SVBC
-
కెనడా, అమెరికాలో ముగిసిన దేవదేవుడి కళ్యాణాలు
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూఎస్ఏలోని జూలై 15న మొర్గాన్విల్ - న్యూజెర్సీ, 16న హూస్టన్ 22న ఇర్వింగ్(టెక్సాస్) నగరాల్లో తిరుమల శ్రీ శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామివారు ఎన్ఆర్ఐ భక్తులకు దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగసంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ మొదటినుండి తితిదేతో ఒకవైపు, ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గాలతో మరోవైపు సమన్వయము చేస్తూ వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణోత్సవం జరిగేలా చూసుకుంది. అక్కడి నిర్వాహకులు... భక్తులు, అర్చకులు, వేదపండితులకు, తితిదే అధికారులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆయా నగరాల్లో జరిగిన కల్యాణోత్సవాల్లో భక్తులు వేల సంఖ్యలో పాల్గొని ప్రత్యక్షంగా స్వామివారి కల్యాణాన్ని వీక్షించారు. మొర్గాన్విల్ – న్యూజెర్సీ లో శ్రీ ఎమ్. మహేందర్, శ్రీ. అన్నా రెడ్డి, రామ్మోహన్, హూస్టన్‌లో మారుతి చింతపర్తి, ఎస్.మహేష్, బి. బ్రహ్మ, దుర్గా ప్రసాద్ సెలోజ్, ఇర్వింగ్(టెక్సాస్)లో గిరి పద్మసోలాల, విజయ మోహన్ కాకర్ల తదితరులు స్వామివారి కల్యాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసారు. ఈ నేపథ్యంలో కెనడా USA దేశాలలోని వివిధ నగరాలలో ఘనంగా జరిగిన శ్రీ మలయప్ప స్వామి వారి కల్యాణోత్సవాలపై ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి పత్రికా ప్రకటన విడుదల చేసారు. కెనడా USA దేశాలలో స్థిరపడిన తెలుగు, భారతీయుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో జూన్ 4వ తేదీ నుంచి డి లై 22 వ తేదీ వరకు పదునాలుగు నగరాల్లో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీనివాస కల్యాణోత్సవాలు ముగిసాయి. ఈ 14 నగరాలలో కల్యాణోత్సవాలే కాకుండా మరో 6 నగరాలలో అక్కడి శ్రీవారి దేవస్థానాలలో స్వామి, అమ్మవార్లకు వసంతోత్సవం, అష్టశత కలశాభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వైఖాసన ఆగమం ప్రకారం తితిదే నుండి వెళ్ళిన అర్చకులు, వేదపండితులు ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. అన్ని నగరాల్లో శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవానికి దాదాపు 60 వేలమంది ఎన్నారై భక్తులు ప్రత్యక్షంగా హాజరయ్యి స్వామివారి కల్యాణాన్ని వీక్షించి పులకితులయ్యారు. ఈ కల్యాణోత్సవాలకు ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ సమన్వయ సహకారం అందించింది. తితిదే చైర్మన్ వై.వీ. సుబ్బారెడ్డి సమన్వయ సూచనలతో కెనడాలోని టొరంటో, మాంట్రియల్, అట్టావా, అమెరికాలోని ర్యాలీ (నార్త్ కరొలినా), జాక్సన్ విల్, డెట్రాయిట్, చికాగో, అట్లాంటా, డల్లాస్ (NATA), సెయింట్ లూయిస్, ఫిలడెల్ఫియా (తానా), మొర్గాన్విల్ – న్యూజెర్సీ, హూస్టన్ ఇర్వింగ్(టెక్సాస్) నగరాలలో తెలుగు, భారతీయ సంస్థల సహకారంతో శ్రీ మలయప్ప స్వామివారి కల్యాణం కన్నులపండుగగా నిర్వహించడం జరిగింది. పలు కల్యాణోత్సవాల్లో శ్రీ వై.వి. సుబ్బారెడ్డి గారు పాల్గొన్నారు. ఈ 14 నగరాలలో శ్రీవారి కల్యాణం మరియు మరికొన్ని నగరాల్లో వసంతోత్సవం, అష్టశత కలశాభిషేకం నిర్వహించడానికి దాదాపు 20వేల కిలోమీటర్లకు పైగా రోడ్డు ప్రయాణం చేసిన తితిదే అర్చకులు, వేదపండితులు ప్రతి కల్యాణాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా ప్రపంచంలోని వివిధ దేశాలలో శ్రీ మలయప్పస్వామి వారి కల్యాణం నిర్వహించాలని భక్తులు, తెలుగు మరియు భారతీయ సంస్థలు ముందుకువస్తే ఆయా దేశాలలో శ్రీవారి కల్యాణం నిర్వహించడానికి గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారని వెంకట్ అన్నారు. గత 13 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 36 నగరాల్లో తిరుమల శ్రీవారి కల్యాణం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కల్యాణోత్సవాల్లో దాదాపు లక్షన్నర పైగా ఎన్నారై భక్తులు పాల్గొన్నారు. తెలుగు, భారతీయ భక్తులతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న వారుకూడా అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణ ఘట్టాన్ని వీక్షించి ఆశీర్వాదాలు అందుకున్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, తితిదే సిద్ధంగా ఉన్నాయని ఇదివరకే వై.వి. సుబ్బారెడ్డి గారు తెలిపారు. దీనికి ఏపీఎన్ఆర్టీఎస్ తమ వంతు సహకారం అందిస్తుందని మేడపాటి తెలిపారు. ఆయా నగరాలలోని నిర్వాహకులు తితిదే చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి గారికి, ఈవో ధర్మారెడ్డి గారికి కృతఙ్ఞతలు తెలిపారు. స్వామివారి కల్యాణోత్సవ కార్యక్రమాన్ని తితిదే నుండి ఏఈవో(జెన్) బి. వెంకటేశ్వర్లు, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సమయానుసారం సమన్వయము చేశారు. ఎస్వీబీసీ ఛానెల్ ఈ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసింది. (చదవండి: అందరికీ కంటి వైద్యం అందేలా..ప్రత్యేక సేవకు శంకర నేత్రాలయ శ్రీకారం) -
CM YS Jagan: మొక్కులు చెల్లించి.. చరిత్రలో నిలిచి..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భక్తిప్రపత్తులతో శ్రీవారిని సేవించుకున్నారు.. సంప్రదాయ దుస్తులు ధరించి సపరివారంగా మంగళవారం ఉదయం మలయప్పను దర్శించుకున్నారు.. దేవదేవుని తీర్థప్రసాదాలను స్వీకరించి ఆనంద పరవశులయ్యారు.. వడ్డికాసులవానికి తులాభారం సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. కోనేటిరాయుని వైభవాన్ని మరింత మంది భక్తులు వీక్షించేలా ఎస్వీబీసీలో కన్నడ, హిందీ ప్రసారాలకు శ్రీకారం చుట్టారు.. ఆలయ సమీపంలో అత్యాధునికంగా నిర్మించిన బూందీ పోటును ప్రారంభించారు.. ఆధ్యాత్మిక క్షేత్రంతో అన్నదాతలను అనుసంధానం చేసేలా రైతుసాధికార సంస్థతో టీటీడీకి ఒప్పందం కుదిర్చారు.. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులనే శ్రీనివాసుని నిత్య కైంకర్యాలకు వినియోగించేలా చర్యలు చేపట్టారు. రెండు రోజుల తిరుమల పర్యటనను ఆహ్లాదకర వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసుకుని తిరుగుపయనమయ్యారు. సాక్షి, తిరుపతి: జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండురోజుల పర్యటన ఉత్సాహంగా సాగింది. తొలిరోజు తిరుపతిలో కొన్ని అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయగా, మంగళవారం తిరుమలలో మరికొన్నింటిని ప్రారంభించారు. అలాగే స్థానిక అన్నమయ్యభవన్‌లో టీటీడీ, రైతుసాధికార సంస్థ మధ్య కీలక ఒప్పందం చేయించారు. ఏడుకొండలస్వామికి బ్రహ్మోత్సవాల సమయంలో పట్టువస్త్రాలను సమర్పించే అదృష్టం కొందరికే దక్కుతుంది. అయితే టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి ఈ మహద్భాగ్యం దక్కడం విశేషం. నాడు ఉమ్మడి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదు పర్యాయాలు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా మూడుసార్లు దేవదేవునికి పట్టువస్త్రాలు అందించి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అన్నదాతతో ఒప్పందం తిరుమల అన్నమయ్యభవన్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో రైతు సాధికార సంస్థతో టీటీడీ ప్రతిష్టాత్మకమైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు గోశాల అభివృద్ధి, గోఆధారిత నైవేద్యం, గుడికో గోమాత, అగరబత్తుల తయారీ, గో ఆధారిత వ్యవసాయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అలాగే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో వివిధ ఆలయాల్లో వినియోగించిన పుష్పాలతో విశిష్ట సామగ్రి తయారీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. చదవండి: (దుర్గమ్మ సేవలో ఏపీ సీఎం) ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు రేణిగుంట: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటన పూర్తి చేసుకుని మంగళవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కోనేటి ఆదిమూలం, కలెక్టర్ హరినారాయణన్, డీఐజీ క్రాంతిరాణా టాటా, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సురేష్, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ, ఏపీఎంఐడీసీ చైర్మన్ షమీమ్ అస్లాం, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ పీఎస్ గిరీష, ఆర్డీవో కనక నరసారెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్ సాదరంగా వీడ్కోలు పలికారు. ఎస్వీబీసీ విస్తరణకు శ్రీకారం శ్రీవేంకటేశ్వర భక్తిచానల్‌కు గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. నాడు టీటీడీ బోర్డు చైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకరరెడ్డి చొరవ తీసుకుని అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా ఎస్వీబీసీని ప్రారంభించారు. తదనంతర కాలంలో తమిళ ప్రసారాలను కూడా మొదలుపెట్టి విశేష భక్తజన ఆమోదం పొందింది. ఈ క్రమంలో మంగళవారం ఎస్వీబీసీ కన్నడ, హిందీ ప్రసారాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. టీటీడీ ధార్మిక కార్యక్రమాలు, శ్రీవారి వైభవాన్ని దశదిశలా చాటేలా మంగళవారం సువర్ణ అధ్యాయానికి తెరతీశారు. ఎస్వీబీసీ నూతన చానళ్లను ఆవిష్కరిస్తూ.. విరివిగా లడ్డూ ప్రసాదం శ్రీవారి ఆలయం వెలుపల రూ.12 కోట్లతో నూతనంగా నిర్మించిన బూందీపోటును సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో సిద్ధం చేసిన ఈ పోటు ద్వారా నిత్యం సుమారు 6లక్షల లడ్డూ ప్రసాదాలు తయారు చేసే వెసులుబాటు ఉంటుంది. గతంలో లడ్డూ ప్రసాదాల కోసం భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడేవారు. చాలినన్ని లడ్డూలు లభించక నిరాశచెందేవారు. ఇకపై ప్రతి భక్తునికీ కోరినన్ని లడ్డూలు అందుబాటులోకి రానున్నాయి. బూందీ పోటును ప్రారంభిస్తూ.. -
ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.కోటి విరాళం
తిరుమల: శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ట్రస్టుకు బుధవారం సాయంత్రం రూ.కోటి విరాళంగా అందింది. కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన ప్రమతి సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ పి.ఎస్.జయరాఘవేంద్ర ఈ విరాళం అందించారు. ఈ మేరకు విరాళం డీడీని దాత తరఫున టీటీడీ బోర్డు సభ్యులు డి.పి.అనంత తిరుమలలోని బంగళాలో టీటీడీ అదనపు ఈవో, ఎస్వీబీసీ ఎండీ ఎ.వి.ధర్మారెడ్డికి అందజేశారు. వైభవంగా పౌర్ణమి గరుడ సేవ తిరుమలలో బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి వారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. చదవండి: జూన్ 1 నుంచి అలిపిరి కాలినడక మార్గం మూత -
ఎస్వీబీసీ చానెల్‌కు హెచ్ఆర్ పాలసీ: టీటీడీ
తిరుపతి: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు తొలిసారి హెచ్ఆర్ పాలసీని ఆమోదిస్తూ ఎస్వీబీసీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 13వ తేదీ నుండి కన్నడ, హిందీ ఛానళ్ల ప్రసారాల ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో బుధవారం ఎస్వీబీసీ బోర్డు సమావేశం జరిగింది. భక్తులకు మరింత మెరుగ్గా ప్రసారాలు అందించేందుకు హెచ్డి ఛానల్ ప్రారంభానికి అవసరమైన పరికరాల కొనుగోలుకు అంచనాలు రూపొందించాలన్నారు. ఎస్వీబీసీ రేడియో ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాబోవు సంవత్సరానికి సంబంధించిన కార్యక్రమాల ప్రణాళిక రూపొందించాలని, వీటిలో భక్తితోపాటు సంగీతం, సాహిత్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలని కోరారు. ఇంకా వెలుగులోకి రాని తాళ్లపాక అన్నమయ్య అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సాహిత్యం, శ్రీ పురందరదాసుల కీర్తనలను పరిష్కరించి ఎస్వీబీసీ ద్వారా భక్తులకు చేరువ చేయాలని టీటీడీ ఈఓ సూచించారు. ఎస్వీబీసీ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేసి ధర్మప్రచార కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఎస్వీబీసీ ప్రారంభం నుంచి హెచ్ఆర్ పాలసీ లేనందువల్ల ఆ విషయంపై బోర్డు సుదీర్ఘ చర్చ జరిపి ఆమోదించింది. -
భక్తుడికి పోర్న్ లింక్: ఐదుగురిపై వేటు
సాక్షి, తిరుపతి : భక్తుడికి పోర్న్ వీడియో లింక్ పంపిన కేసుకు సంబంధించి ఐదుగురు శ్రీ వెంకటేశ్వరా భక్తి ఛానల్ ఉద్యోగులపై టీటీడీ చర్యలు తీసుకుంది. ఆ ఐదుగురిని ఉద్యోగంలోంచి తొలగించింది. వారితో పాటు మరో నలుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విజిలెన్స్ నివేదిక మేరకు టీటీడీ చర్యలు తీసుకుంది. కాగా, కొద్దిరోజుల క్రితం శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించి ఎస్వీబీసీ ఛానెల్‌కు ఓ భక్తుడు మెయిల్ చేశాడు. ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలకు బదులు పొరపాటున అశ్లీల వెబ్సైట్ లింక్‌ను పంపించాడు ఓ ఎస్వీబీసీ ఉద్యోగి. సదరు భక్తుడు దీనిపై టీటీడీ చైర్మన్, ఈఓకి ఫిర్యాదు చేశాడు. ఘటనపై తీవ్రంగా స్పందించిన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈఓ జవహర్ రెడ్డి.. ఎస్వీబీసీ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్, సైబర్ క్రైమ్ టీం, ఈడీపీ అధికార్లు ఎస్వీబీసీ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. పోర్న్ సైట్ వీడియో పంపిన ఉద్యోగితో పాటు కార్యాలయంలో అశ్లీల వీడియోలు చూస్తున్న మరో 5 గురు ఉద్యోగులను గుర్తించారు. విధులు నిర్వహించకుండా ఇతర వీడియోలు చూస్తున్న మరో 25 మంది సిబ్బందిని కూడా గుర్తించి వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. -
అశ్లీల వీడియో లింక్ పంపిన అటెండర్ తొలగింపు
తిరుపతి సెంట్రల్: శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) కార్యాలయంలో పనిచేసే కింది స్థాయి సిబ్బంది ఒకరు ఓ భక్తుడికి మెయిల్ ద్వారా అశ్లీల వీడియో లింక్‌లను పంపిన ఘటనను తీవ్రంగా పరిగణించిన పాలక మండలి సదరు సిబ్బందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగు చూసింది. టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి దీనిపై తక్షణమే స్పందించి విచారణకు ఆదేశించడంతో సైబర్ క్రైం పోలీసు బృందం రంగంలోకి దిగింది. శతమానం భవతి వివరాలు కోరగా.. ఎస్వీబీసీ ప్రసారం చేసే శతమానం భవతి కార్యక్రమం ద్వారా పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటి శుభ సందర్భాల్లో పురోహితులు ఆశీర్వచనాలు అందిస్తారు. హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు ఈ కార్యక్రమం వివరాలు పంపాలని కోరగా ఎస్వీబీసీ కార్యాలయం సిబ్బంది ఒకరు అశ్లీల వీడియో లింక్ పంపినట్లు గుర్తించారు. మెయిల్ తెరిచి చూసి నిర్ఘాంతపోయిన భక్తుడు దీనిపై టీటీడీ చైర్మన్, ఈవోకు ఫిర్యాదు చేయడంతో తక్షణమే విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ టీమ్ తిరుపతి అలిపిరిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టి సుమారు 82 కంప్యూటర్లను, సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించింది. టీటీడీ చైర్మన్ ఆదేశాల మేరకు క్షుణ్నంగా విచారణ కొనసాగుతోంది. కంప్యూటర్ల సెక్యూరిటీ ఆడిట్.. అశ్లీల వీడియోను మెయిల్ చేసిన అటెండర్‌ను విధుల నుంచి తొలగించినట్లు ఎస్వీబీసీ సీఈవో ఒక ప్రకటనలో తెలిపారు. విచారణలో భాగంగా ఎస్వీబీసీలోని అన్ని కంప్యూటర్లను సెక్యూరిటీ ఆడిట్ చేసినట్లు చెప్పారు. ముగ్గురు నలుగురు సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు సైబర్ సెల్ టీం విచారణలో ప్రాథమికంగా తేలిందని, పూర్తి వివరాలు పరిశీలించాక విధుల నుంచి తప్పించడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక టీటీడీ పర్యవేక్షణలో.. ఇకపై ఎస్వీబీసీ కంప్యూటర్ విభాగాన్ని టీటీడీ ఐటీ విభాగం పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లు సీఈవో ప్రకటించారు. ఎస్వీబీసీలో ప్రతి కంప్యూటర్‌కు పాస్వర్డ్ ఏర్పాటు చేసి ఎవరు వినియోగిస్తున్నారో నమోదు చేస్తామన్నారు. ఎస్వీబీసీని టీటీడీ విజిలెన్స్ పర్యవేక్షణలోకి తెస్తామని చెప్పారు. -
అశ్లీల వీడియో వివాదం: ఎస్వీబీసీ ఉద్యోగి తొలగింపు
సాక్షి, తిరుమల : శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ)లో ఓఎస్ఓ( అటెండర్)గా విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగిని బుధవారం విధుల నుండి తొలగించారు. ఈ ఏడాది సెప్టెంబరు నెలలో వెంకట క్రిష్ణ అనే భక్తుడు శతమానం భవతి కార్యక్రమానికి సంబందించిన వివరాలను మెయిల్ ద్వారా కోరారు. అందుకు ఎస్వీబీసీ ఉద్యోగి భక్తుడికి అశ్లీల వెబ్ సైట్ కు సంబంధించిన లింక్ పంపించారు. దీనిపై భక్తుడు టీటీడీ చైర్మన్, ఈవోలకు ఫిర్యాదు చేశారు.. ఈ విషయంపై స్పందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి విచారణకు ఆదేశించారు. (చదవండి : ఎస్వీబీసీలో సిబ్బంది ‘అశ్లీల’ నిర్వాకం) దాదాపు 25 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లతో ఎస్వీబీసీలోని అన్ని కంప్యూటర్లను సెక్యూరిటీ అడిట్ చేశారు. సైబర్ సెల్ టీం దర్యాప్తులో మరో ముగ్గురు లేదా నలుగురు ఉద్యోగులు ఇలాంటి పనులు చేసినట్లు తెలిసింది. ఇంకా ఎంతమంది ఉద్యోగులు ఇలాంటి పనులు చేశారో పరిశీలించి వారిని కూడా ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఎస్వీబీసీ సిఈవో తెలిపారు. ఈ సంఘటన అనంతరం సంస్థ ప్రతిష్టను పరిరక్షించడంలో భాగంగా పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నది. ఇకపై ఎస్వీబీసీ కంప్యూటర్ ఆపరేషన్ టీటీడీ ఐటీ విభాగం పర్యవేక్షణలో జరుగుతుంది. ఎస్వీబీసీలో ప్రతి కంప్యూటర్ కు పాస్వర్డ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా ఏ కంప్యూటర్ ను ఎవరు ఉపయోగిస్తున్నారు అనేది తెలుస్తుంది. అదేవిధంగా ఎస్వీబీసీని టీటీడీ విజిలెన్స్ పర్యవేక్షణలోనికి తీసుకురావాలని నిర్ణయించారు. -
ఎస్వీబీసీలో సిబ్బంది ‘అశ్లీల’ నిర్వాకం
సాక్షి, తిరుపతి : శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో పోర్న్ సైట్ లింక్ కలకలం రేపింది. ఎస్వీబీసీ ఉద్యోగుల నిర్వాకంపై తీవ్రంగా స్పందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి విచారణకు ఆదేశించారు. కాగా ‘శతమానం భవతి’ కార్యక్రమానికి సంబంధించి ఓ భక్తుడు మెయిల్ చేయగా, అతడికి ఎస్వీబీసీ ఉద్యోగి పోర్న్ సైట్ లింక్ పంపించాడు. దీంతో ఈ ఘటనపై ఆ భక్తుడు టీటీడీ చైర్మన్, ఈవోకి ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఎస్వీబీసీ కార్యాలయంలో విజిలెన్స్, సైబర్‌క్రైమ్, ఈడీపీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పోర్న్‌సైట్ వీడియో పంపిన అధికారితోపాటు.. అశ్లీల సైట్లు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగులతో పాటు, విధులు నిర్వహించకుండా ఇతర వీడియోలు చూస్తున్న మరో 25మంది సిబ్బందిని గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఎస్వీబీసీ యంత్రాంగం సిద్ధం అవుతోంది. -
ఎస్వీబీసీ చైర్మన్‌గా సాయికృష్ణ యచేంద్ర
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా నెల్లూరు జిల్లాకు చెందిన సాయికృష్ణ యచేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఆ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారని పేర్కొన్నారు. -
యాడ్ ఫ్రీ చానల్‌గా మారనున్న ఎస్వీబీసీ
సాక్షి, తిరుపతి : ఎస్వీబీసీ నూతన భవనాలకు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 2007 లో ఎస్వీబీసీ కి రూపకల్పన చేశారని, ఆయన అనుమతితోనే ఏర్పాట్లు జరిగాయని తెలిపారు. 2008 ఏప్రిల్ 7 న టెస్ట్ సిగ్నల్ నిర్వహించగా, అదే ఏడాది జులైలో పూర్తి ప్రసారాలు ప్రారంభం అయ్యాయని గుర్తుచేశారు. తక్కువ కాలంలోనే ఎస్వీబీసీ భక్తుల మన్నన్నలు పొందిందని, తదనంతరం 2017లో తమిళ చానల్ కూడా ప్రారంభం అయినట్లు వెల్లడించారు. ఇక నూతన భవనాల్లో రెండు స్టూడియోలు , టేలి పోర్టులు ఉన్నాయని తెలిపారు. ఎస్వీబీసీని యాడ్ ఫ్రీ చానల్ గా ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం భక్తుల నుంచి విరాళాలు కోరామని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే 4 కోట్ల రూపాయలు రాగా, భక్తుల కోరిక మేరకు త్వరలోనే కన్నడ, హిందీ భాషల్లో కూడా చానళ్లు పెడుతున్నట్లు వెల్లడించారు. ఎస్వీబీసీ ని పూర్తి హెచ్డి చానల్ గా మార్చుతున్నామని స్పష్టం చేశారు. (ఆమె జాతీయ నాయకురాలో లేక జాతి నాయకురాలో..) -
ఎస్వీబీసీ సీఈవో పోస్టు భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, తిరుపతి : శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) నియామకానికి గురువారం నోటిఫికేషన్ జారీ అయింది. మూడేళ్ల కాలపరిమితితో సీఈవోను నియమించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 29వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత నిబంధనలు, నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని ‘www.svbcttd.com’ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్వీబీసీ ప్రస్తుత సీఈవో నగేష్‌కు గత ఏడాది జూన్ నెలాఖరుకే పదవీ కాలం ముగిసినా, ఆయన అభ్యర్థన మేరకు టీటీడీ పాలక మండలి ఇప్పటి దాకా పొడిగించింది. తాజాగా సీఈవో పోస్ట్ భర్తీకి ఎస్వీబీసీ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి చర్యలు తీసుకున్నారు. -
ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా
తిరుపతి సెంట్రల్/సాక్షి, హైదరాబాద్: శ్రీవేంకటేశ్వర భక్తి చానల్(ఎస్వీబీసీ) చైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. ఓ మహిళతో పృథ్వీరాజ్ అసభ్యంగా మాట్లాడినట్లు కొన్ని ప్రసార మాధ్యమాల్లో ఆడియో ప్రసారాలు రావడంతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెంటనే స్పందించి, ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. సదరు ఆడియో టేపుల్లోని వాయిస్ శాంపిల్‌ను టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పరమ పవిత్రమైన తిరుమల తిరుపతిలో అనుచిత ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. శ్రీవారి క్షేత్రం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పృథ్వీరాజ్‌ను రాజీనామా చేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలిసింది. తప్పు చేశానని తెలిస్తే చెప్పుతో కొట్టండి: పృథ్వీ తనపై వచ్చిన ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదని ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పృథ్వీ చెప్పారు. తప్పు చేశానని తెలిస్తే తన చెప్పుతో తనను కొట్టండని అన్నారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. మహిళా ఉద్యోగితో తాను అసభ్యంగా మాట్లాడినట్టుగా ప్రచారమవుతున్న ఆడియోలో వాయిస్ తనది కాదన్నారు. శ్రీవారిపై ఒట్టేసి చెపుతున్నానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో తన వాయిస్ లేకుండా చేయాలనే ఇంత పెద్ద కుట్రపన్నారని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై తానే విజిలెన్స్ విచారణ వేసుకున్నట్టు చెప్పారు. వైఎస్సార్సీపీ సిద్ధాంతాలకు కట్టుబడి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని గౌరవించి తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజధాని రైతులను ఉద్దేశించి తాను పెయిడ్ ఆర్టిస్టులని అనలేదన్నారు. తన వ్యాఖ్యలు రైతుల మనస్సులను నొప్పించి ఉంటే క్షమాపణ చెçపుతున్నానని అన్నారు. -
ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా
-
ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా
సాక్షి, తిరుపతి/హైదరాబాద్ : టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధాంతాన్ని గౌరవిస్తూ ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామ చేస్తున్నట్టు పృథ్వీ ప్రకటించారు. ఒక మహిళతో పృథ్వీ అసభ్యంగా మాట్లాడినట్టు కొన్ని ప్రసార మాధ్యమాల్లో ఆడియో ప్రసారాలు జరగడంతో.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దీంతో ఆడియో టేపుల్లోని వాయిస్ శాంపిల్‌ను టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అలాగే ఈ అంశాన్ని వైవీ సుబ్బారెడ్డి సీఎం వైఎస్ జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో పృథ్వీని రాజీనామా చేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్టుగా తెలిసింది. అయితే ఈ క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన పృథ్వీ.. తాను ఎటువంటి విచారణకైన సిద్దమేనని స్పష్టం చేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. ఆ ఆరోపణలపై టీటీడీ విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించాలని కోరాను. నేను ఎస్వీబీసీ చైర్మన్‌గా 2019 జూలై 28న ప్రమాణం స్వీకారం చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు. ప్రక్షాళన దిశగా ఎస్వీబీసీ కోసం పనిచేశాను. తిరుపతిలో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడానని అన్నారు. ఇదంతా చూస్తుంటే నన్ను దెబ్బతీయడం కోసమే.. ఈ కుట్రలు చేసినట్టు ఉంది. పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను. రైతులందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అనలేదు. అన్నం పెట్టే రైతుని నేను పెయిడ్ ఆర్టిస్టులు అనలేదు. కార్పొరేటు ముసుగులో ఉన్నవారి గురించి మాట్లాడితే అంత కోపం ఎందుకు?. అసలైన రైతులు నా మాటల వల్ల బాధపడితే వారికి క్షమాపణలు చెప్తున్నా. నామీద కుట్రలు చేస్తున్నారని కొందరు మీడియా మిత్రులు చెప్పారు. నకిలీ వాయిస్ పెట్టి నాపై దుష్ప్రచారం చేశారు.మేకప్‌మేన్ వెంకట్‌రెడ్డి ప్రవర్తన సరిగా లేదని.. హైదరాబాద్ ఆఫీస్‌లో పనిచేయమని చెప్పాను. దీంతో వరదరాజులు అనే వ్యక్తితో కలిసి అసత్య ప్రచారం చేశారు. నా వ్యక్తి గత ప్రతిష్టను దెబ్బకొట్టినందుకు బాధ కలుగుతోంది. పార్టీ సిద్దాంతాన్ని గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నాను. కాంట్రాక్టు ఉద్యోగుల నియామకంలో నా ప్రమేయం లేదు. విజిలెన్స్ రిపోర్ట్ వచ్చాక వాస్తవాలు తెలుస్తాయి. మహిళతో మాట్లాడింది నేను కాదు. నా గొంతును ఎవరో మిమిక్రీ చేశారు. ఈ ఘటనపై పోలీసులుకు ఫిర్యాదు చేశాను. ఏ ఉద్యోగి కూడా నాపై వేరే ఉద్దేశం లేదు. నేను మద్యం మానేసి చాలా కాలం అయింది. పద్మావతి అమ్మవారి పవిత్ర స్థలంలో మందు తాగుతున్నానని చెడు ప్రచారం చేశారు. వైద్యులతో నాకు పరీక్షలు చేసినా సిద్దమే. ఎస్వీబీసీ చానల్ నిధులు ఒక్క రూపాయి కూడా తినలేదు. నాపై దుష్ప్రచారం చేయడంతో మా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నాపై దుష్ప్రచారం చేసినవారికి సవాలు విసురుతున్నాను. నేను ఏ పరీక్షకైనా సిద్దంగా ఉన్నాను. నాపై వచ్చిన అపవాదులు తొలగిపోయాక మళ్లీ బాధ్యతలు తీసుకుంటాను. నా రాజీనామాను ఫ్యాక్సులో పంపించాను. ఇక పదో తేదీ నాపై దాడి జరిగింది. కొందరు వ్యక్తులు నా మొహంపై పిడిగుద్దలు గుద్ది పారిపోయారు. ’ అని తెలిపారు. -
ఏం మాట్లాడుతున్నాడో పవన్‌కే తెలియదు?
సాక్షి, కాకినాడ: తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడకూడదని తాము ఒట్టు పెట్టుకున్నట్టు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ (ఎస్వీబీసీ) ఛైర్మన్ పృథ్వీరాజ్ తెలిపారు. రాజకీయాల విషయంలో సైద్ధాంతికంగా ఎదుర్కోవాలి కానీ, వ్యక్తిగతంగా విమర్శలు చేయవద్దని ప్రతిపక్షాలకు ఆయన సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కంటే మంచి సీఎంగా వైఎస్ జగన్ పేరు తెచ్చుకుంటున్నారుని కొనియాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎక్కడకెళ్ళినా ప్రజలు జగన్ పరిపాలనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కాకినాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఐదేళ్ళలో ఎందుకు ప్రశ్నించలేదు? వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా ఒప్పుకోనని పవన్ కళ్యాణ్ అనడాన్ని తప్పుబట్టారు. ప్రజలు 150కిపైగా సీట్లతో వైఎస్ జగన్‌ను సీఎంను చేశారని, ఇంకా పవన్ ఒప్పుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానంటున్నా పవన్.. గత ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో ఒక్కసారి కూడా ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పవన్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. హిందు దేవాలయాల్లో ఎక్కడ కూడా అన్యమత ప్రచారం జరగడంలేదని, ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. దిశ అత్యాచారం కేసులో నిందితులను నడిరోడ్డుపై తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తాము వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లడం లేదని, అయినా మిగతా పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రానున్న 30 ఏళ్ళలోనూ రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. -
పృథ్వీరాజ్‌కు సవాల్‌గా ఎస్వీబీసీలో డీవీడీల గోల..
శ్రీవేంకటేశ్వర భక్తి చానల్లో డీవీడీల వివాదం ముదురుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలను డీవీడీలుగా మలచి విక్రయించే క్రమంలో రూ.20 లక్షల నిధులు దుబారా కావడానికి కారణమైన అధికారులపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణమైంది. విలువైన డీవీడీలను రెండేళ్లుగా కార్యాలయ ఆవరణలో పడేశారు. ఇందులో అనేక డీవీడీలు పనికిరాకుండా పోగా, కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ అక్రమాలను నిగ్గుతేల్చడం ఎస్వీబీసీ నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పృథ్వీరాజ్‌కు సవాల్‌గా మారింది. సాక్షి, తిరుపతి సెంట్రల్: శ్రీ వేంకటేశ్వర భక్తితత్వం పై ప్రపంచవ్యాప్తంగా ప్రచారం నిర్వహించడమే లక్ష్యంగా సుమారు 12 ఏళ్ల కిందట ఏర్పాటైన శ్రీవేంకటేశ్వర భక్తి చానెల్(ఎస్వీబీసీ) వివాదాలకు వేదికగా మారడం విస్మ యం కలిగిస్తోంది. టీటీడీ కనుసన్నల్లో నడవాల్సిన ఎస్వీబీసీపై సరైన నియంత్రణ లేకపోవడమే అన్ని వివాదాలకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంతకాలంగా ఎస్వీబీసీకి నేతృత్వం వహిస్తున్న అధికారుల తీరుతో సంస్థ ప్రతిష్ట దెబ్బతింటోంది. చాగంటి డీవీడీల విక్రయానికి శ్రీకారం చాగంటి కోటేశ్వరరావుకు ప్రజల్లో అనూహ్య స్పందన లభిస్తున్న కారణంగా ఎప్పటికప్పుడు ఎస్వీబీసీ ద్వారా రికార్డింగ్ చేశారు. కొంత కాలానికి వీటిని డీవీడీలుగా మార్చి విక్రయించే పనికి శ్రీకారం చుట్టారు. అప్పటికే చాంగటి తన సొంత ట్రస్ట్ ద్వారా తన ప్రవచనాలను లాభాపేక్ష లేకుండా డీవీడీలు చేసి, తన ప్రవచనాలను ప్రజలకు అందించేవారు. కానీ, శ్రీవారి మీద ఉన్న భక్తి భావన కారణంగా తన ట్రస్ట్ ద్వారా కాకుండా ఎస్వీబీసీ ద్వారా ప్రవచనాలను అందించేందుకు అంగీకరించడం గమనార్హం. ఈ క్రమంలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలను ఎస్వీబీసీ అధికారులు డీవీడీలుగా మార్చి, విక్రయానికి సిద్ధం చేశారు. శివానందల హరి, వేంకటేశ్వర మహత్యం, శ్రీవారి బ్రహ్మోత్సవాలు వంటి విభిన్న అంశాలతో కూడిన వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. రికార్డింగ్, మార్కెటింగ్ వంటి పనులకు ఎస్వీబీసీ అధికారులు రూ.20 లక్షల వరకు వెచ్చించారు. అధికారి మారడమే కారణం తిరుమల నాదనీరాజనంతో సహా ఎక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారాలను చేసినా..ఆ ప్రాంతానికి డీవీడీలు తరలిస్తూ విక్రయించడానికి వీలుగా ముగ్గురు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకున్నారు. పరిమిత కాలంలో కొద్ది పాటి డీవీడీలను కూడా ఎస్వీబీసీ విక్రయించింది. ఆ డీవీడీలను రూపకలప్పన చేసిన అధికారి ఉన్నంత కాలం విక్రయాలు కొనసాగాయి. అయితే ఆయన స్థానంలో మరొక అధికారి ఎస్వీబీసీలో కీలక బాధ్యతలను చేపట్టారు. ఆయనకు చాగంటి అంటే గిట్టని కారణంగా డీవీడీలను పక్కన పడేశారు. డీవీడీలకు మార్కెట్లో డిమాండ్ తగ్గిపోయిందన్న సాకు చూపి, మిగిలిన అన్నింటిని ఎస్వీబీసీ కార్యాలయంలో ఓ మూలన పడేసినట్టు సమాచారం. డీవీడీల కంటెంట్ సరిగ్గా లేదంటూ తొలుత పరిశీలన కోసం ప్రత్యేక అధికారిని నియమించారు. ప్రణాళికా ప్రకారం డీవీడీల్లో కంటెంట్ లేదని ఆ ప్రత్యేక అధికారితో బలవంతంగా నివేదికను తయారు చేయించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. డీవీడీలను విక్రయించడం కోసం నియమించిన సిబ్బందిని కూడా ఆయన హయాంలోనే తొలగించారు. మాతృదేవోభవ డీవీడీపై మరో వివాదం శ్రీవారి ఉత్సవాల్లో కాకుండా ప్రత్యేకంగా రూపొందించిన డీవీడీల రికార్డింగ్ విషయంలోనూ వివాదాలు తలెత్తాయి. ఎస్వీబీసీ చానెల్ లేదా అనుమతి పొందిన స్టూడియోలో రికార్డింగ్ చేయాల్సి ఉంటే...ఓ ప్రవచన కర్త సొంతింట్లో నిర్వహించిన కార్యక్రమాన్ని సైతం మాతృదేవో భవ పేరిట డీవీడీగా రూపొందించడంపై అప్పట్లో తీవ్ర దుమారమే చెలరేగింది. సదరు కార్యక్రమానికి సినీ ప్రముఖుల కుటుంబ సభ్యులు హాజరు కావడాన్ని డీవీడీల్లో వీక్షించిన భక్తులు విస్తుపోవాల్సి వచ్చింది. -
ఇండస్ట్రీలో నాపై కక్షసాధింపులు మొదలయ్యాయి: పృథ్వీరాజ్
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ (ఎస్వీబీసీ)లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తామని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎస్వీబీసీ చైర్మన్, నటుడు పృథ్వీరాజ్ తెలిపారు. ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా ఆయన ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. గతంలో రాఘవేందర్‌రావుతోపాటు పలువురు ఎస్వీబీసీ చైర్మన్లుగా ఉన్నారని, వారి హయాంలో ఏమైనా అక్రమాలు జరిగితే.. విచారణ తప్పదని పృథ్వీ స్పష్టం చేశారు. శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఆయన ప్రకటించారు. ఎస్వీబీసీ కోసం నిబద్ధతతో పనిచేస్తానని, రాఘవేందర్రావుతో ఈ విషయంలో తనకు ఎలాంటి పోటీలేదని తెలిపారు. ఎస్వీబీసీ చైర్మన్ అయ్యాక చిత్ర పరిశ్రమలో తనపై కక్షసాధింపులు మొదలయ్యాయని, సినిమాల కోసం తనకు ఇచ్చిన అడ్వాన్స్‌లు కొంతమంది వెనక్కి తీసుకున్నారని పృథ్వీరాజ్ వెల్లడించారు. ఈ పదవి రావడం పూర్వజన్మ సుకృతం ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమితులవ్వడం తన పూర్వజన్మ సుకృతమని పృథ్వీరాజ్ ఆనందం వ్యక్తం చేశారు. శ్రీవారికి ఇలా సేవ చేసుకుంటానని తాను కలలో కూడా అనుకోలేదని పేర్కొన్నారు. జులై 28వ తేదీన ఎస్వీబీసీ చైర్మన్‌గా పదవీ స్వీకారా ప్రమాణం చేశానని తెలిపారు. తెలుగు చిత్రపరిశ్రమకు ఎప్పటికీ రుణ పడి ఉంటానని తెలిపారు. ఎస్వీబీసీ చానల్ ఆధ్యాత్మికతను కాపాడుతానని, చానెల్‌ను దేశంలో నంబర్ వన్ చానల్‌గా చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎస్వీబీసీ చానెల్‌ను నిబద్ధతతో నడిపిస్తానని తెలిపారు. ఈ పదవి తనకు అప్పగించినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమకు చెందిన పోసాని కృష్ణమురళి తనకు అన్నయ్య లాంటి వారని అన్నారు. పోసాని నిజాయితీ గల వ్యక్తి అని కొనియాడారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడను! ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని, అమరావతిలోనే రాజకీయాలు మాట్లాడుతానని ఈ సందర్భంగా పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. ఎస్వీబీసీ చైర్మన్‌గా రాజకీయలకు అతీతంగా పనిచేస్తానని, భక్తుల మనోభావాలను కాపాడుతానని తెలిపారు. నటుడు శివాజీ చంద్రబాబుకు భజన చేశాడని, ఆయనకు మాట మీద నిలకడ లేదని పేర్కొన్నారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీ వైస్సార్సీపీ అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. -
పృథ్వీరాజ్‌కు కీలక పదవి!
సాక్షి, అమరావతి : ప్రముఖ నటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పృథ్వీరాజ్ బాలిరెడ్డి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఈనెల 28న ఎస్వీబీసీ చైర్మన్, డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. తిరుపతిలో శుక్రవారం జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పృథ్వీరాజ్ నియామకానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. మరోవైపు టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తుడా చైర్మన్ నియామకానికి అనుగుణంగా చట్ట సవరణకు కేబినెట్ అంగీకారం తెలిపింది. -
ఎస్వీబీసీ ఉద్యోగి సూసైట్ నోట్ కలకలం
సాక్షి, తిరుపతి : టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఉద్యోగి నిరంజన్ ప్రసాద్ రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. తన ఆత్మహత్యకు సహచర ఉద్యోగి వరదరాజులు వేధింపులే కారణమని ఆ లేఖలో పేర్కొన్న నిరంజన్ ఇంటి నుంచి కనిపించకుండా వెళ్లిపోయారు. సాక్షాత్తూ శ్రీవారి సన్నిధిలో ఉన్న ఎస్వీబీసీ ప్రధాన కార్యాలయాన్ని అడ్డగా మార్చుకుని వరదరాజులు అక్రమ చిట్టి దందా కొనసాగిస్తున్నారని నిరంజన్ ఆరోపించారు. తాను వరదరాజుల చేతిలో మోసపోయాయని.. అతని వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటునానని నిరంజన్ లేఖలో చెప్పారు. అయితే ప్రస్తుతం నిరంజన్ ఎక్కడ ఉన్నాడనే విషయం తెలియడం లేదు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎక్కడికైనా వెళ్లిపోయాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. -
రాఘవేంద్రుడి డైరెక్షన్
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా సినీ దర్శకులు కె.రాఘవేంద్రరావు నియమితులయ్యారు. శనివారం సాయంత్రం టీటీడీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇంతకు ముందు టీటీడీ ట్రస్ట్‌బోర్డులో సభ్యుడిగా కొనసాగిన రాఘవేంద్రరావును ఈసారి ఎస్వీబీసీకి చైర్మన్‌గా నియమించినట్లు టీటీడీ తన ప్రకటనలో పేర్కొంది. ఎస్వీబీసీకి చైర్మన్‌ను నియమించడం ఇదే మొదటిసారి. తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తి తత్వాన్ని, క్షేత్ర ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటేందుకు, హిందూ ధార్మికతను పెంచేందుకు 2008లో టీటీడీ ఎస్వీబీసీ చానల్‌ను ప్రారంభించింది. ఏడాదికి రూ.25 కోట్ల బడ్జెట్‌ను కేటాయించి ఎస్వీబీసీని నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ సీఈఓలుగా కేఎస్ శర్మ, జయదేవరెడ్డి, ఎస్.రామానుజం, మధుసూదనరావు, నరసింహారావులు పనిచేశారు. ప్రస్తుతం టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేకాధికారిముక్తేశ్వరరావు ఎస్వీబీసీకి ఇన్చార్జి సీఈఓగా కొనసాగుతున్నారు. ఆరోపణలు ఉన్నప్పటికీ ఇటీవల ఎస్వీబీసీ ఉద్యోగులు, సీఈఓ నరసింహా రావుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడిచింది. ఎస్వీబీసీ నిధులను కొల్లగొట్టడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఉద్యోగులు సీఈఓపై ఈఓకు ఫిర్యాదు చేశారు. సీఈఓ నరసింహారావు నిధుల వాడకంపై విజిలెన్సు విచారణ కూడా జరిగింది. ఇందులో రూ.2 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అప్ప టి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్న రాఘవేంద్రరావు ఎస్వీబీసీలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం కోసం కోట్లలో నిధులు ఖర్చు పెట్టారని, యాంకర్ పార్టులు మార్చి పాత వాటినే కొత్త ఎపిసోడ్లుగా చూ పారన్న ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ పరిస్థితి గందరగోళంగా మారింది. చానల్ మొత్తాన్ని ప్రక్షాళన చేయాలన్న నిర్ణయంలో ఉన్న టీటీడీ తాజాగా ఎస్వీబీసీ చైర్మన్ నియామకాన్ని జరి పింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవేంద్రరావుకు చైర్మన్ పదవిని ఎలా ఇస్తారన్నది కొందరు ఉద్యోగుల ప్రశ్న. మొదటి నుంచీ ఎస్వీబీసీ వ్యవహారంలో పోరాటం చేస్తున్న రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్‌రెడ్డి కూడా చైర్మన్‌గా రాఘవేంద్రరావు నియామకాన్ని తప్పుబడుతున్నారు. -
వివాదాల్లో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్
-
సరికొత్తగా ఎస్వీబీసీ కార్యక్రమాలు
తిరుపతి అర్బన్: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వరా భక్తి ఛానల్(ఎస్వీబీసీ)లో సరికొత్త పంథాలో కార్యక్రమాలను ప్రసారం చేయనున్నట్లు చానెల్ సీఈవో ఏవీ నరసింహారావు తెలిపారు. ఈ కొత్త కార్యక్రమాల్లో భాగంగా ‘పూజకు వేళాయె’ అనే కార్యక్రమం శనివారం ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. అలాగే 13వ తేదీ నుంచి ప్రారంభమయ్యే భక్తిగీత మాలిక కార్యక్రమం ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు ప్రసారమవుతుందన్నారు. ఇదేరోజు ప్రారంభం కానున్న భక్తిచైతన్యం కార్యక్రమం ప్రతి సోమ, మంగళ, బుధవారాల్లో రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతుందన్నారు. -
త్వరలో ఎస్వీబీసీ తమిళ ఛానల్
* తెలుగు, తమిళం, కన్నడ భక్తులకు ధర్మప్రచారం మరింత విస్తృతం * సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వశాఖతో సంప్రదింపులు సాక్షి, తిరుమల: తెలుగు బుల్లితెరపై ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేష ఆదరణ పొందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ఇక తమిళ భాషలోనూ కనిపించనుంది. ఇందుకోసం టీటీడీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వైభవ ప్రాశస్త్యం, ఆథ్యాత్మిక, ధార్మిక, భక్తి కార్యక్రమాలను జనబాహుళ్యంలో నేరుగా తీసుకెళ్లాలని టీటీడీ సంకల్పించింది. ఆమేరకు జూలై 7వ తేదీ, 2008న శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ను ప్రారంభించింది. రోజూ తిరుమల, తిరుచానూరు అమ్మవారి ఆలయంలో నిర్వహించే విశేష సేవల ప్రత్యక్ష ప్రసారాలు ఎస్వీబీసీ ప్రత్యక్షంగా భక్తుల ఇళ్ల వద్దకే చేరుస్తోంది. రోజుకు 11 గంటలు కేటాయించారు. ఏపీ, తెలంగాణ వారికి తెలుగులోనే వ్యాఖ్యానం చేస్తుంటారు. ఇక తమిళనాడులోని భక్తులకు తమిళ వ్యాఖ్యానం, కర్ణాటకాలోని భక్తులకు కన్నడ వ్యాఖ్యానం చేయటం వల్ల ఆయా ప్రాంతాల్లోని భక్తులకు సులభంగా శ్రీవారి కార్యక్రమాలు చేరుతున్నాయి. వీటితోపాటు తమిళ భక్తుల కోసం ఆథ్యాత్మిక విశేషాలు, ప్రవచనాలు, భక్తి కార్యక్రమాల కోసం 1.30 గంటలు, కన్నడ భక్తుల కోసం గంట కేటాయించారు. ఇలా తమిళ భక్తులకు 12.30 గంటలు, కన్నడ భక్తులకు 12 గంటలపాటు శ్రీవారి కార్యక్రమాలు చేరవేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చేవారిలో 35 నుంచి 45 శాతం తమిళ భక్తులు, మరో 20 శాతం కన్నడ భక్తులు ఉన్నారు. వీరికోసం ప్రత్యేకంగా తమిళంలోనే ఎస్వీబీసీ కార్యక్రమాలు ప్రసారం చేయాలని రెండేళ్లకు ముందే టీటీడీ నిర్ణయించింది. ఆ మేరకు లెసైన్సు హక్కుల కోసం ఢిల్లీలోని సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వశాఖకు దరఖాస్తు చేసుకుంది. తమిళ, కన్నడ భక్తుల నుంచి తమ భాషలకు కూడా ప్రాధ్యాత ఇవ్వాలని విజ్ఞప్తులు పెరిగాయి. దీంతో టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు తమిళఛానల్పై దృష్టిపెట్టారు. అతిత్వరలోనే తమిళ ఛానల్ ఎస్వీబీసీకి భక్తుల నుంచి విశేష ఆదరణ ఉంది. తిరుమలకు వచ్చేవారిలో తమిళులు, కన్నడిగులూ ఉన్నారు. వారి భాషల్లోనూ స్వామి కైంకర్యాలతోపాటు టీటీడీ కార్యక్రమాలను విసృతం చేసేందుకు తమిళ ఛానల్ అవసరం ఉంది. దీనిపై ఢిల్లీ స్థాయిలో సంబంధిత మంత్రిత్వశాఖతో సంప్రదింపులు చేస్తున్నాం. త్వరలోనే అనుమతులు వస్తాయని భావిస్తున్నాం. - టీటీడీ ఈవో సాంబశివరావు -
త్వరలో ఎస్వీబీసీ తమిళ ఛానల్
తిరుమల: బుల్లితెరపై ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేష ఆదరణ పొందిన శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ ప్రత్యేకంగా తమిళ భాషలో కనిపించనుంది. ప్రస్తుతం తెలుగు ఛానల్లోనే తమిళం,కన్నడం కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చేవారిలో 45 శాతం తమిళ భక్తులు, 20శాతం కన్నడ భక్తులు ఉంటున్నారు. ఒకవైపు తెలుగు ఛానల్లో ఇతర భాషా కార్యక్రమాలు చేయటం సరికాదనే డిమాండ్.. మరోవైపు తమిళ, కన్నడ భక్తుల నుండి తమ భాషలకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలనే విజ్ఞప్తులు పెరిగాయి. దీంతో వీరికోసం ప్రత్యేకంగా తమిళంలోనే ఎస్వీబీసీ కార్యక్రమాలు ప్రసారం చేయాలని రెండేళ్ల కిందట టీటీడీ నిర్ణయించింది. ఆ మేరకు ఢిల్లీలోని సమాచార, బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వశాఖకు దరఖాస్తు చేసుకుంది. అనుమతుల అనంతరం తమిళం, కన్నడ భాషలకు సంబంధించిన భక్తి కార్యక్రమాలను ప్రసారం చేయనున్నారు.