ఆ ఇంటి లైట్లను మీరు కూడా ఆన్, ఆఫ్ చేయొచ్చు | american family let strangers on the internet control their Christmas lights | Sakshi
Sakshi News home page

ఆ ఇంటి లైట్లను మీరు కూడా ఆన్, ఆఫ్ చేయొచ్చు

Published Mon, Dec 21 2015 10:01 AM | Last Updated on Thu, Apr 4 2019 4:27 PM

ఆ ఇంటి లైట్లను మీరు కూడా ఆన్, ఆఫ్ చేయొచ్చు - Sakshi

ఆ ఇంటి లైట్లను మీరు కూడా ఆన్, ఆఫ్ చేయొచ్చు

అలస్కా: మన ఇంటికి అలంకరించిన లైట్లను ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా, ఎక్కడి నుండైనా ఆన్, ఆఫ్ చేసే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది?  ఈ ప్రశ్నే కొంచెం విచిత్రంగా అనిపించినప్పటికీ.. అమెరికాలోని ఓ ఇంటి అలంకరణ లైట్లను ఎవరైనా ఎక్కడి నుండైనా వెలిగించవచ్చు, ఆర్పేయవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తమ సంతోషాన్ని అందరితో పంచుకోవడం కోసం అలస్కాకు చెందిన ఐటీ నిపుణుడు జాన్ ఉడ్స్ తన ఇంటికి అలంకరణ లైట్లను ఇంటర్నెట్ ద్వారా ఎక్కడి నుండైనా, ఎవరైనా ఆన్, ఆఫ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాడు.

క్రిస్మస్ సందర్భంగా మరోసారి లైట్లపై పూర్తి కంట్రోల్ ఇంటర్ నెట్ యూజర్లకే ఇచ్చేశాడు. ఈ ఏడాది ఇలాంటి అవకాశం కల్పించడం ఇది ఆరోసారి. ఉడ్స్ ఆలోచనకు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వస్తుంది. తమ ఇంట్లో లైట్లను ఆఫ్ చేయడానికి బద్దకించే వారు సైతం గంటల తరబడి ఆన్లైన్లో ఉడ్స్ ఇంటికి అలంకరించిన లైట్లను ఆన్, ఆఫ్ చేస్తూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ లింక్ ద్వారా http://christmasinfairbanks.com  మీరు కూడా ఓ సారి ప్రయత్నించండి..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement