కార్మికులకు బీమా చెక్కులు అందజేస్తున్న భారతి సిమెంట్ అధికారులు
కాణిపాకం(ఐరాల): నిర్మాణ రంగంలో నాణ్యతకు, నమ్మకానికి మారుపేరుగా భారతి సిమెంట్ నిలిచిందని మార్కెటింగ్ ఆఫీసర్ బాలకష్ణ తెలిపారు. ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో శ్రీగణేష్ స్టీల్స్ పూర్ణచంద్రారావు ఆధ్వర్యంలో పట్టణంలోని కాంట్రాక్టర్లు, మేస్త్రీలు, బిల్డర్లకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతి సిమెంట్ అనతి కాలంలోనే రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించిందని తెలిపారు. మిగతా సిమెంట్‌లతో పోలిస్తే నాలుగు రెట్లు అధికమైన నాణ్యత అని రుజువైందన్నారు. జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో రోబోటిక్ క్వాలిటీ టాంపర్ ప్రూఫ్‌తో అత్యాధునికంగా తయారవుతున్న ఏకైక సిమెంట్ ఇదేనన్నారు. కేవలం వ్యాపార దక్పథంతో కాకుండా నిర్మాణ ర ంగ కార్మికుల సంక్షేమానికి కూడా భారతి సిమెంట్ యాజమాన్యం కషి చేస్తోందన్నారు. నిర్మాణ రంగంలో మార్పులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాపీమేస్త్రీలకు, కార్మికులకు సంస్థ అవగాహన కల్పిస్తుందన్నారు. తాపీ మేస్త్రీలకు రూ.లక్ష ప్రమాద బీమా కల్పిస్తున్న ఘనత తమ సంస్థ దేనన్నారు. టెక్నికల్ మేనేజర్ ఛాయాపతి భారతి సిమెంట్ ప్రత్యేకతలను స్లైడ్ షోలు, షార్ట్ వీడియోల ద్వారా కార్మికులకు వివరించారు. అనంతరం 75 మంది కార్మికులకు రూ.లక్ష బీమా పత్రాలను అందజేశారు.