diyas
-
అయోధ్యలో దీపావళికి రెండు లక్షల దీపకాంతులు
అయోధ్య: రాబోయే దీపావళి నాడు అయోధ్యలో లక్షలాది దీపాలు వెలగనున్నాయి. రామాయణ యుగాన్ని తలపించే విధంగా అయోధ్య ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. రామజన్మభూమి ప్రధాన మార్గం నుంచి గర్భగుడి వరకు భారీ అలంకరణ చేయనున్నారు.ఈసారి దీపావళికి ఆలయ ప్రాంగణంలో రెండు లక్షల దీపాలు వెలిగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ట్రస్ట్ చైనా వస్తువులు, దీపాలను నిషేధించింది. రెండు లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డు నెలకొల్పే లక్ష్యంతో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ దీపావళి నాడు శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చే దృశ్యాలను పునశ్చరణ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. భారత్ భిన్నత్వం కలిగిన దేశమని, మనమంతా పండుగలను ఎలా, ఎప్పుడు జరుపుకోవాలనే వివరాలను పండితుల నుంచి తెలుసుకుంటామన్నారు. జన్మాష్టమి వంటి పండుగలను నక్షత్రం, ఆరోజు ఉదయం ఉన్న తిథి ప్రకారం జరుపుకుంటారని తెలిపారు. కాశీ పంచాంగాన్ని అనుసరించి దీపావళి అక్టోబర్ 31న వచ్చిందన్నారు.ఇది కూడా చదవండి: 30 కోట్లకు విమాన ప్రయాణికులు -
దేదీప్యమానం.. అయోధ్యా నగరం! ఫొటోలను షేర్ చేసిన ప్రధాని మోదీ
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలో సరయూ నదీతీరంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన దీపోత్సవం అమోఘమని, దైవీకమని, కళ్లలో చెరిగిపోనిదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేత్రపర్వమైన ఆ దీపోత్సవ దృశ్యాలను తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో పంచుకున్నారు. అయోధ్యలో వెలిగించిన లక్షలాది దీపాల వెలుగులో దేశమంతా కాంతులీనుతోందన్నారు. ‘ఈ దీప కాంతుల నుంచి వెలువడే శక్తి దేశమంతటా కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఆ శ్రీ రాముడు దేశ ప్రజలందరికీ సుభిక్షాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్’ అని ప్రధాని మోదీ హిందీలో ట్వీట్ చేశారు. అయోధ్యలోని సరయూ నదీ తీరం వెలుగులతో నిండిపోయింది. శనివారం 22 లక్షల దీపాలతో అత్యంత వైభవంగా జరిగిన దీపోత్సవం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే చోట ఒకేసారి అత్యధిక సంఖ్యలో దీపాలను వెలిగించిన ఘటనగా తన గిన్నిస్ రికార్డును తానే బద్దలుకొట్టింది. సరయూ నది ఒడ్డున 51 ఘాట్లలో 25 వేల మంది వలంటీర్లు 22.23 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించారు. अद्भुत, अलौकिक और अविस्मरणीय! लाखों दीयों से जगमग अयोध्या नगरी के भव्य दीपोत्सव से सारा देश प्रकाशमान हो रहा है। इससे निकली ऊर्जा संपूर्ण भारतवर्ष में नई उमंग और नए उत्साह का संचार कर रही है। मेरी कामना है कि भगवान श्री राम समस्त देशवासियों का कल्याण करें और मेरे सभी… pic.twitter.com/3dehLH45Tp — Narendra Modi (@narendramodi) November 12, 2023 -
22 లక్షల దీపాల వెలుగుల్లో అయోధ్య
లక్నో/అయోధ్య: అయోధ్యలోని సరయూ నదీ తీరం వెలుగులతో నిండిపోయింది. శనివారం అత్యంత వైభవంగా 22 లక్షల దీపాలతో జరిగిన దీపోత్సవం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే చోట ఒకేసారి అత్యధిక సంఖ్యలో దీపాలను వెలిగించిన ఘటనగా స్వీయ గిన్నిస్ రికార్డునే బద్దలు కొట్టింది. సరయూ నది ఒడ్డున 51 ఘాట్లలో 25 వేల మంది వలంటీర్లు 22.23 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు డ్రోన్ల సాయంతో దీపాలను లెక్కించి, ప్రపంచ రికార్డుగా ధ్రువీకరించడంతో నగరం ‘జై శ్రీరామ్’ నినాదాలతో మారుమోగింది. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ మేరకు సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు సర్టిఫికెట్‌ను అందజేశారు. గతేడాది ఈ వేడుకలో 15.76 లక్షల ప్రమిదలు వెలిగించడం తొలిసారి గిన్నిస్ రికార్డులకెక్కింది. 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయోధ్యలో ఏటా దీపోత్సవం జరుగుతోంది. శనివారం సీఎం ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, కేబినెట్ మంత్రులు కూడా దీపాలు వెలిగించి, సరయూ నది ఒడ్డున పూజలు చేశారు. దీపోత్సవం 100 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. -
గోమయంతో ప్రమిదలు.. ఎలా తయారు చేస్తారంటే!
పర్యావరణ హిత దీపావళి జరుపుకోవాలన్న సంకల్పంతో నిర్మల్ జిల్లా కేంద్రంలో హిందూ పరిషత్ గోరక్షక విభాగం ఆధ్వర్యంలో గోమయ ప్రమిదలు తయారు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ ఫంక్షన్ హాల్లో వీటిని తయారు చేస్తున్నారు. నాటు గోవుల నుంచి మాత్రమే సేకరించిన పేడను బాగా ఎండబెడతారు. అనంతరం దాన్ని పొడిచేసి గోమూత్రం, ముల్తానీ మట్టి, చింత గింజల పొడి కలిపి ముద్ద చేస్తున్నారు. అచ్చు యంత్రంతో ఆ ముద్ద నుంచి ప్రమిదలు తయారు చేస్తున్నారు. వీటి తయారీ ద్వారా 20 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ (క్లిక్ చేయండి: రోగులకు ఊరట..పెద్ద జబ్బులకు ఉచితంగా పీహెచ్‌సీల్లో చికిత్స) -
దీపాల పండగ వేళ.. కాంతులు పంచే తీరొక్క దివ్వెలు!
దీపాల పండగ అనగానే మనకు మట్టి ప్రమిదలే గుర్తుకువస్తాయి. కానీ, ఇప్పుడీ దివ్వెల అలంకరణలో ఎన్నో అందమైన సృజనాత్మక రూపాలు బంగారు కాంతులను విరజిమ్ముతున్నాయి. ఆ కాంతుల వెలుగుల్లో ఆనందాల దీపావళి మరింత అలంకారంగా, రంగుల హరివిల్లుగా మన కళ్లను కట్టిపడేస్తుంది. ప్రమిదలకు ఆభరణాల సొగసును అద్ది, కాంతిని గ్లాసుల్లో నింపి, కుండల్లో మెరిపించి, ఆరోగ్యాన్ని పంచి, రంగులను వెదజల్లేలా ఈ దీపావళిని ఓ అందమైన కథలా మరింత అర్థవంతంగా జరుపుకోవచ్చు. ఆభరణాల వెలుగు: మట్టి ప్రమిదలకు న చ్చిన పెయింట్ వేసి, వాటికి పూసల హారాలను గమ్‌తో అతికించి జిలుగు పూల కాంతులను పూయించవచ్చు. కొన్నేళ్లుగా వస్తున్న ఈ ప్రమిదల అలంకరణ ప్రతి యేటా కొత్తదనాన్ని నింపుతూనే ఉంది. అలంకరణలో ఎన్నో ప్రయోగాలు చేయిస్తోంది. మగ్గం వర్క్‌లో ఉపయోగించే మెటీరియల్‌తో ప్రమిదలను అందంగా అలంకరించవచ్చు. గ్లాస్లో కాంతి: ప్లెయిన్గానూ, క్లాస్‌గాను ఉండే గ్లాస్ కాంతి ఇంటికి, కంటికి కొత్త వెలుతురును తీసుకువస్తుంది. కొన్ని గులాబీ పూల రేకులను ప్లేట్లో పరిచి, గ్లాస్లో క్యాండిల్ అమర్చి వెలిగిస్తే చాలు కార్నర్ ప్లేస్‌లు, టేబుల్, టీపాయ్‌పైన ఈ తరహా అలంకరణ చూపులను ఇట్టే ఆకర్షిస్తుంది. పండగల కళను రెట్టింపు చేస్తుంది. చిట్టి కుండల గట్టి కాంతి: కుండల దొంతర్లు దీపావళి పండగ వేళ ఐశ్వర్యానికి ప్రతీకగా ఉపయోగిస్తారు. ఎక్కువ సేపు దీపాలు వెలగడానికి, డెకొరేటివ్ పాట్ క్యాండిల్స్‌ను ఉపయోగించవచ్చు. ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు అనుకునేవారు చిట్టి చిట్టి కుండలు కొనుగోలు చేసి, నచ్చిన అలంకారం చేసుకొని, వాటిలో మైనం నింపి దీపం వత్తితో వెలిగించుకోవచ్చు. లేదంటే కుండల మీద ప్రమిదలు పెట్టి, మరొక అలంకారం చేయచ్చు. ఆరోగ్యకాంతి: ఇది గ్లాస్ అలంకారమే. పానీయాలు సేవించే గాజు గ్లాస్లో నిమ్మ, ఆరెంజ్ తొనలు, పుదీనా ఆకులు, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క ముక్కలు వేసి, ఆపైన సగానికి పైగా నీళ్లు పోసి, ఫ్లోటెడ్ క్యాండిల్‌ను వేసి వెలిగించవచ్చు. ఈ కాంతి చుట్టూ కొన్ని పరిమళలాను వెదజల్లుతుంది. హెర్బల్స్ నుంచి వచ్చే ఆ సువాసన ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. ఇంద్రధనస్సు కాంతి: ఎరుపు, పసుపు, నీలం .. ఇంద్రధనుస్సు కాంతులు ఇంట్లో వెదజల్లాలంటే రంగురంగుల గాజు గ్లాసులను తీసుకోండి. వాటిల్లో ఫ్లోటెడ్ క్యాండిల్స్ అమర్చి, వెలిగించండి. చీకటి వేల వేళ రంగులు పూయిస్తాయి ఈ కాంతులు. కథ చెప్పే కాంతి: దీపావళి వేళ తోరణాలుగా ఎలక్ట్రిక్ దీపాలను చాలా మంది ఉపయోగిస్తుంటారు. వాటిని చాలా మంది గుమ్మాలకు వేలాడదీస్తుంటారు. దీనినే కొంచెం సృజనాత్మకంగా ఆలోచిస్తే ఓ కొత్త దీపాల వెలుగులను ఇంటికి తీసుకురావచ్చు. ఒక గాజు ఫ్లవర్‌వేజ్ లేదా వెడల్పాటి గాజు పాత్ర తీసుకొని అడుగున పచ్చ రంగు అద్దిన స్పాంజ్ ముక్కలను పరిచి, ఆ పైన ఎలక్ట్రిక్ బల్పులు గొలుసు, మధ్యన పూల కాంబినేషన్‌తో ఓ అందమైన లోకాన్ని నట్టింట్లో సృష్టించిన అనుభూతిని పొందవచ్చు. చదవండి: పాపం.. ఒంటరైన తిమింగలం..తలను గోడకేసి బాదుకుని..! -
దీపాలు వెలిగించే ముందు శానిటైజర్లు వాడొద్దు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి దీపాలు వెలిగించేవారు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం శనివారం సూచించింది. దీపాలు, కొవ్వొత్తులు వెలిగించే ముందు చేతులు శుభ్రం చేసుకోవడానికి ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు వాడొద్దని పేర్కొంది. ఇలాంటి శానిటైజర్లు మంటలకు అంటుకునే ప్రమాదం ఉందని ప్రెస్ ఇన్ఫర్మేసన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ కేఎస్ దాత్వాలియా హెచ్చరించారు. -
మట్టే కదా అని నెట్టేయకండి.. చూస్తే ఫిదానే
భారత సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా పండగలు విరాజిల్లుతున్నాయి. దూరంగా ఉన్న వారిని అక్కున చేర్చుతూ.. ఎన్నో అనురాగాలను, ఆప్యాయతలను పంచి పెడుతాయి ఈ పండగలు. అన్ని పండగల్లో దీపావళికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. చిన్న పెద్ద తేడా లేకుంగా ప్రపంచంలోనే ఎక్కువమంది జరుపుకునే పండగ దీపావళి. దీపావళి పేరు వినగానే అందరికీ గుర్తోచ్చేది దీపాల కాంతుల్లో వెలిగే జిగేలులు. ఆకాశమంతా విరజిల్లే సంబరాలు.. ఇంతటి వైభవంగా జరుపుకునే ఈ పండగలో మెయిన్ అట్రాక్షన్ మహిళలు. భక్తి, శ్రద్ధలతో లక్ష్మీ దేవిని పూజించడం ఈ పండడ ప్రత్యేక. అయితే అలాంటి మగువల అందాలకు మరింత వన్నే చేకూర్చేవి వారి అలంకరణ. ఈ అలంకరణలో మందుగా గుర్తొచ్చేవి ఆభరణాలు. జ్యువెల్లరీ లో ముఖ్యంగా బంగారం, వెండి, డైమండ్,ముత్యాలు వగైరా. వీటితో పాటు ఈ మధ్య కాలంలో థ్రెడ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ఇవి కూడా పాతబడిపోయాయి. ప్రతీసారి ఇవే ధరించడం మహిళలకు కాసింత రోటీన్‌గా అనిపిస్తోంది. అయితే ప్రతి పండక్కి ఒకింత కొత్తగా, మరింత నూతనంగా అలంకరించుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. అందుకే ఈ సారి వీటికి భిన్నంగా మట్టితో తయారు చేసినవి ట్రై చేస్తే ఎలా ఉంటుందంటారు. నగరానికి చెందిన కృష్ణలత గత కొంత కాలంగా వీటి పైనే దృష్టి పెట్టింది. మట్టితో ఒకటి కాదు రెండు ఏకంగా వందల రకాల వస్తువులను తయారు చేస్తుంది. అభరణాలు, గిఫ్ట్ ఆర్టికల్, బొమ్మలు, గృహాలంకరణ వస్తువులతో పాటు ఏ పండగకైనా ఉపయోగించే వస్తు సామాగ్రిని ఇలా ఎకో ఫ్రెండ్లీగా తయారు చేస్తుంది. తన స్వహస్తాలతో తయారైన ఈ ఆభరణాలను చూసి ముచ్చటపడటమే కాక, ధరించి ఆహా అనాల్సిందే. పండగలకు ఉపయోగించే ప్రతి వస్తువులలో సాధారణంగా ప్లాస్టిక్ వినియోగం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ప్లాస్టిక్ పెనుభూతంగా తయారవుతూ మానవ మనుగడకు తీవ్ర ప్రమాదంగీ తయారవుతోంది. దీంతో ప్లాస్టిక్‌ను తగ్గించి పర్యావరణానికి మేలు జరిగేలా మట్టితో తయారు చేసిన వస్తువులను ఈ ప్రత్యేక పండగలో ఉపయోగిద్దాం. చెడుపై మంచి గెలిచినా విజయానికి దీపావళి జరుపుకుంటారన తెలిసిందే. అలాగే ప్రస్తతం ప్రపంచంలో చెడుగా వ్యాప్తి చెందుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ మనం కూడా ఓ మంచి పనికి శ్రీకారం చుడుదాం. పరిచయం... అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కృష్ణలతకు మట్టితో వివిధ వస్తువులు తయారు చేయడం అలవాటు. అనంతరం అమెరికా నుంచి నగరానికి వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేస్తూ సమయం చిక్కినప్పుడల్లా మళ్లీ మట్టితో అభరణాలు, తయారు చేయడం ప్రారంభించారు. తాను ఏం చేసిన పర్యావరణానికి హానీ కలగకుండ ఉండాలి. అంతేగాక కొత్తగానూ, అందరూ మెచ్చేలా ఉండాలని భావించారు. కేవలం తన అభిరుచితోనే ప్రారంభించిన ఈ పనిని 2014లో ఊర్వి పేరుతో ఓ బ్రాండ్‌ను స్థాపించి మట్టితో అనేక వస్తువులను తయారు చేసి బిజెనెస్ ప్రారంభించారు. మట్టి మాత్రమే కాకుండా పర్యావరణానికి మేలు చేసే అనేక పదార్ధాలతో తయారు చేసే వస్తువులు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయి. తయారీ విధానం... అభణానికి కావల్సినంత మట్టిని తీసుకొని మొదట దానిని ఎండబెట్టాలి. ఆ తరువాత మట్టిని 1000 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేయాలి. అప్పుడు అది స్టోన్‌లా మారుతుంది. దానిని మనకు కావల్సిన కలర్స్ వేసుకొని నచ్చిన డిజైన్‌లో జ్యువెల్లరీ తయరు చేసుకోవచ్చు. ఏంటీ ప్రత్యేకత మట్టితో తయారు చేయడం. ఎలాంటి రసాయనాలను వాడకపోవడం ఫ్యాషన్‌కు తగ్గట్టుగా తయారు చేయడం పూర్తిగా పర్యావరణ హితమైనవి, కాలుష్యానికి ఆమడ దూరం వెండి,బంగారం వంటి అభరణాలతో పోలిస్తే తక్కువ ధరకే అందుబాటులో ఉండటం దీపావళికి ప్రత్యేకంగా నూతన వెరైటీలతో జ్యువెల్లరీ(నగలు, చెవి కమ్మలు) తయారీ. అదే విధంగా దీపావళికి ప్రతేక ఆకర్షణ ప్రమిదలు. సాధారణంగా వీటిని మట్టితోనే తయారు చేస్తారు. ఈ మట్టిలో సైతం అనేక ఆకృతులలో అంటే గణేష్ ప్రమిదలు, నెమలి ఆకార ప్రమిదలు, ఏనుగు ప్రమిదలు వంటివి చేస్తోంది. వీటితోపాటు గుమ్మానికి వేలాడదీసే ప్రమిదలు. ఆవు పేడ (కవ్ డంగ్)తో తయారు చేస్తుంది. అంతేగాక పండక్కి వచ్చే అతిథుల కోసం వాయినంగా ఇచ్చే కుంకుమ భరణిని మట్టితో తయారు చేయడం. తులసి కోట వంటివి ఈ దీపావళికి ప్రత్యేకం. ధరలు.. కృష్ణలత తయారు చేసిన ప్రతి వస్తువుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఒక్క దానికి ఒక్కో ధర ఉంటుంది. అధిక ధరలకు కాకుండా తయారీకి అయిన ఖర్చుతో కలిపి అందరికి అందుబాటులో ఉండే ధరకు వీటిని మనం కొనవచ్చు. ఆవు పేడ ప్రమిదలు- రూ.140 నుంచి రూ. 240....డిజైనర్ ప్రమిదలు-రూ. 320.... నగలు- రూ.450 నుంచి మొదలు... చెవి కమ్మలు రూ. 120 నుంచి ప్రారంభం. సో ఇంవేందుకు అలస్యం వెంటనే కొనేయండి. వీటిని మీ సొంతం చేసుకోవాలంటే అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో లాగిన్ అవ్వండి. లేదా నేరుగా ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించండి. -
కోహ్లికి అభిమాని అరుదైన కానుక
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘రన్ మెషీన్’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే కోహ్లి ఇప్పటికే పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కోహ్లిని ఆదర్శంగా తీసుకున్న అతడి అభిమాని వరల్డ్ రికార్డు కోసం ట్రై చేస్తున్నాడు. అందుకు కోహ్లి రూపాన్నేఎంచుకున్నాడు. అర్థం కాలేదు కదా.! ఏం లేదండీ దీపావళితో పాటు కోహ్లి బర్త్‌డే (నవంబరు 5) కూడా సమీపిస్తున్న సంగతి తెలిసిందే కదా. అందుకే కోహ్లి కోసం ప్రత్యేకంగా మొజాయిక్ ల్యాంప్ ఆర్ట్‌ను రూపొందించాడు అతడి అభిమాని. ముంబైకి చెందిన మొజాయిక్ ఆర్ట్ నిపుణుడు అబాసాహెబ్ షెవాలే కోహ్లికి వీరాభిమాని. దీపావళి సందర్భంగా తన అభిమాన క్రికెటర్‌కు ఓ వినూత్న కానుక ఇవ్వడంతో పాటు గిన్నిస్ బుక్ రికార్డు కూడా సాధించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా తన కళా నైపుణ్యాన్ని ఉపయోగించి.. 4,482 మట్టి దివ్వెలతో కోహ్లి రూపాన్ని తయారు చేశాడు. 9.5 అడుగుల వెడల్పు, 14 అడుగుల పొడవుతో ఉన్న ఈ ల్యాంప్ ఆర్ట్‌ను నవీ ముంబైలోని సీవుడ్ గ్రాండ్ సెంట్రల్ మాల్లో ప్రదర్శనకు ఉంచాడు. ఈ ఆర్ట్ కోసం ఎరుపు, తెలుపు, నీలం, పసుపు, పచ్చ రంగులను ఎంచుకున్నట్లు తెలిపాడు. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద మొజాయిక్ ల్యాంప్ ఆర్ట్ అని పేర్కొన్నాడు. ఈ అరుదైన కానుకను కోహ్లికి అందించేందుకు షెవాలేతో పాటు అతడి ఐదుగురు స్నేహితులు సుమారు ఎనిమిది గంటలపాటు శ్రమించారట. -
లైట్ ఫర్ లైఫ్
తదేకదీక్షతో ప్రమిదకు సొబగులు అద్దుతున్న ఈ చిన్నారి కళ్లలో వేయి దీపాల కాంతులు కనిపిస్తున్నాయి కదూ! ఆ వెలుగులు అమావాస్య నాడు ప్రతి ఇంటికీ పున్నమి వెలుగులు తెస్తాయి. ఈ పండుగ రోజు మనం వెలిగించే ప్రతి ప్రమిద ఓ చిన్నారి భవిష్యత్తులో కాంతులు నింపుతుందంటే.. ఎదిగీ ఎదగని ఓ మనసుకు భరోసానిస్తుంద ంటే అంతకు మించిన ఆనందం ఏముంటుంది. ఆ స్పెషల్ చిల్డ్రన్ తయారు చేసిన దివ్వెలు హృదయానికి హ త్తుకుంటున్నాయి. ఇంటింటా దీపాల పండుగను కలర్‌ఫుల్ చేస్తున్నాయి. వయసుకు తగ్గట్టు ఎదగని మనసు వాళ్లను స్పెషల్ కేటగిరీలో చేర్చింది. వాళ్లేం చేసినా సంథింగ్ స్పెషలే. అందుకే ఆ చిన్నారులు మలచిన ప్రమిదలు సిటీవాసుల లోగిళ్లలో కాంతులీనుతున్నాయి. ఈ ‘చిరు’ దీపాల పనితనం కార్పొరేట్ హౌస్‌లను సైతం మెరుపులై ఆకట్టుకుంటున్నాయి. మెంటల్లీ రిటార్టెడ్ పిల్లలు దీపావళి సందర్భంగా డిజైన్ చేస్తున్న ప్రమిదలకు మంచి డిమాండ్ వస్తోంది. ఈ స్పెషల్ చేతులు మలచిన ప్రమిదలను కొని పండుగను సంతోషమయం చేసుకునేందుకు సిటిజన్లు సిద్ధమవుతున్నారు. కార్పొరేట్ అదిరిం‘దియా’.. స్పెషల్ చిల్డ్రన్ తీర్చిదిద్దుతున్న వెలుగు నెలవులను అదిరిం‘దియా’ అంటూ కొంటున్నాయి కార్పొరేట్ కంపెనీలు. డెల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర వంటి పలు కంపెనీలు తమ కార్యాలయాల్లో ఈ వీటినే దీపాలుగా మలుస్తున్నాయి. గొడుగులు, కలశం వంటి విభిన్న రకాల డిజై న్లు.. కార్పొరేట్ మాల్స్‌లోని ప్రమిదలతో పోటీపడుతున్నాయి. వీటి విలువ రూ.10 నుంచి రూ.150 వరకూ పలుకుతున్నాయి. సంప్రదాయంగా మారింది.. నగరానికి చెందిన యానిమేషన్ సంస్థ డిక్యు ఎంటర్టైన్మెంట్ 3 బ్రాంచిల ఉద్యోగులు మా పిల్లలు చేసిన ప్రమిదలనే కొంటున్నారు. దీపావళికి ముందే పిల్లలు దీపాలకు కలర్స్ వేసి, డిజైన్లు దిద్ది సిద్ధం చేస్తారు. దియాల తయారీ.. చిన్నారుల్లో క్రియేటివిటీ పెంచడానికి ఎడ్యుకేషన్‌లో భాగంగా ప్రారంభించినా.. ఆ తర్వాత పిల్లల ఆసక్తి, వీటికి వస్తున్న స్పందనతో దీన్నో సంప్రదాయంగా మార్చాం. - దుర్గ, స్వయంకృషి సంస్థ నిర్వాహకురాలు స్పెషల్ మేళా.. ఈ చిన్నారుల చేతుల్లో ఒక్క ప్రమిదలే కాదు.. వాల్ హ్యాంగింగ్స్, శారీ పెయింటింగ్, వుడెన్ డెకరేటివ్ ఐటమ్స్, కార్ హ్యాంగింగ్స్, డోర్ హ్యాంగింగ్స్, ఫొటో ఫ్రేమ్స్ వంటి ఎన్నో వెరైటీ ఆకృతులు రూపుదిద్దుకుంటున్నాయి. వీటితో సప్తపర్ణిలో స్టాల్ కూడా ఏర్పాటైంది. నగరంలో స్పెషల్ చిల్డ్రన్ కోసం పని చేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలు వీరిలోని కళాత్మకను వెలికితీస్తున్నాయి. వీరు తయారు చేసిన దివ్వెలను మార్కెట్ చేయగా, వచ్చిన లాభాలను పిల్లల అవసరాలకే వినియోగిస్తున్నాయి. బాగ్‌లింగంపల్లిలోని ‘ఆశయం’ ఆర్గనైజేషన్, ఎల్లారెడ్డిగూడలోని ఆరంభ్ ఆటిజం స్కూల్, తిరుమలగిరిలోని ఎయిర్ లైన్స్ కాలనీ స్వయంకృషి సంస్థలో స్పెషల్ చిల్డ్రన్ అందమైన దివ్వెలను తయారు చేస్తూ.. మన్ననలు అందుకుంటున్నారు. - ఎస్.సత్యబాబు