ప్రతీకాత్మక చిత్రం
రిలేషన్‌లో ఉన్నపుడు జంట మధ్య రహష్యాలు లేకుండా ఉండటం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అన్ని జంటలు తమ మధ్య రహష్యాలు లేని పారదర్శకమైన బంధం కావాలని కోరుకోవటం లేదు. తమ జీవితంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను రహష్యంగా ఉంచినా పర్లేదు అనుకుంటున్నారు. కానీ, కొన్ని విషయాలను సీక్రెట్‌గా ఉంచటం వల్ల జరిగే మంచికంటే చెడే ఎక్కువగా ఉంటుంది. కలతల్లేని మంచి బంధాన్ని కోరుకుంటున్నట్లయితే రహష్యాలకు దూరంగా ఉండాలి. ఎదుటి వ్యక్తి పట్ల నమ్మకంగా వ్యవహారించాలి.
ఎదుటి వ్యక్తితో సుధీర్ఘమైన బంధాన్ని కొనసాగించాలనుకుంటే ముఖ్యంగా మన ఆర్థిక పరిస్థితుల విషయంలో రహష్యాలు ఉండరాదు. మన పరిస్థితి గురించి ఎదుటి వ్యక్తికి వివరించి చెప్పాలి. అయితే చాలా మంది తాము అప్పుల్లో కూరుకుపోయి ఇబ్బంది పడుతున్నా ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేయటానికి పైన పటారం లోన లొటారంలా వ్యవహరిస్తుంటారు. తర్వాతి కాలంలో ఇది బంధానికి గొడ్డలి పెట్టులా తయారవుతుంది. అదే విధంగా మతాల విషయంలోనూ, రాజకీయ విషయాలకు సంబంధించి కూడా ఒకే విధమైన ఆచరణలు, ఆలోచనలు ఉండాల్సిన అవసరం లేదు. ఎదుటి వ్యక్తి కోసం మనం వాటిని దాచిపెట్టుకోవల్సిన, మార్చుకోవల్సిన అవసరం లేదు. ఇలాంటి విషయాల్లో చాలా క్లారిటీతో ఉండాలి.
ఇలాంటి విషయాలే బంధంలో కీలక పాత్రల్ని పోషిస్తాయని గుర్తించాలి. ఇక గతానికి సంబంధించిన విషయాల్లో కూడా కచ్చితంగా ఉండాలి. మన గతంలోని ప్రేమ, ఎంగేజ్‌మెంట్, పెళ్లి గురించిన విషయాలను ఎదుటివ్యక్తికి తప్పక చెప్పాలి. ఆవతలి వ్యక్తుల నుంచి కూడా క్లారిటీ పొందాలి. ఇలాంటి విషయాల్లో దాపరికాలు ఉన్నట్లయితే బంధం ఏ నిమిషమైనా ఇబ్బందుల్లో పడటానికి అవకాశం ఉంటుంది. వీటి విషయంలో సరైన క్లారిటీ ఉన్నట్లయితే భవిష్యత్తులో చోటుచేసుకోబోయే అపార్థాలకు ముందుగానే అడ్డుకట్టపడుతుంది.
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment