
సాక్షి, చిత్తూరు: చంద్రగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకి ఎస్‌వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలపమన్నాను తప్ప తప్పుగా మాట్లాడలేదన్నారు. కానీ తిరుమలలో రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వర్గవిభేదంగా ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు సీఎం అయితే సత్కారాలు చేస్తారు.. జగన్ సీఎం అయితే విమర్శలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతో మంది సినిమా వాళ్లు లబ్ధి పొందరాని పృథ్వీరాజ్ గుర్తు చేశారు. సీఎం జగన్‌ను ఎవరు విమర్శించిన తాట తీస్తానంటూ హెచ్చరించారు. పులి కడుపున పులే పుడుతుంది కానీ లోకేష్ పుట్టడని పృథ్వీరాజ్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment