
తిరుమల: శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ట్రస్టుకు బుధవారం సాయంత్రం రూ.కోటి విరాళంగా అందింది. కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన ప్రమతి సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ పి.ఎస్.జయరాఘవేంద్ర ఈ విరాళం అందించారు. ఈ మేరకు విరాళం డీడీని దాత తరఫున టీటీడీ బోర్డు సభ్యులు డి.పి.అనంత తిరుమలలోని బంగళాలో టీటీడీ అదనపు ఈవో, ఎస్వీబీసీ ఎండీ ఎ.వి.ధర్మారెడ్డికి అందజేశారు.
వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
తిరుమలలో బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి వారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment