
ప్రతీకాత్మక చిత్రం
జీవితం అనేది ఓ ఎమోషనల్ జర్నీ. ఇందులో మనం ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత ఎక్కువగా లాభపడతాము. ఒంటిరిగా కంటే జంట ప్రయాణానికే జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఎదుటి వ్యక్తి ప్రవర్తన, ఆలోచనా విధానం ఇలా రకరకాల విషయాలపై మన 70 ఏళ్ల జీవితం! ఆధారపడి ఉంటుంది. ముందుగా ఓ రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టబోయే ముందు ఎదుటి వ్యక్తిలో ఈ ఐదు లక్షణాలు ఉన్నాయో లేదో చూసుకోండి. చివరిగా ‘నిజమైన ప్రేమ దొరకటం అంత సులభం కాదు’ అన్న షేక్‌స్పియర్ మాటల్ని గుర్తు తెచ్చుకోండి.
1) ముక్కుసూటి తనం
మన జీవితంలోకి ఆహ్వానించబోయే వ్యక్తి కొద్దిగానైనా ముక్కుసూటి తనం కలిగి ఉండాలి. మనం చేస్తున్నది తప్పా.. ఒప్పా అన్నది ఇబ్బంది పడకుండా చెప్పగలగాలి. మనల్ని సరైన మార్గం వైపు నడిపించగలగాలి.
2) ఎమోషనల్లీ స్టేబుల్(భావోద్వేగాల నియంత్రణ)
ఈ సృష్టిలో సమస్యలు లేని జీవి అంటూ ఏదీ ఉండదు. వారివారి జీవితాలకు తగ్గట్టు ఎవరి కష్టాలు వారికి ఉంటాయి. సమస్యలు వచ్చినపుడు తమ భావోద్వేగాలను నియంత్రించుకోగలగాలి. ముఖ్యంగా తమ సమస్యలను ఎదుటి వ్యక్తికి చెప్పి ఇబ్బంది పెట్టకుండా ఉండగలగాలి. అలాంటి వారితో జీవితం సంతోషంగా సాగుతుంది.
3) నమ్మకం
మనం ఎమోషనల్‌గా ఎదుటివ్యక్తి మీద ఆధారపడి ఉండటం అన్నది సర్వసాధారణం. అలాంటి వ్యక్తి మనం అన్నిరకాలుగా నమ్మదగిన వాడా లేదా అన్నది గుర్తించాలి. మన బలహీనతలను ఆధారంగా చేసుకుని మనల్ని పీడించకుండా ఉండాలి.
4) గౌరవం
మన జీవితంలోకి రాబోయే వ్యక్తి మనల్ని మనగా గౌరవించగలగాలి. ఒకరిపై ఒకరికి గౌరవం ఉండటం జంట మధ్య బంధాన్ని ధృడపరుస్తుంది. ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకోవటానికి సహకరిస్తుంది.
5) ధృడ సంకల్సం
ఎదుటి వ్యక్తి మనపై ప్రేమను చూపించటంలో ఎటువంటి మొహమాటాలకు తావు ఉండకూడదు. పక్కవాళ్లు ఏమనుకుంటారోన్న ఆలోచన చేయకుండా మనపై ప్రేమ చూపించే వ్యక్తులు దొరకటం అదృష్టం.
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి