బల్లియా: కన్నబిడ్డను పాశవిక అత్యాచార దాడిలో కోల్పోయిన నిర్భయ తల్లిదండ్రులు బృహత్తర కార్యక్రమానికి పూనుకున్నారు. వేధింపులు ఎదుర్కొనే తమ బిడ్డలాంటి మహిళలకు సాయం చేసేందుకు ఆమె పేరుతో ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిర్భయ కన్నుమూసి ఏడాది గడచిన సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో తమ స్వగ్రామం దామినికి ఆదివారం చేరుకున్న నిర్భయ తండ్రి ఈ విషయాన్ని వెల్లడించారు. తమ ప్రయత్నానికి గ్రామస్తులు కూడా సహకారం అందిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. కన్నకూతురు దూరమై ఏడాది గడచినా ఆ బాధ నుంచి బయటకు రాలేకపోతున్నామని తెలిపారు. నిర్భయ తుదిశ్వాస విడిచి ఏడాది గడచిన సందర్భంగా ఒక్క నేతా తమ గ్రామానికి రాలేదని, వారు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ కొడుక్కి ఇంతవరకూ ఉద్యోగం ఇవ్వలేదన్నారు.