అయోధ్యలో కొలువైన బాలక్ రాముని దర్శించుకునేందుకు లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. తాజాగా శ్రీరామ జన్మభూమి ఆలయ ట్రస్టు భక్తుల సౌలభ్యం కోసం మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులలో నెలకొన్న అసంతృప్తిని దూరం చేసేందుకు ఈ నిర్ణయాలు ఉపయోగపతాయని ట్రస్టు భావిస్తోంది.
ఇకపై ఆయోధ్య రామాలయానికి వచ్చే ప్రముఖులకు, సెలబ్రిటీస్‌కు చందనం రాయడం లేదా తిలకం పెట్టడం లాంటివి చేయరు. చరణామృతం(తీర్థం) ఎవరికీ ఇవ్వరు. అలాగే అక్కడి పూజారులకు దక్షిణ ఇవ్వకూడదు. దానిని విరాళం రూపంలోనే సమర్పించాల్సి ఉంటుంది.
రామాలయంలో భక్తులందరినీ సమానంగా చూడడం లేదనే ఆరోపణలు వస్తున్న దరిమిలా శ్రీరామ జన్మభూమి ఆలయ ట్రస్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఆలయానికి వచ్చే ప్రముఖులకు ప్రత్యేక సౌకర్యాలు లభిస్తున్నాయి. వారికి గంధం పూస్తున్నారు. తిలకం దిద్దుతున్నారు. చరణామృతం అందజేస్తున్నారు. ఈ విధానాన్ని ఇప్పుడు ట్రస్ట్ రద్దు చేసింది. ఇకపై రామాలయానికి వచ్చే ఎవరినీ ప్రత్యేకంగా గుర్తించరు. రామభక్తులందరినీ సమానంగానే పరిగణించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment