
ప్రతీకాత్మక చిత్రం
వాషింగ్టన్ : ప్రతికూల భావోద్వేగాలు, ఎప్పుడూ అదోలా ఉండటం మనిషిని మరింత ఒత్తిడికి గురిచేస్తాయని, తీవ్రమైన ఒత్తిడికి గురిచేసే ప్రతికూల భావోద్వేగాలు ఎదుటి వ్యక్తి మీద నమ్మకాలను సన్నగిల్లేలా చేస్తాయని తాజా సర్వేలో తేలింది. ఇవి ఎదుటి వ్యక్తితో మనం మసలుకునే తీరును కూడా దెబ్బతీస్తాయని వాషింగ్టన్‌కు చెందిన పరిశోధకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మనం ప్రేమంచిన వ్యక్తులతో చిన్న చర్చ కూడా గొడవలకు దారి తీస్తుందని చెబుతున్నారు. ఎలక్ట్రిక్ షాక్ టెక్నిక్ ద్వారా కొంతమంది మనషులపై ప్రయోగాలు చేశారు. షాక్ ద్వారా వ్యక్తులలో ప్రతికూల భావోద్వేగాలను ప్రేరేపించారు. ఆ క్షణంలో వారు ఎదుటి వ్యక్తిని ఎంత మేరకు నమ్ముతున్నారో పరిగణలోకి తీసుకున్నారు.
ఎలక్ట్రిక్ షాక్ ద్వారా వ్యక్తిలో ప్రేరేపించబడ్డ ప్రతికూల భావోద్వేగాలు కారణంగా ఎదుటి వ్యక్తిపై నమ్మకం సన్నగిల్లినట్లు తేల్చారు. ప్రతికూల భావోద్వేగాల ద్వారా మన ఎదుటి వారితో తత్సంబంధాలు దెబ్బతింటాయని, ముఖ్యంగా మనం ఎదుటి వ్యక్తులను నమ్మటంపై ప్రభావం ఉంటుందని, మెదడులో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ఎదుటి వ్యక్తుల ప్రవర్తనలను అంచనా వేయటం కుదరదని అంటున్నారు. ముఖ్యంగా భార్యాభర్తలు, ప్రేమికుల మధ్య బంధాన్ని దెబ్బతీస్తాయని చెబుతున్నారు. అయితే మనతో సంబంధంలేని, సంఘటనల ఆధారంగా చోటు చేసుకునే ‘ఇన్సిడెంటల్’ భావోద్వేగాలకు వారు పరిశోధకులు అంతగా ప్రాధాన్యత నివ్వలేదు.
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment