svbc channel
-
తెలుగు భక్తి చానెల్స్‌లో నంబర్. 1 ఎస్వీబీసీ
సాక్షి, తిరుపతి: కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా మీడియా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్తే... శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ( ఎస్వీబీసీ) మాత్రం ఆర్ధిక పరంగా లాభాలను గణిస్తూ విస్తృతమైన రేటింగ్‌తో దూసుకుపోతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైభవం, హిందూ ధర్మ ప్రచారం కోసం 2008లో నాటి ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి టీటీడీ భక్తి ఛానల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో జూలై 7, 2008 వ తేదీన అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఎస్వీబీసీని ప్రారంభించారు. సరిగ్గా 13సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎస్వీబీసీ ఇప్పుడు కరోనా విపత్తును ఒక అవకాశంగా మలుచుకుని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అనూహ్యంగా చానల్ ఆర్థిక పరిపుష్టి వైపు అడుగులు వేస్తోంది. (చదవండి: ఇదీ ఆ ఊరు కథ.. నెల్లి అంటే ఉసిరిక, నెల్లు అంటే వడ్లు!) కరోనా సమయంలో తిరుమల సహా టీటీడీకి చెందిన అన్ని ఆలయాల్లోనూ భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే కరోనా నియంత్రణకు వైద్య రంగం లౌకిక సేవలు అందిస్తే, టీటీడీ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కరోనా నియంత్రణ కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ అనేక కార్యక్రమాలు ప్రారంభించింది. వీటినే ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజల్లోకి తీసుకు వెళితే ఎలా ఉంటుందని ఆలోచించింది. ఈ మేరకు టీటీడీ అధికారులు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేశారు. ఈ క్రమంలోనే ఎస్వీబీసీ ఏకధాటిగా 17 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారం చేసిన కార్యక్రమం సుందరకాండ సంపూర్ణ అఖండ పారాయణ దీక్షకు వీక్షకులు, భక్తుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. యూట్యూబ్ లో లైవ్‌లో 10 వేలకు పైగా వ్యూస్ లైక్‌లు రావడంతో భగవద్గీత, విరాట పర్వం, కార్తీక మాస విశిష్టత తదితర కార్యక్రమాలను కూడా ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీంతో లక్షల్లో వ్యూస్ రావడంతో తెలుగు ఆధ్యాత్మిక భక్తి చానళ్లలో ఎస్వీబీసీ అగ్రస్థాన్థంలో కొనసాగుతుంది. ఆయా కార్యక్రమాలు చూసిన అనేకమంది భక్తులు ఛానల్‌కు విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. చానల్‌ను ఆర్థికంగా మంచి లాభల్లో దూసుకుపోవాలనే ఆలోచనతో టీటీడీ ఇందుకోసం ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఈ ఏడాది కాలంలోనే ఎస్వీబీసీకి 31 కోట్ల రూపాయల విరాళాలు అందాయి.. మరో రెండు నెలల్లో రెండు చానెళ్ళు మరో రెండు నెలల్లో హిందీ(ఎస్వీబీసీ–3), కన్నడ(ఎస్వీబీసీ–4) ఛానళ్ళు ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అనుమతి లభించిన వెంటనే ఈ చానళ్లు ప్రారంభించేలా సన్నాహాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పటికే ఉన్న ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో సేవలు మరింత విస్తరించేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని ఎస్వీబీసీ సీఈవో జి సురేష్‌బాబు సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ వెల్లడించారు. (చదవండి: ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు: సీఎం జగన్) -
ముంబైలో శ్రీవారి ఆలయానికి భూమి ఇస్తాం
తిరుమల/సాక్షి, అమరావతి: ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని, ఎస్వీబీసీ హిందీ చానల్‌కు సహకరిస్తామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి హామీ ఇచ్చారు. ముంబయిలో మంగళవారం రాత్రి టీటీడీ ఏఈవో ధర్మారెడ్డి, ఎస్వీబీసీ సీఈవో సురేష్‌కుమార్‌లతో పాటు వైవీ సుబ్బారెడ్డి సీఎం థాక్రేను కలిశారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి సహకరించాలని సీఎంను టీటీడీ చైర్మన్ కోరగా, గత ప్రభుత్వం కేటాయించిన భూమిని పరిశీలించాలని, అది అనువుగా లేదనుకుంటే ఇంకో చోట భూమి కేటాయిస్తామని థాక్రే చెప్పారు. అలాగే త్వరలో ప్రారంభించనున్న ఎస్వీబీసీ హిందీ చానల్‌కు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి సీఎంకు స్వామివారి ప్రసాదాలు అందించి, శేషవస్త్రంతో సన్మానించారు. కాగా, ఇదే అంశంపై టీటీడీ చైర్మన్, ఏఈవో, ఎస్వీబీసీ సీఈవోలు ముంబై స్థానిక సలహామండలి సభ్యులతో కూడా సమావేశమయ్యారు. టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముంబైలో శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. -
ఏప్రిల్ నుంచి యాడ్స్ ఫ్రీ ఛానల్‌గా ఎస్వీబీసీ..
సాక్షి, తిరుమల: శ్రీవారి సేవలన్నీ ఏకాంతంగా జరుగుతున్నాయని, త్వరలోనే భక్తులను అనుమతిస్తామని టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎస్వీబీసీలో మార్చి వరకు యాడ్స్ అగ్రిమెంట్ ఉందని, ఏప్రిల్ నుంచి ఎస్వీబీసీలో యాడ్స్ ఫ్రీగా చేస్తామన్నారు. తిరుచానూరులో కూడా సేవలు ప్రస్తుతం ఏకాంతంగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. (చదవండి: తిరుపతి సర్వీసుల్లో శీఘ్రదర్శనం టికెట్లు) ‘‘రథసప్తమికి ఆన్ లైన్లో టికెట్లు విడుదల చేశాం. సర్వ దర్శనం టోకెన్లను రథసప్తమి ముందురోజు కేటాయిస్తాం. వృద్దులు, చిన్న పిల్లల దర్శనాలను కోవిడ్ కారణంగా రద్దు చేశాం. మరో నెలలో వీటిపై నిర్ణయం తీసుకొంటామని’’ ఈవో తెలిపారు. తిరుమలకి ఒక్కరే వచ్చే వృద్ధులకు ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేస్తామన్నారు. టీటీడీలో విధులు నిర్వహించే ఉద్యోగులందరూ తిరునామము ధరించాలని పేర్కొన్నారు. తిరుమలలోని కాటేజీల్లో మరమ్మతులు చేపట్టామని, త్వరలో అద్దె గదుల ధరలు నిర్ణయిస్తామని’’ జవహర్‌రెడ్డి వెల్లడించారు.(చదవండి: చిత్తూరు జిల్లా: ఏకగ్రీవ సర్పంచ్‌లు వీరే!) -
అశ్లీల వీడియో వివాదం: ఎస్వీబీసీ ఉద్యోగి తొలగింపు
సాక్షి, తిరుమల : శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ)లో ఓఎస్ఓ( అటెండర్)గా విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగిని బుధవారం విధుల నుండి తొలగించారు. ఈ ఏడాది సెప్టెంబరు నెలలో వెంకట క్రిష్ణ అనే భక్తుడు శతమానం భవతి కార్యక్రమానికి సంబందించిన వివరాలను మెయిల్ ద్వారా కోరారు. అందుకు ఎస్వీబీసీ ఉద్యోగి భక్తుడికి అశ్లీల వెబ్ సైట్ కు సంబంధించిన లింక్ పంపించారు. దీనిపై భక్తుడు టీటీడీ చైర్మన్, ఈవోలకు ఫిర్యాదు చేశారు.. ఈ విషయంపై స్పందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి విచారణకు ఆదేశించారు. (చదవండి : ఎస్వీబీసీలో సిబ్బంది ‘అశ్లీల’ నిర్వాకం) దాదాపు 25 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లతో ఎస్వీబీసీలోని అన్ని కంప్యూటర్లను సెక్యూరిటీ అడిట్ చేశారు. సైబర్ సెల్ టీం దర్యాప్తులో మరో ముగ్గురు లేదా నలుగురు ఉద్యోగులు ఇలాంటి పనులు చేసినట్లు తెలిసింది. ఇంకా ఎంతమంది ఉద్యోగులు ఇలాంటి పనులు చేశారో పరిశీలించి వారిని కూడా ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఎస్వీబీసీ సిఈవో తెలిపారు. ఈ సంఘటన అనంతరం సంస్థ ప్రతిష్టను పరిరక్షించడంలో భాగంగా పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నది. ఇకపై ఎస్వీబీసీ కంప్యూటర్ ఆపరేషన్ టీటీడీ ఐటీ విభాగం పర్యవేక్షణలో జరుగుతుంది. ఎస్వీబీసీలో ప్రతి కంప్యూటర్ కు పాస్వర్డ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా ఏ కంప్యూటర్ ను ఎవరు ఉపయోగిస్తున్నారు అనేది తెలుస్తుంది. అదేవిధంగా ఎస్వీబీసీని టీటీడీ విజిలెన్స్ పర్యవేక్షణలోనికి తీసుకురావాలని నిర్ణయించారు. -
ఎస్వీబీసీలో సిబ్బంది ‘అశ్లీల’ నిర్వాకం
సాక్షి, తిరుపతి : శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో పోర్న్ సైట్ లింక్ కలకలం రేపింది. ఎస్వీబీసీ ఉద్యోగుల నిర్వాకంపై తీవ్రంగా స్పందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి విచారణకు ఆదేశించారు. కాగా ‘శతమానం భవతి’ కార్యక్రమానికి సంబంధించి ఓ భక్తుడు మెయిల్ చేయగా, అతడికి ఎస్వీబీసీ ఉద్యోగి పోర్న్ సైట్ లింక్ పంపించాడు. దీంతో ఈ ఘటనపై ఆ భక్తుడు టీటీడీ చైర్మన్, ఈవోకి ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఎస్వీబీసీ కార్యాలయంలో విజిలెన్స్, సైబర్‌క్రైమ్, ఈడీపీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పోర్న్‌సైట్ వీడియో పంపిన అధికారితోపాటు.. అశ్లీల సైట్లు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగులతో పాటు, విధులు నిర్వహించకుండా ఇతర వీడియోలు చూస్తున్న మరో 25మంది సిబ్బందిని గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఎస్వీబీసీ యంత్రాంగం సిద్ధం అవుతోంది. -
ఎస్వీబీసీ చైర్మన్‌గా సాయికృష్ణ యచేంద్ర
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా నెల్లూరు జిల్లాకు చెందిన సాయికృష్ణ యచేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఆ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారని పేర్కొన్నారు. -
వెబ్సైట్లో ధార్మికాంశాల వీడియోలు
తిరుపతి సెంట్రల్: పిల్లలకు సనాతన ధర్మంపై మక్కువ పెంచేందుకు ముఖ్యమైన ధార్మికాంశాలను వీడియోలుగా రూపొందించి టీటీడీ వెబ్సైట్లో ఉంచాలి అని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. వాటిని ఎస్వీబీసీ చానల్లోనూ ప్రసారం చేయాలని ఆయన సూచించారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యక్రమాలపై తిరుపతి పరిపాలన భవనంలో సోమవారం అధికారులతో ఈవో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైందవ సనాతన ధర్మంలోని ప్రాథమికాంశాలతో నెల వ్యవధితో కూడిన కోర్సును రూపొందించాలని ఆదేశించారు. వేదాలు, పురాణాలు, ఆలయాల వైశిష్ట్యం, హైందవ ధర్మ పరిరక్షణకు పలువురు మహానుభావులు చేసిన కృషిని కోర్సుల్లో పొందుపరచాల్సిందిగా సూచించారు. మే నెలలో తెలుగు రాష్ట్రాల్లో వేలాది ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకారులకు మూడు దశల్లో అర్చక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. వైజాగ్, రాజమండ్రి వంటి దూర ప్రాంతాల నుంచి తిరుపతికి రానవసరం లేకుండా ఆయా ప్రాంతాలకు సమీపంలోనే అర్చక శిక్షణ ఏర్పాటు చేస్తే సౌకర్యవంతంగా ఉంటుందని ఈవో తెలిపారు. సనాతన ధర్మం, సంస్కృతికి సంబంధించి చిత్రాలతో కూడిన కథలను ముద్రిస్తే ఎక్కువ మందికి చేరుతాయన్నారు. పదకవితా పితామహుడైన తాళ్లపాక అన్నమయ్యపై ప్రతి నెలా ఒకటి చొప్పున వరుస కథనాలను ప్రచురించాలని సూచించారు. వచ్చే అన్నమయ్య జయంతి నిర్వహణకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. దాససాహిత్య ప్రాజెక్ట్, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ద్వారా ముద్రించే పుస్తకాలను ఇంగ్లిష్‌లోనూ తర్జుమా చేయాలన్నారు. శ్రీవాణి ట్రస్ట్,ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌లపై సమీక్ష టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవాణి, ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌ల కార్యకలాపాలపైనా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షించారు. స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల్లో నిర్వహించిన వైద్య చికిత్సల వివరాలను ఆరా తీశారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ మత్స్యకార ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ సమావేశాల్లో టీటీడీ జేఈవో బసంత్ కుమార్, చీఫ్ ఇంజనీర్ జీ రామచంద్రా రెడ్డి, ఎఫ్ఏసీఏవో బాలాజీ, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, సీఎంవో డాక్టర్ నాగేశ్వరరావు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్ పాల్గొన్నారు. -
సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తిరుపతి: టీటీడీలో చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని ఆ సంస్థ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడుతూ.. సాధారణ భక్తులే పరమావధిగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ)లో జరిగిన పరిణామాలపై విచారణకు ఆదేశించామని, వాయిస్ రికార్డులను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు. -
సీఎం జగన్‌ను కలిసిన పృధ్వీరాజ్
సాక్షి, అమరావతి: ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృధ్వీరాజ్ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాయలంలో ముఖ్యమంత్రిని కలిసి తనను చైర్మన్‌గా నియమించడం పట్ల కృతఙ్ఞతలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎస్వీబీసీ చానల్ ను ప్రారంభించి భక్తులకు అనేక సేవలు అందించే అవకాశం కల్పించారన్నారు. ఇప్పుడు ఆ సేవ చేసుకునే భాగ్యాన్ని తనకు కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ఎస్వీబీసీని మరింతగా భక్తులకు చేరువ చేసేందుకు కృషి చేస్తానని పృధ్వీరాజ్ తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో పలువురు ప్రముఖులు కలుసుకున్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అదీప్‌రాజ్, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, ధనలక్ష్మి, మేరుగ నాగార్జున, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు ముఖ్యమంత్రితో సమావేశమైన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీ తమ నియోజకవర్గ పరిధిలోని అనేక సమస్యలను జగన్ దృష్టికి తెచ్చారని సమాచారం. -
సీఎం జగన్‌ను ఒప్పిస్తా: పృథ్వీరాజ్
సాక్షి, తిరుపతి : శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో గతంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని ఆ ఛానల్ చైర్మన్ పృథ్వీరాజ్ తెలిపారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.. భక్తి ఛానల్ అక్రమాల మీద చాలా ఆరోపణలు ఉన్నాయని, వాటన్నింటినీ నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఒప్పిస్తామని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. సీఎం కాళ్లు పట్టుకుని అయినా ఎస్వీబీసీలో పనిచేస్తున్న 286 మంది ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక సినిమా పరిశ్రమలోని కొందరు.. జగన్ ప్రభుత్వంపై నిందలు వేయడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. అనవసరపు మాటలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడనన్న పృథ్వీరాజ్.. ఎస్వీబీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటన తన ఓటర్ కార్డుతో పాటు ఆధార్‌ను తిరుపతికే మార్చుకున్నట్లు చెప్పారు. -
‘సీఎం జగన్‌ను విమర్శిస్తే తాట తీస్తా’
సాక్షి, చిత్తూరు: చంద్రగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకి ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలపమన్నాను తప్ప తప్పుగా మాట్లాడలేదన్నారు. కానీ తిరుమలలో రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వర్గవిభేదంగా ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు సీఎం అయితే సత్కారాలు చేస్తారు.. జగన్ సీఎం అయితే విమర్శలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతో మంది సినిమా వాళ్లు లబ్ధి పొందరాని పృథ్వీరాజ్ గుర్తు చేశారు. సీఎం జగన్‌ను ఎవరు విమర్శించిన తాట తీస్తానంటూ హెచ్చరించారు. పులి కడుపున పులే పుడుతుంది కానీ లోకేష్ పుట్టడని పృథ్వీరాజ్ ఎద్దేవా చేశారు. -
పోసానితో నాకెలాంటి విభేదాలు లేవు...
సాక్షి, హైదరాబాద్ : సినీనటుడు పోసాని కృష్ణమురళికి మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలను ఎస్వీబీసీ చానల్ చైర్మన్, సినీ నటుడు పృథ్వీరాజ్ ఖండించారు. ఆయన ఆదివారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ మధ్య మనస్పర్థలు ఏర్పడినట్లు వచ్చిన వార్తల్లో స్తవం లేదని, ఆయన తన సోదరుడి లాంటివారని పృధ్వీ పేర్కొన్నారు. స్వీబీసీ చానల్లో ఐడీ కార్డు వేసుకుని తాను కూడా ఓ ఉద్యోగిగా కొనసాగుతానని తెలిపారు. చానల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేసేందుకు కృషి చేస్తానని, ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి ఎస్వీబీసీ భక్తి చానల్ చైర్మన్‌గా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. చానల్ చైర్మన్‌గా కీర్తి ప్రతిష్టలు పెంచుతానన్నారు. భక్తి చానల్లో గతంలో జరిగిన అక్రమాలపై మాట్లాడుతూ.. ఎవరిపైనా ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలనే ఉద్దేశం తమ ముఖ్యమంత్రికి గానీ, తనకు గానీ లేవన్నారు. ప్రస్తుతం రోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు నెలలో 20 రోజులు అక్కడే ఉంటున్నానని చెప్పారు. ఎవరైనా గతంలో అక్రమాలు చేశారని రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. -
దేవుడు నా మొర ఆలకించాడు: పృథ్వీరాజ్
సాక్షి, తిరుమల : కలియుగ దైవం శ్రీనివాసుడిని ఆదివారం ప్రముఖ సినీ నటుడు, ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పృథ్వీరాజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు పృథ్వీరాజ్‌కు వేదాశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు. అలాగే పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. శనివారం ఆయన శ్రీవారి దర్శనార్థం శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం పృథ్వీరాజ్ మాట్లాడుతూ....స్వామివారి అనుగ్రహం లేకుంటే దర్శనానికి కూడా రాలేమని అన్నారు. అలాంటిది ఏకంగా స్వామివారి సేవ చేసుకునే భాగ్యం కలిగిందన్నారు. శ్రీవారికి సేవ చేసే భాగ్యం తనకు దక్కిందని, శ్రీవారి కైంకర్యాలు ప్రసారమయ్యే ఎస్వీబీసీ చానల్‌ను గాడిలో పెట్టి, అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఇన్నాళ్లకు ఆ దేవదేవుడు నా మొర ఆలకించారు. సినీ పరిశ్రమలోనే కాకుండా, తిరుమల కొండపై కూడా సేవ చేసుకునే అదృష్టం కలిగింది. భగవంతుడి ఇచ్చిన ఈ అవకాశాన్ని అందరి సహకారంతో 24 గంటలూ పనిచేసి, అందరితో శభాష్ అనిపించుకుంటాం. తనను అందరూ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారని, అలాగే ఎస్వీబీసీ ఛానల్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా పృథ్వీరాజ్ బాగా పని చేశారనేలా అనిపించుకుంటామన్నారు. ఇక ఉద్యోగులను కుటుంబసభ్యుల్లా భావిస్తూ అందరిని కలుపుకొని ఎస్వీబీసీ చానల్ అభివృద్ధికి పాటుపడుతానని తెలిపారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా చానల్‌ను తీర్చిదిద్దుతానన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని కాలినడకన గతంలో తిరుమలకు వచ్చి స్వామి వారిని వేడుకున్నానని తెలిపారు. తాము కక్ష పూరితంగా వ్యవహరించబోమని, అవినీతికి పాల్పడి ఉంటే వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎస్వీబీసీలో అక్రమాలు జరిగాయని భక్తులు ఆరోపిస్తున్నారని, దేవుడికి సంబంధించింది దేవుడికే చెందాలన్నది తన సిద్ధాంతమని అన్నారు. దేవుని సొత్తు జేబులో వేసుకోవాలి అనుకొనే వారికి కనిపించని నాలుగో సింహంలా స్వామివారే తగిన గుణపాఠం చెబుతారన్నారు. చిత్తూరు జిల్లాతో కూడా తనకు అనుబంధం ఉందని, తాను ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకూ శ్రీకాళహస్తిలో చదువుకున్నానని పృథ్వీరాజ్ తెలిపారు. నటుడు జోగినాయుడు కూడా స్వామివారిని దర్శించుకున్నాడు. -
ఎస్వీబీసీ చైర్మన్, డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తిరమల : శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ (ఎస్వీబీసీ) చైర్మన్, డైరెక్టర్‌గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి.. శ్రీవారిని దర్శించుకుని పెద్ద జియర్‌స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు టీటీడీ వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. -
వివాదంలో ఎస్వీబీసీ: ఛానల్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వివాదంలో చిక్కుకుంది. ఎస్వీబీసీ ఛానల్ సీఈవో నరసింహారావు తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నరసింహారావు గురువారం అర్థరాత్రి కార్యాలయంలోని ఫైళ్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా మేకప్‌మన్ వెంకటేశ్వర రెడ్డి అడ్డుకున్నారు. దీంతో తనపై నరసింహారావు దాడి చేసినట్టు వెంకటేశ్వర రెడ్డి అలిపిరి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మరో వైపు వెంకటేశ్వర రెడ్డిపై దాడికి నిరసనగా శుక్రవారం ఛానెల్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఎస్వీబీసీ వద్ద ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సీఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిసెంబర్ 30 తో పదవీ కాలం ముగిసినా ఇంకా కొనసాగుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఉద్యోగులు ఆరోపించారు. తన అవినీతికి చెందిన ఫైళ్లను తారుమారు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగిపై దాడికి పాల్పడ్డ సీఈవో నరసింహారావు పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఎస్వీబీసీలో అవకతవకలు జరుగుతున్నట్టు ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి. గత రెండు సంవత్సరాలుగా ఛానల్లో చోటు చేసుకున్న పరిణామాలు శ్రీవారి భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఛానల్ నిర్వహణ పేరుతో టీటీడీకి చెందిన కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని బలమైన ఆధారాలు ఉన్నాయి. సీఈవో నరసింహారావు టీడీపీ పెద్దల అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్నట్టు అభియోగాలున్నాయి. ఇప్పటికైనా అవినీతిపై కొరడా ఝుళిపించి శ్రీవారికి చెందిన ఛానల్ ను కాపాడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
ఎస్వీబీసీ ఛానల్ తీరుపై విమర్శలు
-
కళానీరాజనం
-
వేంకటేశ్వరా.. తీరు మారలేదురా
ఎస్వీబీసీలో మళ్లీ మళ్లీ అవే కథలు ‘కుమ్మరి భీమన్న’ కథ కంచికే వేలి ముద్రవేసి..ఎవరిదారి వారిదే.. వివిధ రేడియోలలో పార్ట్‌టైమ్ రీడర్లుగా కొందరు టెలికాస్ట్ కాని వాటికి రూ.లక్షల్లో ఖర్చు తిరుపతి సిటీ: అనుక్షణం కొత్తదనంతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని వివిధ భక్తి చానళ్లు పోటీ పడుతున్న తరుణం ఇది. అయితే టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) మాత్రం ఏడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంలా ఉంది. శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే తలంపుతో కోట్లాది రూపాయల వ్యయంతో ఈ చానల్‌ను నెలకొల్పిన విషయం విదితమే. ఆతర్వాత దీనికి అనుబంధంగా శ్రీవెంకటేశ్వర స్వామి పేరున తమిళ చానల్‌నూ నెలకొల్పారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అనంతరం ఎస్వీబీసీలో ఏ మాత్రం పురోగతి లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేసిన కార్యక్రమాలనే మళ్లీ మళ్లీ వేస్తూ వీక్షకులకు విసుగుపుట్టిస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. ఇక ఇందులో పనిచేసే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో పనిచేయాలనుకునే వారు కూడా చేసే అవకాశం లేకుండా పోతోందని తెలుస్తోంది. చుట్టపుచూపులా సీఈవో రాక అన్నీ తానై వ్యవహరించాల్సిన ఎస్వీబీసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో) హైదరాబాద్‌లో కూర్చొని నెలకోసారి చుట్టపుచూపులా ఇక్కడి కార్యాలయానికి వెళుతున్నారని సమాచారం. దీంతో కొందరు ఉద్యోగులు బయోమెట్రిక్‌లో వేలిముద్ర వేసిందే తడవుగా తమ సొంత పనులకు వెళ్లిపోతున్నారనే ఆరోపణలున్నాయి. ఇంకొందరు ప్రైవేట్ రేడియో చానల్లో పార్ట్‌టైమ్ రీడర్లుగా కొనసాగుతూ ధనార్జన చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు సక్రమంగా విధులకు రాకపోవడంతో కిందిస్థాయి అధికారులపై అజమాయిషీ కొరవడి చానల్ నిర్వహణ మొక్కుబడి వ్యవహారంగా మారింది. టెలికాస్ట్ కాని వాటికి లక్షల్లో ఖర్చులు ఎస్వీబీసీలోని సీనియర్ నిర్మాతల అనాలోచిత నిర్ణయాలతో వెంకన్న సొమ్ము లక్షల్లో ఖర్చవుతోంది. రెండేళ్ల క్రితం రూ.20 లక్షల ఖర్చుతో తీసి మరుగున పడిన ‘నాయన’ సీరియల్ ఉదంతం మరువక ముందే ఇటీవల ‘కుమ్మరి బీమన్న’ పేరుతో ఓ సీరియల్‌ను ప్రారంభించి రూ.5లక్షలు ఖర్చు చేసి మూలన పడేశారు. అలాగే మరో రూ.5 లక్షలతో ‘విజయీభవ’, రూ 5 లక్షలతో ‘స్వరరాగసుధ, సప్తవాహీ తరంగణి’ కార్యక్రమాలు రూపొందించి మధ్యలోనే ఆపేశారు. చానల్ ప్రారంభం నుంచి ఒకటి, రెండు తప్ప చివరి వరకు నడిపిన సీరియళ్లు లేవు. దాదాపుగా ప్రతి సీరియల్‌నూ రెండు, మూడు ఎపిసోడ్స్‌తో ఆపేయడం షరామామూలే. నడుస్తున్న గీతాంజలి-1, గీతాంజలి-2 కార్యక్రమాలకు అవసరమైన క్యారెక్టర్లలో ఉన్నతాధికారుల పిల్లలు, సీనియర్ నిర్మాతల పిల్లలకే అవకాశం ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మా దృష్టికి రాలేదు ఎస్వీబీసీ ఉద్యోగులు, అధికారులు వేలిముద్రలు వేసి విధులకు రావడం లేదన్న విషయం మా దృష్టికి రాలేదు. మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. త్వరలో ప్రసారం అవుతాయి. కుమ్మరి భీమన్న సీరియల్‌ను తాత్కాలికంగా ఆపాం. త్వరలో రీ ఎడిటింగ్ చేసి టెలికాస్ట్ చేస్తాం. -మధుసూదన్‌రావ్, సీఈవో, ఎస్వీబీసీ -
‘ఎస్వీబీసీ’లో ఏం జరుగుతోంది!?
సాక్షి, తిరుమల: ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులు కొత్త సంవత్సరం జనవరి తొలిరోజున శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించాలని కోరుకుంటారు.. అయితే, టీటీడీ శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్లో మాత్రం కేవలం భజనలు చూపారు. ఇది చాలా అన్యాయం. ఆ ప్రసారాలు చూసిన నేనే చాలా బాధపడ్డాను’’ అని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గవర్నర్ దంపతులు శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజుతో జనవరి 1నాటి ఎస్వీబీసీ ప్రసారాలపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘రాజుగారు..ఐ యాం వెరీ సారీ.. వాట్ హ్యాపనింగ్ ఇన్ ఎస్వీబీసీ చానల్.. నో కంట్రోల్, నో డి సి ప్లిన్.. ప్లీజ్ సీ, పరుస్యూ ద ప్రాబ్లమ్’’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రతి రోజూ వేకువజామున 3 నుంచి 4 గంటల మధ్యలో తోమాల, సహస్ర నామార్చన వంటి నిత్యసేవలు ప్రసారం చేస్తుంటారు. చాలా బాగుంటాయి. జనవరి మొదటి తారీకునే భజనలు వేయడం అన్యాయమండి’’ అన్నారు. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ వందశాతం దేవుడినే దర్శించాలని కోరుకుంటారు తప్ప భజనల్ని కాదన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేంకటేశ్వరుడిని ప్రార్థించానన్నారు. గవర్నర్ రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. -
ఎస్వీబీసీ ఛానల్ నిర్వహణపై గవర్నర్ మండిపాటు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ నిర్వహణపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మండిపడ్డారు. ఆ చానల్ నిర్వహణ తీరుపై టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజుకు ఫిర్యాదు చేశారు. నూతన సంవత్సర వేడుకలు, పండగ, పర్వదినాలు, సెలవు దినాలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు చిన్నపాటి ఇబ్బందులు ఉండటం సహజమేనని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎంజీ గోపాల్ వివరణ ఇచ్చారు. నిన్న ఉదయం శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తురాలిపై ఓ పోలీసు వాకిటాకీతో దాడి చేసింది. దాంతో టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ వివరణ ఇచ్చారు. అయితే నూతన సంవత్సరం సందర్బంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన వీఐపీ పాస్‌ల మంజూరులో పూర్తి పారదర్శకత పాటించామని గోపాల్ వెల్లడించారు.