trust
-
అయోధ్యలో దీపావళికి రెండు లక్షల దీపకాంతులు
అయోధ్య: రాబోయే దీపావళి నాడు అయోధ్యలో లక్షలాది దీపాలు వెలగనున్నాయి. రామాయణ యుగాన్ని తలపించే విధంగా అయోధ్య ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. రామజన్మభూమి ప్రధాన మార్గం నుంచి గర్భగుడి వరకు భారీ అలంకరణ చేయనున్నారు.ఈసారి దీపావళికి ఆలయ ప్రాంగణంలో రెండు లక్షల దీపాలు వెలిగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ట్రస్ట్ చైనా వస్తువులు, దీపాలను నిషేధించింది. రెండు లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డు నెలకొల్పే లక్ష్యంతో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ దీపావళి నాడు శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చే దృశ్యాలను పునశ్చరణ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. భారత్ భిన్నత్వం కలిగిన దేశమని, మనమంతా పండుగలను ఎలా, ఎప్పుడు జరుపుకోవాలనే వివరాలను పండితుల నుంచి తెలుసుకుంటామన్నారు. జన్మాష్టమి వంటి పండుగలను నక్షత్రం, ఆరోజు ఉదయం ఉన్న తిథి ప్రకారం జరుపుకుంటారని తెలిపారు. కాశీ పంచాంగాన్ని అనుసరించి దీపావళి అక్టోబర్ 31న వచ్చిందన్నారు.ఇది కూడా చదవండి: 30 కోట్లకు విమాన ప్రయాణికులు -
కేంద్రంపై రైతులకు విశ్వాసం లేనట్లుంది: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య అపనమ్మక(విశ్వాసంలేని) పరిస్థితులున్నట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం కేంద్రం కొన్ని చర్యలు చేపట్టాలని కోర్టు అభిప్రాయపడింది. రాజధాని ఢిల్లీ, హర్యానాకు సరిహద్దుగా ఉన్న శంభూ ప్రాంతంలో రైతుల ఆందోళన సమయంలో బారికేడ్లు తొలగించాలని పంజాబ్-హర్యానా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బుధవారం(జులై 24) ఈ వ్యాఖ్యలు చేసింది.రైతుల సమస్యలను తీర్చేందుకు కేంద్రప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని సూచించింది. అసలు రైతులు ఢిల్లీకి ఎందుకు రావాలనుకుంటారని ప్రశ్నించింది. మీపై వారికి విశ్వాసం లోపించినట్లు కన్పిస్తోందని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు, ప్రభుత్వం మధ్య విశ్వాసం కలిగించే అంపైర్‌లాంటి వ్యక్తి కావాలని కోర్టు పేర్కొంది. రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ప్రతిపాదించింది.దీనిపై వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని, అప్పటిదాకా శంభూ సరిహద్దుల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని కోరింది. సరిహద్దులోని బారికేడ్లను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. కాగా, రైతుల ఉద్యమం సందర్భంగా హర్యానాలోని అంబాలాకు సమీపంలోని శంభూ సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను వారంలోగా తొలగించాలని ఇటీవల పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
అయోధ్యలో మూడు కీలక మార్పులు
అయోధ్యలో కొలువైన బాలక్ రాముని దర్శించుకునేందుకు లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. తాజాగా శ్రీరామ జన్మభూమి ఆలయ ట్రస్టు భక్తుల సౌలభ్యం కోసం మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులలో నెలకొన్న అసంతృప్తిని దూరం చేసేందుకు ఈ నిర్ణయాలు ఉపయోగపతాయని ట్రస్టు భావిస్తోంది.ఇకపై ఆయోధ్య రామాలయానికి వచ్చే ప్రముఖులకు, సెలబ్రిటీస్‌కు చందనం రాయడం లేదా తిలకం పెట్టడం లాంటివి చేయరు. చరణామృతం(తీర్థం) ఎవరికీ ఇవ్వరు. అలాగే అక్కడి పూజారులకు దక్షిణ ఇవ్వకూడదు. దానిని విరాళం రూపంలోనే సమర్పించాల్సి ఉంటుంది.రామాలయంలో భక్తులందరినీ సమానంగా చూడడం లేదనే ఆరోపణలు వస్తున్న దరిమిలా శ్రీరామ జన్మభూమి ఆలయ ట్రస్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఆలయానికి వచ్చే ప్రముఖులకు ప్రత్యేక సౌకర్యాలు లభిస్తున్నాయి. వారికి గంధం పూస్తున్నారు. తిలకం దిద్దుతున్నారు. చరణామృతం అందజేస్తున్నారు. ఈ విధానాన్ని ఇప్పుడు ట్రస్ట్ రద్దు చేసింది. ఇకపై రామాలయానికి వచ్చే ఎవరినీ ప్రత్యేకంగా గుర్తించరు. రామభక్తులందరినీ సమానంగానే పరిగణించనున్నారు. -
అయోధ్యలో 10 పడకల మినీ ఆసుపత్రి!
మండుతున్న ఎండల్లో అయోధ్యకు వస్తున్న భక్తులకు వైద్య సదుపాయాలు అందించేందుకు రామాలయ ట్రస్ట్ 10 పడకల మినీ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చింది. దర్శనం సమయంలో భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా ఈ నూతన ఆసుపత్రిలో చికిత్స అందించనున్నారు. అయోధ్యలో భక్తుల కోసం మినీ ఆసుపత్రితోపాటు దర్శన్ మార్గ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ట్రస్ట్ మీడియాకు తెలిపింది. మండుతున్న ఎండల్లో రామభక్తులకు ఉపశమనం కలిగించేందుకు రామ మందిర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం జన్మభూమి పాడ్ నుంచి రామాలయం వరకు వివిధ ప్రాంతాల్లో వసతి ఏర్పాట్లు చేసినట్లు ట్రస్ట్ తెలిపింది.రామజన్మభూమి మార్గంలో ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ప్రయాణికుల సౌకర్యాల కేంద్రంలో వెయ్యిమంది విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక్కడ కూలర్లు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఈ సేవా కేంద్రంలోనే 10 పడకల మినీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.మూడు రోజుల క్రితం రామజన్మభూమి కాంప్లెక్స్‌లో ఇద్దరు భక్తులు అపస్మారక స్థితికి చేరారు. వారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటన తర్వాత ట్రస్ట్ వెనువెంటనే 10 పడకల మినీ ఆసుపత్రిని భక్తులకు అందుబాటులో ఏర్పాటు చేసింది. ఈ మినీ ఆసుపత్రిలో సాధారణ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు రామమందిర ట్రస్టు సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. ఇక్కడ వైద్యులతో పాటు సిబ్బందిని కూడా నియమించారన్నారు. అలాగే అంబులెన్స్ సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. -
శిల్పి అరుణ్ యోగిరాజ్ గురించి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఏమన్నది?
అయోధ్యలో ఈనెల 22న నూతన రామాలయ ప్రారంభోత్సవం జరగనుంది. అదేరోజు ఆలయంలో బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. సుప్రసిద్ధ మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ అయోధ్యలో కొలువుదీరే బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఈ నేపధ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శిల్పి అరుణ్ యోగిరాజ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆరు నెలల మౌనదీక్ష అరుణ్ యోగిరాజ్ బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దే సమయంలో నెలల తరబడి తన కుటుంబంలోని ఎవరితోనూ మాట్లాడకుండా, ఎంతో దీక్షతో ఈ కార్యాన్ని నెరవేర్చారని ట్రస్ట్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. విగ్రహ తయారీలో అరుణ్ యోగిరాజ్ పూర్తి అంకితభావాన్ని ప్రదర్శించారని తెలిపింది. కుటుంబానికి దూరంగా.. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో విగ్రహ నిర్మాణ సమయంలో అరుణ్ యోగిరాజ్ చూపిన ఏకాగ్రత, కనబరిచిన త్యాగం అమోఘమని అన్నారు. విగ్రహం తయారు చేసే సమయంలో ఈ పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులకు కూడా ఆయన దూరంగా ఉన్నారని చంపత్ రాయ్ తెలిపారు. చివరికి తన పిల్లల ముఖాలు కూడా చూడలేదని, మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించలేదని పేర్కొన్నారు. శంకరాచార్యుల విగ్రహం కూడా.. అరుణ్ యోగిరాజ్‌కు విగ్రహాల తయారీతో అమితమైన అనుబంధం ఉందన్నారు. వారి పూర్వీకులు కూడా శిల్పకళా నైపుణ్యం కలిగినవారేనన్నారు. కాగా కేదార్‌నాథ్‌లోని శంకరాచార్యుల విగ్రహం, ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గరున్న సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. ఇంటిలో సంక్రాంతి సంబరాలు అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన బాలరాముని విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్న నేపధ్యంలో అతని కుటుంబ సభ్యులంతా ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ నేపధ్యంలోనే వారంతా మకర సంక్రాంతిని అత్యంత వేడుకగా చేసుకున్నారు. ఈ సందర్భంగా శిల్పి అరుణ్ యోగిరాజ్ తల్లి సరస్వతి, భార్య విజేత యోగిరాజ్ మీడియాతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ట్రస్ట్ ప్రకటన ఆనందదాయకం అరుణ్ యోగిరాజ్ తల్లి సరస్వతి మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ రోజున శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తమ కుమారుని గురించి చేసిన ప్రకటన తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. రామ్‌లల్లా విగ్రహాన్ని చెక్కడానికి మైసూర్‌లోని హెగ్గదేవన్కోట్లోని కృష్ణ శిలను తమ కుమారుడు ఎంచుకున్నాడన్నారు. ఆ రాయిని శిల్పంగా మలిచేముందు తాను ఆ కృష్ణ శిలను పూజించానని తెలిపారు. ‘జీవితం సార్థకమైంది’ అరుణ్ యోగిరాజ్ భార్య విజేత మాట్లాడుతూ తన భర్త చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ జీవితం సార్థకమైందన్నారు. తన భర్త అరుణ్ ఆరు నెలలపాటు అయోధ్యలో ఉన్న సమయంలో పిల్లలను చూసుకోవడం కొంచెం కష్టంగా మారిందన్నారు. అయితే ఇప్పుడు తన భర్త రూపొందించిన విగ్రహం ఎంపిక కావడం, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తన భర్తను అభినందించడం ఆనందంగా ఉందన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు వెళితే ఎంత ఖర్చవుతుంది? ఎక్కడ బస చేయాలి? -
ముఖ స్తుతి
పొగడ్తకి పొంగిపోని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మనుషులే కాదు దేవతలు కూడా పొగిడితే ఉబ్బి తబ్బిబ్బై పోతారు. పొగడ్త వినగానే డోపమైన్ అనే హార్మోను విడుదల అవుతుంది. అందుకే దైవాన్ని ఇష్టదైవాన్ని అష్టోత్తరాలు, సహస్రనామాలతో కీర్తిస్తూ ఉంటారు. మానవులు, దేవతలు మాత్రమే కాదు. జంతువులు కూడా పొగిడితే సంతోషిస్తాయి. పెంపుడు జంతువులున్నవారికి ఇది అనుభవమే. పొగడ్తలు మనిషిని ప్రోత్సహించే వరకు ఉపయోగ పడతాయి. నిజంగా ప్రతిభ ఉన్నవారికి చిన్న మెప్పుదల ఉత్సాహాన్ని ఇస్తుంది. తాము చేస్తున్నది మంచిదే అయినా సాటివారి ఆమోదముద్ర తమ పని మీద నమ్మకాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. పొగడ్తలో కొంచెం అయినా నిజం ఉంటుంది. ముఖస్తుతిలో అంటే ఎదురుగా పొగడటంలో నిజం ఉండే అవకాశం తక్కువ. మెరమెచ్చుల కోసం లేనిపోనివి అపాదించి చెప్పటం ముఖస్తుతి. ఆ సంగతి అంటున్నవారికి, వింటున్నవారికి తెలుసు. అయినా ఇష్టం లేనట్టు ముఖం పెట్టి వింటూనే ఉంటారు. లోలోపల సంతోషంగానే ఉంటుంది. ఎటువంటి వారికైనా తమని మెచ్చుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. ‘‘మీ లాగా పొగడ్తలు ఇష్టపడని వారు చాల గొప్పవాళ్ళు. అందుకే మీరంటే నాకు ఎంతో అభిమానం.’’ అంటే బోల్తాపడరా? చిన్నపిల్లల దగ్గర నుండి, దేవతల వరకు. ముఖస్తుతిని ఆశించి, ఆనందించే వారు సాధారణంగా నష్టపోతూ ఉంటారు. తనకి అపాదించబడిన గుణాలు తనలో ఉన్నాయేమో నని భ్రమ పడుతూ ఉంటారు. ఆ భ్రమ వల్ల దానిని నిజం చేయాలనే తాపత్రయంలో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. దాని వల్ల కలిగే దుష్ఫలితాలు ఏవిధంగా ఉంటాయో గమనించ వచ్చు. ఉదాహరణకి: మన్మథుడు, శల్యుడు. ఇంద్రుడు మన్మథుణ్ణి పిలిపించి అతడి సామర్థ్యాన్ని పొగుడుతాడు. అతడు ఉబ్బి తబ్బిబ్బు అయిపోయి ‘‘నేను ఎంతటి వారినైనా ప్రలోభపెట్ట గలను – శివుడైనా సరే!’’ అంటాడు. ఇంద్రుడికి కావలసింది అదే! అంతే! ఇరుక్కుపోయాడు. శరీరాన్ని కోల్పోయాడు. శల్యుణ్ణి దుర్యోధనాదులు పొగిడి కర్ణుడి రథసారథిగా ఒప్పించారు. ససేమిరా, నేను సారథ్యం చేయట మేమిటి? అని భీష్మించుకున్న శల్యుడు తనని కృష్ణుడితో సమానమని పోల్చగానే ఆ పొగడ్తల మాయాజాలంలో పడి రథసారథ్యం చేశాడు. ములగచెట్టు ఎక్కించటం అని చమత్కారంగా అంటూ ఉంటారు. ఆ కొమ్మ పుటుక్కున విరిగిపోతుంది. ముఖస్తుతి చేసే వారు ఎదుట పొగిడినా, వెనుక విమర్శిస్తూ ఉంటారు. పైగా పొగడ్తలకి పడిపోయారని చులకనగా మాట్లాడుతారు. ఈ ఆయుధం కొన్ని మారులు ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ‘‘నా బంగారుకొండ మంచివాడు. చక్కగా అన్నం తిని నిద్రపోతాడు.’’ అంటుంది తల్లి. వాడు అన్నం తినటానికి పేచీ పెడతాడని ఒక పట్టాన నిద్రపోడని ఆ తల్లికి తెలుసు. వినగా, వినగా ఆ లక్షణాలు కొడుకులో పెంపొందుతాయేమోననే ఆశతో ఆ విధంగా పొగుడుతుంది. ఒక రాజుకి ఒక కన్ను లేదు. తన చిత్రాన్ని అందంగా వేసిన వారికి బహుమతి ప్రకటించాడు. ఒక చిత్రకారుడికి ఆ బహుమతి దక్కింది. రాజు విల్లు ఎక్కుపెట్టి లక్ష్యం వైపు చూడటానికి ఒక కన్ను మూసినట్టు వేశాడు. పొగడటానికి అబద్ధాలు చెప్పనక్కర లేదు. సాధారణంగా ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి లేని సద్గుణాలని అపాదించి ఇంద్రుడు, చంద్రుడు అని కీర్తించేదే ముఖస్తుతి. పిల్లికి బిచ్చం పెట్టని వాణ్ణి దానకర్ణుడని, పొట్ట పొడిస్తే అక్షరం ముక్క లేని వాణ్ణి బృహస్పతి అని పొగడటం ముఖస్తుతి కాక మరేమిటి? ముఖస్తుతికి అలవాటు పడిన వారు విమర్శను అంగీకరించ లేరు. ఆత్మవిమర్శ అసలే ఉండదు. తాము చేసింది సరైనదే అనే మొండిపట్టు ఉంటుంది. పొరపాట్లని సరిదిద్దుకునే లక్షణం ఉండదు కనుక నాశాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. మహత్కార్యాలు చేయటానికి ఈ పొగడ్త ప్రేరకం అవుతుంది. ఉదాహరణకి హనుమ. – డా.ఎన్.అనంత లక్ష్మి -
రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే..
శ్రీరామ జన్మభూమి అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముడు జనవరి 22న కొలువుదీరనున్నాడు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానపత్రికలను ప్రముఖులకు అందజేస్తున్నారు. అయితే సామాన్యులు జనవరి 22 తరువాత ఆలయాన్ని సందర్శించుకోవాలని రామజన్మభూమి ఆలయట్రస్ట్ కోరింది. జనం రద్దీని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నూతన రామాలయం ప్రాంగణంలో పలు ఇతర ఆలయాలు కూడా ఉండనున్నాయని రామాలయ ట్రస్టు తెలిపింది. వీటిలో మహర్షులు వాల్మీకి, వశిష్ఠుడు, విశ్వామిత్ర,అగస్త్యుడు, శబరి, అహల్య ఆలయాలు ముఖ్యమైనవి. దీంతో పాటు నైరుతి భాగంలో నవరత్న కుబేరుడు కొలువుదీరనున్నాడు. గుట్టపై ఉన్న శివాలయాన్ని పునరుద్ధరించి అక్కడ రామభక్తుడు జటాయురాజు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అయోధ్యలో ఉన్న రామ మందిర సముదాయాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసు ఎస్టీఎఫ్ పర్యవేక్షించనుంది . 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇది కూడా చదవండి: 22న అయోధ్యలో వెలగనున్న భారీ దీపం -
The Little Theatre: వందలాది పిల్లల అమ్మ
‘ఆరంభ శూరత్వం’ చాలామందిలో కనిపిస్తుంది. అయితే చెన్నైకి చెందిన అయేషా మేడమ్‌లో అది మచ్చుకైనా కనిపించదు. మూడు దశాబ్దాల క్రితం నాటకరంగంలోకి అడుగు పెట్టిన అయేషా పిల్లల్లో సృజనాత్మక కళల వికాసానికి ‘ది లిటిల్ థియేటర్’ ప్రారంభించింది. కాలంతో పాటు నడుస్తూ కొత్త ఆలోచనలు జత చేస్తూ థియేటర్‌ను ఎప్పటికప్పుడు క్రియాశీలంగా, నిత్యనూతనంగా నిర్వహిస్తోంది. మూడు దశాబ్దాల క్రితం ‘క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి పనిచేయాలని ఉంది’ అని తన మనసులో మాటను తండ్రి దగ్గర బయట పెట్టింది అయేషా. ఆయన ప్రోత్సాహకరంగా మాట్లాడారు. అలా తండ్రి–కూతురు ఆలోచనల్లో నుంచి వచ్చిందే ది లిటిల్ థియేటర్ ట్రస్ట్. ఆరంభంలో ఉన్న ఉత్సాహం ఆ తరువాత చాలామందిలో కరుగుతూ పోతుంది. కాని మూడు దశాబ్దాలు దాటినా ‘ది లిటిల్ థియేటర్’ ఉత్సాహం. సృజన శక్తి రవ్వంత కూడా తగ్గలేదు. ‘ఇంకా కొత్తగా ఏం చేయవచ్చు’ అని ఆలోచిస్తూ వెళుతోంది ది లిటిల్ థియేటర్. కళలు, ఆరోగ్యాన్ని మేళవించి 2015లో చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆసుపత్రిలో ‘హాస్పిటల్ క్లౌన్స్’ను పరిచయం చేసింది లిటిల్ థియేటర్. కీమో థెరపీ చేయించుకునే పిల్లలకు ‘క్రియేటివ్ థెరపీ’ అందిస్తోంది. ‘లిటిల్ థియేటర్’ ద్వారా ఏడాది పొడవునా సృజనాత్మక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. రెండు నుంచి నాలుగు సంవత్సరాల పిల్లల కోసం ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. క్యాంప్ ఫైర్ కథల కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. కోవిడ్ కల్లోల సమయంలో ‘లిటిల్ థియేటర్’ ఆన్‌లైన్‌లోకి వచ్చింది. మల్టీ–కెమెరా సెటప్‌తో షోలను ఎడిట్ చేసి అప్లోడ్ చేసేవారు. యూట్యూబ్ చానల్ ద్వారా ఎంతోమందికి చేరువ అయింది. వన్స్ అపాన్ ఏ టైమ్ తన ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తూ ‘పిల్లలకు క్లాసు, హోంవర్క్ తప్ప మరో వ్యాపకం లేకుండా ఉంది’ అని నిట్టూర్చింది అయేషా. విదేశాల్లో ఉన్నత చదువు చదివిన అయేషా అక్కడ పిల్లల సృజనాత్మక వికాసానికి ఎన్నో వేదికలు ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఇక్కడ వాటి కొరత ఉంది అని గ్రహించి ‘ది లిటిల్ థియేటర్’కు శ్రీకారం చుట్టింది. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లితో ‘నాకు వందలాది పిల్లలు పుడతారు’ అని చెప్పింది చిన్నారి అయేషా. కూతురు మాట విని తల్లి పెద్దగా నవ్వింది. ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ‘నా మాట నిజమైంది. ఇప్పుడు నాకు వందలాది పిల్లలు. ది లిటిల్ థియేటర్‌కు దగ్గరైన వాళ్లందరూ నా పిల్లలే’ అంటుంది అయేష. స్కూల్ ముగిసిన తరువాత పిల్లల కోసం నాటకానికి సంబంధించిన ప్రాథమిక విషయాలను పరిచయం చేసే కార్యక్రమాల నుంచి కుండల తయారీ వర్క్‌షాప్‌ల వరకు ఎన్నో నిర్వహించింది ది లిటిల్ థియేటర్. ‘ది లిటిల్ థియేటర్’ ట్రస్టు ప్రతి సంవత్సరం వందలాది మంది నిరుపేద పిల్లలకు సహాయపడుతుంది. ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన బాధ్యతలు చూస్తున్న అయేషా థియేటర్‌కు సంబంధించి సృజనాత్మక కార్యకలాపాలను మాత్రం యువతరానికే అప్పగించింది. ‘ప్రతిభావంతులైన యువతరానికి సృజనాత్మక బాధ్యతలు అప్పగిస్తే కంటెంట్‌లో కొత్తదనం కనిపిస్తుంది. సంస్థ మరింత ముందు వెళుతుంది’ అంటుంది అయేషా. ‘నాటకరంగంలోకి అడుగు పెట్టి ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదా, నేర్చుకున్నది ఏమిటి?’ అనే ప్రశ్నకు జవాబు ఆమె మాటల్లోనే... ‘నాటకరంగంలోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దాటింది. అయినప్పటికీ నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అనిపిస్తుంది. నాటకరంగానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆన్లైన్ కోర్సులలో చేరుతుంటాను. నేను నేర్చుకున్నదాన్ని లిటిల్ థియేటర్‌కు తీసుకువస్తుంటాను’ అంటోంది అయేషా. క్రియేటివ్ థెరపీ హాస్పిటల్ వాతావరణంలో గాంభీర్యం, విషాదం, నిర్వేదం మిళితమై కనిపిస్తుంటాయి. ఈ వాతావరణాన్ని మార్చడానికి ఆస్పత్రిలో చేరిన పిల్లల్లో హుషారు తెప్పించడానికి, వారి పెదవులపై నవ్వులు మెరిపించడానికి చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రిలో ది లిటిల్ థియేటర్ ‘క్రియేటివ్ థెరపీ’ నిర్వహిస్తోంది. కథల కార్యక్రమం నుంచి తోలుబొమ్మలాట వరకు రకరకాల సృజనాత్మక కళలలో పేషెంట్లుగా ఉన్న పిల్లలను కలుపుకుంటూ వారిని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళతారు. ‘క్రియేటివ్ థెరపీ’ కోసం హాస్పిటల్లో ఒక స్టూడియో ఏర్పాటు చేశారు. ఈ ఏసీ స్టూడియోలో పెర్ఫార్మెన్స్ లైట్లు, సౌండ్ సిస్టమ్స్, డిజిటల్ టీవీ స్క్రీన్, వర్క్‌షాప్‌కు సంబంధించి రకరకాల వస్తువులు ఉంటాయి. హాస్పిటల్‌లోని పిల్లల దిగులును దూరం చేయడంలో క్రియేటివ్ థెరపీ సత్ఫలితాలు ఇచ్చింది. హాస్పిటల్‌లోని పిల్లల కోసం షెల్ఫ్‌ల నిండా బట్టలు, బొమ్మలు, కలరింగ్ బుక్స్... మొదలైనవి ఏర్పాటు చేశారు. ఇతర హాస్పిటల్స్ కూడా పిల్లల కోసం ‘ఆర్ట్ థెరపీ’ని మొదలుపెట్టాయి. అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రకరకాల పూల మొక్కలు, ప్లే పార్క్, పిట్టగూళ్లతో పేషెంట్ల కోసం ‘హ్యాపీ ప్లేస్’ను ప్రారంభించింది. మా అదృష్టం ‘చదువే కాదు మా పిల్లలకు కళలు కూడా కావాలి’ అంటున్న తల్లిదండ్రుల పరిచయం నిజంగా మా అదృష్టం. ‘చదువు తప్ప మా పిల్లలకు ఏమీ అవసరం లేదు’ అని వారు అనుకొని ఉంటే ది లిటిల్ థియేటర్ ఇంత దూరం వచ్చేది కాదు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచేది కాదు. డబ్బున్న కుటుంబం, డబ్బు లేని కుటుంబం అని తేడా లేకుండా పిల్లలందరూ కళలతో మమేకం కావాలి. మనిషి సంపూర్ణ మానవుడిగా మారడానికి కళలు ఉపయోగపడతాయి. – అయేషా, ఫౌండర్, ది లిటిల్ థియేటర్ -
ఆస్తుల బదిలీ.. ఇలా ఈజీ!
కుటుంబ సభ్యుల ఆర్థిక భద్రత ప్రతి ఒక్కరికీ ప్రథమ ప్రాధాన్యంగా ఉండాలి. జీవితాంతం ఎంతో కష్టించి, ఆస్తులు, సంపద కూడబెట్టుకోవడంతోనే సరికాదు. తమ వారికి సాఫీగా బదిలీ అయ్యేలా చర్యలు తీసుకున్నప్పుడే ఆకాంక్ష ఫలిస్తుంది. ఒక ఆస్తికి ఒకటికి మించిన వారసులు ఉంటే పంపకం సమస్యగా మారకూడదు. క్లిష్టమైన కుటుంబ నిర్మాణం ఉన్న వారు ఈ విషయంలో ముందుచూపుతో వ్యవహరించాల్సిందే. దురదృష్టవశాత్తూ తమకు ఏదైనా జరిగితే, తమ పేరిట ఉన్న ఆస్తులు వారసులకు సాఫీగా బదిలీ అయ్యేది ఎలా? ఆస్తులకు సంబంధించి వివాదాలు ఏర్పడకుండా చూసుకునేది ఎలా..? ఎస్టేట్ (ఆస్తి) ప్లానింగ్ ఇందుకు పరిష్కారం అవుతుంది. వీలునామా రాస్తే సరిపోతుందిలే అనుకోవద్దు. దీనికంటే మెరుగైనది కుటుంబ ట్రస్ట్. ఆస్తులనే కాకుండా, కుటుంబ వ్యాపారాల సాఫీ పంపిణీ సైతం ఎస్టేట్ ప్లానింగ్‌తో సాధ్యపడుతుంది. ఎస్టేట్ ప్లానింగ్ అంటే..? ఆస్తుల పంపకాన్నే ఎస్టేట్ ప్లానింగ్‌గా చెబుతారు. తమ మరణానంతరం కుటుంబ సభ్యులకు ఆస్తులు ఎలా పంపిణీ చేయాలన్నది ఇందులో ఉంటుంది. తమ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటే కుటుంబ వ్యాపారానికి ఎవరు నాయకత్వం వహించాలి? అనే వివరాలు కూడా ఇందులో భాగమే. ప్లాట్లు, ఇళ్లు, పొలాలు, బంగారం, ఆభరణాలు, బ్యాంక్ బ్యాలన్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నింటికీ ఇందులో చోటు ఉంటుంది. కాయిన్లు, పెయింటింగ్‌లు తదితర అన్నింటి పంపిణీని ఎస్టేట్ ప్లానింగ్‌తో సులభతరం చేసుకోవచ్చు. ట్రస్ట్ ఏర్పాటు కొన్ని కుటుంబాల నిర్మాణం సంక్లిష్టంగా ఉంటుంది. అలాగే, కొన్ని పెద్ద కుంటుంబాలు ఉంటాయి. మొదటి వివాహం ద్వారా పిల్లలు ఉండి, తర్వాత రెండో వివాహం ద్వారా పిల్లలు కన్న వారికి ఆస్తుల పంపిణీలో సహజంగా వివాదాలు ఏర్పడుతుంటాయి. అలాగే, ప్రత్యేక అవసరాల (దివ్యాంగులు) వారూ ఉండొచ్చు. అలాంటి వారికి ఆస్తుల పంపిణీని తమ ఇష్ట ప్రకారం చేసుకోవాలంటే అందుకు వీలునామా లేదా ఫ్యామిలీ ట్రస్ట్ మార్గాలవుతాయి. తమ సంపద సాఫీగా బదిలీ అయ్యేందుకు ట్రస్ట్ వీలు కలి్పస్తుంది. ట్రస్ట్ అంటే ధర్మనిధి. ట్రస్ట్ ఏర్పాటు చేసే వ్యక్తికి, ధర్మ కర్తలకు మధ్య ఒప్పందమే ట్రస్ట్ డీడ్. దీని ద్వారా తనకు సంబంధించిన ఆస్తులను ధర్మకర్తలకు అప్పగిస్తారు. ట్రస్ట్ ఏర్పాటు చేసిన వ్యక్తి మరణానంతరం ట్రస్ట్ డీడ్‌లో పేర్కొన్న విధంగా ఆస్తుల బదిలీ పూర్తి చేయాల్సిన బాధ్యత ట్రస్ట్ నిర్వాహకులపై ఉంటుంది. ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అనుకునే వారు ట్రస్ట్ డీడ్ రాయాల్సి ఉంటుంది. సంపదను ఎలా బదిలీ చేయాలన్నది అందులో స్పష్టంగా పేర్కొనాలి. స్థిర, చరాస్తులను ట్రస్ట్‌కు బదిలీ చేయాలి. ట్రస్ట్ డీడ్ రాసిన తర్వాత దాని నిర్వహణకు ట్రస్టీ (ధర్మకర్త)ని నియమించాలి. స్టాంప్ డ్యూటీ చెల్లించి, ట్రస్ట్‌ను రిజి్రస్టార్ కార్యాలయం వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. ట్రస్ట్ ఏర్పాటు ఉద్దేశాన్ని ట్రస్ట్ డీడ్ తెలియజేయాలి. దీని ఏర్పాటు ఉద్దేశం, ఎలా పనిచేయాలన్నది స్పష్టంగా పేర్కొనాలి. ట్రస్టీ లేదంటే ట్రస్టీలుగా ఎవరిని నియమించాలి? అన్న సందేహం రావచ్చు. స్నేహితులు లేదా బంధువులను ట్రస్టీలుగా నియమించుకోవచ్చు. లేదా కార్పొరేట్ సంస్థను అయినా ట్రస్టీగా నియమించొచ్చు. కొన్ని కార్పొరేట్ సంస్థలు ట్రస్ట్ సేవలను అందిస్తున్నాయి. ట్రస్ట్ వ్యవస్థాపకుడు మరణించినా లేదా తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురైన సందర్భాల్లో ఆస్తులను ఎలా వినియోగించుకోవాలన్న సూచనలను ట్రస్ట్ డీడ్‌లో పేర్కొనొచ్చు. అలాగే, ధర్మకర్త జీవించి లేకపోయినా లేక రిటైర్మెంట్ తీసుకున్నా.. తదుపరి ట్రస్టీగా ఎవరు వ్యవహరించాలన్నది కూడా టస్ట్ర్ డీడ్‌లో పేర్కొనాలి. వీలునామా.. కోర్టు విచారణలు! వీలునామా గురించే ఎక్కువ మందికి తెలుసు. సులభమైన, మెరుగైన సాధనమని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందులో కొన్ని ప్రతికూలతలు లేకపోలేదు. వీలునామా రిజిస్టర్ చేసినా, చేయకపోయినా దాన్ని కోర్టుల్లో సవాలు చేయవచ్చు. వీలునామా అనేది కేవలం వ్యక్తి మరణానంతరం అమల్లోకి వచ్చే పత్రం. వైకల్యం లేదా తీవ్ర అనారోగ్యం బారిన పడిన సందర్భాల్లో వీలునామా పని చేయదు. మరణించిన వ్యక్తి ఆస్తుల బదిలీకి సంబంధించినదే కానీ, ఆ ఆస్తుల నిర్వహణకు సంబంధించినది కాదు. వీలునామా కింద లబి్ధదారులు హక్కులను కోర్టులో నిరూపించుకోవాల్సి వస్తుంది. ఇందుకు ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టొచ్చు. అప్పటి వరకు ఆ ఆస్తులను వినియోగించుకోవడానికి వీలు పడదు. మోసం, ఫోర్జరీ, ఒత్తిడితో రాయించినట్టు లేదా మానసిక వైకల్యంతో బాధపడుతున్న సమయంలో రాయించినట్టు, తెలియకుండా రాయించుకున్నట్టు తదితర ఆరోపణలపై వీలునామాను కోర్టులో సవాలు చేయవచ్చు. వీలునామాను రిజిస్టర్ చేసినంత మాత్రాన అది చట్టబద్ధంగా చెల్లుబాటు అయిపోతుందని అనుకోవడం పొరపాటు. రిజిస్టర్ చేయించిన వీలునామా సైతం కోర్టుల విచారణ పరిధిలోకి వస్తుంది. మనదేశంలో ఎస్టేట్ ప్లానింగ్ కోసం హిందు అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) ఏర్పాటును కొంత మంది అనుసరిస్తుంటారు. ఇది పన్నుకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాటు. ఒక్కసారి హెచ్‌యూఎఫ్ రిజిస్టర్ చేసి, ఆస్తులు దానికి బదలాయించారంటే.. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు దఖలు పడతాయి. హెచ్‌యూఎఫ్ పరిధిలోని ఆస్తులను విభజించడం వివాదాలు, కోర్టు కేసులకు దారితీయవచ్చు. వీటన్నింటిలోకి మెరుగైనది ఫ్యామిలీ ట్రస్ట్. పిల్లలకు కూడా.. మైనర్ చిన్నారులు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఎస్టేట్ ప్లానింగ్ ప్రయోజనకరంగా ఉంటుంది. తాము లేని రోజున తమ పిల్లల బాధ్యతను బంధువులపై మోపడం.. వారు చూస్తారని ఆశించడం అన్ని సందర్భాల్లో సరైనది అనిపించుకోదు. ఇది పూర్తిస్థాయి, పెద్ద బాధ్యత. ట్రస్ట్ ఏర్పాటు చేసి, దాని నిర్వహణ బాధ్యతను కార్పొరేట్ ట్రస్టీకి అప్పగించడం మెరుగైనది అవుతుంది. కార్పొరేట్ ట్రస్టీ అయితే.. ప్రత్యేక అవసరాల పిల్లలకు (దివ్యాంగులు) పూర్తి సమయం పాటు సహాయకుడు/సహాయకురాలిని అందుబాటులో ఉంచుతారు. అలాగే వంట మనిíÙ, వైద్య సాయం సహాయకులు, స్పెషలిస్ట్ డాక్టర్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. పిల్లలు సాధారణంగా తమ హక్కులను క్లెయిమ్ చేసుకోలేరు. అందుకుని వీలునామా రాస్తే, దాని నిర్వహణ బాధ్యతను ఒకరికి అప్పగించాల్సి వస్తుంది. అందుకే వీలునామాలో ఉన్న ప్రతికూలతల దృష్ట్యా పిల్లల కోసం ఫ్యామిలీ ట్రస్ట్ మెరుగైనది అవుతుంది. ఎవరికి అవసరం..? నిజానికి ఎస్టేట్ ప్లానింగ్ లేదా వీలునామా అనేవి సంపన్నులకేనన్న ఒక అపోహ నెలకొంది. ఇది నిజం కాదు. ప్రతి ఒక్కరికీ ఇది ఎంతగానో సాయపడుతుంది. తమ పేరిట ఆస్తులు ఉన్నా, లేదా అప్పులు ఉన్నా సరే ఎస్టేట్ ప్లానింగ్‌తో వారసులకు మార్గం స్పష్టంగా మారుతుంది. అకాల మరణం ఎదురైతే, తమ పేరిట ఉన్న ఆస్తులు ఎలా పంచాలి? అప్పులు ఎలా తీర్చాలి? ఏ ఆస్తి విక్రయించి అప్పు చెల్లించాలి? వీటికి ఎవరు బాధ్యత వహించాలి? ఇలాంటి వాటికి స్పష్టత ఇవ్వొచ్చు. నిజానికి మనలో 90 శాతం మంది ఆస్తులకు సంబంధించి భవిష్యత్ ప్రణాళిక గురించి ఆలోచించరు. వీలునామా కూడా రాయరు. తాము క్షేమంగా ఉన్నందున, మరణం గురించి చర్చించడం, ఆస్తులపై చర్చను కోరుకోకపోవడం వల్ల ప్రణాళికకు దూరంగా ఉంటుంటారు. నిజానికి ఎంతో ముఖ్యమైన ఈ పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు. దీనివల్ల ఉపయోగాలే కానీ, నష్టం ఉండదు. కనుక ప్రతి ఒక్కరూ దీనికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. మార్గాలు.. నామినేషన్, వీలునామా (విల్లు), ఫ్యామిలీ ట్రస్ట్ ఇవన్నీ ఎస్టేట్ ప్లానింగ్‌లో పలు రకాల సాధనాలు. ఆర్థిక సాధనాలకు నామినేషన్ సదుపాయం ఉంటుంది. సంబంధిత ఆస్తి ఎవరికి వెళ్లాలని అనుకుంటే వారి పేరును నామినీగా నమోదు చేసుకోవచ్చు. కానీ, అన్నింటికీ నామినేషన్ సదుపాయం ఉండదు. ముఖ్యంగా స్థిరాస్తులకు నామినేషన్ చేసుకోలేరు. కనుక అన్నింటికీ పరిష్కారంగా ఫ్యామిలీ ట్రస్ట్ అక్కరకు వస్తుంది. ఇలాంటి ఏర్పాట్లు ఏవీ లేకుండా ఓ కుటుంబ యజమాని మరణించిన సందర్భాల్లో లేదా వారసులు కాని వ్యక్తి నామినీగా ఉండి వివాదాలు ఏర్పడిన సందర్భాల్లో.. ఆస్తుల పంపిణీ అన్నది ఆయా మతస్థుల వారసత్వ చట్టం ప్రకారం చేసుకోవాల్సి వస్తుంది. దీనికి కోర్టులను ఆశ్రయించాల్సిందే. హిందూ వారసత్వ చట్టం ప్రకారమైతే మరణించిన వ్యక్తి జీవిత భాగస్వామి, అతని తల్లి, పిల్లలకు సమానంగా ఆస్తులు బదిలీ చేసుకోవాలి. ఈ విషయంలో వివాదం ఏర్పడితే అప్పుడు పరిష్కారానికి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇది నిజం కాదు.. ట్రస్ట్ ఏర్పాటు చేస్తే, తమ ఆస్తులన్నీ ట్రస్టీ నిర్వహణలోకి వెళ్లిపోతాయని, వాటిపై తాము నియంత్రణ కోల్పోతామనే అపోహ ఉంది. ట్రస్ట్ ఏర్పాటు చేసి, దానికి తమ ఆస్తులను బదిలీ చేసిన తర్వాత అప్పుడు ట్రస్టీయే యజమాని అవుతారు. నిజానికి ట్రస్ట్ డీల్‌లో పేర్కొన్న మేరకు బాధ్యతలను నిర్వహించడమే ట్రస్టీ పని. అంతేకానీ, సంబంధిత ట్రస్ట్ నిర్వహణలోని ఆస్తులను వినియోగించుకునే, అనుభవించే హక్కులు ట్రస్టీలకు ఉండవు. కేవలం ట్రస్ట్ డీడ్‌లో పేర్కొన్న లబి్ధదారుల ప్రయోజనాల కోసమే ఆ ఆస్తులను వినియోగించాల్సి ఉంటుంది. ట్రస్ట్ ఏర్పాటు చేసిన వారు జీవించి ఉన్నంత వరకు బదిలీ చేసిన ఆస్తులు, ట్రస్ట్ కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. నేడు పలు ప్రొఫెషనల్ ట్రస్ట్ ఏజెన్సీలు ట్రస్టీ సేవలను అందిస్తున్నాయి. అవి ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరిస్తాయి. ట్రస్ట్ డీడ్‌కు పూర్తి స్థాయి నిర్వాహకుడి మాదిరే పనిచేస్తాయి. -
ఫేస్బుక్ యాడ్స్‌లో ఫేక్ లోన్‌యాప్స్ నమ్మి మోసపోవద్దని
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ మోసాలకు తెరతీసేందుకు సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా ఫేక్ లోన్ యాప్‌లను ఫేస్బుక్లో యాడ్స్ రూపంలో పంపుతున్నట్లు సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్లో వచ్చే ఆన్లైన్ లోన్‌యాప్‌లలో నిమిషాల్లోనే మీ బ్యాంకు ఖాతాల్లో రుణం మొత్తం జమ చేస్తామంటూ నమ్మబలుకుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఫేస్బుక్ వినియోగదారులను టార్గెట్ చేస్తూ ఈ తరహా ప్రకటనలు ఇస్తున్నట్లు తెలిపారు. తీసుకున్న రుణానికి వడ్డీ కూడా అతి స్వల్పం అని ఊదరగొడుతున్నారన్నారు. ఇలా వారి వలకు చిక్కే అమాయకుల నుంచి ప్రాథమిక వివరాల కోసం అంటూ ఆధార్‌కార్డు, పాన్‌కార్డుల వివరాలు సేకరిస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్బీఐ నిబంధనల మేరకు పనిచేసే సంస్థల నుంచే ఆన్లైన్ రుణాలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. -
భావోద్వేగాలతో నిండిన రోజు ఇది: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఇవాళ(బుధవారం) రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు తనను కలిసి ఆహ్వానం అందించారని సంతోషం వ్యక్తం చేశారాయన. ఈ మేరకు ఎక్స్‌లో భావోద్వేగంగా ఆయన ట్వీట్ చేశారు. సియా రామ్! ఈ రోజు భావోద్వేగాలతో నిండిన రోజు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు నన్ను కలవడానికి నా నివాసానికి వచ్చారు. శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా అయోధ్యకు రావాల్సిందిగా ఆయన నన్ను ఆహ్వానించారు. నా జీవితకాలంలో ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చూడటం నా అదృష్టం అని ఎక్స్‌లో పోస్ట్ చేశారాయన. जय सियाराम! आज का दिन बहुत भावनाओं से भरा हुआ है। अभी श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के पदाधिकारी मुझसे मेरे निवास स्थान पर मिलने आए थे। उन्होंने मुझे श्रीराम मंदिर में प्राण-प्रतिष्ठा के अवसर पर अयोध्या आने के लिए निमंत्रित किया है। मैं खुद को बहुत धन्य महसूस कर रहा… pic.twitter.com/rc801AraIn — Narendra Modi (@narendramodi) October 25, 2023 జనవరి 22వ తేదీన ఉత్తర ప్రదేశ్ అయోధ్య నగర రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపనతో ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న 136 సనాతన సంప్రదాయాలకు సంబంధించి పాతిక వేల మంది హిందూ సంఘాల నేతలకు, మరో పాతిక వేల మంది సన్యాసులకు, ఇంకో పదివేల మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానం అందించే యోచనలో ఉంది ట్రస్ట్. 2016లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. ఆ తర్వాతే కేంద్రం శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేయించి మందిర నిర్మాణం ప్రారంభించింది. -
అంత్యక్రియలు చేశారు.. అస్థికలు మరిచారు
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలోని (జూబ్లిహిల్స్ రోడ్డు) వైకుంఠ మహాప్రస్థానంలో శాస్త్రోక్తంగా జలాల్లో కలపాల్సిన అస్థికలు ఏళ్లుగా అక్కడే ఉండిపోతున్నాయి. కొందరు మృతుల బంధువులు వాటిని తీసుకుపోకుండా అస్థికలు భద్రపరిచే రూంలోనే అమానవీయంగా వదిలేస్తుండటమే దీనికి కారణం. దాదాపు నాలుగేళ్ల నుంచి పలువురి అస్థికలు నిలువ ఉంటున్నాయి. దీంతో మహాప్రస్థానం ట్రస్టు స్పందించింది. అంత్యక్రియలు నిర్వహించి చాలాకాలంగా వదిలేసిన అస్థికలను సంబంధితులు తీసుకువెళ్లాలని రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానం ట్రస్టు తెలిపింది. అంతిమ సంస్కారాలు చేసిన పలువురి అస్థికలు 2019 నుంచి మహాప్రస్థానంలోని గదిలోనే ఉండిపోతున్నాయని పేర్కొంది. అస్థికలను తీసుకుపోకుండా అలాగే ఉంచడం సరికాదని వివరించింది. కరోనా సమయంలోనూ చాలా మంది అంతిమ సంస్కారాలు మహాప్రస్థానంలో జరిగాయి. అప్పటినుంచీ కొందరి అస్థికలు అలాగే ఉంటున్నాయి. దీంతో మహాప్రస్థానం ట్రస్టు స్పందించి.. ఈ నెల 30నాటికి అస్థికలను సంబంధికులు తీసుకువెళ్లాలని సూచించింది. లేని పక్షంలో అక్టోబర్ 14న ట్రస్టు ఆద్వర్యంలో సంప్రదాయబద్దంగా పూజా క్రతువులు నిర్వహించి, జలాల్లో కలుపుతామని స్పష్టం చేశారు. వివరాలకు 9703153111, 9703158111 నెంబర్లకు సంప్రదించాలని కోరారు. ఇదీ చదవండి: సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు బాలిక ఆత్మహత్య -
ఎన్సీపీ సంక్షోభం.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
ముంబయి: అజిత్ పవార్ తిరుగుబాటు చేసి ఎన్సీపీలో చీలిక తేవడం మహారాష్ట్ర రాజకీయంలో పెను సంచలన మార్పు. ఈ కీలక పరిణామంలో రాజకీయ ఉద్దండుడిగా పేరుగాంచిన శరద్ పవార్ ఒంటరిగా మిగిలిపోయారు. అయినప్పటికీ తన మేథోసంపత్తితో పార్టీ పునర్నిర్మాణం దిశగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో నాసిక్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో అజిత్ పవార్‌ను ఉద్దేశించి శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవ్వరినీ నమ్మకూడదని అన్నారు. కొందరిని గుడ్డిగా నమ్మి తప్పు చేశానని శరద్ పవార్ అన్నారు. మళ్లీ అలాంటి తప్పులను పునరావృతం చేయబోనని చెప్పారు. 83 ఏళ్లు వచ్చాయని రిటైర్మెంట్పై అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలను శరద్ పవార్ తిప్పికొట్టారు. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పుడు ఆయన వయస్సు ఏంటో తెలుసా? అని సభా వేదికగా ప్రశ్నించారు. (నా టైర్డ్ హు.. నా రిటైర్డ్ హు..) అలసిపోను.. రిటైర్మెంట్ తీసుకోను అనే వాజ్‌పేయీ వ్యాఖ్యలను గుర్తుచేశారు. సొంత కొడుకును కానందునే తనను ఎన్సీపీలో పక్కకుపెట్టారని అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై శరద్ పవార్ స్పందించారు. కుటుంబ విషయాలు బయట మాట్లాడడం తనకు ఇష్టం ఉండదని చెప్పారు. అజిత్ పవార్ నేతృత్వంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు షిండే ప్రభుత్వంతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా దక్కాయి. ఈ క్రమంలో పార్టీని పునర్నిర్మించడానికి రాష్టవ్యాప్త పర్యటనకు శరద్ పవార్ తెరతీశారు. తిరుగుబావుటా ఎగురవేసిన తన సన్నిహితుడైన ఛగన్ బుజ్భల్ నియోజకవర్గమైన నాసిక్ జిల్లా యోలా నుంచి శరద్ పవార్ ర్యాలీ ప్రారంభించడం గమనార్హం. ఇదీ చదవండి: ఇరు‘సేన’లకూ నోటీసులు.. వారంలోగా బదులివ్వాలి: స్పీకర్ -
క్యూబ్ హైవేస్ ట్రస్ట్‌కు రూ. 1,030 కోట్ల నిధులు!
న్యూఢిల్లీ: క్యూబ్ హైవేస్ ట్రస్ట్ (క్యూబ్ ఇన్విట్) తాజాగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) నుంచి రూ. 1,030 కోట్ల మేర నిధులు సమీకరించింది. దీర్ఘకాలిక లిస్టెడ్ నాన్–కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా ఈ మొత్తాన్ని అందుకున్నట్లు సంస్థ వివరించింది. క్యూబ్ హైవేస్ ట్రస్ట్‌కి చెందిన స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. సంస్థకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 11 రాష్ట్రాల్లో రహదారి అసెట్స్ ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 1,424 కిలోమీటర్ల విస్తీర్ణంలో 18 టోల్, యాన్యుటీ ప్రాజెక్టులు ఉన్నాయి. -
‘శ్రీవాణి’పై ఆరోపణలు నమ్మవద్దు
తిరుమల: శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై భక్తులకు ఎవరికైనా సందేహాలుంటే నేరుగా టీటీడీని సంప్రదించి వివరాలు పొందాలని టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి కోరారు. ఈ ట్రస్టుకు సంబంధించి నిరాధారమైన ఆరోపణలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుమలలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్లలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో 8.25 లక్షల మంది శ్రీవాణి ట్రస్టు ద్వారా స్వామిని దర్శించుకున్నారని చెప్పారు. ఎన్నో నియమ నిబంధనల ప్రకారం ట్రస్టు ఏర్పాటవుతుందన్నారు. ఇంతమంది భక్తులకు రసీదులు ఇవ్వకపోతే మిన్నకుంటారా అని ప్రశ్నించారు. విరాళానికి, దర్శన టిక్కెట్‌కు వేర్వేరుగా రసీదులు వస్తాయని చెప్పారు. ఆరోపణలు చేసేముందు వాస్తవాలను పూర్తిగా తెలుసుకోవాలని, లేనిపక్షంలో కోట్లాదిమంది భక్తుల విశ్వాసం దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగం అవాస్తవం శ్రీనివాసమంగాపురంలోని లలితా పీఠాధిపతి శ్రీస్వస్వరూపానందగిరిస్వామి, కడపలోని బ్రహ్మంగారి మఠం మఠాధిపతి శ్రీవిరజానందస్వామి, హైదరాబాద్‌కు చెందిన శ్రీహనుమత్‌పీఠం పీఠాధిపతి శ్రీదుర్గాప్రసాదస్వామి మాట్లాడుతూ శ్రీవాణి నిధులు దుర్వినియోగం అవుతున్నాయని వస్తున్న ఆరోపణలపై వాస్తవాలు తెలుసుకునేందుకు తిరుమలలో ఈవోను కలిశామన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఎంతమంది దర్శించుకున్నారు.. ఎక్కడెక్కడ ఆలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి.. ట్రస్టు నిధులు ఏయే బ్యాంకుల్లో ఉన్నాయి.. వడ్డీ ఎంత వచ్చింది.. తదితర వివరాలను ఈవో తెలియజేశారని చెప్పారు. ఈ వివరాలు పరిశీలించాక తమకు ఎంతో సంతోషం కలిగిందన్నారు. నిధులు దుర్వినియోగమయ్యే అవకాశమే లేదని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే హిందూధర్మం పట్ల భక్తుల విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్లు పక్కాగా ఉన్నాయి హైదరాబాద్‌కు చెందిన సోలిస్ ఐకేర్ ఎండీ రామాంజనేయులు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా సామాన్య భక్తుడిగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నానని, శ్రీవాణి ద్వారా కూడా పలుమార్లు దర్శనానికి వెళ్లానని చెప్పారు. శ్రీవాణి ట్రస్టు అకౌంట్లను పరిశీలించాక తనకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయని తెలిపారు. భక్తులు ఇస్తున్న విరాళాలతో వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. మీడియా సమావేశంలో వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్, పతంజలి సంస్థల ప్రతినిధులు శ్రీధర్‌రావు, మురళి, దీపక్‌రెడ్డి, శ్రీనివాస్, సుబ్బన్న, సురేష్, కుమారస్వామి, టీటీడీ వీజీవో బాలిరెడ్డి, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయవద్దు సనాతన హిందూధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, ఎస్సీ, మత్స్యకార, ఇతర వెనుకబడిన గ్రామాల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీ ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ చేయడం అభినందనీయమని పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు మీడియా సమావేశంలో ప్రశంసించారు. విశ్వహిందూ పరిషత్ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు రాఘవులు మాట్లాడుతూ టీటీడీ ధర్మప్రచారం కోసం ఏర్పాటుచేసిన శ్రీవాణి ట్రస్టుపై రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయవద్దని కోరారు. శ్రీవాణి ట్రస్టుపై కొందరు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. సనాతన ధర్మంలో కీలకమైన దేవాలయం సమాజ సంక్షేమ కేంద్రమని చెప్పారు. పురాతన కాలంలో ఆలయం.. ధర్మశాల, వేదశాల, భోజనశాల, యోగశాల, వైద్యశాల, మల్లశాల, గోశాలగా ఏడు ప్రధాన బాధ్యతలను నిర్వహించేదని తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధార్మికసంస్థ టీటీడీపై నిరాధారమైన ఆరోపణలు చేయడం వల్ల కోట్లాదిమంది భక్తుల మనోభావాలు, విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. తాము శ్రీవాణి ట్రస్టు అకౌంట్లను పరిశీలించామని, ఒక్కపైసా కూడా దుర్వినియోగమయ్యే అవకాశం లేదని చెప్పారు. ఎవరికైనా సందేహాలుంటే నేరుగా తిరుమల వచ్చి శ్రీవాణి ట్రస్టు రికార్డులను, అకౌంట్లను పరిశీలించి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. -
మాకు మద్దతివ్వండి
ముంబై: నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టుపై విశ్వాసం లేదని, అందుకే ఢిల్లీలో పాలనాధికారాలపై నియంత్రణ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ విమర్శించారు. ఆయన బుధవారం ముంబైలో శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తమ పోరాటానికి మద్దతివ్వాలని ఠాక్రేను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్డినెన్స్‌పై రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లును వ్యతిరేకిస్తామని ఉద్ధవ్ హామీ ఇచ్చారన్నారు. సభలో ఈ బిల్లు విఫలమైతే 2024లో బీజేపీ ఓటమి తథ్యమని చెప్పారు. తమ పోరాటం కేవలం ఢిల్లీ కోసం కాదని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసం పోరాడుతున్నామని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను ఓడించడానికి తాము చేతులు కలిపామని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఈసారి బీజేపీని ఓడించకపోతే దేశంలో ఇక ప్రజాస్వామ్యం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఠాక్రే వర్గం శివసేనకు రాజ్యసభలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. కేజ్రివాల్ మంగళవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసి, మద్దతు కోరిన సంగతి తెలిసిందే. -
బోడుప్పల్ లో రూ.10 కోట్ల కుచ్చుటోపి
-
ఆమె చూపిన బడిబాట
తహానున్నిసా బేగంకి బీఎస్సీ నర్సింగ్ పూర్తయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా, మాన΄ాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్టాప్ నర్సుగా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత కమిషన్ ఆన్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఫారిన్ నర్సింగ్ స్కూల్స్ (సీజీఎఫ్‌ఎన్‌ఎస్) కోర్సు చేసింది. అమెరికా వెళ్లడానికి ఐల్ట్స్ కూడా మంచి స్కోర్‌తో పూర్తి చేసినా అక్కడికి వెళ్లడం కుదరకపోవడంతో ఎమ్ఎస్సీ నర్సింగ్ సైకియాట్రీ కోర్సులో చేరింది. ఏడాది పూర్తయ్యేసరికి పునరాలోచనలో పడి కుటుంబ అవసరాల కోసం గృహిణిగా ఇంటికే పరిమితం అయింది. కొడుకుకి తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో సీటు రావడంతో మకాం తిరుపతికి మారింది. చదువు మీదున్న ఆసక్తిని సేవా కార్యక్రమాల వైపు మళ్లించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. సావిత్రీ పూలే అవార్డును అందుకుంది. తన సేవా ప్రస్థానం ఆమె మాటల్లోనే... అమ్మమ్మ... అమ్మ స్ఫూర్తితో... ‘‘మాది తెలంగాణలోని వనపర్తి. మా అమ్మ సైన్స్ టీచర్, నాన్న డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్‌గా లెప్రసీ విభాగంలో పని చేశారు. ఆ స్ఫూర్తితోనే నేను నర్సింగ్ కోర్సు చేశాను. సర్వీస్ మా ఇంటి వాతావరణంలోనే ఉంది. రంజాన్ మాసంలో జకాత్ ఇవ్వడంతో సరిపెట్టే వాళ్లు కాదు. రోజూ ఆకలి తీర్చేవాళ్లు. మా అమ్మమ్మ రోజూ జొన్న రొట్టెలు చేసి రెండు తీసి పక్కన పెట్టి ఆ తర్వాత మాకు తినడానికి పెట్టేది. పక్కన తీసి పెట్టిన రొట్టెలు ఆ రోజు ఆకలితో ఎవరు వస్తే వారికిచ్చేది. మా అమ్మ కూడా తన నెల జీతంలో కొంత భాగం పేద వారికి ఇవ్వడం కోసమే తీసి పక్కన పెట్టేది. అవి చూస్తూ పెరిగాను, నాకు ఉద్యోగం రాగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. ఆకాశమే హద్దు అన్నంతగా సమాజానికి వైద్యసేవ చేయాలనుకున్నాను. అక్కడి పరిస్థితుల్లో ఎంతో కాలం ఇమడలేకపోయాను. నా దృష్టికి వచ్చిన వాళ్లకి చేతనైన సహాయం చేయడంతోనే కొన్నేళ్లు జరిగిపోయాయి. తిరుపతికి వచ్చిన తర్వాత కరోనా సమయంలో నాకు ఒక దారి దొరికింది. నా అసలైన అవసరం ఎక్కడ ఉందో తెలిసింది. మా వారు డాక్టర్, కొడుకు ఎంబీబీఎస్ పూర్తి చేసి కోవిడ్ మెడికల్ ఆఫీసర్‌గా సర్విస్ మొదలు పెట్టేశాడు. వాళ్లిద్దరూ సర్వీస్ ఇస్తున్నారు. నాకు మెడికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి సర్విస్ చేస్తానంటే మా వారు, అబ్బాయి ఇద్దరూ నా ఆరోగ్యరీత్యా వద్దన్నారు. అప్పుడు నేను ఆహారం పెట్టడం అయినా చేయాలని మొదలు పెట్టాను. ఒక పూట అన్నానికి కూడా భరోసా లేని కాలనీలను చూశాను. వాళ్లకు రోజూ అన్నం పెట్టడం, ఆ పిల్లల బాగోగులు అడిగి తెలుసుకుంటూ ఉంటే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. బ్రష్, పేస్ట్, సబ్బు కూడా తెలియని బాల్యం వాళ్లది. వాళ్లకు స్కూల్లో పేరుంటుంది, కానీ వాళ్లు స్కూలుకి పోరు. తర్వాత క్లాస్‌కి ప్రమోట్ కాలేరు. ఏం చదువుతున్నారని అడిగితే ఏదో ఓ క్లాసు చెప్తారు, ఎక్కడ ఆపేశారో కూడా వాళ్లకు గుర్తుండదు. ఇంకా ఇలాంటి జీవితాలున్నాయేంటి... అని బాధ కలిగింది. ఈ స్థితిని చూసిన తర్వాత ‘వియ్ సపోర్ట్’ అంటూ చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించి పూర్తి స్థాయిలో పని మొదలు పెట్టాను. అన్నింటా రాణిస్తున్నారు! అలాంటి పిల్లలు ఈ మూడేళ్లలో ఎంతగా మారిపోయారంటే... వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో బహుమతులందుకున్నారు. త్రోబాల్, వంద మీటర్ల పరుగు, ఖోఖో వంటి ఆటల్లో ముందుంటున్నారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నృత్య ప్రదర్శన ఇచ్చారు. నా పిల్లల నంబరు ఏడాదికేడాదీ పెరుగుతోంది. ఇంకో విషయం... వీళ్లు మేడమ్, టీచర్ అనే పదాలంటేనే భయపడేవాళ్లు. ‘ఆంటీ’ అని పిలిపించుకోవడం అలవాటు చేశాం. దాంతో బాగా మాలిమి అయ్యారు. ఇంకా ఇలాంటి వారిని వెతికి మరీ బడిబాట పట్టించాలి. అదే పనిలో ఉన్నాను’’ అన్నారు తహానున్నిసా బేగం. స్నేహితులు వచ్చారు! మొదట అన్నారావు సర్కిల్ దగ్గరున్న ఎస్టీ కాలనీతో మొదలు పెట్టాను. రోజూ కాలనీకి వెళ్లడం పిల్లలందరినీ బ్రష్ చేయమని, స్నానం చేసి రమ్మని చెప్పడం నుంచి సంస్కరణ మొదలు పెట్టాను. పాఠాలను కంఠతా పట్టడం, ఆ తర్వాత చదవడం, రాయడం నేర్పించాను. ఆ తర్వాత వాళ్లు చదవగలిగిన క్లాసులో చేర్పిస్తున్నాను. ఈ యజ్ఞంలో నన్ను చూసి నా స్నేహితులు ముందుకు వచ్చి పాఠాలు చెప్తున్నారు. కొంతమంది పుస్తకాలు, బ్యాగులు సహాయం చేశారు. వీళ్లు స్కూల్ డ్రాపవుట్స్ కావడంతో ప్రభుత్వం ఇచ్చే పథకం వర్తించదు. అలాంటి పిల్లలను ఒక దారిలో పెట్టిన తరవాత టీటీడీ ఓరియెంటల్ స్కూల్లో చేర్పిస్తున్నాం. – వాకా మంజులారెడ్డి ఫొటోలు : మహమ్మద్ రఫీ, తిరుపతి -
తల్లిదండ్రులే ఆమె పిల్లలు
కడుపున పుట్టిన వాళ్లు తరిమేసిన తల్లిదండ్రులు ఎక్కడికి పోవాలి? పిల్లల్ని పెంచి పెద్ద చేసి పసి పిల్లల వయసుకు చేరుకున్న ఆ వృద్ధులను ఎవరు ఆదుకోవాలి? ‘నేను మీ తల్లిని’ అంది రాజేశ్వరి. నీలగిరులకు ఎవరైనా ఆహ్లాదం కోసం వెళతారు. కాని పిల్లలు విడిచిన తల్లిదండ్రులు మాత్రం రాజేశ్వరిని వెతుక్కుంటూ వెళతారు. ఆమె నడుపుతున్న హోమ్ వారికి శాశ్వత ఇల్లుగా మారింది. ఊరూరా ఎంతమంది రాజేశ్వరుల అవసరం ఉందో కదా ఇప్పుడు. ఈ కథ 20 ఏళ్ల క్రితం మొదలైంది. ఆ రోజు రామమూర్తి తన ఇంటికి ఒక వృద్ధురాలిని తీసుకుని వచ్చాడు. భార్య రాజేశ్వరితో ‘ఇవాళ నుంచి ఈమె మనతోనే ఉంటుంది’ అన్నాడు. రాజేశ్వరి ‘ఎవరు.. ఏమిటి’ అని భర్తని ఒక్క మాట కూడా అడగలేదు. ‘అలాగే’ అంది. అయితే ఆ వృద్ధురాలు లెప్రెసీ పేషెంట్. ఆమెకు ఆ వ్యాధి ఉందనో, మరే కారణం చేతనో అయినవారు ఆమెను వదిలేశారు. రామమూర్తి, రాజేశ్వరిలకు ఇద్దరు ఆడపిల్లలు. చదువుకుంటున్నారు. ‘లెప్రసీ అంటువ్యాధి ఏమీ కాదు కదా.. అదేం పర్వాలేదులే’ అన్నాడు రామమూర్తి. దానికి కారణం– అతడు హెల్త్ డిపార్ట్మెంట్లో పని చేస్తూ ఉండటమే. లెప్రసీ పేషంట్స్‌తో ఎలా వ్యవహరించాలో అతనికి తెలుసు. అలా నీలగిరి జిల్లాలో కూనూరుకు పక్కనే ఉండే తెనాలి అనే చిన్న ఊళ్లో ఒక పెద్ద కార్యక్రమానికి తెర లేచింది. తలుపు తట్టండి... తెరవబడును మరో రెండు రోజులకే రామమూర్తి తలుపు తట్టబడింది. రాజేశ్వరి తెరిచి చూస్తే ఎదురుగా మరో వృద్ధురాలు. ‘మా ఇంట్లో నుంచి గెంటేశారు. మీ ఇంట్లో చోటు ఇవ్వండమ్మా’... రాజేశ్వరి గడప నుంచి పక్కకు జరిగి ఆమెను లోపలికి రానిచ్చింది. మరో వారంలో ఇంకో వృద్ధురాలు వచ్చింది. అప్పటికి రాజేశ్వరి భర్తతో మాట్లాడింది. ‘మన ఇంట్లో చోటు చాలదు. మన టీ గార్డెన్లో పెడదాం’ అంది. నీలగిరి జిల్లా టీ తోటలకు ప్రసిద్ధి. రాజేశ్వరికి కూడా చిన్న టీ తోట ఉంది. అందులోనే ఒక గదిలో ఆ ముగ్గురు స్త్రీలను ఉంచారు. చిన్న ఊరు తెనాలి. ఈ విషయం ఆ నోట ఈ నోట చుట్టుపక్కల ప్రాంతాలకంతా పాకిపోయింది. రామమూర్తికి ఎవరో ఒకరు ఫోన్ చేసేవారు. రాజేశ్వరి వారిని అక్కున చేర్చుకునేది. ఇవాళ్టికి దాదాపు ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. రామమూర్తి రిటైర్ అయ్యాడు. వాళ్ల పెద్దమ్మాయి మెడిసిన్ చేసి డాక్టర్‌గా ఉద్యోగం చేస్తోంది. చిన్నమ్మాయి ఇంకా చదువుకుంటూ ఉంది. అయినప్పటికీ రాజేశ్వరి తన సొంత పిల్లలకు కాకుండా ఇంకో అరవై మందికి తన హోమ్‌లో తల్లిగా ఉంటూ సేవ చేస్తోంది. నగలు కుదువ పెట్టి హోమ్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా రిజిస్టర్ చేసి నడపడం తప్పని సరి అని శ్రేయోభిలాషులు చెప్తే ‘ఎంఎన్ ట్రస్ట్’ పేరుతో రిజిస్టర్ చేసి అర ఎకరాలో రెండు షెడ్స్ వేసి అన్ని విధాలా అనుకూలమైన షెల్టర్ హోమ్‌ను నిర్మించారు రామమూర్తి, రాజేశ్వరి. ‘ఇది అనాథ గృహం కాదు. పిల్లల చేత గెంటివేయబడగ దిక్కులేనివారైన తల్లిదండ్రులకు ఆత్మీయ గృహం’ అంటుంది రాజేశ్వరి. ఇది నడపడం ఎలాగా? ‘మన టీ తోట మీద వచ్చే ఆదాయం దీనికే పెడదాం’ అంది రాజేశ్వరి. ఉద్యోగంలో ఉండగా, ఇప్పుడు పెన్షన్ నుంచి రామమూర్తి సగం ఆదాయం ఈ హోమ్‌కే. డాక్టర్‌గా ఉద్యోగం చేస్తున్న కూతురు ఒక ముప్పై వేల వరకూ పంపుతుంది. మొత్తం మీద నెలకు 70 లేదా ఎనభై వేలు సొంత ఖర్చుల మీదే ఈ భార్యాభర్తలు హోమ్‌ను నడుపుతున్నారు. ‘తమిళనాడు ప్రభుత్వం మా హోమ్‌ను గుర్తించింది కాని వాళ్ల నుంచి ఏమీ ఫండ్స్ రావు. ఈ హోమ్స్ కూడా లోన్ తీసుకుని, నా నగలు కుదువ పెట్టి కట్టాం’ అంటుంది రాజేశ్వరి. ఇప్పుడు హోమ్‌లో 60 మంది ఉన్నారు. అతి తక్కువ వయసు అంటే 47. ఎక్కువ వయసు అంటే 90. ‘ఒక్కొక్కరిది ఒక్కో ధోరణి. కొందరు చెప్పిన వెంటనే మాట వింటారు. మరికొందరు మొండిగా ఉంటారు. ఆత్మీయులకు దూరంగా ఉండటం వల్ల వారికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అన్నింటినీ ఓపిగ్గా భరిస్తూ వస్తాను’ అంటుంది రాజేశ్వరి. సొంత తల్లిలా హోమ్‌లో ఉన్న సభ్యులకు మూడు పూట్లా టీ ఉంటుంది. సాయంత్రం పలహారం ఉంటుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సరేసరి. నీలగిరి చల్లటి ప్రాంతం కాబట్టి ఎప్పుడూ వేణ్ణీళ్ల ఏర్పాటు ఉంటుంది. వెచ్చటి దుస్తులను ఇస్తుంది రాజేశ్వరి. రెండు పూటలా యోగా చేయిస్తారు. ఉల్లాసం కోసం పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ‘వంట పని దాదాపుగా నేనే చూస్తాను’ అంటుంది రాజేశ్వరి. హోమ్ కోసం ఒక వ్యాన్, ఐదుగురు సిబ్బంది పని చేస్తారు. ‘రెగ్యులర్‌గా హాస్పిటల్‌కు తీసుకెళతాం. అందరికీ ఆధార్ కార్డ్‌లు ఇప్పించాం. ఎవరైనా పోతే అంత్యక్రియలు కూడా నిర్వహిస్తాం’ అంటుందామె. ఇంత పని ఎందుకోసం చేస్తున్నారు ఈ భార్యాభర్తలు. బహుశా ఇది చూపదగ్గ మానవత్వం అనుకోవడం వల్ల కావచ్చు. భావితరాలకు పాఠం వీరి హోమ్‌కు రెగ్యులర్‌గా కొంతమంది వచ్చి విరాళాలు ఇస్తారు. కొందరు స్కూల్ పిల్లలు పుట్టినరోజులు జరుపుకోవడానికి వస్తారు. ‘మీ తల్లిదండ్రులను ఇలా విడిచిపెట్టొద్దు’ అని చెబుతుంది రాజేశ్వరి వారికి. పిల్లల్ని పెద్ద చేయడం కోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడతారు. వారిని నిరాకరించి పిల్లలు మరిన్ని కష్టాల్లో నెడతారు. నీలగిరిలో రాజేశ్వరి ఉంది. మీ ఊళ్లో ఎవరున్నారు? -
రూ. 200 కోట్లకు పైగా లతా ఆస్తులు ఎవరికి? వీలునామాలో ఏం ఉంది..
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లతాజీ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్నివేల పాటలతో సంగీత ప్రియులను మైమరిపించిన ఆమె 92 ఏళ్ల వయసులో కన్నుమూసింది. అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఐదేళ్ల వయసు నుంచి పాడటం ప్రారంభించిన లతా మంగేష్కర్ ఇండియన్ నైటింగల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీ, మరాఠీ, తెలుగు సహా వివిధ భాషల్లో 50వేలకు పైగా పాటలు పాడిన ఈ ఇండియన్ నైటింగల్ తన గొంతుతో సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నారు. అలా చివరి వరకు స్టార్ గాయనిగా వెలుగువెలిగిన లతాజీ రెమ్యునరేషన్ కూడా అత్యధికంగానే తీసుకునేవారు. పెళ్లి కూడా చేసుకోని లతా మంగేష్కర్ ఆస్తుల చిట్టా చాలా పెద్దది. ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 200 కోట్లపైనే. సాధారణంగా మరణాంతరం వారి ఆస్తులు పిల్లలకు లేదా భర్తకు చెందుతాయి. కానీ చివరి వరకు బ్రహ్మచారినిగా ఉన్న లతాజీ ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయనేది ప్రశ్నగా మారింది. ఆమె చెల్లెల్లు ఆశా భోంస్లే, మీన ఖడికర్, ఉషా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్లకు దగ్గుతాయని అంటున్నారు. అలాగే తన తండ్రి పేరుపై కట్టించిన ట్రస్ట్‌కు కూడా లతా ఆస్తులు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె చెల్లెల్లు, సోదరుడు గాయకులుగా మంచి పోజిషన్లో ఉన్నారు. ఆస్తులు కూడా బాగానే సంపాదించుకున్నారు. వారంత ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. దీంతో లతా ఆస్తులు ట్రస్ట్‌కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. చిన్నప్పటి నుంచి కూడా చదువు మానేసి మరీ తన జీవితం అంతా కుటుంబాన్ని పోషించడం కోసం కష్టపడింది. మరి ఆమె మరణాంతరం ఆస్తులు ఎవరి పేరుపై ఆమె రాశారనేది సస్పెన్స్‌లో ఉండిపోయాయి. మరి దీనిపై ఆమె లాయరు ఎలాంటి ప్రకటన ఇవ్వనున్నాడనేది కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా ఓ మీడియా రిపోర్టు ప్రకారం.. లతా మంగేష్కర్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు దాదాపు 200 కోట్లకు పైనే ఉంటాయని సమాచారం. ఆమె చివరి వరకు ప్రభు కుంజ్ అనే నివాసంలో ఉన్నారు. అంతేకాక ముంబై పెద్దర్ రోడ్లో మరో విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. ఆమెకి పాటల ద్వారానే కాక రెంట్స్ రూపంలో కూడా సంపాదన వస్తుంది. ఆమె పాడిన పాటలకు రాయల్టీ ద్వారా సంవత్సరానికి దాదాపు 5 కోట్ల పైగానే ఆదాయం వస్తోందని తెలుస్తుంది. -
విజయానికి తొలిమెట్టు అవగాహన
అవగాహన.. మనం నిత్యమూ స్మరించే పదాల్లో ఒకటి. దాదాపుగా ప్రతి వ్యక్తీ వాడే మాట.. ‘‘ఈ విషయం మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది’’.. ‘‘ ఆ పని చేయడానికి కావలసిన ప్రాథమిక అవగాహన కూడా అతనికి లేదు’’. ఇటువంటి మాటలు మనం తరచు మాట్లాడుతూ ఉంటాం. అసలు అవగాహన అంటే ఏమిటో, అవతలివారిని ఏ విధంగా అవగాహన చేసుకోవాలో, అవగాహన వల్ల ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం... అవగాహన అనే పదం చాలా విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉంది. శాస్త్రీయంగా చెప్పాలంటే, ఏదైనా వస్తువు లేదా విషయంమీద ఒక వ్యక్తికున్న ఇంద్రియజ్ఞానాన్ని, ఆకళింపు శక్తినీ అవగాహనగా పేర్కొనవచ్చు. ప్రత్యేకమైన అంశంపై మనకున్న çస్పృహæ అంటే బాహ్య దృగ్విషయ సాక్షాత్కారం మనసులో నిండి ఉండడమే అవగాహన లేదా ఆకళింపు లేదా గ్రహింపు శక్తి. కొంచెం విడమరచి విశ్లేషిస్తే, ఆకళింపు అంటే చేయబోయే పనిమీద ప్రాథమికమైన జ్ఞానాన్ని కలిగి ఉండడం అన్న అర్థంలో తీసుకోవచ్చు. అదే విధంగా తాను కార్యసాధనలో కలిసి పని చేయబోయే వ్యక్తిని గురించి తెలుసుకుని ఉండగలగడాన్ని అవగాహనగా నిర్వచించవచ్చు. ఆనందకరమైన రీతిలో జీవితాన్ని గడపడానికి తన జీవితభాగస్వామితో నిత్యమూ ఆనందకరంగా చరించడమూ అవగాహనకు అందమైన ఉదాహరణే. ప్రజాసేవకు అంకితమయ్యే నాయకులు తాము చేసే సేవా కార్యక్రమాల మీద అర్థవంతమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉండడమూ అవగాహనే. అంతేకాదు, పసిపిల్లలను ముఖ్యమైన విషయాలపట్ల అప్రమత్తంగా తీర్చిదిద్దడమూ మకరందభరితమైన అవగాహనగానే పరిగణించాలి. పిల్లలకు కలిగించవలసిన గ్రహింపుశక్తి గురించి క్లుప్తంగా మాట్లాడాలంటే, బాల్యం ఆరంభ దశ ఎంతో సున్నితమైంది. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల ఎదుగుదల కాలాన్ని బాల్యారంభదశగా పరిగణిస్తే, ఆ సమయంలోనే వారిలో అన్ని విధాలుగా ఎదుగుదలకు ఉపయోగపడేలా, అత్యంత సులంభంగానే విషయాలన్నిటా ఆకళింపు చేసుకునేలా బీజాలు నాటాలి. ఈ సమయంలోనే వారిలో చూపు, స్పర్శ, గుర్తింపు, వినికిడిలాంటి చేతనలన్నీ విజ్ఞానరూపం వైపు తొంగిచూస్తుంటాయి. ఈ సమయంలో ఏ మాత్రం మొరటు తనానికి వారు గురైనా, వారి భావి జీవితాలకు ఎంతో నష్టం కలుగుతుంది. ఆరు సంవత్సరాలలోపు పిల్లల మానసికస్థితి అత్యంత సున్నితంగా ఉంటుంది. వారి వ్యక్తిత్వపు మొలకలు ఆరంభమయ్యే రోజుల్లో ప్రతి విషయం మీదాగ్రహింపు కలిగేలా వారిని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పూర్వ ప్రాథమిక దశలోని పిల్లలకున్న అవసరాలు తెలుసుకోవటం ఎంత ముఖ్యమో, వారి శక్తి సామర్థ్యాలను మనంఅంచనా వేయటం, విభిన్నమైన విషయాలపై అర్థవంతమైన రీతిలో బలాన్ని కలిగించడం పిల్లల సమగ్ర అభివృద్ధికి మధురఫలంగా రూపొందుతుందనడంలో ఎటువంటి సందేహమూ అక్కర్లేదు. అవగాహన గురించి విశ్లేషించుకునే సందర్భంలో తప్పకుండా ప్రస్తావించుకోవలసిన మరొక అంశం భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి ఉండవలసిన నమ్మకం. భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి ఉండవలసిన విశ్వాసపూరిత భావన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఈ అనుబంధమే ధరిత్రిలో సృష్టికార్యానికి మూలమై నవచరితకు ఆధారంగా నిలుస్తోంది కదా..!! ఈ రోజుల్లో జీవిత భాగస్వామితో ఉన్న విశ్వాసరాహిత్యంవల్లనే, వారి దాంపత్యబంధంలో ముఖ్యమైన శాంతి కరువవుతోంది, సుఖమన్నది అరుదవుతోంది. భార్యాభర్తలమధ్య పొడసూపే ఆకళింపు లేమివల్ల సత్సమాజం ఏర్పడేందుకు అవరోధాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఎందుకంటే, తల్లిదండ్రులు వ్యవహరించే తీరునే పిల్లలు అనుసరిస్తారు, అనుకరిస్తారు. ఇది మనస్తత్వ శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెప్పేదేగాక, మనం నిత్యమూ కనులముందు తిలకించేదే..!! ఒకరినొకరు అర్థం చేసుకోవడమైనా, ఒకరి అభిరుచుల్ని మరొకరు గ్రహించడమైనా, ఒకరి ఇష్ట్రపకారం మరొకరు నడుచుకోవడమైనా.. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ దంపతులు ఆలోచించి అడుగేస్తే ఆ దాంపత్యం చిగురులోనే మొగ్గ తొడుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భార్యాభర్తల బంధంలో ఒకరినొకరు అర్థం చేసుకుని చరించడం భారమైన విషయం కాదు, అది మధురమైన మకరంద సారం వంటిదని గ్రహించాలి.. ఇది నిజం..!! ఒకరిపై ఒకరికి అనురాగం, ప్రేమలను మరింత బలీయంగా ఉంచేది వారి మధ్య నిలిచివున్న అందమైన అవగాహనే. ‘‘భార్యకు నచ్చిన పనుల్ని చేయవలసిన అవసరం ఏముందని భర్త భావించడం, భర్త చెప్పినట్లుగా ఎందుకు నడుచుకోవాలి?’’ అని భార్య భావిస్తే, అతి కొద్ది రోజుల్లోనే ఆ బంధం దెబ్బతింటుంది. దీనికి ప్రధాన కారణం వారికి వారుగా ఒకరిపై ఒకరు పెంచుకున్న విశ్వాసరాహిత్యమే అని చెప్పడం నూటికి నూరుపాళ్ళూ నిజం. ఒక విషయాన్ని ఆకళింపుచేసుకోవడం జ్ఞానం కన్నా గొప్పదైన విషయంగా భావించమంటాడు ఓ తత్త్వవేత్త. ‘‘నీవెవరో చాలా మందికి తెలియవచ్చు, కానీ నీ విద్వత్తు మీద, శక్తిసామర్థ్యాల మీద నమ్మకం ఉన్న వాళ్ళ వల్లనే నీ ప్రతిభ లోకానికి పరిపూర్ణంగా తెలుస్తుంది’’ అనే భాష్యం సముచితంగా ఉంటుంది. విద్యార్థులు తమ విద్యపట్ల, లక్ష్యసాధకులు తాము సాధించ దలచిన లక్ష్యంపట్ల అవగాహన కలిగి ఉన్నట్లే, దేశ ప్రగతిని కాంక్షించే నాయకులకు తాము ఏ రకంగా ఉత్తమ సేవలను అందించి దేశానికి ప్రగతిని, సుగతిని అందించదలచుకున్నామో అన్న విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం దేశప్రగతికి అత్యంత ముఖ్యమైన విషయం. ప్రతి అందమైన బంధానికీ ఇరువురి మధ్య అవగాహన అనేది ఎంతో ముఖ్యం. సాధకుని ఆలోచనా ధోరణిలో నిండి వున్న దృఢమైన అవగాహనే కార్యసాధనలో విజయానికి ప్రధాన భూమిక నిర్వహిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఏదైనా లక్ష్యాన్ని సాధించాలి అని భావించినప్పుడు, ఆ లక్ష్య సాధనకు సంబంధించిన విషయాల పట్ల సమగ్రమైన గ్రహింపుని కలిగి ఉండడమనేది మౌలికమైన విజయసూత్రంగా భాసిస్తుంది. సాధనా క్రమంలో ఏదైనా విషయం తెలియకపోయినా, కొద్దిపాటి ఆకళింపు లేకపోయినా, ఆ విషయాన్ని సాధకుడు పనికిమాలిన అంశంగా భావించకూడదు. అదే, పరాజయానికి హేతువుగా మారుతుంది. నీకు ఏ విషయమైనా తెలియకపోయినా, ఆ రంగంలో నిష్ణాతులైనవారినో, అందులోని లోటుపాట్లను విడమరచి చెప్పగలవారినో ఆశ్రయించాలి. అందుకే, ఒక ఆర్యోక్తిలో చెప్పినట్లు ‘‘పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవడం ముఖ్యం కాదు. చిన్న చిన్న విషయాలను సమగ్రంగాఅర్థం చేసుకుంటూ ముందుకు సాగడం వివేకి లక్షణం’’ అన్న మాటలు శిరోధార్యమే..!! –వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి -
వెలుగులోకి ధూళిపాళ్ల ట్రస్ట్ అక్రమాలు
-
ధూళిపాళ్ల నరేంద్రకు దేవాదాయశాఖ నోటీసులు
సాక్షి, గుంటూరు: ధూళిపాళ్ల నరేంద్రకు శుక్రవారం దేవాదాయశాఖ నోటీసులు అందించింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరీ స్మారక ట్రస్ట్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆయనకు ట్రస్ట్ వార్షిక ఆదాయ వివరాలు అందించాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే 2018 నుంచి జమా ఖర్చుల వివరాలను అందించాలని నోటీసులో పేర్కొంది. -
కొండకోనల్లో ప్రవాసిని వైద్యం
పోషకాహార లేమి, ప్రసూతి మరణాలు ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతుంటాయి. ఒరిస్సాలోని కంధమాల్ జిల్లాలో గిరిజన తండాలు ఎక్కువ. అరకొరగా కూడా అందని వైద్యసేవలు. రోడ్లు, రవాణా, ఫోన్ సదుపాయాలు లేక అటవీ ప్రజానీకం నిత్యం అవస్థలను ఎదుర్కొంటూనే ఉంది. 33 ఏళ్ల ప్రవాసినీ భట్నాగర్ ఈ పరిస్థితిని గుర్తించి, అవసరమైన మెడిసిన్స్ పట్టుకొని కొండకోనల్లో ఉన్న గిరిజనులకు అందజేస్తోంది. ప్రసూతి మరణాల నివారణకు కృషి చేస్తోంది. ఆరోగ్య అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తోంది. మూడేళ్లుగా ఆత్మశక్తి ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రవాసిని మారుమూల గ్రామాల్లోని దాదాపు 21 వేల మంది గిరిజనుల్లో ఆరోగ్య స్పృహ కల్పిస్తోంది. గిరిజన గ్రామాలు కొండకోనల్లో ఉంటాయి. వాటికి చేరుకోవాలంటే కాలువలు, కొండగట్లు, రాళ్లూ రప్పలు, ముళ్ల పొదలు.. దాటుకుంటూ ప్రయాణించాలి. అలా ప్రవాసిని రోజూ కొన్ని మైళ్ల దూరం నడుస్తూనే గిరిజనులను కలుసుకుంటుంది. ఎలాంటి రవాణా సదుపాయాలు లేని ఈ ప్రాంతాల్లో పనిచేయడం తనకు కష్టమని ప్రవాసినికి తెలుసు. కానీ, వీటి గురించి పట్టించుకోలేదు ప్రవాసిని. గిరిజనులు నేటికీ మొరటైన సాంప్రదాయ వైద్యపద్ధతులనే అనుసరిస్తున్నారు. ఆరోగ్య వృద్ధి లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తన సేవలను విస్తరించింది. గిరిజన, ఇతర అట్టడుగు వర్గాలకు కరోనా మహమ్మారి మరిన్ని సమస్యలను సృష్టించింది. దీంతో ప్రవాసిని పాత్ర గతంలో కంటే మరింత ముఖ్యమైంది. ఆరోగ్య పథకాల పట్ల అవగాహన గిరిజన ప్రాంతాల పరిస్థితి గురించి ప్రవాసిని వివరిస్తూ –‘పోషకాహార లోపం వారికి అన్నిరకాల ఆరోగ్యసమస్యలకు మూలమైంది. ఆరోగ్య సదుపాయాలు లేకపోవడం వల్ల తల్లీ పిల్లల మరణాల రేటు పెంచుతోంద’ని వివరిస్తుంది. 2018 లో లాభాపేక్షలేని ఆత్మశక్తి ట్రస్టు ద్వారా తన సేవలను అందించడానికి సిద్ధపడింది ప్రవాసిని. మూడునెలలు ఆ సంస్థలో పనిచేసిన తర్వాత పోషకాహారం లేని మారుమూల గ్రామాల ప్రజలకు చేరువకావడానికి ఆసక్తి చూపించింది. అప్పటి నుండి ‘హెల్త్ యానిమేటర్‌గా’గా పనిచేస్తోంది. శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తగా గిరిజనులకు కావల్సిన ఔషధాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో గిరిజనులు భాగం పంచుకునే లా చేస్తోంది. కష్టపడలేక మధ్యలోనే సేవలను ఆపేసే కొందరిలా కాకుండా ఇష్టంతో తన పనిని కొనసాగిస్తోంది. ప్రతి రోజూ 2–3 గ్రామాలను సందర్శించి ఇల్లిల్లూ తిరిగి ఆరోగ్య సంరక్షణ చేపడుతోంది. తుడిబంధ బ్లాకులో 76 మంది పురుషులు, 37 మంది మహిళలను గ్రామ కార్యకర్తలు గా ఆరోగ్య పరిరక్షకులుగా తయారు చేసింది. కష్టం తీరింది.. ‘ఈ గిరిజన ప్రాంతాల మహిళలు, బాలికలు తమ ఆరోగ్య సమస్యలను పంచుకోవడానికి వెనకాడతారు. కానీ, నాతో ఎలాంటి జంకు లేకుండా పంచుకుంటారు. దీని వల్ల వారి అవసరాలను తెలుసుకోవడానికి, సరైన మార్గం చూపడానికి నాకు వీలవుతుంది’ అని చెబుతుంది ప్రవాసిని. ‘గతంలో జ్వరం వచ్చి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లాలంటే పదేసి కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. దీనికి 200 నుంచి 500 రూపాయలు ఖర్చు కూడా అయ్యేది. ఎంతో కష్టపడి ఆసుపత్రి కి వెళ్లినా అక్కడ సిబ్బంది ఉండేవాళ్లు కాదు. ఇప్పుడు ప్రవాసిని ద్వారా మాకు ఆ కష్టం తీరింది. చిన్న చిన్న జబ్బులకు మందులు అందుబాటులో ఉండటంతో త్వరగా కోలుకోగలుగుతున్నాం’ అని గుమా గ్రామ పంచాయితీ సర్పంచ్ సుస్మిత వివరిస్తారు. ఈ ప్రాంతాల్లో 102, 108 అంబులెన్స్ సర్వీసులు అందుబాటులో లేవు. అందుకే జబ్బులు ముదరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా వారిలో అవగాహన కల్పించడంతోపాటు బాల్య వివాహాలు, రుతు శుభ్రతకు సంబంధించిన అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేస్తోంది. పోషకాహారం ఆవశ్యకత గురించి చెబుతూ పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రవాసిని లాంటి మహిళలు ఈ సమాజానికి ఎంతో మంది అవసరం. ఇలాంటి వారి వల్లే గ్రామాల అభివృద్ధి మెరుగుపడుతుంది. ఆదివాసీలతో ప్రవాసినీ భట్నాగర్ -
ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.కోటి విరాళం
తిరుమల: శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ట్రస్టుకు బుధవారం సాయంత్రం రూ.కోటి విరాళంగా అందింది. కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన ప్రమతి సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ పి.ఎస్.జయరాఘవేంద్ర ఈ విరాళం అందించారు. ఈ మేరకు విరాళం డీడీని దాత తరఫున టీటీడీ బోర్డు సభ్యులు డి.పి.అనంత తిరుమలలోని బంగళాలో టీటీడీ అదనపు ఈవో, ఎస్వీబీసీ ఎండీ ఎ.వి.ధర్మారెడ్డికి అందజేశారు. వైభవంగా పౌర్ణమి గరుడ సేవ తిరుమలలో బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి వారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. చదవండి: జూన్ 1 నుంచి అలిపిరి కాలినడక మార్గం మూత