
ప్రతీకాత్మక చిత్రం
ఓ ఇద్దరు వ్యక్తులు జంటగా బంధంలోకి ప్రవేశించినపుడు అన్ని రకాల ఛాలెంజ్‌లను వారు ఫేస్ చేయాల్సి ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోవాల్సి వస్తుంది. ఏ జంటకైనా కొన్ని కష్టసమయాల్లో ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి జంటలకు చిన్న సలహాలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. అలాంటి జంటల కోసం బెస్ట్ రిలేషన్‌షిప్ టిప్స్!!
1) వ్యక్తిగత సరిహద్దులు
జంట మధ్య బంధం సాఫీగా సాగాలంటే వ్యక్తిగత సరిహద్దుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకరికొకరు కొంత ఫ్రైవేట్ స్పేస్‌ను ఏర్పరచుకోవాలి. అనుమతి లేకుండా భాగాస్వామి సెల్‌ఫోన్‌ను చెక్‌చేయటం, పర్శనల్ వస్తువులను వారికి తెలియకుండా వాడుకోవటం లాంటివి చేయకూడదు. దీనివల్ల ఎదుటివ్యక్తికి మనపై ఉన్న నమ్మకం సన్నగిల్లుతుంది.
2) నచ్చని అలవాట్లు ..
బంధం అంటేనే అంగీకారం, సర్దుకుపోవటం. బంధంలోకి అడుగుపెట్టగానే ఎదుటి వ్యక్తిని లేదా వారి అలవాట్లను మార్చాలనుకోవటం, అది కుదరక నిరుత్సాహపడిపోవటం మామూలే. అయితే మనం నిజంగా ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నట్లయితే వారిని లేదా వారి అలవాట్లను మార్చాలని అనుకోము! వారిని వారిగా స్వీకరిస్తాము. అయితే ఎదుటి జీవితాన్ని నాశనం చేసే ఆరోగ్యపు అలవాట్ల విషయంలో మాత్రం ఈ సూత్రం వర్తించదు.
3) అన్యోన్యమైన జంట గొడవపడదు!
అన్యోన్యమైన జంట గొడవపడదు అని చెప్పటం జంటలను పక్కదోవ పట్టించటమే. జంటల మధ్య గొడవలు జరగటం వల్ల వారి బంధం మరింత బలపడుతుంది. గొడవలు పడకుండా జంట సర్దుకుపోవటం వల్ల ధీర్ఘకాలంలో వారి బంధాన్ని నాశనం చేసే విషయాలను వారు స్వేచ్ఛగా చర్చించలేరు. అలాగని చీటికిమాటికి గొడవపడటం ఎంత మాత్రమూ మంచిది కాదు.
4) అనుకూలమైన భాగస్వామి
భాగస్వామి కోసం వెతుకుతున్నపుడు అనుకూలమైన వారి కోసం అన్వేషించటం పరిపాటి. చాలామంది అనుకూలతలేని భాగస్వామితో జీవితం బాగుండదని నమ్ముంతుంటారు. అయితే అనుకూలత అన్నది ఓ స్థిరమైన గుణం కాదని, నెమ్మదిగా అలవర్చుకునేదని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది మొదటి చూపులోనే అనుకూలంగా కనిపించకపోవచ్చు. అలాగని వారిని దూరం చేసుకోవటం మంచిదికాదు.
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment