సాక్షి, హైదరాబాద్ : సినీనటుడు పోసాని కృష్ణమురళికి మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలను ఎస్వీబీసీ చానల్ చైర్మన్, సినీ నటుడు పృథ్వీరాజ్ ఖండించారు. ఆయన ఆదివారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ మధ్య మనస్పర్థలు ఏర్పడినట్లు వచ్చిన వార్తల్లో స్తవం లేదని, ఆయన తన సోదరుడి లాంటివారని పృధ్వీ పేర్కొన్నారు. స్వీబీసీ చానల్‌లో ఐడీ కార్డు వేసుకుని తాను కూడా ఓ ఉద్యోగిగా కొనసాగుతానని తెలిపారు. చానల్‌లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేసేందుకు కృషి చేస్తానని, ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి ఎస్వీబీసీ భక్తి చానల్ చైర్మన్‌గా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
చానల్ చైర్మన్‌గా కీర్తి ప్రతిష్టలు పెంచుతానన్నారు. భక్తి చానల్‌లో గతంలో జరిగిన అక్రమాలపై మాట్లాడుతూ.. ఎవరిపైనా ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలనే ఉద్దేశం తమ ముఖ్యమంత్రికి గానీ, తనకు గానీ లేవన్నారు. ప్రస్తుతం రోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు నెలలో 20 రోజులు అక్కడే ఉంటున్నానని చెప్పారు. ఎవరైనా గతంలో అక్రమాలు చేశారని రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment