖానికి కారణమేంటో వాడికి అర్థం అయ్యేది కాదు. కానీ కొంత వయసొచ్చాక, ‘రాని నాన్న కోసం ఎందుకమ్మా ఏడుస్తావు’ అన్నాడు. నాపై, నా తోబుట్టువులపై ప్రభుత్వ నిర్బంధాన్ని చూసి నిర్ఘాంతపోయేవాడు. మున్నా నక్సల్ మార్గాన్నెంచుకోవడానికి కారణం? వాడు మంచి చదువులు చదువుకోవాలని నా కోరిక. వాళ్ళనాన్న చెపితేనైనా చదువుపై శ్రద్ధపెడతాడనిఅనుకున్నాను. అందుకే ఆర్కే కాంటాక్ట్ కోసం అడవికి వెళ్ళాను. ఆయనకోసం వెళ్ళినప్పుడల్లా కాంటాక్ట్ దొరకక ఒకోసారి రెండు మూడు నెలలు మేం కూడా గిరిజనులతోపాటే అడవిలోనే గడపాల్సి వచ్చేది. మున్నా అక్కడి ప్రజల్లో ఇట్టే కలిసిపోయేవాడు. చాలా పుస్తకాలు కూడా చదివేవాడు. అక్కడి తన లాంటి పిల్లల్ని చూశాడు. వాళ్ళ తిండి తిన్నాడు. వాళ్ళ కష్టాల్ని పంచుకోవడమూ అలవాటైంది. రాజ్య హింస వాడిని చదువుకంటే అడవినే ప్రేమించేలా చేసింది. ఎప్పటికి కలవగలిగారు వాళ్ల నాన్నని? ఒక్కోసారి ఐదారు నెలలకు కూడా కాంటాక్టు దొరికేది కాదు. అంతకాలం అక్కడే ఉండేవాళ్లం. చివరకు నా బిడ్డని నా భర్త దగ్గరికి తీసుకెళ్ళా. ఆర్కే, వాడితో చదువు గురించి మాట్లాడాలన్నది నా కోరిక. ఆర్కే వాడికి చదువు నేర్పాడు. కానీ నేననుకున్న చదువుకాదది. కొద్ది రోజులు అక్కడే ఉంటానన్నాడు మున్నా. ఆ కొద్ది రోజులూ చాలా రోజులని నాకర్థం కాలేదప్పుడు. ఆ తరువాత నేను నా అక్కయ్యల దగ్గరే ఉన్నాను. జి. కల్యాణరావు గారు (రచయిత, ‘విరసం’ నేత) మా అక్క అమృత భర్త. ఉద్యమం ఎప్పుడూ అండగా నిలిచింది. మమ్మల్ని కాపాడుకోవడానికి మా కుటుంబమంతా నిర్బంధాన్ని అనుభవించింది. మున్నా గురించి ఆర్కే ఏమని చెప్పేవారు? మున్నాని ఉద్యమంలోనికి ఆహ్వనించిందే వాళ్ళ నాన్న. తన కొడుకు అందరిలా ఏ డాక్టరో, ఇంజనీరో కావాలని వాళ్ళ నాన్న కోరుకోలేదు. నేను కూడా. తన కొడుకుని తనలా ప్రపంచ ప్రజలను ప్రేమించడం నేర్పాలని ఆర్కే కల. అదే విషయాన్ని ఉత్తరాల్లోనూ రాసేవాడు. వాడిని ఓ ఉద్యోగస్థుడిలా కాకుండా, ఉద్యమకారుడిగా చూడాలని భావించేవారు. తన కొడుకే కాదు. విప్లవకారులందరి పిల్లలూ ఉద్యమాల్లోనే ఉండాలని ఉత్తరాల్లో రాసేవాడు. ‘నీ కిద్దరు పిల్లలు కదా, ఒకరినైనా ఉద్యమానికివ్వకూడదూ’ అని చాలా మంది సానుభూతిపరుల్ని కోరేవారు. మున్నా అటు వెళతాడని గ్రహించారా? వాళ్ళ నాన్న అనుసరించిన మార్గాన్ని మున్నా ఎంచుకుంటాడని నేనూ అనుకోలేదు. వాళ్ళ నాన్న త్యాగం వాడికి అర్థమైతే నా కన్నీటిని వాడు అర్థం చేసుకుంటాడనుకున్నా. నా దృష్టిలో మున్నా చిన్నపిల్లాడే, కానీ వాడేంటో కొద్దికొద్దిగా అర్థం అయ్యేసరికే వాడు నాకందనంత ఎదిగిపోయాడు. ఎంతగా అంటే మావోయిస్ట్ సైన్యానికే యుద్ధతంత్రాలు నేర్పేంతగా. మున్నా మళ్ళీ ఎప్పుడైనా మీ దగ్గరికి తిరిగి వచ్చాడా? ఇక మళ్ళీ రాలేదు. నేనే వాణ్ణి తీసుకొద్దామని వెళ్ళాను. అప్పటికి ఏడాదిన్నర అయ్యింది. వాడి కోసమే 2010లో ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు (ఏఓబి)కి వెళ్ళా. అప్పుడే గంటి ప్రసాదంతో పాటు అరెస్టయ్యా. ఐ.ఎ.ఎస్. అధికారి వినీల్ కృష్ణ నిర్బంధమప్పుడు నిజానికి మావోయిస్టుల డిమాండ్ ఆదివాసీలను విడుదల చేయాలన్నదే. కానీ, పోలీసులు మమ్మల్ని విడుదల చేశారు. అందుకు నిరసనగానే గంటి ప్రసాదం మూడు రోజులు విడుదల కాలేదు. ఆ తరువాత మీ జీవనాధారం? నక్సలై ట్లు, అలా ఉద్యమంలో పనిచేసి బయటకు వచ్చినవారు ఆస్తులు సంపాదించుకుంటారనీ, అడవిలోకి వెళ్ళొచ్చి డబ్బులు వెనకేసుకుంటారనీ రాజ్యం దుష్ర్పచారం చేస్తూ ఉంటుంది. కానీ నా జీవితమే వారికి సమాధానం. ఒంటిపైన ఒకటి, దండెం పైన రెండూ - మొత్తం మూడు చీరలే నాకుండేవి. కటిక దారిద్య్రం అనుభవించా. ఓ వైపు పోలీసుల బెదిరింపుల నుంచి కాపాడుకుంటూనే బతుకుతెరువు చూసుకోవాలి. నేను చేయని పని లేదు. బట్టలు కుడుతూ బతికాను. కూలికెళ్ళి కడుపునింపుకున్నా. ఒంగోలు పొగాకు బేర్నీలో రోజు కూలీకి కూడా పనిచేశా. చివరకు హైదరాబాద్‌లో ఐదువేల రూపాయలకు టీచర్‌గా చేరా. పోలీసు నిర్బంధం నుంచి తప్పించుకోవడానికి ప్రతిసారీ మారాల్సి వచ్చేది. ఒంగోలుకొచ్చి ఓ బళ్ళో చేరాను. మావోయిస్ట్ఆర్కే అసలు మీకెలా పరిచయమయ్యారు? కారంచేడులో దళితుల ఊచకోతతో వేదనకు గురయ్యా. స్త్రీలపై వేధింపులు ఆందోళనకు గురి చేశాయి. కారంచేడు దారుణంపై జరిగిన ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్నా. అప్పుడే మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. అది పెళ్ళికి దారి తీసింది. నా కొడుకు ఎంత సున్నితమనస్కుడో నా భర్త ఆర్కే కూడా అంత అతి సున్నిత మనస్కుడు. అందుకే, అన్యాయంపై ఆయుధం ఎక్కుపెట్టాడు. మున్నాకి పృథ్వి అని పేరెందుకు పెట్టారు? పృథ్వి అంటే భూమి. ఆ భూమి కోసమే వారి పోరాటం. భూమి లేని వారి కోసమే వారి ఆరాటం. ఎవరి భూమినైతే కబళించాలనుకున్నారో, ఆ భూమిపైనే వాళ్లిద్దరూ నిలబడాలనుకున్నారు. ఆ భూమిపై ఉన్న ప్రేమతోనే వాడికి ఆ పేరు పెట్టాం. ఆ భూమిని నమ్ముకున్న వాళ్ళకోసమే ఈ అమ్మనొదిలి, ఎందరో అమ్మల కోసం తండ్రీకొడుకులిద్దరూ తరలిపోయారు. అదే విషయాన్ని వాళ్ళ నాన్న నాకు నచ్చజెబుతూ ఉండేవాడు. ఆర్కే మిమ్మల్ని కూడా ఉద్యమంలోకి ఆహ్వానించారా? అవును. నేనెప్పుడూ తనలాగే ఉద్యమాన్ని అంటిపెట్టుకుని ఉండాలని ఆర్కే అనుకునేవాడు. చాలాసార్లు రమ్మన్నాడు. నా అవసరం జనతన్ సర్కార్‌కి ఉందని చెప్పేవాడు. నేనేం చేయగలనని ప్రశ్నిస్తే, ఇక్కడి ఆదివాసీ పిల్లలకి చదువు నేర్పమన్నాడు. చివరకు నేను లోపలున్నప్పుడు సాయుధ దళాలకు బట్టలు కుట్టడం కూడా వారికి చాలా ఉపయోగపడుతుందన్నారు. నేనదే చేశాను. వెళ్ళిపోయాక మున్నా ఎప్పుడైనా తన కబురంపాడా? మున్నా నాకు ఉత్తరం రాశాడు. ‘ఎందరో తల్లులను ప్రేమించే నాకు నీ మీద ప్రేమ ఉండదా అమ్మా?’ అని అందులో ప్రశ్నించాడు. రాసిన ఉత్తరాన్ని నేను దొంగతనంగా దాచుకుని, దాచుకుని చదివేదాన్ని. కానీ ఇప్పుడు నిర్భయంగా, బహిరంగంగా, స్వేచ్ఛగా చదువుకుంటాను. మీరేదైనా చెప్పాలనుకుంటున్నారా? కోవర్టులతో కొన్నాళ్ళు ఉద్యమాన్ని దెబ్బతీయొచ్చు. కానీ ఎల్లకాలం అది సాధ్యం కాదు. ఈ ఆటుపోట్లు తాత్కాలికమే. వాళ్ళను నిజమైన యుద్ధం చేయమనండి. నా కొడుకు మరణించినా, అతనే నిజమైన హీరో. మావోయుస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, ఆంధ్రా ఒరిస్సా బార్డర్ (ఏ.ఒ.బి) కమిటీ ఇన్ఛార్జ్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కేది మావోయిస్ట్ పార్టీ నాయకత్వంలో కీలకస్థానం. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం గుత్తికొండ బిలం దగ్గర్లోని తుంబిరి కోటకి చెందిన ఆర్కే 4 దశాబ్దాలుగా మావోయిస్ట్ ఉద్యమానికి వెన్నెముక. 1985 జూలైలో ప్రకాశం జిల్లా కారంచేడు దళితుల ఊచకోతకు నిరసనగా ఎగిసిపడ్డ ఉద్యమం ఆర్కేనీ, ప్రకాశం జిల్లాకి చెందిన పద్మక్కనీ కలిపింది. దాదాపు మూడు దశాబ్దాల వైవాహిక జీవితంలో ఆర్కే అడవిబిడ్డల విముక్తికే తన జీవితాన్ని అర్పిస్తే, పద్మక్క అతని కుమారుడిని ఉద్యమ నెలబాలుణ్ణి చేశారు. ఇటీవలి బలిమెల ‘ఎన్కౌంటర్’తో జాడ తెలీని ఆర్కే కోసం వెతుకుతున్నారు. - అత్తలూరి అరుణ, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి -
స్టార్డమ్ గురించి రజనీ ఏమన్నారంటే...
-
స్పెషల్ షో : 'పేరడీ123' పార్ట్2
-
ఇదీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కథ!