ప్రతీకాత్మక చిత్రం
ఓ రిలేషన్‌షిప్ బలంగా ఉండాలంటే అన్ని ఏమోషన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ.. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని కాకుండా సమానత్వం పాటించటం ఎంతో ముఖ్యం. ఒక వేళ ప్రేమ పెళ్లికి దారి తీసినపుడు బ్యాలెన్స్, ఈక్వాలిటీ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటాయి. అయితే అన్ని వేళలా ఇది సాధ్యం కాదు. ప్రతి జంట మరో జంట కంటే భిన్నంగా ఉండటమే కాక వారి మధ్య బంధంలో కూడా తేడాలుంటాయి. రిలేషన్‌లో ఉన్న జంటలో ఆడ,మగ అన్న తేడా లేకుండా కొంతమంది ఎదుటి వ్యక్తిపై పెత్తనం చెలాయించటానికి చూస్తుంటారు. అయితే ఇదే కొన్ని సార్లు ఇబ్బందులకు దారితీస్తుంది. బంధంలోకి అడుగుపెట్టిన కొత్తలో మామూలుగా ఉంటూ ఆ తర్వాతినుంచి తమ ఆధిపత్యాన్ని చూపించాలని చూసేవాళ్లపై ఓ కన్నేసి ఉంచటం మంచిది. వారితో ప్రేమను పెళ్లిగా మలుచుకోవాలనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిందే.
1) నెగ్గాలనే తత్వం
గొడవలు పడకుండా ఉండటం అన్నది ఏ జంటకూ సాధ్యంకాదు. అసలు గొడవలులేకపోతే అది బంధమే కాదు. ఈ గొడవల్ని దాటి జంట ఎలా ముందుకు సాగుతుందన్న దానిపైనే బంధం ఆధారపడి ఉంటుంది. అయితే గొడవ జరిగినపుడు ఎదుటి వ్యక్తి దాన్ని ఎలా నెగ్గాలన్న దానిపైనే దృష్టిపెడుతున్నట్లయితే కొంచెం జాగ్రత్తపడాలి. భవిష్యత్తులో వారు మనపై ఆధిపత్యం చెలాయించే అవకాశాలు ఉంటాయని గుర్తించాలి.
2) చేయి చేసుకోవటం
జంటల మధ్య గొడవలు జరగటం, ఎవరో ఒకరు ఎదుటి వ్యక్తిపై చేయి చేసుకోవటం అన్నది అప్పుడప్పుడు జరుగుతుండేదే. అయితే ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ.. తరచుగా చేయి చేసుకోవటానికి ప్రయత్నిస్తుంటే వారు కచ్చితంగా మనపై ఆధిపత్యం చెలాయించటానికి చూస్తున్నారని గుర్తించాలి.
3) నిర్ణయాధికారం
రిలేషన్‌లో ఉన్నపుడు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అది ఇద్దరి అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే మన అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా ఎదుటివ్యక్తే ఏకాభిప్రాయంగా నిర్ణయాలు తీసుకోవటం అన్నది ఆధిపత్య ధోరణికి సూచన. ఇలా అయితే భవిష్యత్తులో వారు మన అభిప్రాయాలకు విలువివ్వరని గుర్తించాలి. పెళ్లైన తర్వాత కూడా వారు ఇదే ధోరణిని అవలంభించే అవకాశాలు ఎక్కువ.
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment