
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి దీపాలు వెలిగించేవారు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం శనివారం సూచించింది. దీపాలు, కొవ్వొత్తులు వెలిగించే ముందు చేతులు శుభ్రం చేసుకోవడానికి ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు వాడొద్దని పేర్కొంది. ఇలాంటి శానిటైజర్లు మంటలకు అంటుకునే ప్రమాదం ఉందని ప్రెస్ ఇన్ఫర్మేసన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ కేఎస్ దాత్వాలియా హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment