అయోధ్య: రాబోయే దీపావళి నాడు అయోధ్యలో లక్షలాది దీపాలు వెలగనున్నాయి. రామాయణ యుగాన్ని తలపించే విధంగా అయోధ్య ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. రామజన్మభూమి ప్రధాన మార్గం నుంచి గర్భగుడి వరకు భారీ అలంకరణ చేయనున్నారు.
ఈసారి దీపావళికి ఆలయ ప్రాంగణంలో రెండు లక్షల దీపాలు వెలిగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ట్రస్ట్ చైనా వస్తువులు, దీపాలను నిషేధించింది. రెండు లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డు నెలకొల్పే లక్ష్యంతో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ దీపావళి నాడు శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చే దృశ్యాలను పునశ్చరణ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. భారత్ భిన్నత్వం కలిగిన దేశమని, మనమంతా పండుగలను ఎలా, ఎప్పుడు జరుపుకోవాలనే వివరాలను పండితుల నుంచి తెలుసుకుంటామన్నారు. జన్మాష్టమి వంటి పండుగలను నక్షత్రం, ఆరోజు ఉదయం ఉన్న తిథి ప్రకారం జరుపుకుంటారని తెలిపారు. కాశీ పంచాంగాన్ని అనుసరించి దీపావళి అక్టోబర్ 31న వచ్చిందన్నారు.
ఇది కూడా చదవండి: 30 కోట్లకు విమాన ప్రయాణికులు
Comments
Please login to add a commentAdd a comment