ప్రతీకాత్మక చిత్రం
మనం రిలేషన్‌లో ఉన్నపుడు చాలా విషయాల్లో భాగస్వామి మిగితా వాళ్లకంటే ప్రత్యేకంగా అనిపిస్తారు. నిజం చెప్పాలంటే అది వాస్తవం కూడా! వ్యక్తుల మధ్య తేడాలున్నట్లే భాగస్వామికి భాగస్వామికి మధ్య చాలా వ్యత్యాసాలు ఉంటాయి. అదేవిధంగా మీరో వ్యక్తిని చూడగానే నా కోసమే పుట్టారనే భావన కలుగుతుంది. ఇది కొన్ని కొన్ని సందర్భాలలో కచ్చితంగా నిజం. ఎందుకంటే కొన్ని వందల మందిలో ఓ వ్యక్తిని మాత్రమే ఎంచుకుని వారితో ప్రేమలో పడటం మామాలు విషయం కాదు. ఆ తర్వాత ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడంగానే లోకాన్నే మర్చిపోతారు. ప్రేమలో మునిగితేలుతూ కాలాన్ని ఖాళీ చేస్తుంటారు. అయితే ప్రేమను, పనిని బ్యాలెన్స్ చేయటానికి మగవారు ఆలోచిస్తారని, కానీ! ఆడవారు మాత్రం పనిని, ప్రేమను రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తారని ప్రముఖ జర్నలిస్ట్ బెన్నా బిర్చ్ తన పుస్తకంలో రాసుకున్నాడు.
అదే విధంగా ఇద్దరికీ సంబంధించిన వాటి కారణంగా ప్రేమ బంధం గట్టిపుడుతుంది. కుక్క, ఇళ్లు ఏదైనా కావచ్చు.. ఇలాంటివి మీ జీవితంలో భాగం అయినపుడు విడిపోవటానికి ముఖ్యంగా గొడవపడటానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఇతరులకు రిలేషన్ గురించి సలహాలు ఇచ్చేవారు కూడా తమ రిలేషన్‌లో కష్టాలు ఎదుర్కొంటుంటారు. ఎదుటి వ్యక్తికి నీతులు చెప్పినంత ఈజీగా ఫాలో అవ్వటం కుదరదు. అయితే ఒక వేళ గొడవపడితే దాన్ని తమ తెలివితేటలతో పరిష్కరించగలుగుతారు. మొత్తానికి ఎదుటి వ్యక్తిని మనం అర్థం చేసుకున్నపుడే బంధాలు కలకాలం కలతలు లేకుండా కొనసాగుతాయి.
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment