
సాక్షి, తిరుపతి : శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌లో పోర్న్ సైట్ లింక్ కలకలం రేపింది. ఎస్వీబీసీ ఉద్యోగుల నిర్వాకంపై తీవ్రంగా స్పందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి విచారణకు ఆదేశించారు. కాగా ‘శతమానం భవతి’ కార్యక్రమానికి సంబంధించి ఓ భక్తుడు మెయిల్ చేయగా, అతడికి ఎస్వీబీసీ ఉద్యోగి పోర్న్ సైట్ లింక్ పంపించాడు. దీంతో ఈ ఘటనపై ఆ భక్తుడు టీటీడీ చైర్మన్, ఈవోకి ఫిర్యాదు చేశాడు.
మరోవైపు ఎస్వీబీసీ కార్యాలయంలో విజిలెన్స్, సైబర్‌క్రైమ్, ఈడీపీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పోర్న్‌సైట్ వీడియో పంపిన అధికారితోపాటు.. అశ్లీల సైట్లు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగులతో పాటు, విధులు నిర్వహించకుండా ఇతర వీడియోలు చూస్తున్న మరో 25మంది సిబ్బందిని గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఎస్వీబీసీ యంత్రాంగం సిద్ధం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment