lights on off
-
రేయ్! రేయ్!.. తప్పుకోండిరా బాబు... మీదకు వచ్చేస్తోంది..!!
ఒక్కోసారి అనుహ్యంగా జరిగే ప్రమాదాలు చాలా భయంకరంగా ఉంటాయి. అయితే, అటువంటి ఘటనల్లో ఎవ్వరికీ ఏం నష్టం జరగకపోతే పర్వాలేదు గానీ ఊహించని విధంగా ప్రాణం నష్టం సంభవిస్తే మాత్రం పరిస్థితి మరింత భయానకంగా మారుతుంది. తాజాగా అటువంటి ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (చదవండి: రాంచీలో బిర్సా ముండా స్మారకాన్ని ప్రారంభించిన మోదీ) వీడియో ప్రకారం.. ఏమైందో తెలియదు గానీ, చెరకు లోడ్‌తో ఉన్న ట్రాక్టర్ ట్రాలీ భాగం ఒక్కసారిగా ప్రజల మీదకు దూసుకొస్తోంది. ఊహించని ఘటనతో కంగుతిన్న అక్కడున్నవారు అప్రమత్తమై తప్పుకోండి.. తప్పుకోండి అని అరవడం మొదలెట్టారు. మరికొంతమంది అలవాటులో పొరపాటుగానో.. లేక నిజంగానే అంత బలమైన, వేగంతో పరుగెడుతున్న ట్రాలీని ఆపగలమనే భ్రమతోనో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక లోడ్‌తో ఉన్న ట్రాలీ జనం మధ్యగుండా వేగంగా వెనక్కి వెళ్లి ఓ కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగింది. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. విషయం ఏంటంటే.. ఓ ట్రాక్టర్ చెరకు లోడ్‌తో వచ్చింది. దానిని అన్లోడ్ చేద్దామని.. ట్రాలీని ఇంజన్ భాగం నుంచి వేరు చేశారు. అయితే, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ట్రాలీని ఇంజన్ నుంచి విడదీయడంతో అది ఒక్కసారిగా వెనక్కి లగెత్తింది. ఇక్కడ ఫన్నీ విషయం ఏంటంటే.. అప్పటి వరకు అక్కడ చీకటి కమ్ముకోగా.. ట్రాలీ ఢీకొట్టడంతో స్తంభానికి ఉన్న లైట్ ఒక్కసారిగా వెలిగింది. "ఏవిధంగా ట్రాలీని ఆపగలమనుకుని పరుగెడుతున్నారంటూ" కొందరు నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్లు చేశారు. (చదవండి: జిమ్‌లో అసభ్య ప్రవర్తన... టిక్‌టాక్ షేర్ చేయడంతో పరార్!!) जान माल का नुकसान तो नहीं हुआ लेकिन दूसरा बल्ब चालू हो गया 🤣🤣😁😅😀 pic.twitter.com/wIf2nhW1jM — Doctor Gulati L L B (@DRGulati80) November 12, 2021 -
దీపాలు వెలిగించే ముందు శానిటైజర్లు వాడొద్దు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి దీపాలు వెలిగించేవారు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం శనివారం సూచించింది. దీపాలు, కొవ్వొత్తులు వెలిగించే ముందు చేతులు శుభ్రం చేసుకోవడానికి ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు వాడొద్దని పేర్కొంది. ఇలాంటి శానిటైజర్లు మంటలకు అంటుకునే ప్రమాదం ఉందని ప్రెస్ ఇన్ఫర్మేసన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ కేఎస్ దాత్వాలియా హెచ్చరించారు. -
ఆ ఇంటి లైట్లను మీరు కూడా ఆన్, ఆఫ్ చేయొచ్చు
అలస్కా: మన ఇంటికి అలంకరించిన లైట్లను ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా, ఎక్కడి నుండైనా ఆన్, ఆఫ్ చేసే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నే కొంచెం విచిత్రంగా అనిపించినప్పటికీ.. అమెరికాలోని ఓ ఇంటి అలంకరణ లైట్లను ఎవరైనా ఎక్కడి నుండైనా వెలిగించవచ్చు, ఆర్పేయవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తమ సంతోషాన్ని అందరితో పంచుకోవడం కోసం అలస్కాకు చెందిన ఐటీ నిపుణుడు జాన్ ఉడ్స్ తన ఇంటికి అలంకరణ లైట్లను ఇంటర్నెట్ ద్వారా ఎక్కడి నుండైనా, ఎవరైనా ఆన్, ఆఫ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా మరోసారి లైట్లపై పూర్తి కంట్రోల్ ఇంటర్ నెట్ యూజర్లకే ఇచ్చేశాడు. ఈ ఏడాది ఇలాంటి అవకాశం కల్పించడం ఇది ఆరోసారి. ఉడ్స్ ఆలోచనకు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వస్తుంది. తమ ఇంట్లో లైట్లను ఆఫ్ చేయడానికి బద్దకించే వారు సైతం గంటల తరబడి ఆన్లైన్లో ఉడ్స్ ఇంటికి అలంకరించిన లైట్లను ఆన్, ఆఫ్ చేస్తూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ లింక్ ద్వారా http://christmasinfairbanks.com మీరు కూడా ఓ సారి ప్రయత్నించండి..