lights
-
మన ముంగిళ్లలో వెలుగు పూలు
సాధారణంగా అమావాస్యనాడు చిక్కటి చీకట్లు అలముకుని ఉంటాయి. అయితే దీపావళి అమావాస్యనాడు మాత్రం అంతటా వెలుగుపూలు విరగపూస్తాయి. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఇంట ఉల్లాసం, ఉత్సాహం వెల్లివిరుస్తాయి. ముంగిళ్లన్నీ దీపకాంతులతో కళకళలాడే ఈ పర్వదినం ప్రాముఖ్యత, ఆచార సంప్రదాయాలను తెలుసుకుని ఆచరిద్దాం...దీపావళికి సంబంధించి కథలెన్నో ఉన్నప్పటికీ శ్రీ కృష్ణుడు సత్యభామ సమేతుడై... లోక కంటకుడైన నరకాసురుని వధించిన సందర్భంగా మాత్రమే దీపావళి జరుపుకుంటున్నామన్న కథే బహుళ ప్రాచుర్యంలో ఉంది.నరకాసుర వధభూదేవి కుమారుడైన నరకుడు ప్రాగ్జ్యోతిషపురమనే రాజ్యాన్ని పాలించేవాడు. నరకుడు అంటే హింసించేవాడు అని అర్థం. పేరుకు తగ్గట్టే ఉండాలని కాబోలు.. రాజై ఉండి కూడా దేవతల తల్లి అదితి కర్ణకుండలాలను, వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు. దేవతలను, మానవులను, మునులను హింసల పాల్జేసేవాడు. దేవతల మీదికి పదేపదే దండెత్తేవాడు. వాడు పెట్టే హింసలు భరించలేక అందరూ కలసి శ్రీ కృష్ణుని దగ్గర మొరపెట్టుకోగా, కృష్ణుడు వాడిని సంహరిస్తానని మాట ఇచ్చి, యుద్ధానికి బయలుదేరాడు. ప్రియసఖి సత్యభామ తాను కూడా వస్తానంటే వెంటబెట్టుకెళ్లాడు. యుద్ధంలో అలసిన కృష్ణుడు ఆదమరచి, అలసట తీర్చుకుంటుండగా అదను చూసి సంహరించబోతాడు నరకుడు. అది గమనించిన సత్యభామ తానే స్వయంగా విల్లందుకుని వాడితో యుద్ధం చేస్తుంది. ఈలోగా తేరుకున్న కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, వాడిని సంహరిస్తాడు.లోక కంటకుడైన నరకాసురుని వధ జరిగిన వెంటనే ఆ దుష్టరాక్షసుడి పీడ వదిలిందన్న సంతోషంతో దేవతలు, మానవులు దీపాలను వెలిగించి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అప్పటినుంచి ప్రతి ఏటా దీపావళి పండగ జరుపుకోవడం ఆచారంగా మారింది.ఈ పర్వదినాన ఇలా చేయాలి...ఈ రోజున తెల్లవారు జామునే తలకి నువ్వుల నూనె పెట్టుకుని, తలంటుస్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు ఆకులను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వపాపాలను హరింపజేయడమే గాక గంగాస్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం.దీపావళి నాడు విధివిధానంగా లక్ష్మీపూజ చేయాలి. ఎందుకంటే, దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లలో తన కళను ఉంచి వెళుతుందని శాస్త్రవచనం. అందుకే దీపావళి నాడు ఇంటిని వీలైనంత అందంగా అలంకరించాలి.దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి?దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి. అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పురాతన వృక్షాల వద్ద, ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే నాలుగు వీధుల కూడలిలో దీపం వెలిగించాలి. నువ్వులనూనె దీపాలనే వెలిగించడం, మట్టి ప్రమిదలనే వాడడం శ్రేష్ఠం. దీపావళి పితృదేవతలకు సంబంధించిన పండుగ కాబట్టి ఈనాటి సాయంత్రం గోగు కాడల మీద దివిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయని, తద్వారా పితృదేవతలు సంతోషిస్తారని, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుందనీ విశ్వాసం.దీపావళి నాటి అర్ధరాత్రి చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళ్లతోనూ, డిండిమం అనే వాద్యాన్ని వాయిస్తూ జ్యేష్ఠలక్ష్మిని (దరిద్ర దేవతను) సాగనంపాలని, లక్ష్మీదేవికి పచ్చకర్పూరంతో హారతినివ్వాలనీ శాస్త్రవచనం.లక్ష్మీపూజ ఇలా చేయాలి...ఇంటిగుమ్మాలను మామిడి లేదా అశోకచెట్టు ఆకుల తోరణాలతోనూ, ముంగిళ్లను రంగవల్లులతోనూ తీర్చిదిద్దాలి. అనంతరం... ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద కొత్త కండువా పరిచి, బియ్యం ΄ోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచాలి. కలశం పెట్టే అలవాటున్న వారు ఆనవాయితీ తప్పకూడదు. ఆ ఆచారం లేనివారు అమ్మవారిని ధ్యానావాహనాది షోడశోపచారాలతో పూజించాలి. వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దుపుస్తకాలను ఉంచాలి. మిగిలినవారు నాణాలను, నూతన వస్త్రాభరణాలను, గంధ పుష్పాక్షతలు, మంగళకరమైన వస్తువులను ఉంచి యథాశక్తి పూజించాలి. దీపావళి నాడు లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్మీ అష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామర పువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రోక్తి. సాయంత్రం వేళ నూత్న వస్త్రాలు ధరించి పెద్దల ఆశీస్సులు అందుకోవాలి. అనంతరం బాణసంచా కాల్చి, నోరు తీపి చేసుకోవాలి. – డి.వి.ఆర్. భాస్కర్ -
మట్టి ప్రమిదలు,నువ్వుల నూనె : ఆరోగ్య లక్ష్మి, ఐశ్వర్యలక్ష్మికి ఆహ్వానం!
వినాయక చవితి సందర్భంగా మట్టివిగ్రహాలతొ విఘ్ననాయకుడ్ని కొలిచి తరించాం. ఇపుడు దీపాల పండుగ దీపావళి సంబరాలకు సమయం సమీపిస్తోంది. దీపావళి రోజున పెట్టిన దీపాల పరంపర, కార్తీకమాసం అంతా కొనసాగుతుంది. దీపావళి పండుగలో దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది.దీపావళి రోజున మట్టి ప్రమిదలనే వాడదాం. తద్వారా దైవశక్తులను ఆకర్షించడం మాత్రమే కాదు, పర్యావరణాన్ని కాపాడిన వారమూ అవుతాం. ‘‘దీప” అంటే దీపము. ‘ఆవళి’ అంటే వరుస. అలా దీపావళి అంటే.. దీపాల వరుస అని అర్థం. దీపం అంటే జ్ఞానం, ఐశ్వర్యం. చీకటి నుంచి వెలుగులోకి, ఐశ్వర్యంలోకి పయనించడమే దీపాల పండుగ ఆంతర్యం.మట్టి ప్రమిద. నువ్వుల నూనె, లేదా ఆవు నెయ్యి ఈ కలయిక ఎంతో మంగళకరం. నువ్వుల నూనెతో కూడిన మట్టి ప్రమిదల దీపపు కాంతి, ఆరోగ్యానికి కంటికి ఎంతో మేలు చేస్తాయి. శీతాకాలపు చలిగాలు మధ్య మన శరీరానికి ఏంతో మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభించి, పూర్వ జన్మ పాపపుణ్యాలు తొలగి పోతాయి. మట్టి ప్రమిదల్లో దీపం పెట్టడం అంటే అటు ఆరోగ్య లక్ష్మీని ఇటు ఐశ్వర్యలక్ష్మీని ఆహ్వానించి, వారి అనుగ్రహాన్ని పొందడన్నమాట.దీపారాధన చేసే సమయంలో ”దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర! దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదేవి నమోస్తుతే!!” అనే శ్లోకాన్ని చదువుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల మట్టి ప్రమిదలు, దీపాలు అందుబాటులో ఉన్నాయి. మట్టి దీపాలను వాడటం ద్వారా వృత్తి కళాకారులకు ప్రోత్సాహమిచ్చినవారమవుతాం. అలాగే కస్టమర్ల ఆసక్తికి అనుగుణంగా, ఆకట్టుకునే డిజైన్లతో ట్రెండీ లుక్‌తో అలరిస్తున్నాయి మట్టి దీపాలు. పాత ప్రమిదలను కూడా శుభ్రం చేసుకొని వాడుకోవచ్చు. -
దీపావళి వేళ.. వళ్లంతా దీపాలే!
దీపావళి వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి. దీపావళి అంటే వెలుగుల పండుగ. దీపావళి రోజున ఇళ్లను దీపాలతో అలంకరిస్తారు. అయితే దీపావళి వేళ ఒక మహిళ వినూత్నంగా అలంకరించుకుంది. ఇళ్లను అలంకరించేందుకు వినియోగించే చిరు దీపాలను తన దుస్తులకు అల్లుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు దీపావళికి ఇటువంటి దుస్తులు పర్ఫెక్ట్ అని కితాబిస్తున్నారు. వర్షా. యాదవ్ పేరిట ఉన్న ఇన్‌స్టా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. వీడియోలో ఒక మహిళ ఘాగ్రా చోళీని ధరించి కనిపిస్తుంది. ఘాగ్రాతో పాటు వేసుకున్న చున్నీకి రంగురంగుల దీపాలు అతికించి ఉన్నాయి. కాంతులీనుతున్న ఈ దుస్తులను చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోకు దాదాపు 5 లక్షల లైక్స్ వచ్చాయి. లెక్కకు మించిన కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇది కూడా చదవండి: దీపావళి వేళ.. ఢిల్లీలో 200కుపైగా అగ్నిప్రమాదాలు! View this post on Instagram A post shared by Varsha Bai (@varsha.yadav777) -
‘యూదుల దీపావళి’ ఏమిటి? దేనిపై విజయానికి గుర్తు?
భారతీయులు దీపావళి పండుగ కోసం ఏడాది పొడవునా ఆసక్తిగా వేచిచూస్తుంటారు. ఆ రోజున భారతదేశం యావత్తూ దీపకాంతులతో నిండిపోతుంది. దీపావళి రోజున ఎక్కడ చూసినా వెలుగులు విరజిమ్ముతాయి. అయితే మనం చేసుకునే దీపావళి లాంటి పండుగను యూదులు కూడా జరుపుకుంటారని మీకు తెలుసా? యూదులు ఈ ఉత్సవాన్ని ఎలా జరుపుకుంటారో.. దీపావళికి ఇది ఎలా సరిపోలి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న యూదులు జరపుకునే వెలుగుల పండుగ పేరు హనుక్కా. యూదులు దీనిని దీపాల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ యూదులకు చాలా ముఖ్యమైనది. ఈ రోజున ఇజ్రాయెల్ అంతా కాంతులతో నిండిపోతుంది. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ పండుగ ఇజ్రాయిల్‌లో కేవలం ఒక్కరోజుతోనే ముగిసిపోదు. ఈ పండుగను యూదులు ఎనిమిది రోజులు ఆనందంగా జరుపుకుంటారు. హనుక్కా ఉత్సవ సమయంలో ప్రతి యూదు తమ ఇంటిలో 24 గంటలూ దీపాలు వెలిగిస్తాడు. యూదుల ఈ పండుగను మన దీపావళి తర్వాత అంటే డిసెంబర్లో జరుపుకుంటారు. యూదుల ఈ పండుగను ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 18 వరకూ జరుపుకుంటారు. అయితే ఈ పండుగను ఇజ్రాయెల్ యూదులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులంతా ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండుగకు ఎంతో గుర్తింపు ఉంది. ఈ ఉత్సవ సమయంలో ఎక్కడెక్కడి యూదులు సైతం వారి ఇళ్లకు చేరుకుని ఆనందంగా గడుపుతారు. శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు మనం దీపావళి జరుపుకున్నట్లే, యూదులు కూడా తమ విజయానికి గుర్తుగా హనుక్కా పండుగను జరుపుకుంటారు. నాటి రోజుల్లో క్రోబియన్ తిరుగుబాటు జరిగినప్పుడు గ్రీకు-సిరియన్ పాలకులకు వ్యతిరేకంగా యూదులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ విధంగా వారిని జెరూసలేం నుండి వెళ్లగొట్టారు. దీనికి గుర్తుగా యూదులు హనుక్కా ఉత్సవాన్ని చేసుకుంటారు. ఇది కూడా చదవండి: ఆసియాను వణికించిన భూ కంపాలివే.. -
నిజంగా ఇదో అద్భుతం.. రాజమౌళి ప్రశంసలు
నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోంది. టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఈ పాటకు అమెరికాలోనూ క్రేజ్ మామూలుగా లేదు. తాజాగా న్యూజెర్సీలో టెస్లా కార్లతో ప్రదర్శించిన ఓ వీడియో సోషల్ మీడియోలో పెద్దఎత్తున వైరలైంది. ఈ వీడియో చూసిన రాజమౌళి తాజాగా స్పందించారు. ఆ వీడియోను తన ట్విటర్లో షేర్ చేస్తూ అద్భుతమంటూ కొనియాడారు. రాజమౌళి తన ట్విటర్లో రాస్తూ.. 'న్యూజెర్సీ నుంచి నాటు నాటు పాటకు మీరు చూపిన అభిమానానికి నిజంగా పొంగిపోయా. మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇంతటి అధ్బుతమైన వీడియోను ప్రదర్శించిన ప్రతి ఒక్కరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. నాటు నాటు సాంగ్‌కు టెస్లా కార్లతో లైట్ షో ఒక అద్భుతమైన అనుభూతి.' అంటూ పోస్ట్ చేశారు. ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా నాటు నాటు సాంగ్ ఇంత క్రేజ్ తీసుకొచ్చన ఘనత దర్శకధీరుడు రాజమౌళికే దక్కుతుంది. ఈ ఏడాది జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో ఈ పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. Truly overwhelmed by this tribute to #NaatuNaatu from New Jersey ! Thank you @vkkoppu garu, #NASAA, @peoplemediafcy and everyone associated with this incredible and ingenious @Tesla Light Show...:) It was a stunning show. #RRRMovie @elonmusk pic.twitter.com/JKRfTZdvLK — rajamouli ss (@ssrajamouli) March 21, 2023 -
18.82 లక్షల దీపాలతో గిన్నిస్ రికార్డు
ఉజ్జయిని: మహా శివరాత్రి సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో ఏకంగా 18,82,229 దీపాలు వెలిగించారు. గిన్నిస్ రికార్డు సృష్టించారు. శనివారం సాయంత్రం క్షిప్రా నది ఒడ్డున నిర్వహించిన ఈ కార్యక్రమంలో 20 వేల మంది వాలంటీర్లు పాల్గొన్నారు. 2022లో అయోధ్యలో అత్యధికంగా 15.76 లక్షల దీపాలు వెలిగించారు. ఉజ్జయినిలో గత శివరాత్రి సందర్భంగా 11,71,078 దీపాలు వెలిగించారు. -
Diwali 2022: అమావాస్య చీకట్లలో పున్నమి వెలుగులు
భారతీయులందరూ అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి దీపావళి పండుగ. మన మహర్షులు ఏర్పరచిన మన పండుగలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలు కలిగి, ఆచార వ్యవహారాలతో కలిసి ఉంటాయి. మన పండుగల వెనుక అపారమైన శాస్త్రీయత, సమాజానికి హితకరమైన అంశాలు అనేకం దాగి ఉంటాయి. కాలంలో వచ్చే మార్పులతోపాటు, ఖగోళంలో వచ్చే మార్పులను కూడా ఆధారంగా చేసుకుని మన మహర్షులు మనకు ప్రతి నెలలోనూ పండుగలను నిర్దేశించారు. మన సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికతకు, మానవతా విలువలకు ప్రతీక ‘దీపావళి పండుగ‘. సమగ్ర భారత దేశంలో హిందువులే కాక జైనులు, బౌద్ధులు, సిఖ్ఖులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. నేటి కాలంలో ప్రపంచ దేశాలలో ఎందరో దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. అమెరికాలో వైట్‌హౌస్ లో కూడా దీపావళి నాడు దీపాలు వెలిగిస్తున్నారు. అమావాస్యను, పౌర్ణమిని కూడా ‘పూర్ణ తిథులు‘ అంటారు. అలాంటి ఆశ్వయుజ బహుళ అమావాస్యనాడు, స్వాతి నక్షత్రంతో కూడిన అమావాస్యనాడు మనం దీపావళి పండుగను జరుపుకుంటాము. ‘దీపానాం ఆవళీ – దీపావళీ.‘దీపావళి అంటే దీపాల వరుస. దీపావళి రోజు రాత్రి సమయంలో యావత్ భారతదేశం అసంఖ్యాకమైన విద్యుద్దీపాలంకరణతోను, నూనె దీపాల ప్రమిదలతోనూ అత్యంత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దీపావళి పండుగనాడు విశేషంగా ఆచరించే పనులు – సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానమాచరించటం, పితృతర్పణాలివ్వటం, దానం చెయ్యటం, వత్తులు వేసి, నూనె దీపాలను వెలిగించటం, ఆకాశదీపం పెట్టటం. ఆకాశదీపం పెట్టడం వల్ల దూరప్రాంతాల వారికి కూడా ఈ దీప దర్శనమవుతుంది. దాని వెలుగు వలన మార్గదర్శనమవుతుంది. నరకుడు అలా పుట్టాడు: హిరణ్యాక్షుడు దేవతలను, ధర్మాత్ములైన మానవులను హింసిస్తూ, యావద్భూమండలాన్ని క్షోభిల్లజేస్తుంటే, శ్రీమన్నారాయణడు వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించి, భూమాతను రక్షించాడు. ఆ సమయంలో భూదేవి తనకొక కుమారుడిని ప్రసాదించమని స్వామిని ప్రార్థిస్తుంది. వారి సంతానమే నరకాసురుడు. స్వామి రాక్షస సంహారం కోసం అవతరించిన తరుణంలో భూమాతకి కలిగిన పుత్రుడు కనుక, నరకుడు తమోగుణ భరితుడై రాక్షసుడయ్యాడు. అతడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి, మరణం లేకుండా వరం కోరాడు. బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదని అంటే, ‘కన్నతల్లి బిడ్డలను పొరపాటున కూడా చంపదు కదా’ అని ఆలోచించి, ‘నాకు మా అమ్మ చేతిలో తప్ప మరణం లేకుండా వరం ఇవ్వండి‘ అని కోరాడు. ‘తథాసు’్త అన్నాడు బ్రహ్మ. ఇంక తనకు చావే లేదు, అనే భ్రమతో నరకుడు లోక కంటకుడై వేద సంస్కృతిని వ్యతిరేకిస్తూ, యజ్ఞయాగాదులు జరగకుండా అడ్డుకుంటూ, అమాయకులను, సాధువర్తనులను బాధిస్తూ రావణాసురుని వలె పరస్త్రీ వ్యామోహంతో శీలవంతులైన 16 వేల మంది స్త్రీలను బంధించాడు. దుష్ట శిక్షణ కోసం పరమాత్మ శ్రీ కృష్ణునిగా అవతరించాడు. భూదేవి సత్యభామగా అవతరించింది. తన తల్లి అయిన సత్యభామ వదిలిన బాణాహతితో నరకుడు మతి చెందాడు. శ్రీకృష్ణ పరమాత్మ నరకుని స్మృతిగా ఆ అమావాస్య నాడు దీపాలను వెలిగించి పండుగ చేసుకోవాలని నిర్దేశించాడు. నరకుని చెరలో ఉన్న 16,000 మంది స్త్రీలను విడిపించటమే కాక, నరకుని హస్తగతమైన ధనలక్ష్మిని విడిపించి, తన పాంచజన్య శంఖంతో, కామధేను క్షీరంతో, చతుస్సాగర జలాలతో ధనలక్ష్మికి ఈ రోజునే సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు. కనుకనే దీపావళి రోజున ప్రదోషకాలంలో లక్ష్మీపూజ చేయాలి అని శాస్త్రం చెప్తోంది. నరకుడు చనిపోయిన రోజును నరక చతుర్దశిగాను, ఆ మరునాడు అమావాస్యను దీపావళి గాను పండుగ చేసుకుంటున్నాము. నరకుడు అజ్ఞానానికి ప్రతీక. నరకం అంటే దుర్గతి. అది కలవాడు నరకుడు. అంటే చెడు నడత కలవాడు. మానవులందరూ మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని గ్రహించి మంచి నడతను కలిగి ఉండాలి. దీపావళి పండుగను అజ్ఞానం మీద జ్ఞానం, అంధకారం మీద వెలుగు విజయంగాను, నిరాశ మీద ఆశ సాధించిన విజయంగానూ చెప్పవచ్చును. ఈ దీపావళి పండుగనాడు కొందరు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో తమ జీవితాలు కలకాలం కళకళలాడుతూ సాగాలని కేదారేశ్వర వ్రతం చేస్తారు. కేదారేశ్వరుడు అంటే పరమేశ్వరుడు. జగన్మాత మంగళ గౌరీ దేవి పరమేశ్వరుని అనుగ్రహం కోసం గొప్ప తపస్సు చేసి ఈశ్వరుని మెప్పించి పరమేశ్వరుని శరీరంలో అర్ధ భాగాన్ని పొందింది. ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడయ్యాడు. ఈ కేదారేశ్వర వ్రతం చేసిన దంపతులు అన్యోన్యంగా ఆనందంగా ఉంటారని ప్రతీతి. దీపావళి మానసిక వికాసాన్ని కలిగించే పండుగ. అజ్ఞానం అనే చీకట్లు తొలగాలి అంటే జ్ఞానం అనే సూర్యుడు ప్రకాశించాలి. జ్ఞాన జ్యోతి వెలగాలి. ‘తమసోమా జ్యోతిర్గమయ‘ అంటే అర్థం ఇదే! అమావాస్య నాటి చీకటిని చిరు దివ్వెల వెలుగుతో పారద్రోలాలి, అని మన పెద్దలు చెప్పారు. ఎప్పటికైనా అధర్మం నశించి, ధర్మం ఉద్ధరింపబడుతుందని, మంచి అన్నదే శాశ్వతమని చాటి చెప్పేదే దీపావళి పండుగ. కుల మత వర్ణ వర్గ జాతి విభేద రహితంగా జరుపుకుని ఆనందించేది ఈ దీపావళి పండుగ. దీపం చైతన్యానికి ప్రతీక. దీపావళి ఉత్సవాలను ‘కౌముది ఉత్సవాలు‘ అంటారు. ఈ దివ్వెల పండుగ వచ్చినప్పుడు నాలుగైదు రోజులు ఆనందోత్సాహాలు ఉరకలు వేస్తూ గడపటం, నువ్వుల నూనె దీపాలు వెలిగించి, దైవారాధన చేయటం వంటి ఆధ్యాత్మిక ఆనంద వాతావరణం వల్ల శరీరం చురుకుదనాన్ని పొందుతుంది. మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. ఈ విశ్వమంతా ఆనంద డోలికలలో తేలియాడుతున్న భావనతో అందరి హదయాలలో ఆధ్యాత్మిక ఆనంద తరంగాలు జాగృతమై, సత్యం, ధర్మం, సమత, ప్రేమ, భూత దయ, సౌమనస్యం వంటి సాత్విక గుణాలు ఉదయించి, ఒక విధమైన ప్రశాంతతని అనుభవిస్తాం. దీపావళినాడు పగలంతా బంధుమిత్రుల ఆనందోత్సాహాల పలకరింపులు, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవటాలతోను, రాత్రంతా అద్భుతమైన ప్రకాశవంతమైన జ్యోతుల దర్శనంతో, మతాబుల వెలుగుల తేజస్సుతో మనలోని ఆధ్యాత్మిక చీకట్లు తొలగినట్లు, జ్ఞాన ఆనందాలు కలిగినట్లుగా ఆత్మానందానుభూతి కలుగుతుంది. దివిలోని తారలన్నీ భువికి దిగి వచ్చినట్లుగా లోకం వెలిగిపోతుంది. ఆనందోత్సాహాలు ఉరకలేస్తాయి. మన హృదయాలు ఆనందమయమయినప్పుడు మనం ఆ ఆనందాన్ని సర్వప్రాణి కోటికి పంచగలుగుతాం. పరమాత్మ అనుగ్రహంతో యావద్విశ్వం ఆనందమయమగు గాక! దీపావళి నాడు పితృదేవతలు సాయం సంధ్యా సమయాన ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి, తమ సంతానాల గృహాలను సందర్శిస్తారట. వారికి దారి కనిపించటం కోసమే దివ్వెలు కొట్టే సంప్రదాయం ఏర్పడింది. ఇంట్లోని పెద్దవారు పిల్లలతో ఈ దివిటీను కొట్టిస్తారు. పొడుగాటి గోంగూర కాడలకు నూనెతో తడిపిన బట్ట వత్తులు కట్టి, వాటిని పిల్లల చేతులకిచ్చి, వారిని వీధి గుమ్మం ముందు నిలబెట్టి దివిటీలను వెలిగించి, ఆకాశంలో దక్షిణం వైపుకి చూపిస్తూ గుండ్రంగా మూడుసార్లు తిప్పి, నేలకు వేసి కొట్టిస్తూ, ‘దుబ్బు దుబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి‘ అని అనిపిస్తారు. ఆ తరువాత ఆ కాడలను ఒకపక్కగా పడేస్తారు. పిల్లల కాళ్లు చేతులు కడిగి, కళ్ళు తడి చేతితో తుడిచి, నోరు పుక్కిలించి శుభ్రం చేసుకోమని, తరువాత ఆ పిల్లలకు నోట్లో మిఠాయిలు పెట్టి తినిపిస్తారు. తరువాత ఇంటిల్లిపాది టపాకాయలు కాల్చడం ప్రారంభిస్తారు. ఆనందంగా ఎంతసేపన్నా చిచ్చుబుడ్లు, మతాబులు, కాకరకడ్డీలు, అగ్గిపెట్టెలు, విమానాలు, రాకెట్లు, వెన్న ముద్దలు మొదలైనవన్నీ కాల్చవచ్చు. కానీ ‘బాణసంచా కాల్చటం లాంటి సంబరాలు పూర్తయ్యాక, అర్ధరాత్రి దాటాక, ఇళ్ళు, వాకిళ్ళను తుడిపించుకోవాలి‘ అని ధర్మశాస్త్రం చెప్తోంది. ∙చతుర్దశి మొదలు మూడు రాత్రులు దేవాలయాలలో, మఠాలలో, ఉద్యాన వనాలలో, వీధులలో, ఇళ్ళల్లో, గోశాలలలో, గుర్రాలు, ఏనుగులు ఉండు చోట్లల్లో దీపాలు వెలిగించాలి అని శాస్త్ర వచనం. ∙ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాడు ఉదయం చంద్రుడు ఉండగా నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయాలి. సూర్యాస్తమయ సమయంలో నరకాసుర వధ జరిగింది కనుక విథూయంలో అభ్యంగన స్నానమాచరించాలి అని పెద్దలు చెప్పారు. ∙‘దీపావళి ముందరి చతుర్దశి నాడు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగామాత ఆవేశించి ఉంటారు‘ అని పద్మ పురాణం చెప్తోంది. ఆరోజున సూర్యోదయాత్పూర్వం స్నానం చేసిన వారు యమలోకాన్ని దర్శించరట. ∙నువ్వుల నూనె శరీరానికి పట్టించుకుని అభ్యంగన స్నానం చేయటం వలన శనిదోష నివారణే కాకుండా, కండరాలు నరాలు దృఢపడతాయి. నరక చతుర్దశి రోజున తెల్లవారుఝామున స్వాతి నక్షత్ర కాంతి నీటిపై తన ప్రభావం చూపిస్తుంది. దీపావళి రోజు అమావాస్య కనుక సూర్యుడు తన సంపూర్ణ ప్రభావాన్ని చూపిస్తాడు. జలాధిపతి అయిన వరుణుడు తన అనుగ్రహాన్ని నీటిలో ఉంచుతాడు. కనుక ఈ స్నానం ఆరోగ్యాన్ని, లక్ష్మీ అనుగ్రహాన్ని కలిగిస్తుంది. పద్మ పురాణ, స్కాంద పురాణాలలో దీపావళి గురించిన ప్రస్తావన ఉంది. శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళ లోకానికి అణగదొక్కి సుతల రాజ్యాధిపతిని చేసినందుకుగాను ఈ అమావాస్యను దీపావళిగా జరుపుకుంటారనీ, శ్రీరామచంద్రుడు రావణాసురుడిని వధించి శ్రీసీతాలక్ష్మణ ఆంజనేయాదులతో అయోధ్యకేతెంచి, పట్టాభిషిక్తుడైన రోజు ఈరోజు కనుక ఈరోజును దీపావళిగా జరుపుకుంటారని, శ్రీ కృష్ణుడు సత్యభామా సమేతుడై నరుకుని వధించిన సందర్భంగా ప్రజలు దీపావళి జరుపుకుంటున్నారని, కృత, త్రేతా, ద్వాపర యుగాలకు సంబంధించిన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇంకా, పంచపాండవులు వనవాస, అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకుని విజయవంతులై తిరిగి వచ్చినందుకు ఆనందంతో ప్రజలు దీపావళి జరుపుతున్నారని కూడా ప్రచారంలో ఉంది. ఆదిపరాశక్తి శుంభ నిశుంభులనే రాక్షసులను సంహరించినందుకు ఆనందంతో వెలిగించిన జ్యోతులే దీపావళి అని కూడా ప్రచారంలో ఉంది. ఇవే కాక, క్షీరసాగర సమద్భూత అయిన శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణుడిని వరించినందుకు దేవతలు, మానవులు, అందరూ ఆనందోత్సాహాలతో దీపావళిని జరుపుకుంటున్నారు అని కూడా చెప్తారు. – డా. సోమంచి (తంగిరాల) విశాలాక్షి -
వెలుగులతో ముస్తాబైన హైదరాబాద్ (ఫొటోలు)
-
ఆధునిక ఇళ్లకు సరికొత్త లైట్లు
సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో దొరికే లైటు తెచ్చి ప్రతి గదిలో పెట్టే రోజులు పోయాయి. పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక ఇంటి యజమానుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆలోచనలకు తగ్గట్టు, పరిస్థితుల ప్రకారం వెలిగే లైట్లను ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగా వైర్లెస్ లైటింగ్ ఆటోమేషన్ మార్కెట్లో లభిస్తుంది. ఫ్లాట్‌లో అయినా విల్లాలో అయినా వైర్లెస్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవచ్చు. బంధుమిత్రులు, చూపరులకు నచ్చే విధంగా ఇంటిని అలంకరించుకోవచ్చు. అయితే ఇందుకు మనం చేయాల్సిందల్లా.. ఎక్కడెక్కడ ఏయే తరహా లైట్లు ఉండాలో చెబితే సరిపోతుంది. లేదా మన ఆలోచనల్ని చెబితే ఆయా సంస్థలే పనిని పూర్తి చేస్తాయి. ఏసీలు ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణమయ్యాయి. రిమోట్ కంట్రోల్ బదులు మొబైల్‌తో వీటిని నియంత్రించుకోవచ్చు. వీటిని అమర్చిన తర్వాత మనం ఎక్కడున్నా సరే అరచేతిలో ఉండే మొబైల్‌తో మన ఇంట్లోని లైట్లను వెలిగించుకోవచ్చు, -
గ్రిడ్ కుప్పకూలే అవకాశమే లేదు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు దేశ ప్రజలందరూ విద్యుత్ బల్బులను ఆర్పివేసినా పవర్ గ్రిడ్ ఏమీ కూలిపోదని కేంద్ర ప్రభుత్వం శనివారం స్పష్టం చేసింది. విద్యుత్ సరఫరా, డిమాండ్‌లో వచ్చే తేడాలను నియంత్రించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో భారతీయులందరి సామూహిక సంకల్ప బలాన్ని ప్రదర్శించేందుకు ప్రధాని ఆదివారం రాత్రి విద్యుత్ దీపాలను తొమ్మిది నిమిషాలపాటు ఆర్పివేయాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే ఇలా చేస్తే అకస్మాత్తుగా వినియోగం తగ్గి విద్యుత్ గ్రిడ్ కుప్పకూలుతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీపాలన్నీ ఆర్పితే దాదాపు 13 గిగావాట్ల విద్యుత్తు డిమాండ్ తగ్గుతుందని, దీన్ని ఎదుర్కొనేందుకు జల, గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తిని తగ్గిస్తామని విద్యుత్ గ్రిడ్ నిర్వహణను చూస్తున్న పవర్ సిస్టమ్స్ ఆపరేషన్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. బొగ్గు, గ్యాస్ ఆధారిత ప్లాంట్లను తగు విధంగా పనిచేయించడం ద్వారా అత్యధిక స్థాయి డిమాండ్‌ను అందుకునేందుకు ఏర్పాట్లు చేశామని పవర్ సిస్టమ్ కార్పొరేషన్ తెలిపింది. దేశీ విద్యుత్తు వ్యవస్థ పటిష్టంగా ఉందని, వోల్టేజీలో వచ్చే హెచ్చుతగ్గులను తట్టుకునేందుకు తగిన పద్ధతులు పాటిస్తామని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు లేఖ రాశారు. ఇళ్లల్లో దీపాలను మాత్రమే ఆర్పివేయాల్సిందిగా మోదీ కోరారని, వీధి దీపాలు, కంప్యూటర్, టీవీ, ఫ్యాన్, ఫ్రిజ్ వంటివి నడుస్తూనే ఉంటాయని తెలిపారు. ఆసుపత్రులు, ఇతర ప్రజా సంబంధిత వ్యవస్థల్లోనూ విద్యుత్తు వినియోగం ఉంటుందని గుర్తు చేశారు. ఆదివారం రాత్రి నాటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రాల లోడ్ డిస్పాచ్ సెంటర్లు సిద్ధమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్, తమిళనాడులు రాత్రి ఎనిమిది, తొమ్మిది గంటల మధ్య లోడ్ షెడ్డింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ఆదివారం రాత్రి విద్యుత్తు డిమాండ్ పది నుంచి పన్నెండు గిగావాట్ల మేర తగ్గే అవకాశముందని ఇది గ్రిడ్ కూలిపోయేంత స్థాయిదేమీ కాదని అధికారులు కొందరు తెలిపారు. -
దీపాలతో సంఘీభావం ప్రకటించండి
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం రా త్రి 9 గంటలకు విద్యుత్ దీపాలను ఆ పి 9 నిముషాల పాటు కొవ్వొత్తులు లే దా ప్రమిదలు వెలిగించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. కరోనాపై దేశం సమిష్టిగా చేస్తున్న యుద్ధానికి సంఘీభావంగా దీపాలు వెలిగించాల్సిందిగా కోరారు. ఇళ్ల ముంగిట, బాల్కనీల్లో దీపాలు వెలిగించి సంఘీభావం ప్రకటించాలని, రోడ్లపై బృందాలుగా రావొద్దని గవర్నర్ తమిళిసై సూచించారు. సహృదయ ఫౌండేషన్ విరాళం గవర్నర్ పిలుపు మేరకు ‘కొవిద సహృదయ ఫౌండేషన్’శనివారం నీలోఫర్ ఆసుపత్రికి సబ్బులు, శానిటైజర్లు, మాస్కులు తదితరాల ను విరాళంగా అందజేసింది. ఫౌండే షన్ వ్యవస్థాపకుడు జి.అనూఖ్యరెడ్డి రాజ్‌భవన్‌లో ఈ సామగ్రిని నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ జి.అనురాధకు అందజేశారు. 500 సబ్బులు, 250 లీటర్ల శానిటైజర్, మాస్కులు ఇతరాలను అందజేశారు. వీటితో పాటు రాజ్ భవన్ పరిసరాల్లో పనిచేసే జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందికి మాస్కులతో పాటు ఆహార ప్యాకెట్లను కూడా అందజేశారు. లాక్డౌన్ కొనసాగినన్ని రోజులు రాజ్‌భవన్ పరిసరాల్లో పేదలకు ఉచితంగా ఆహారం అందజేస్తామని గవర్నర్ సంయుక్త కార్యదర్శి జె.భవానీ శంకర్ ప్రకటించారు. -
లైట్లు వెలగక.. ఫ్యాన్ తిరగక
ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో సకల సౌకర్యాలు కల్పించామని ఊదరగొట్టిన అధికారుల డొల్లతనం తొలిరోజే బయటపడింది. చాలా కేంద్రాల్లో ఫ్యాన్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు చెమటలు కక్కుతూనే పరీక్ష రాశారు. వెలుతురు సరిగాలేని గదుల్లో లైట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకటికి పదిసార్లు సమీక్షలతో కాలం గడిపిన జిల్లా ఉన్నతాధికారులు, ఇంటర్‌బోర్డు అధికారులు పరీక్ష వేళ చేతులెత్తేయడంతో విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. అనంతపురం విద్య: ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు తెలుగు/సంస్కృతం పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 97 కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహించారు. మొత్తం 34,839 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 33,709 మంది హాజరయ్యారు. జిల్లా కేంద్రం అనంతపురంలోని ప్రధాన పరీక్ష కేంద్రాల్లో అధికారులు కనీసం ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయని పరిస్థితి. దీంతో విద్యార్థులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. లైట్లు లేకపోవడంతో చీకట్లోనే పరీక్షలు రాయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పరీక్షలు బాగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా గత 20 రోజులుగా జాయింట్ కలెక్టర్–2, ఆర్ఐఓలు అనేక సందర్భాల్లో సమీక్షలు నిర్వహించారు. అయినప్పటికీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, న్యూటౌన్–ఎస్.ఎస్.బీ.ఎన్ కళాశాల పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు పనిచేయకపోవడం.. ఫ్యాన్లు అసలు లేకపోవడంతో విద్యార్థులు చుక్కలు చూడాల్సి వచ్చింది. జూమ్ యాప్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఇంటర్మీడియట్ పరీక్షలు తొలి రోజు పకడ్బందీగా నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. మాస్‌కాపీయింగ్ జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ఆర్ఐఓ, ఇతర ఉన్నతాధికారులతో ఇంటర్‌బోర్డు కార్యదర్శి ‘జూమ్ యాప్’ ద్వారా పర్యవేక్షించారు. 97 పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. యాప్.. బంపర్ గైడ్ గతంలో విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి వెళ్లి అక్కడ నోటీసు బోర్డులో వేసిన సమాచారం ఆధారంగా తమకు కేటాయించిన గదికి వెళ్లేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేకుండా ముందు రోజు రాత్రే విద్యార్థుల తల్లిదండ్రుల రిజిస్టర్డ్ నంబర్‌కు పరీక్ష కేంద్రం, సీటింగ్ అరైంజ్‌మెంట్ సమాచారాన్ని చేరవేసేలా ఇంటర్‌బోర్డు అధికారులు ‘సెంటర్ మొబైల్ లొకేటర్ యాప్ ’ను అందుబాటులోకి తీసుకవచ్చారు. ఈ యాప్ ఇంటర్ విద్యార్థులకు బాగా ఉపయోగపడింది. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్‌ఎయిడ్ కిట్లను ఏర్పాటు చేశారు. నేడు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు గురువారం తెలుగు/సంస్కృతం పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో 97 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనుండగా.. 32,041 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలని అధికారులు కోరుతున్నారు. ముందస్తుగానే పరీక్ష కేంద్రానికి వస్తే ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 27 ప్రత్యేక బస్సులు ప్రతి విద్యార్థికీ, తాను చదువుతున్న కళాశాలకు 20 కి.మీ దూరం లోపే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ‘ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదు’ అని గతంలో పేర్కొన్నప్పటికీ.. బుధవారం పరీక్ష ప్రారంభమయ్యే గంట ముందు సడలింపు ఇచ్చారు. పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాల వరకు విద్యార్థి పరీక్షకు హాజరు కావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు కారణాన్ని చీఫ్ సూపరింటెండెంట్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. ఆయన సమ్మతిస్తే పరీక్షకు అనుమ తిస్తారు. ఎక్కువ ఆలస్యమైతే ప్రత్యేకమైన పరిస్థితులు, కారణాలు ఉంటే అనుమతించే అంశంపై ఛీప్ అబ్జర్వర్లు నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కోసమే ఆర్టీసీ ప్రత్యేకంగా 27 సర్వీసులు నడిపింది. -
సాయి యోగ్యశక్తి
షిర్డీ గ్రామంలో ఏ రోజుకారోజు సాయి స్వయంగా అందరు అంగడులవారి వద్దకి వెళ్లి, మసీదులో, మరికొన్ని ప్రదేశాల్లో దీపాలని వెలిగించవలసి ఉందని చెప్పి నూనెని అడగడం చేస్తుండేవాడు. అందరూ కూడా సాయి గొప్పదనాన్ని విని ఉండటం, చూస్తూ ఉండటం కారణంగా ఎవరూ కాదనకుండా యథాశక్తి నూనెని దీపాల నిమిత్తం ఇస్తూనే ఉండేవాళ్లు. అంతా సవ్యంగా జరిగిపోతూ ఉంటే చెప్పుకోవాల్సిందంటూ ఏముంటుంది? సాయి అంటే కిట్టనివాళ్లు కొందరు పగ అనే వత్తిని, ద్వేషమనే నూనెలో తడిపి, వ్యతిరేకత అనే దీపాన్ని వెలిగించారు అంగడిదారుల బుద్ధులందరిలో. అంతే! ఎవ్వరూ కూడా నూనెని సాయికి ఇవ్వరాదని తీర్మానించుకున్నారు. ‘అంతమంది భక్తులొస్తున్నారుగా!? అందరిలో ఎవరో ఒకరితోనో, లేదా అందరితోనో నూనెని ఏర్పాటు చేసుకోలేడా?’ అని కొందరు, ‘అయినా మసీదులో కిరసనాయిలతో వెలిగే లాంతర్లు ఉండగా, ఈ నూనె దీపాలని కూడా వెలిగించాల్సిన అవసరమేమిటి?’ అని ఇంకొందరు, ‘ఇదంతా కాదు. మసీదేమిటి? హిందూ ఆచారం ప్రకారం నూనె దీపాలు వెలిగించడమేంటి?’ అని మరికొందరు మాట్లాడుకోసాగారు. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు అనుకుని, సాయికి నూనె ఇవ్వరాదని తీర్మానించుకున్నారు. ఎప్పటిలానే సాయి నూనె కోసం వస్తే, వ్యాపారస్థులంతా ముభావంగా ఉండటం, ముఖం తిప్పుకోవడం, అయిష్టంగా ఇవ్వదలచడం, రేపటిరోజున రండి అనడం వంటివేం చెయ్యలేదు. ముఖానే చెప్పారు ఇవ్వడం సాధ్యంకాదని. ఇలాంటి అకస్మాత్ వ్యతిరేకతకు సాయి ఏ మాత్రం దుఃఖపడలేదు. వ్యతిరేకత సామూహికమైనందుకు అశ్చర్యపడలేదు. తన మసీదుకి తిరిగొచ్చేశాడు. తన దగ్గరున్న డబ్బాలో అట్టడుగున ఉన్న నూనెలో నీటిని పోశాడు. కలియదిప్పాడు డబ్బాని. ఆ నూనె, నీరు కలిసిన మిశ్రమాన్ని తాగి ఊశాడు. ఆ మీదట నిండుగా నీటిని డబ్బాలో నింపాడు. ఆ నీటినే వత్తులు ఉన్న ప్రమిదల్లో నిండుగా పోశాడు. ఎవరికీ ఏం అర్థంకాని స్థితిలో నూనె దీపాలులాగానే వాటిని క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి చొప్పున వెలిగించసాగాడు. అలా వెలిగిన నీటి దీపాలు రాత్రి రాత్రంతా కాంతిని ఇస్తూనే, వెలుగుతూనే ఉండిపోయాయి. ఇది అందరూ చూస్తుండగా జరిగిన కథ కాదు, చరిత్ర. విశ్వనిర్మాణ రహస్యం ఏదైనా ఒక వస్తువు మరమ్మతుకి గాని వస్తే దాన్ని బాగు చేయవలసిన వానికి, ఆ వస్తువుకి సంబంధించిన, మొత్తం నిర్మాణానికి సంబంధించిన అంత సమాచారం ఎలా తెలిసి ఉండాలో, అదే తీరుగా విశ్వంలో జరిగిన ఈ విచిత్రానికి సంబంధించిన నిజానిజాలు తెలియాలంటేనూ, దాన్ని వివరించి చెప్పాలంటేనూ ఆ విశ్వానికి సంబంధించిన నిర్మాణ రహస్యం తెలిసి ఉండి తీరాల్సిందే కదా! ఆ దృష్టితో చూస్తే పృధ్వి – అప్ – తేజస్ – వాయు – ఆకాశం అనే ఐదింటితో ఈ జగత్తు ఏర్పడింది కాబట్టే దీన్ని ‘ప్ర–పంచము’ (ఐదింటి సమాహారం) అన్నారు. ఇది బ్రహ్మ చేత నిర్మింపబడింది కాబట్టి, బ్రహ్మకి మాత్రమే దీన్ని సృష్టించే అధికారాన్ని ఇచ్చారు కాబట్టి దీన్ని బ్రహ్మా+అండము ‘బ్రహ్మా అనే దీర్ఘం చివర ఉంటే పురుషుడైన బ్రహ్మ’ అని అర్థం. అదే ‘బ్రహ్మ+అండము’ అన్నట్లయితే స్త్రీ పురుష భేదం లేని బ్రహ్మపదార్ధమనే అర్థం వస్తుంది. ఈ జగత్తుని సృష్టించగల అధికారాన్ని పురుషుడైన బ్రహ్మే పొందాడు కాబట్టి ‘బ్రహ్మా+అండము’ అనేదే సరైన పదవిభాగం. అలాంటి బ్రహ్మ చేత సృష్టించబడిన ‘అండం’ ( స్త్రీయో, పురుషుడో తెలియని స్థితిలో ఉండే ముద్ద – ప్రాణియో, అప్రాణియో తెలియని స్థితిలో ఉండే ముద్ద) కాబట్టి దీన్ని బ్రహ్మాండము అన్నారు. ఈ బ్రహ్మాండమే జగత్తంతా. దీనికి సరైన పోలికతో ఉండేది మనం. మనందరం తల్లి గర్భంలో ఉన్న పిండం నుంచి పుట్టాం కాబట్టి మనం ‘పిండాండం’ నుంచి పుట్టినవాళ్లం. బ్రహ్మాండానికి ఎలా పంచభూతాలు సహకరించాయో అలాగే పిండాండానికి కూడా పంచభూతాలు సహకరించి ఉన్నాయి. అంటే బ్రహ్మాండంలో ఉన్న పంచభూతాలు, పిండాండంలో కూడా ఉండనే ఉన్నాయన్నమాట! బ్రహ్మాండంలోని ‘పృ«థ్వి’ మనకి కన్పించే నేల. పిండాండం అంటే మనలో పృ«థ్వి మన శరీరంలో ఉన్న మాంసం, మజ్జ అనేవి. బ్రహ్మాండంలోని ‘అప్’ మనకి కన్పించే నదులు, సముద్రాలు అన్నీను. పిండాండం అంటే మనలో ‘అప్’ మన శరీరంలోన ఉన్న నీరు. రక్తంలో ఎక్కువశాతం నీరే. బ్రహ్మాండంలోని ‘తేజస్’ (వేడిమి) మనకి కన్పించే సూర్యుని ఉష్ణత. పిండాండంలో కన్పించే ‘తేజస్’ మన శరీరంలో ఎప్పుడూ ఒకేలా ఉండే 98.4 డిగ్రీల వేడిమి. బ్రహ్మాండంలోని ‘వాయువు’ మనకి అనుభవంతో కన్పించే వాయువు. పిండాండంలో అంటే మన శరీరంలో (5+5) దశవిధాలైన వాయువులు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన మొదలైనవి ఉన్నాయి. బ్రహ్మాండంలోని ‘ఆకాశం’ మనకి కన్పిస్తున్నట్లుగా ఉంటూ ఎంత దూరం వెళ్లినా కన్పించని శూన్యమైన పదార్థం. ఇక పిండాండంలో ఉండే ఆకాశమంటే అనుభవంలో కన్పిస్తూ ఎవరూ చూడడానికి అవకాశం లేని మనస్సు. ఇలా బ్రహ్మాండ – పిండాండాలు అనే రెండూ పరస్పరం సమానంగా ఉంటూ రెంటి స్వభావం, స్వరూపం ఒకటే అయినా ఆ రెండూ వేర్వేరుగానే ఉంటాయి. ఒకటిగా ఉండలేవు. ఉండవు. ఇదంతా ఎందుకంటే ఈ పంచభూతాలు పైకి వేర్వేరుగా కన్పిస్తున్నా అన్నీ ఆకాశం నుంచి వచ్చాయని చెప్పడానికి. తద్వారా నీటిని గురించిన, అలాగే అగ్నిని గురించిన తత్వాన్ని తెలుసుకుని నీటిలో అగ్నితనం ఎలా ఉంటుందో నిరూపించడానికీను. ఆకాశాద్వాయుః – ఆకాశం నుండి వాయువు పుట్టింది. ‘గాలి బిగదీసింది’ అంటూ ఉంటాం. అంటే ఆకాశం ఆ సమయంలో తన శూన్య ప్రదేశం నుండి వాయువుని విడుదల చేయడం లేదని అర్థమన్నమాట. అంతే కాక వాయువెప్పుడూ శూన్యం నుండే వస్తుందని కూడా భావమన్నమాట. వాయో రగ్నిః – ఇలా వచ్చిన వాయువు నుండే అగ్ని పుట్టిందని దీనర్థం. ఇదేమిటి? ఎక్కడైనా నిప్పుంటే ఆ సమయంలో గాలి బలంగా వీస్తే నిప్పు ఆరిపోతుందిగా!? అని అనుకుంటాం మనం. నిప్పు ఆరిపోవాలన్నా, బాగా రాజుకుని నిప్పు మరింతగా పెరిగి, తన ప్రతాపాన్ని చూపాలన్నా వాయువు వీచినప్పుడే అని అనుకోం. దానికి కారణం సాధారణమైన దృష్టితో ఆలోచించడమే. లో–దృష్టితో పరిశీలించకపోవడమే!!అగ్నే రాపః – ఆ అగ్ని నుంచి నీరు పుట్టిందని దీనర్థం. ఇదేమిటి? ఇది మరీ వింతగా ఉంది! అనిపిస్తుంది. అగ్ని అనేది నీటిని వేడి చేస్తుంది. అలాగే నీరు అనేది నిప్పుని ఆర్పుతుంది. అంతేతప్ప అగ్ని నుండి నీరు పుట్టడమేమిటి? అన్పిస్తుంది. దీనికి కూడా కారణం సాధారణ దృష్టితో మాత్రమే చూడడం. లో–దృష్టి పెట్టాలనే ఆలోచన కూడా లేకుండా ఉండడమూనూ. అబ్భ్యః – పృధ్వి అలాంటి నీటి నుండి నేల పుట్టిందని దీనర్థం. ఎక్కడైనా నేల అనేది కణాలు కణాలుగా ఉంటే ఆ భూకణాలని తొలగించడానికి దూరంగా నెట్టివేయడానికీ నీటిని వాడతాం తప్ప నీటి నుండి భూమి ఎలా పుట్టే వీలుంది? అన్పిస్తుంది. దీనికి కూడా సమాధానం సాధారణ దృష్టితో ఆలోచించడమే తప్ప లో–దృష్టిని పెట్టకపోవడమే అనేదే. అంటే ఏమన్నమాట? నీటితో దీపాల్ని వెలిగించడం వంటి అనూహ్యమైన, ఎన్నడూ వీలుకాని సంఘటనలని విన్నట్లయితే, చూసినట్లయితే సాధారణ దృష్టితో కాకుండా లో–దృష్టితో పరిశీలించి తీరాల్సిందే అని దీని భావమన్నమాట! మరొక్క మాటని అనుకుని సమాధానాన్ని తెలుసుకుందాం! మన శరీరానికి నవ(9) రంధ్రాలున్నాయి. రంధ్రం అంటే కన్నం లేదా చిల్లు అని కదా అర్థం. మరి ఈ తొమ్మిదింటి నుంచి శరీరంలోకి మనం నీటిని పంపినా, అన్నాన్ని పంపినా, మరి దేన్ని తిన్నా వెంటనే అన్నీ కన్నాల నుండి లేదా ఏవో ఒకటో రెండో కన్నాల నుంచి బయటికొచ్చేయాలి కదా! అనుకుంటాడు సామాన్య దృష్టి మాత్రమే ఉన్నవాడు. సహజంగా పిల్లలు ఈ ప్రశ్నని చిన్నపిల్లలు అడిగే ఉన్నారు కదా! దాన్ని వివరించి చెప్తేగదా వాడు ఆ రోజున అర్థం చేసుకోగలిగాడు! ఇదే తీరుగా పంచభూతాల్నీ వివరించుకోకుండా (అసందర్భం అవుతుంది కాబట్టి) నీటిని గురించి మాత్రమే అనుకుందాం! నీరు అనేది ‘అగ్నేరాపః’ నిప్పునుంచి పుట్టిందే. అయితే ఈ నీరు నిప్పుని ఆర్పగల శక్తితో కన్పిస్తోంది. లౌకికంగా ముందు ఒక సమాధానాన్ని చూద్దాం! నీటిని బాగా వేడి చేశాం. వేడి నీళ్లు అయ్యాయి. మనం ముట్టుకుంటే మన శరీరభాగం కాలేంతటి నిప్పుదనం (ఉష్ణత) ఆ నీటికి పట్టుకుంది. అవును కదా! ఆ నిప్పుదనంతో నిండిన నీటిలోనికి నీళ్లని ఎక్కువగా పంపితే... పూర్తి ఉష్ణతని కోల్పోయి మళ్లీ చల్లబడిపోయి, వేడిమి చేయడానికి ముందు ఏ చల్లదనంతో ఉన్నాయో ఆ స్థితికే వచ్చేస్తాయి నీళ్లు. అంతే కదా! ఇప్పుడు నీళ్లు అనేవి ఎలా ఏర్పడ్డాయో ఈ ఉదాహరణతో గమనిద్దాం! నీళ్లు అనేవి రెండు వాయువుల కలయిక వల్ల ఏర్పడి వాయురూపాన్ని మార్చుకుని, ద్రవరూపాన్ని పొందాయి. వాయువులు రెండు కలిస్తే ఆ పదార్థం వాయువే కావలసి వస్తూంటే ఆ రెండు వాయువుల సమ్మేళనం ద్రవంగా (నీరు) కావడమేమిటి? ఇక్కడే ఉంది రహస్యం. పంచభూతాలు వేటికి అవిగా ఉన్నప్పుడు చెప్పుకోవలసిందంటూ ఏమీ ఉండదు. పృధ్వి(నేల)+అప్(నీరు) = ప్రవాహం అప్(నీరు)+ తేజస్(ఉష్ణత) = వేడి నీరు తేజస్(ఉష్ణత)+ వాయువు(గాలి) = వేడిగాలి(గాడుపు) వాయువు + ఆకాశం = శూన్యం (కన్పించని ఆకాశం) ఇదే తీరుగా ఉష్ణతని కలిగించే శక్తి ఉన్న వాయువు (ఆక్సిజన్) మరో ఉష్ణత ఏమాత్రం ఉండని వాయువుతో (హైడ్రోజన్) కలిసినట్లయితే ఆ రెంటి సంయోగం ‘నీరు’గా మారుతుంది. (ఏ2+ౖ2 ఏ2ౖ అని తీర్మానించారు విజ్ఞాన శాస్త్రజ్ఞులు). పైన చెప్పుకున్న ఉదాహరణలో వేడిగా ఉన్న నీళ్లలో చన్నీళ్లని అతిమాత్రంగా కలిపితే ఎలా ఆ వేన్నీళ్లు కాస్తా చల్లబడిపోతాయో, అలా ఈ ఉష్ణత కలిగిన గాలి(ఆక్సిజన్) అలాగే ఉష్ణతలేని గాలి(హైడ్రోజన్) అనే రెంటి సంయోగంలో తీవ్రమైన ఉష్ణతకల వాయువు (ౖ2 లేదా ఆక్సిజన్) అనేది మరింత స్థాయి కలిగినదైన పక్షంలో నీరుగా కన్పిస్తున్న ఈ పదార్థానికి మండించగల శక్తి మాత్రమే ఎక్కువ అయి, ఆ నీరు దేన్నైనా మండించగలిగిందిగా అయిపోతుంది. ఇది నిజం కాబట్టే సాయి ఎప్పుడైతే నీటిని తెచ్చాడో, ఆ నీటిలో మండించగల ఉష్ణతాశక్తిని తన యోగశక్తితో పెంపొందేలా (అభివృద్ధి అయ్యేలా) చేసాడో వెంటనే ఆ నీరు తనలోని చల్లదనాన్ని కోల్పోయి, తనలో ఉన్న రెండవదైన ఉష్ణతాశక్తి ఆధిక్యంతో ఉండిపోయింది. అంటే నిప్పుగా అయింది. గుడ్డతోనో, పత్తితోనో చేయబడిన వత్తికి ఉన్న నూనె అనేది మండే అవకాశాన్నిచ్చేది కాబట్టి, ఈ నీటిలో ఉన్న దహించే శక్తి ఆ వత్తికంటుకుని దీపంగా వెలగడం ప్రాంభించింది. అయితే ఇక్కడ ‘మరి సాయి గొప్పదనమేంముంది?’ అనుకోకూడదు. తన యోగశక్తి ద్వారా సాయి నీటిని రెండు వాయువులుగా విభజించేసి, రెండవదైన ఉదజని (హైడ్రోజన్) శక్తిని పూర్తిగా కోల్పోయేలా చేసి ప్రాణశక్తిని (ఆక్సిజన్) మరింత పెంపుచేసి ఉండడమే. ఇలాంటిదే మరో ఉదాహరణ. శ్రీమద్రామాయణంలో ఆంజనేయస్వామి తోకకి రావణుని సేనలైన రాక్షసులు నిప్పు పెట్టారు. రావణ ఆజ్ఞకి అనుగుణంగా ఆంజనేయస్వామి ఆ తోకకున్న నిప్పుతో మొత్తం లంకని తగులబెట్టాడని చెప్పింది ఆ ఇతిహాసం. అంతవరకూ బాగానే ఉంది. మరి నిప్పుకి కాల్చివేయడమనేది లక్షణం కాబట్టి, ఆ ఆంజనేయస్వామి తోకకి ఉన్న నిప్పు లంకాజనాన్ని మంటలకి గురి చేసి చంపినట్లే. ఆంజనేయస్వామి శరీర భాగాలకు కూడా వ్యాపించి ఎందుకు ఆంజనేయుడ్ని గాయపరచలేదనేది ప్రశ్న కదా! సాయి కథలో నీటి నుండి నిప్పు కన్పిస్తూంటే, ఆ నిప్పుద్వారా వత్తులన్నీ మండి వెలుగుతుంటే, ఇక్కడ నిప్పులోని నిప్పుదనం(ఉష్ణత) లేకుండా ఆంజనేయునికి చల్లదనం గోచరించడమేమిటి? ఇక్కడ కూడా లోతుగా ఆలోచిస్తే తప్ప సమాధానం దొరకదు. దొరికినా మరింత లోతుగా భావిస్తే తప్ప ఆ సమాధానం అర్థం కాదు. నీటికుండే లక్షణం చల్లదనం. (శీతస్పర్శవత్య ఆపః) అలాగే నిప్పుకుండే లక్షణం ఉష్ణత. (ఉష్ణస్పర్శవత్తేజః) నీటికుండే చల్లదనాన్ని వేడిగా మార్చి దీపాలని వెలిగేలా చేస్తే, సీతమ్మ తన మంత్రశక్తితో అగ్నికుండే ఉష్ణతని చల్లబరిచింది. రెంటికీ ఎంత సామ్యముందో గుర్తించగలగాలి. గుర్తుంచుకోగలగాలి కూడా! ఏ చల్లదనమనేది లేని పక్షంలో దాన్ని నీరు అనమో, ఏ ఉష్ణత లేని పక్షంలో దాన్ని అగ్ని అనమో, చల్లదనమనేది నీటితో కలిసి మాత్రమే ఉంటుందో అలాగే వేడితనమనేది నిప్పుతో కలిసి మాత్రమే ఉంటుందో అలా కలిసి ఉన్న రెంటిలో నుంచి ఒకదాన్ని వేరు చేయడమనేది మంత్రశక్తితోనే సాధ్యం! ఆ మంత్రశక్తి అనేది దేవతల్లో ఉంటే ఆ దేవతలని ప్రార్థించి ప్రార్థించి ఉన్న కారణంగా ఆ తపస్సు శక్తే వ్యక్తుల్లో యోగశక్తిగా మారుతుంది. ఆ యోగశక్తి ఉన్న వ్యక్తి యోగిగా మారుతాడు. తనకున్న ఆ యోగశక్తి కారణంగానే ఇలాంటి లోకాతీతమైన కొన్నింటిని చేయగలుగుతాడు. శంకరాచార్యులవారు రాసిన సౌందర్యలహరిలో ఓ శ్లోకం (మహీం మూలాధారే..)లో యోగశక్తి గురించి మరింత వివరంగా కన్పిస్తుంది. మూలాధార చక్రాన్ని బాగా ఉపాసించినట్లయితే భూమిలోపల దాగి ఉండగల శక్తిని సాధకుడు సంపాదించగలడట. కపిల మహర్షి అలాగే తపస్సు చేస్తూ ఉండిపోయాడు. సగరుని పుత్రులైన అరవై వేల మందిని భస్మం చేసింది ఆ యోగశక్తితోనే. అలాగే మణిపూరక చక్రాన్ని బాగా ఉపాసించినట్లయితే నీటిని గురించిన మహాశక్తిమంతుడవుతాడు. దాంతో నీళ్లలో దాగి ఉండగలుగుతాడు. దుర్వాసో మహర్షి అలాగే తపస్సు చేసి ఆ యోగశక్తితోనే అంబరీషుని మీదికి కృత్య అనే రాక్షసిని పంపగలిగాడు. ఇదే తీరుగా మిగిలిన ఐదు చక్రాలనీ కూడా ఉపాసించినట్లయితే.. ఆయా లోకాతీత శక్తులు లభిస్తాయి ఉపాసించినవారికి. సాయి ఎవరితో మాట్లాడుతూ ఉన్నట్లు కన్పించినా నిరంతరమైన తన ఏకాగ్రతతో కూడిన ఉపాసన సాగిపోతూనే ఉంటూ ఉండేది. కాబట్టి అన్ని శక్తులు ఆయనకి లభించాయి. అంతటి శక్తిమంతుడు కాబట్టే కుల, మత, వర్గ, స్త్రీ, పురుష, బాల, వితంతు... వంటి భేదాలు ఆయనకి లేనే లేవు. అంతే కాక ఉరుసు – శ్రీరామనవమి జెండా ఉత్సవం, చందనోత్సవం వంటి ఈ ఆ మతాలకి సంబంధించిన పండుగలన్నీ ఆయనకి ఒకటిగానే అన్పించాయి, కన్పించాయి. మనకి మనం, అలాగే మన పక్కనున్న మరో కొంతమంది మాత్రమే కన్పిస్తాం గానీ పర్వతమెక్కిన వారికి అందరం కన్పిస్తాం! దాన్నే సమదృష్టి, సరైన దృష్టి అంటారు. - డా. మైలవరపు శ్రీనివాసరావు -
చుక్కల్లో ‘దీపం’
దీపావళి వంటి పండుగ సందర్భంగా ప్రతి ఇంటా కొవ్వొత్తులు, నూనె పోసి దీపాంతలతో దీపాలు వెలిగించడంతోపాటు టపాకాయలు కాల్చడం ఆనవాయితీగా వస్తుంది. మహిళలు ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు దొంతులు పెట్టి బొమ్మల కొలువు చేసి పండగను జరుపుకుంటారు. ఇలాంటి ప్రాధాన్యత కలిగిన దీపావళి పండుగ ఈ ఏడాది సామాన్య ప్రజలకు భారంగా మారింది. రోజురోజుకు కుల వృత్తులు అంతం అవుతున్న నేపథ్యంలో ఆయా వస్తువుల ధరలకు రెక్కలొస్తున్నాయి. గ్రామాల్లో దీపావళి వచ్చిందంటే ఎక్కడ చూసినా కుమ్మరుల ఇంటి ముందు దీపాలు చేయడం, దొంతులు చేయడంలో నిమగ్నమయ్యేవారు. అయితే వృత్తుల మీద వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ కష్టం అవుతుండటంతో క్రమంగా వారు వృత్తులకు దూరం అవుతున్నారు. దీంతో దీపాంతలు తయారీ, దొంతులు తయారీ చేయడం పూర్తిగా మానుకున్నారు. పట్నం నుంచి దిగుమతి చేసుకొని వాటిని అమ్ముతున్నారు. ఇబ్రహీంపట్నం మార్కెట్లో ప్రస్తుతం ఈ దొంతులు , దీపాంతాలు లభిస్తున్నాయి. గత సంవత్సరం డిజైన్లను బట్టి డజను(12)దీపాంతాలకు రూ.45నుంచి 50 అమ్మేవారు. ప్రస్తుతం రూ.70–80 అమ్ముతున్నారు. దొంతులు గత సంవత్సరం రూ.60–70 అమ్మేవారు ప్రస్తుతం రూ.100లకు అమ్ముతున్నారు. బొమ్మలను కూడా రూ.100కు విక్రయిస్తున్నారు. ప్రతి ఒక్కరూ దీపావళి ముందు రోజు నుంచే మొదలు పెట్టి పండుగ ముగిసిన మరో రెండు రోజుల వరకు కూడా గడపకు రెండు చొప్పున ఇంటి చుట్టూ దీపాంతలు పెట్టి దీపాంతాలు పెడుతుంటారు. అయితే ధరలు ఏకంగా రూ.20–30 పెరగడంతో కొనుగోళ్లు పూర్తిగా తగ్గాయి. గతంలో ఒక్కొక్కరు పదుల డజన్ల చొప్పున దీపాంతాలను కొనుగోలు చేసే వారని.. ప్రస్తుతం పెరిగిన ధరల నేపథ్యంలో రెండు మూడు డజన్లు కొనుగోలు చేస్తున్నారని విక్రయదారులు వాపోతున్నారు. ధరలు భాగా పెరిగాయి గతం కంటే ఈసారి దీపాంతల ధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంది. నిత్యవసరాల ధరలతోపాటు వీటి ధరలు అమాంతం పెంచారు. వృత్తులు కాపాడితే ఇలా ధరలు పెరిగేవి కాదు. ఉన్నోళ్లు మాత్రమే పండుగ జరుపుకునే పరిస్థితి నెలకొంది. ఇలా పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లలో దీపావళి కాంతులు ప్రసరించవు. – పోరెడ్డి సుమతి, సర్పంచ్ ఉప్పరిగూడ ఒక్కో దొంతి రూ. 100 ఏటా దీపావళికి ఆడ పిల్లలకు బొమ్మలు కొలువు చేస్తుంటాము. ఈసారి మా పాపకు దొంతులు పెడదామని మార్కెట్‌కు వెళితే ఏకంగా రూ.100కు ఒక్కటి అని చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇంత ధర లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పండుగ నిర్వహణ ఖర్చుతో కూడుకుంటోంది. ఇప్పటికే బెల్లం దొరకడం లేదు. – లక్ష్మి, గృహిణి వ్యాపారం బాగా తగ్గింది గతేడాదితో పోలిస్తే ఈసారి వ్యాపారం బాగా తగ్గింది. రెండు మూడు రోజులకు ముందుగా తె చ్చినా సరుకు అమ్ముడుపోయేది. ఈ ఏడాది మాత్రం అమ్ముడవం కష్టంగా ఉంది. ధరలు పెరిగాయి.. డిమాండ్ తగ్గింది. అప్పు చేసి మాల్ తీసుకొచ్చాము. అమ్ముడు పోకపోతే మిగిలేది అప్పే. – రాజేష్, వ్యాపారి -
ఆటో లైటింగ్స్!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఎల్ఈడీ లైట్లలో లైట్ ఆటోమిషన్ ట్రెండ్ నడుస్తోంది. ఈ రకమైన ఎల్ఈడీ లైట్లు గదిలోకి రాగానే దానంతటదే లైట్ ఆన్ అవుతుంది. వెళ్లిపోగానే ఆఫ్ అవుతుంది. టీవీ సౌండ్ పెంచినట్టుగా రిమోట్ సహాయంతో లైట్ వెలుతురు (లుమిన్స్)ను ఎక్కువ, తక్కువ చేసుకోవచ్చు కూడా. ఇక వెబ్ బేస్డ్ సొల్యుషన్స్ ఎల్ఈడీ లైట్లయితే ఇంటర్నెట్ సహాయంతో ఐఫోన్, ఐప్యాడ్ల నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా రెస్టారెంట్లు, పబ్బులు, గేమింగ్ జోన్లు, థియేటర్లు, షామింగ్ మాళ్లులో వినియోగిస్తుంటారు. బల్బు, సీఎఫ్ఎల్, ట్యూబ్‌లైట్లతో పోల్చుకుంటే ఎల్ఈడీ లైట్ల ధర కాస్త ఎక్కువే. కానీ, విద్యుత్ వినియోగం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. 18 ఓల్టుల ఎల్ఈడీ లైట్ ధర రూ. 1,500-1,800 మధ్య ఉంటుంది. 1,000 చ.అ. ఇంటికి రూ. 8 లక్షలతో వెబ్ బేస్డ్ సొల్యుషన్స్ ఎల్ఈడీ లైట్లను అమర్చుకోవచ్చు. 300 గజాల ఇండిపెండెంట్ హౌజ్ గార్డెనింగ్‌కు రూ. 3 లక్షలు ఖర్చవుతుంది. ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఫంక్షన్ హాల్‌కు రూ. 40 లక్షలు, షాపింగ్ మాళ్లకు చదరపు అడుగుకు రూ. 500 నుంచి రూ. 1,000 వరకు ఖర్చవుతుంది. -
ఆధునిక ఇళ్లకు అదిరే లైట్లు
సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో దొరికే లైట్లు తెచ్చి.. ప్రతి గదిలో పెట్టే రోజులు కావివి. పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక ఇంటి యజమానుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆలోచనలకు తగ్గట్టు, పరిస్థితుల ప్రకారం.. వెలిగే లైట్లను ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగా వైర్లెస్ లైటింగ్ ఆటోమేషన్ మార్కెట్లో లభిస్తోంది. ⇔ ఫ్లాట్‌లో అయినా విల్లాలో అయినా వైర్లెస్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. బంధుమిత్రులు, చూపరులకు ఇట్టే నచ్చే విధంగా ఇంటిని అలంకరించుకోవచ్చు. అయితే ఇందుకు మనం చేయాల్సిందల్లా.. ఎక్కడెక్కడ ఏయే తరహా లైట్లు ఉండాలో చెబితే సరిపోతుంది. లేదా మన ఆలోచనల్ని చెబితే ఆయా సంస్థలే పనిని పూర్తి చేస్తాయి. ⇔ ఏసీలు ప్రతి ఇంట్లో సర్వసాధారణమయ్యాయి. రిమోట్ కంట్రోల్ బదులు మొబైల్‌తో వీటిని నియంత్రించుకోవచ్చు. వీటిని అమర్చిన తర్వాత మనం లోపలికి వెళ్లినా అమెరికాకు వెళ్లినా అరచేతిలో ఉండే మొబైల్‌తో మన ఇంట్లోని లైట్లను వెలిగించొచ్చు, ఆర్పేయవచ్చు కూడా. ⇔ నిన్నటిదాకా ఇంటికి హోమ్ ఆటోమేషన్ చేయాలంటే ప్రత్యేకంగా వైరింగ్ చేయాల్సి ఉండేది. కానీ, సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో వైర్ల అవసరం లేకుండానే ఇంటిని ఆధునిక లైట్లతో అలంకరించుకోవచ్చు. సన్నివేశాలకు తగ్గట్టు పరిస్థితులకు అనుగుణంగా మనక్కావాల్సిన రీతిలో ఏర్పాటు చేసుకోవచ్చు. ⇔ కొత్త, పాత అనే తేడా లేకుండా ఏ ఇంట్లో అయినా హోమ్ ఆటోమేషన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. రెండు పడక గదుల ఫ్లాట్‌లో కేవలం ఆధునిక లైటింగ్ ఏర్పాటుకు రూ.90 వేల వరకు ఖర్చవుతుంది. అదే మూడు పడక గదులు ఫ్లాట్ అయితే లక్షన్నర దాకా ఖర్చవుతుంది. వివిధ సంస్థలు, ఆయా ఉత్పత్తులను బట్టి ధరల్లో మార్పులుంటాయని గుర్తుంచుకోవాలి. -
త్రీడీ మెరుపులు..
చిలకలగూడ: బతుకమ్మ, దసరా వేడుకలను పురష్కరించుకుని ఏర్పాటు చేసిన త్రీడీ వెలుగుల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మెరిసిపోతోంది. రంగుల విద్యుద్దీపాల కాంతులు భవనంపై త్రీడీలో ప్రతిబింబిస్తూ బతుకమ్మ ఆటపాటలు, దుర్గామాత అలంకరణలు చూపరుల మనసును చూరగొంటున్నాయి. రైల్వేస్టేన్ ప్రాంగణం మొత్తం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన టెర్మినల్‌పై ప్రతిబింబిస్తున్న త్రీడీ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. -
సగం మందికే ఎల్ఈడీ వెలుగులు!
భ్రాంతిగా మారిన ఎల్ఈడీ కాంతి ఇంటికి రెండిస్తామని చెప్పిన ప్రభుత్వం శతశాతం పంపిణీ చేస్తామన్న ఈపీడీసీఎల్ మూలకు చేరిన బల్బులకు అతీగతీ లేదు బల్బులకు ముఖం చాటేస్తున్న ఈఈఎస్ఎల్ శ్రీకాకుళం టౌన్: విద్యుత్ వాడకాన్ని తగ్గించుకునేందుకు ప్రతి ఇంటికీ ఎల్ఈడీ బల్బులను సబ్సిడీపై పది రూపాయలకే అందిస్తున్నామని చెప్పుకున్న ప్రభుత్వం ఆ మేరకు లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది. విద్యుత్ బిల్లులు తగ్గుతాయన్న ఆశతో వినియోగదారులు ఇంట్లో ఉన్న బల్బులను తీసేసి ఎల్ఈడీలను అమర్చుకోవడానికి సిద్ధపడ్డారు. ప్రతీ ఇంటికి రెండు బల్బులను తప్పనిసరి చేస్తే విద్యుత్ వినియోగం పెద్దెత్తున తగ్గుతోందని అధికారులు అంచనా వేశారు. అందులో భాగంగా జిల్లాలో విద్యుత్ వినియోగదారులందరికీ తన ఇంట్లో ఉన్న బల్బులకు తోడు రెండునెలల పాటు విద్యుత్ వినియోగానికి చెల్లిస్తున్న చార్జీల బిల్లులను అందజేయడంతో పాటు 20 రూపాయలు చెల్లిస్తే గ్రామంలోనే ఎల్ఈడీ బల్బులు అందజేస్తామని ప్రటనలు ఇచ్చారు. అకారణంగా బల్బులు పాడైతే తిరిగి వాటిని బిల్లు చెల్లించే చోట అందజేస్తే కొత్తవి ఇస్తామని ప్రకటించారు. ఈ మాటలు నమ్మిన వినియోగదారులు పెద్ద ఎత్తున ఎల్ఈడీ బల్బులకు క్యూ కట్టారు. అయితే జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఎల్ఈడీ విద్యుత్ దీపాల పంపిణీ కార్యక్రమంలో ఇంకా లక్షన్నర కుటుంబాల దరి చేరలేక పోయింది. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ గణాంకాల ప్రకారం 6.44 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి తోడు గత ఏడాది కొత్తగా 32 వేల కనెక్షన్లను మంజూరు చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు మరో 12 వేల కొత్త కనెక్షన్లు మంజూరయ్యాయి, మొత్తం గృహ వినియోగదారుల సంఖ్య 6.90 లక్షల వరకు చేరింది. కాని ఇంతవరకు తొలివిడతలో 5.32 లక్షల మందికి ఒక సర్వీసుకు రెండు బల్బుల వంతున గత ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 10.65 లక్షల బల్బులను సరఫరా చేశారు. ఈ ఏడాది మార్చిలో రెండో విడత కింద 19,128 మంది లబ్థిదారులకు 38,256 బల్బులను మాత్రమే పంపిణీ చేశారు. ఇంకా లక్షన్నర కుటుంబాలకు ఎల్ఈడీ బల్బులను సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉంది. దీనికితోడు ఎల్ఈడీ బల్బులు సరఫరా చేసిన ఈఈఎస్ఎల్ సంస్థ ఇప్పుడు ముఖం చాటేస్తుండడంతో కొత్త సమస్య తలెత్తుతోంది. గతంలో పంపిణీ సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏకారణం చేతనైనా బల్బు వెలగక పోతే వాటిని తిరిగి సంస్థ తీసుకుని కొత్తవి ఇస్తారని గతంలో ప్రభుత్వంతోపాటు సంస్థ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. ఈపీడీసీఎల్ సంస్థ కార్యాలయంలో బిల్లులు చెల్లించే స్థలాల్లో వీటిని తిరిగి తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. కాని అలాంటి కౌంటర్లు ఇంతవరకు ప్రారంభం కాకపోవడంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా.. వారు ఏమీ చేయలేని స్థతిలో నిట్టూరుస్తున్నారు. మూడున్నర లక్షల బల్బులు అవసరం జిల్లాకు ఇంకా మూడున్నర లక్షల ఎల్ఈడీ బల్బులు అవసరమవుతోందని గుర్తించి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయానికి గతంలో లేఖలు రాశాం. రెండో విడత కేవలం 32 వేల బల్బులే పంపిణీ అయ్యాయి. మిగిలిన రెండున్నర లక్షల బల్బులు ఇంకా సరఫరా కావాల్సిఉంది. ఈఈఎస్ఎల్ సంస్థ ప్రతినిధులను ఇప్పటికే పలుమార్లు సరఫరా కోసం సంప్రదించాం. ఇంకా బల్బులు రాక పోవడంతో పంపిణీ సాధ్యం కాలేదు. – డి.సత్యనారాయణ, ఎస్ఈ, తూర్పు విద్యుత్ పంపిణీసంస్థ(ఆపరేషన్స్) -
పుష్కర ఘాట్లకు విద్యుత్ సొబగులు
గుంటూరు (నగరంపాలెం) : పుష్కర ఘాట్లకు విద్యుత్ సొబగులు అద్దుతున్నారు. ఘాట్లలో నిరంతరం విద్యుత్ వెలుగులు అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేశారు. తెల్లవారజాము నుంచి అర్ధరాత్రి వరకు పుష్కర స్నానాలు నిరంతరం కొనసాగనున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. లైటింగ్ ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను విద్యుత్ శాఖకే అప్పగించారు. జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్లు, పుష్కరనగర్లలో 8000 కిలోవాట్ సామర్ధ్యం ఉన్న విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. వీటిలో 1000 వాట్ సామర్ధ్యం ఉన్న 1,500 దీపాలు, 500 వాట్ సామర్ధ్యం ఉన్న 1,500 దీపాలతో పాటు ఏ1, ఏ క్యాటగిరీ ఘాట్లు, పుష్కరనగర్లలో 35 హైమాస్ట్ లైటింగ్ టవర్లు ఏర్పాటు చేశారు. భక్తుల భద్రత దృష్ట్యా జిల్లాలోని స్నాన ఘాట్లు, పుష్కరనగర్ల వద్ద విద్యుత్ సరఫరాకు 72.95 కిమీ 11 కెవీ కవర్డు కండక్టరును వినియోగించారు. ఏ1, ఏ పుష్కర ఘాట్ల వద్ద ఏడీఈస్థాయి అధికారి, బీ, సీ ఘాట్లకు ఏఈస్థాయి అధికారి ఇన్చార్జిగా ఉంటారు. సిబ్బంది సిద్ధం.. ఘాట్ల వద్ద 549 మంది, పుష్కరనగర్ల వద్ద 188 మంది బ్రేక్ డౌన్ సర్వీసులు సరిచేయటానికి 386 మందితో 43 క్విక్ రెస్పాన్స్ టీంలకు మూడు షిఫ్టులుగా విధులు కేటాయించారు. సిబ్బంది పనితీరు పర్యవేక్షించటానికి ఇద్దరు ఏడీఈలపై ఒక డీఈని, నలుగురు ఏడీఈలకు ఒక ఏడీఈని నియమించారు. జిల్లా ఎస్ఈ బి జయభారతరావుతోపాటు డిస్కం కార్యాలయం నుంచి చీఫ్ ఇంజనీరు బి. సంగీతరావు, సూపరింటెండెంట్ ఇంజనీరు జి. నాగశయనరావు, డీఈ సీఏ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ప్రత్యేక అధికారులుగా నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించటానికి ఏ1, ఏ ఘాట్లకు విద్యుత్ సరఫరా కోసం 40 జనరేటర్లు సిద్ధం చేశారు. జిల్లాలో అమరావతి, పెనుమూడి, సత్రశాల, మందడం, వీపీసౌత్లలో మెటీరియల్‌తో కూడిన కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. విద్యుత్ సిబ్బందితో నిరంతర కమ్యూనికేషన్ కోసం 100 వైర్లెస్ సెట్లు వినియోగించనున్నారు. విద్యుత్ సిబ్బందిని వెంటనే గుర్తుపట్టే విధంగా ప్రత్యేక యూనిఫాంతో డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నారు. విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి రక్షణ నిమిత్తం చేతి తొడుగులతో పాటు కటింVŠ Sప్లేయర్లు, ఇన్స్‌లేషన్ టేప్లతో సహా పూర్తి కిట్ బాక్స్‌ను అందిస్తున్నారు. జిల్లా కార్యాలయంలో కంట్రోల్ రూం.. యాత్రికులకు నిరంతరం సేవలు అందించడానికి జిల్లా కార్యాలయంలో 24 గంటలు పని చేసే కంట్రోల్ రూంను ఏర్పాటు చేశాం. ఈ కంట్రోల్ రూం నుంచి సహాయం, సమాచారం పొందాల్సిన వారు 9440817526 నెంబరుకు ఫోన్ చేయవచ్చు. నిరంతరం విద్యుత్ సరఫరా కోసం పటిష్టమైన చర్యలు తీసుకున్నాం. ఘాట్లకు, పుష్కరనగర్లకు విద్యుత్ సరఫరా చేసే స»Œ æస్టేçÙన్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. ఆల్ట్రానేటివ్ లైన్లు కూడా అందుబాటులో ఉంచాం. – బి.జయభారతరావు, ఎస్ఈ వైర్లెస్ సెట్లతో అప్రమత్తంగా విద్యుత్ సిబ్బంది ఎస్ఈ బి. జయభారతరావు వెల్లడి -
బిహార్‌లో మరో హైటెక్ కాపీయింగ్
పాట్నాః జనతాదళ్ పాలిస్తున్న బిహార్ రాష్ట్రంలో విద్యారంగం అవినీతిలో కూరుకుపోయింది. అందుకు తాజాగా మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. స్థానిక రోటాస్ కళాశాల విద్యార్థులు గుంపులు గుంపులుగా నేలపై కూర్చొని, మొబైల్ లైట్లతో పరీక్షలు రాయడం మళ్ళీ కలకలం రేపింది. బిహార్ రోటాస్ కాలేజీ విద్యార్థులు పరీక్షలు రాసిన తీరు చూస్తే... యాజమాన్య అలసత్వం, విద్యారంగంలో డొల్లతనం మరోసారి బయటపడింది. స్నేహంలోనే కాదు పరీక్షలు రాయడంలోనూ విద్యార్థులు ఐకమత్యాన్ని ప్రదర్శించారు. ఇటీవల బిహార్ లో 12వ తరగతి విద్యార్థుల పరీక్షల టాపర్స్ స్కాం వెలుగులోకి వచ్చి, విచారణలో నిజాలు బహిర్గతమైనా అక్కడి పరిస్థితి మాత్రం మారలేదు. తాజాగా రోటాస్ కాలేజీ విద్యార్థులు నేలమీద గుంపుగా కూర్చుని, మొబైల్ లైట్ల వెలుగులో హాయిగా కలసి మెలసి పరీక్షలు రాస్తున్నట్లుగా బయటపడ్డ ఫొటోలు ఇప్పుడు అక్కడి విద్యారంగాన్నే ప్రశ్నిస్తున్నాయి. రోటాస్ కాలేజీలో కనీస సౌకర్యాలు కూడ లేవన్నదానికి ప్రస్తుతం బయటపడ్డ ఫొటోలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా కూడ మారాయి. -
తిరునగరికి స్మార్ట్ వెలుగులు!
విద్యుత్ చౌర్యానికి అడ్డుకట్ట.. సరఫరాలో లోపాల సవరణ.. తప్పుడు బిల్లులకు చెక్ పెట్టడం.. ప్రధాన కార్యాలయం నుంచే కనెక్షన్ కట్.. నష్టాల తగ్గింపు.. ఇదీ డిస్కం లక్ష్యం. ఇందుకోసం తిరునగరిలో స్మార్ట్ సిస్టమ్ అమలుకు నోచుకోనున్నది. ఈ దిశగా ఆ సంస్థ అడుగులు వేస్తోంది. తిరుపతి రూరల్: తిరునగరిలో అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్తును సరఫరా చేయడానికి స్మార్ట్ గ్రిడ్ విధానం అమలులోకి తెస్తున్నారు. నగరంలో విద్యుత్తు సరఫరా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్ది నిరంతరం అంతరాయం లేని విద్యుత్తును సరఫరాకు రూ.325 కోట్ల వ్యయంతో స్మార్ట్‌గ్రిడ్ ఏర్పాటు చేయడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రుపొందించారు. ఈ మొత్తం లో రూ. 275 కోట్లు రుణం మంజూరు చేయడానికి ప్రపంచ బ్యాంకు అంగీకరించింది. అందులో భాగంగా తిరుపతిలోని సదరన్ డిస్కం కార్పొరేట్ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా 15 స్మార్ట్‌మీటర్లను అమర్చారు. రానున్న రోజుల్లో 200 యూనిట్ల క న్నా అధికంగా విద్యుత్ వినియోగించే విని యోగదారులకు స్మార్ట్ మీట ర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరంలో దశల వారీగా 15 వేల మందికి స్మార్ట్ మీటర్లు అమర్చుతారు. మెరుగుపడనున్న విద్యుత్ వ్యవస్థ నగరంలో రూ.325 కోట్లతో విద్యుత్తు సరఫరా వ్యవస్థను మెరుగుపరచనున్నారు. నూతనంగా 33/11 కేవీ సామర్థ్యంతో నాలుగు ఇండోర్ విద్యుత్తు సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు రూ.14 కోట్ల అంచనాతో నివేదిక సిద్ధం చేశారు. నగరంలో శ్రీదేవి కాంప్లెక్స్, మున్సిపల్ పా ర్కు, ఉపాధ్యాయనగర్, శ్రీపద్మావతి మహిళ వర్సిటీ ప్రాం తాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. నగరంలో రూ.45 కోట్లతో 44 కిలోమీటర్ల మేర 33 కేవీ భూగర్భ విద్యుత్తు లైన్లు, మరో రూ.80 కోట్లతో 100 కిలోమీటర్ల మేర 11 కేవీ భూగర్భ విద్యుత్తు లైన్లు నిర్మిస్తారు. రూ.180 కోట్లతో 200 కిలోమీటర్ల మేరకు ఎల్టీ లైన్లకు భూగర్భ విద్యుత్తు కేబుల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరంలో వివిధ ప్రాంతా ల్లో పాత ట్రాన్స్పార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు ఇప్పటికే ఉన్నవాటి సామర్థ్యాన్ని పెంచుతారు. మొత్తం నగరంలో 50 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేయడానికి రూ. 80 లక్షలతో నివేదికలు రూపొందించారు. నగరంలో 3 పీహెచ్ సామర్థ్యమున్న స్మార్ట్ మీటర్లు తొలిదశలో 15 వేలు మీటర్లు ఏర్పాటు చేస్తారు. ఇందుకు రూ.15 కోట్ల సొమ్ము వెచ్చించనున్నారు. విద్యుత్తు చౌర్యానికి చెక్! విద్యుత్తు శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి విద్యుత్ చౌర్యానికి చెక్‌పెట్టడంతోపాటు నష్టాలు తగ్గించుకుని, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి స్మార్ట్‌గ్రిడ్ నిర్మాణానికి సిద్ధమైంది. స్మార్ట్గ్రిడ్లో భాగంగా స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే తిరుపతిలోని సదరన్ డిస్కం కార్పొరేట్ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా 15 స్మార్ట్‌మీటర్లు బిగించారు. స్మార్ట్‌మీటర్లతో పాటు ప్రతి ట్రాన్స్ఫార్మర్ వద్ద మీటర్ రీడర్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ట్రాన్స్ఫార్మర్ పరిధిలోని స్మార్ట్‌మీటర్లను అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల ట్రాన్స్ఫార్మర్ పరిధిలో ఎక్కడైనా విద్యుత్ చౌర్యం జరిగినా గుర్తించవచ్చు. ఏ ఇంట్లోని మీటరులో ఏ సమయం నుంచి ఏ సమయం వరకు విద్యుత్తు చౌర్యం జరిగిందన్న విషయాన్ని సైతం కచ్చితంగా తెలసుకోవచ్చు. దీంతో పాటు ప్రతి నెల రీడింగ్ తీసే సమయంలో మీటరు వరకు వెళ్లి మాన్యూవల్‌గా కాకుండా డేటా సెంటర్ నుంచే విద్యుత్తు ఎంత వినియోగించారు? బిల్లు ఎంత? తదితర విషయాలతో బిల్లు వచ్చేస్తుంది. దీనివల్ల తప్పుడు బిల్లులకు చెక్ పడుతుంది. అంతేకాకుండా బిల్లు చెల్లించని వినియోగదారులకు స్మార్ట్మీటర్లో లోడు బ్రేక్ స్విచ్ ద్వారా డేటా సెంటర్ నుంచే విద్యుత్ కనెక్షన్ కట్ చేయవచ్చు. బిల్ ఇన్స్పెక్టర్ల పనిభారం కూడా తగ్గుతుంది. స్మార్ట్ మీటర్లలో డిస్ప్లే సౌకర్యం కూడా ఉంది. పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ విధానం కూడ అమల్లోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉందని, ఆ దిశగా మీటర్లో టెక్నాలజీని పొందుపరిచినట్లు డిస్కం అధికారి ఒకరు తెలిపారు. తొలుత నగరంలో కొంతభాగానికి అమలుచేసి అనంతరం నగరం మొత్తం విస్తరించే దిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. -
నిప్పులాంటి అబద్ధం
చేతనబడి ఒక తుమ్మ మొద్దు. ఒక మొద్దు నిద్దుర. నిప్పు లాంటి ఒక అబద్ధం. ఈ మూడూ కలిశాయి. అగ్నికి అసూయ తోడైంది. తుమ్మ మొద్దు.. ప్రాణాన్ని భస్మం చేసింది. మూఢ నమ్మకం.. మొద్దు నిద్ర అయింది. నిజం అబద్ధానికి ఆహుతయింది! అసలేం జరిగింది? ఎందుకు జరిగింది? చదవండి... ఈవారం చేత(న)బడి. అది నల్గొండ జిల్లా, నాంపల్లి మండలం, మహ్మదాపురం గ్రామం. ఊరికి దూరంగా ఉంది గూడెం. జంగమ్మ ఇల్లు ఆ గూడెంలోనే. 2005లో ఓ రోజు... ఉదయం ఆరు గంటలైంది. నలుగురు మగవాళ్లు జంగమ్మ ఇంటి ముందు నిలబడి గోలచేస్తున్నారు. వాళ్ల వాలకం చూస్తుంటే గొడవ పడడానికి సిద్ధమై వచ్చినట్లే ఉంది. చూస్తుండగానే నలుగురు పదిమందయ్యారు. పది ముప్పైకి చేరింది. జంగమ్మను అమానుషంగా బయటకు లాగి ఈడ్చుకుంటూ రెండిళ్ల అవతల ఉన్న స్తంభానికి కట్టేశారు. ఏం జరుగుతోందో, ఎందుకు జరుగుతోందో ఎవరికీ తెలియడం లేదు. అయినా అందరూ వచ్చి చూస్తున్నారు. అందరిలో ఒక్కరూ ఇదేంటని ఆ అమానుషాన్ని నివారించే ప్రయత్నం చేయడం లేదు. ‘మా అమ్మకు ఏం తెల్వదు. కొట్టొద్దు, మా అమ్మను వదిలిపెట్టండి’ అంటూ ప్రతి ఒక్కరి దగ్గరకూ వచ్చి ప్రాధేయపడుతున్నారు జంగమ్మ కూతుళ్ల్లిద్దరు. ‘గొడ్డును బాదినట్లు బాదుతున్నారు’ చచ్చిపోతుందేమో. పెద్ద ఊరికి తీసుకెళ్దాం...’ అన్నాడో కుర్రాడు ఆందోళనగా. ‘ఎహె! పెద్దూరికి తీస్కబోతే అక్కడి పెద్దోళ్లు అంతా తాము చెప్పినట్లే నడుచుకోమంటరు. ఇప్పుడే... ఇక్కడే చంపిపాతెయ్యాల్సిందే’ ఉడికిపోతున్నాడో వ్యక్తి. అతడి కళ్లు ఎర్రగా చింతనిప్పుల్లా, కాలుతున్న నిప్పు కణికల్లా ఉన్నాయి. ‘ఏ కేసు వచ్చుద్దో ఏంటో? పోలీసులకు చెప్తే పోలా’ ఎవరో భయంగా. ‘పోలీసుల్లేదు, గీలీసుల్లేదు నిప్పెట్టి తగలబెట్టేద్దాం, పీడ వదిలిపోద్ది’ మరొకరు ఆవేశంగా. ‘మీ ఇంట్లో కిరసనాయిలుందా తేపో’ అంటూ పక్కనున్న కుర్రాడిని కొట్టినంత పని చేశాడొకతడు. ఆ మాట పూర్తయ్యేలోపు అక్కడి వారి చూపు దగ్గరల్లోనే ఉన్న తుమ్మ మొద్దు మీదకు మళ్లింది. ప్రతి ఇంట్లో దీపాలు పెట్టుకోవడానికి తెచ్చుకున్న కిరోసిన్ అంతా జమ అయింది. జంగమ్మను మొద్దుకు కట్టేసి, కిరోసిన్ పోసి నిప్పు పెట్టేశారు. పొలానికెళ్లిన పెద్ద కొడుకు సంగతి తెలిసి పరుగెత్తుకొస్తుంటే దూరంగా జంగమ్మ పెడుతున్న చావుకేకలు చెవిన పడుతున్నాయి. ఊరు దగ్గరయ్యే కొద్దీ అరుపులు సద్దుమణిగాయి, కొడుకు వచ్చే లోపే తల్లి బూడిదైపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చేసరికి చితిమంటలు కూడా ఆరిపోయాయి. ఈ దురాగతంలో పాల్గొన్న 30 మందినీ అరెస్టు చేశారు. చోద్యం చూడడానికొచ్చిన వారిలో ఒకావిడ ‘ఎందుకు జంగమ్మను కట్టేశారు’ గుసగుసగా అడిగింది పక్కనున్నామెని. ‘చేతబడి చేస్తోందట, పోయిన వారం మల్లేశన్న పిట్టపిడుగున పోయాడు గదా! అది చేతబడితోనే. ‘గుండెపోటని చెప్పార్ట పట్నంలో డాక్టరు’ ప్రశ్నార్థకంగా చూసిందా మహిళ. ‘గట్టిగా పిడిరాయిలా ఉన్న మనిషికి అట్లాంటి మాయదారి రోగం ఎందుకొస్తుంది. ఏ చేతబడో చేయకపోతే. అయినా ఈ జంగమ్మ ఇప్పుడే కాదు... అంతకు ముందు కూడా చాలా చేసింది. అందుకే వాడలో ఎవరింట్లోనూ డబ్బులు చాలడం లేదు. అట్టాంటిది బళ్లకొద్దీ పంట, మేకలు అన్నీ జంగమ్మ ఇంటికే వస్తున్నాయి. సౌభాగ్యం అంతా తనింటికే రావాలని అందరిళ్లకూ చేతబడి చేయిస్తోంది. మొగుడిని అమాయకుడిని చేసి చక్రం తిప్పుతోంది. ఎదురులేనట్లు ఊరేగుతోంది’ మెల్లగా అంటున్నప్పటికీ ఆమె మాటల్లో మనసులోని అక్కసంతా వ్యక్తమైంది. ఊరు సద్దుమణిగింది. అరెస్టయిన వారి ఇళ్లలో భయాందోళనలు రగులుతుంటే జంగమ్మ ఇంట్లో తీవ్రమైన నైరాశ్యం చోటుచేసుకుంది. ఎవరు ఏ మూలన ముడుచుకుని ఉన్న వాళ్లు అక్కడే అన్నట్లు గడుస్తోంది రోజు. వాళ్ల మనసుల్లో ఆవేదన సుళ్లు తిరుగుతోంది. ‘కళ్లలో నిప్పులు పోసుకున్నారు కదరా, నా పెండ్లాన్ని చంపితే మీకేమొచ్చింది’ అని పదే పదే తనలో తానే మాట్లాడుకుంటున్నాడు జంగమ్మ భర్త. అయినా ఊరంతా ఒకటైనప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయత. ‘మూఢ నమ్మకానికి బలైంది జంగమ్మ’ అనుకున్నారు విద్యావంతులు, వివేకవంతులు. వార్తా పత్రికలు కూడా అదే రాశాయి. కానీ... నిజం అది కాదు... జంగమ్మ మూఢనమ్మకం ముసుగులో అసూయకు గురయింది. ద్వేషానికి బలైంది. ఆమె అలా ఎవరి మీదా ఆధారపడకుండా జీవించడం ఊళ్లో వాళ్లకు నచ్చలేదు. కుక్కను చంపాలంటే పిచ్చికుక్క అనే ముద్ర వేయాలని వారు ఎక్కడా చదువుకోలేదు. కానీ అంత లౌక్యంగానూ వ్యవహరించారు. మహ్మదాపురంలో జరిగిన మహిళ సజీవదహనం సంఘటన జిల్లా మొత్తాన్ని కుదిపేసింది. పోలీసుల ఆధ్వర్యంలో జనవిజ్ఞానవేదిక మహ్మదాపురంలో చైతన్య సమావేశం ఏర్పాటు చేసింది. అరెస్టయిన 30 మందిని కూడా తీసుకువచ్చారు పోలీసులు. చైతన్య సమావేశం పూర్తయింది. జనవిజ్ఞానవేదిక బృందం వెళ్లిపోవడానికి సన్నద్ధమవుతోంది. ఇంతలో... అందరి కళ్లూ నిప్పుల గుండం మీదకు మళ్లాయి. ఆశ్చర్యంతో పెద్దవైన కళ్లు, తెరిచిన నోరు కొద్ది క్షణాలపాటు అలాగే ఉండిపోయాయి. జంగమ్మ పెద్ద కూతురు యాదమ్మ... అప్పటి వరకు నోరు విప్పని యాదమ్మ... మౌనంగా నిప్పుల మీద నడుస్తోంది. ఆమె కళ్లు వేనవేల ప్రశ్నలను సంధిస్తున్నాయి. ఇవన్నీ మంత్రాలనే కదా మీరు మా అమ్మను చంపేసింది అని ఆ అమ్మాయి అడగలేదు. కానీ ఆ కళ్లు ప్రశ్నిస్తున్నాయి. మా అమ్మ కాలిపోయింది. మరో తల్లి ఇలాంటి మూఢనమ్మకాలకు బలికాకూడదు... అనే సందేశం ఆ మౌనంలో ఉంది. తన తల్లి మూఢనమ్మకాలకు ఆహుతైంది. ఆమె తన ప్రాణంతోపాటు ఆ ఊరిలోని మూఢత్వాన్ని కూడా ఆహుతి చేసిందనడానికి ప్రతీకలా ఉంది యాదమ్మ. మూఢత్వం నుంచి చైతన్యవంతమైన కొత్తతరానికి ప్రతీకలా నిప్పుల గుండాన్ని దాటి బయటకు వచ్చింది. ఊరంతా దోషిలా తలవంచుకుంది. ఇది జరిగి పదేళ్లు దాటింది. యాదమ్మను ఇప్పుడెళ్లి పలకరించినా తల్లిని తలుచుకుని కడివెడు కన్నీళ్లు కారుస్తోంది. మా అమ్మలాగ మరెవరికీ జరగకూడదని కోరుకుంటోంది. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి - తిరుమణి శేఖర్, సాక్షి, నాంపల్లి మా అమ్మ నిర్దోషి! మా అమ్మను మా దాయాదులే చంపేశారు. చేతబడులేంటో మాకు తెలియదు. మా నాన్న అమాయకుడు. మాకు సాగు పొలం, ఎడ్లు, మేకలు ఉన్నాయి. వాళ్లకవేవీ లేవు. మా అమ్మ దేనికీ వారి ముందు చేయి చాచేది కాదు. అందుకే వారికంత అసూయ. పెద్దూరికి పంచాయతీకి తీస్కబోయి ఉంటే అమ్మ బతికేది. అలా కూడా చేయలేదు. అప్పుడు తమ్ముడు హైదరాబాద్‌లో పదవతరగతి చదువుతున్నాడు. నేను పొద్దున్నే బావికాడికి (పొలానికి) పోయాను. అంతా రెండు గంటల్లోనే అయిపోయింది. - వెంకటయ్య, జంగమ్మ పెద్ద కొడుకు కొట్టి కిరోసిన్ పోసి కాలవెట్టిండ్రు! మా అమ్మను మా కళ్ల ముందే కొట్టుకుంటూ లాక్కెళ్లారు. పాలోళ్ల (దాయాదులు) మోసమే అంతా. మంటల్లో కాలిపోతున్న మా అమ్మ రూపం కళ్ల ముందే కనిపించేది చాలా రోజులు. ఆమె ఏడుపు చెవుల్లో వినిపిస్తూనే ఉండేది. జనవిజ్ఞాన వేదిక వాళ్లు వచ్చి నిప్పుల మీద నడిచినప్పుడు నాకు చాలా చెప్పాలనిపించింది. ఏమీ మాట్లాడలేకపోయాను. మంత్రాలు, పూజలు లేవని వాళ్లు చూపించిన బాటలోనే నడవాలని నేను కూడా నిప్పుల మీద నడిచాను. - యాదమ్మ, జంగమ్మ పెద్ద కూతురు జంగమ్మ కథతో నాటిక! చేతబడులు లేవు, క్షుద్రపూజలు లేవు. ఎవరికో హాని జరగాలని పూజ చేసినంత మాత్రాన అలా జరగదు.. అని చెబుతూ మంత్రగాళ్ల మోసాలకు బలికావద్దని చెప్పం. నిప్పుల మీద నడవడానికి మంత్రాలు అక్కరలేదని నడిచి చూపించాం. సర్పంచ్‌తోపాటు ఊరివాళ్లు కూడా నిప్పుల మీద నడిచారు. ప్రజలను చైతన్యవంతం చేయడానికి జంగమ్మ కథ రాశాం. ఆమెకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కడుతూ జిల్లా అంతటా ప్రదర్శించాం. మూఢత్వంతో ఇప్పటికీ చెట్టుకి కట్టేసి కొట్టడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. కానీ సజీవదహనం వంటి దురాగతాలు ఆ చుట్టుపక్కల జరగలేదు. మూఢనమ్మకాలు లేని సమాజ నిర్మాణానికి మా ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది. - టి. రమేశ్, జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ -
ఆకట్టుకుంటున్న ఆక్లాండ్ లాంతరెన్ ఫెస్టివల్
చైనా కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన లాంతర్ల వెలుగులు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఆక్లాండ్ మునుపెన్నడూ లేని విధంగా 800 లాంతర్లతో దేదీప్యమానమైంది. ఉత్సవాలను చూసేందుకు వచ్చే జనంకోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను, ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశారు. లాంతరెన్ పండుగలో వివిధ ఆకృతుల్లో తయారుచేసిన 800 చైనీస్ హ్యాండ్ మేడ్ లాంతర్లు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. వారి నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. పండుగ సంబరాల్లో భాగంగా ఏర్పాటుచేసిన స్టేజ్ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చైనా చిత్రకళలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. అన్ని వయసుల వారినీ ఆకర్షించేలా ఏర్పాటుచేసిన కార్యక్రమాలను సందర్శకులు ఉచితంగా తిలకించే సౌకర్యం కల్పించారు. ఉత్సవాల సందర్భంగా రుచికరమైన ఆసియా వంటకాలు నోరూరిస్తున్నాయి. చేతిపనులు, అల్లికలు, లాంతర్ల తయారీ ప్రదర్శనలు అభిమానుల మనసు దోస్తున్నాయి. చైనా సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా సంప్రదాయ నృత్యాలు, మార్షల్ ఆర్ట్స్, లైవ్ మ్యూజిక్ తో పాటు... అనేక అంతర్జాతీయ ప్రదర్శనలు వేడుకల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఆదివారం ముగింపు వేడుకల్లో భాగంగా బాణసంచా ప్రదర్శన ప్రత్యేకతను సంతరించుకోనుంది. -
నీరు ఎంత కావాలో ఈ బాటిల్ చెప్తుంది
-
ఆ ఇంటి లైట్లను మీరు కూడా ఆన్, ఆఫ్ చేయొచ్చు
అలస్కా: మన ఇంటికి అలంకరించిన లైట్లను ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా, ఎక్కడి నుండైనా ఆన్, ఆఫ్ చేసే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నే కొంచెం విచిత్రంగా అనిపించినప్పటికీ.. అమెరికాలోని ఓ ఇంటి అలంకరణ లైట్లను ఎవరైనా ఎక్కడి నుండైనా వెలిగించవచ్చు, ఆర్పేయవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తమ సంతోషాన్ని అందరితో పంచుకోవడం కోసం అలస్కాకు చెందిన ఐటీ నిపుణుడు జాన్ ఉడ్స్ తన ఇంటికి అలంకరణ లైట్లను ఇంటర్నెట్ ద్వారా ఎక్కడి నుండైనా, ఎవరైనా ఆన్, ఆఫ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా మరోసారి లైట్లపై పూర్తి కంట్రోల్ ఇంటర్ నెట్ యూజర్లకే ఇచ్చేశాడు. ఈ ఏడాది ఇలాంటి అవకాశం కల్పించడం ఇది ఆరోసారి. ఉడ్స్ ఆలోచనకు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వస్తుంది. తమ ఇంట్లో లైట్లను ఆఫ్ చేయడానికి బద్దకించే వారు సైతం గంటల తరబడి ఆన్లైన్లో ఉడ్స్ ఇంటికి అలంకరించిన లైట్లను ఆన్, ఆఫ్ చేస్తూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ లింక్ ద్వారా http://christmasinfairbanks.com మీరు కూడా ఓ సారి ప్రయత్నించండి.. -
పర్యావరణ కాంతులు
-
రికార్డు సృష్టించిన క్రిస్మస్ ట్రీ
కళాకారుడి సృజనకు, కష్టానికి మరోసారి ఫలితం దక్కింది. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఏర్పాటుచేసిన ట్రీ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కాన్బెర్రా డౌన్ టౌన్లో నక్షత్రాల్లా మెరిసిపోయే లక్షల కొద్దీ లైట్లతో వెలిగిపోతున్న రిచర్డ్స్ రూపకల్పన గిన్నిస్ పుటలకెక్కింది. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ రిచర్డ్స్ సంవత్సరాల కృషి.. ప్రత్యేక గుర్తింపు పొందడంతోపాటు.. అతడు మూడోసారి రికార్డును సాధించేలా చేసింది. జపాన్ యూనివర్సల్ స్టూడియో ఐదేళ్లుగా ఒకాసాలో నిర్వహిస్తున్న ప్రదర్శనల్లో అత్యధిక లైట్లను ఏర్పాటుచేసి, ఆకట్టుకున్న కృత్రిమ చెట్టు.. ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 118 అడుగుల ఎత్తు, సుమారు 3.75 లక్షల లైట్లతో మిరుమిట్లు గొల్పుతూ కొత్త ప్రమాణాలతో జపనీస్ ట్రీ... గిన్నిస్ పుస్తకంలో స్థానం సంపాదించింది. కాన్బెర్రా కు చెందిన న్యాయవాది, వ్యాపారవేత్త, రిచర్డ్స్... కొందరు ఇంజనీర్లతోపాటు, కార్పెంటర్, వెల్డర్ల వంటి సహాయక బృందంతో ఏర్పాటుచేసిన మిరుమిట్లు గొలిపే క్ర్మిస్మస్ ట్రీ ప్రదర్శన ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. కాన్‌బెర్రాకు చెందిన సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ స్వచ్ఛంద సంస్థకు.. పిల్లలకు సాయం అందించేందుకు విరాళాలను ఆహ్వానిస్తూ ఈ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. రిచర్డ్స్ 2013 లో మొదటిసారి తన సబర్బన్ హోమ్ ను 5 లక్షలకు పైగా బల్పులు లైట్లతో అలంకరించి గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. నాలుగు వారాలకు పైగా ప్రదర్శన నిర్వహించడంతో అప్పట్లో సుమారు 75 వేలమంది పైగా ఈ ప్రదర్శనను తిలకించారు. వచ్చే పోయే వారితో ఇరుగు పొరుగులతో సహా ఇంట్లోని వారూ విసిగిపోయారు. దీంతో ఇంకెప్పుడూ రికార్డు కోసం ఇటువంటి ప్రయత్నం చేయనని రిచర్డ్స్ హామీ ఇచ్చాడు. ఏడాది క్రితం రిచర్డ్స్ ఓ బహిరంగ ప్రదేశంలో 10 లక్షలకు పైగా ఎల్ఈడీ లైట్లను సెట్ చేసి తన రెండో గిన్నిస్ రికార్డును సాధించాడు. అప్పట్లో 120 కిలోమీటర్ల రంగురంగుల వైర్లను కాన్బెర్రా మాల్ లోని క్రిస్మస్ బహుమతులకు చుట్టి అతిపెద్ద ఎల్ఈడీ లైట్ల చిత్రాన్ని రూపొందించాడు. అయితే పోటీ ప్రపంచంలో రికార్డులు సాధించడం అంత సులభం కాదనేందుకు నిదర్శనంగా 2014 లో రిచర్డ్స్.. మ్యోకో హోటల్ వద్ద ఏర్పాటు చేసిన డ్రాగన్ లైట్ల ప్రదర్శనలో ఫెయిలయ్యాడు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా తిరిగి ఈసారి అతి పెద్ద కృత్రిమ క్రిస్మస్ ట్రీ కి అత్యధిక లైట్లను అలంకరించి 2012లో న్యూయార్క్ కుటుంబం సాధించిన గిన్నిస్ రికార్డును తిరగరాశాడు. -
మస్టర్లు ఇవ్వండి మహాప్రభో..!
సింగరేణి కంపెనీ మణుగూరు ఏరియాలో పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది మస్టర్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లకోసారి టెండర్ ద్వారా నియమించుకుంటున్న సిబ్బంది సంక్షేమాన్ని ప్రైవేట్ సంస్థ నిర్వాహకులు పట్టించుకోవడంలేదు. ఫలితంగా వారు అరకొర సదుపాయాలు, పనిదినాలు కరువై అవస్థలు పడుతున్నారు. ఏరియాలో ప్రతిరోజు సింగరేణికి 70 మంది సెక్యూరిటీ సిబ్బందిని అందించేందుకు ఓ సంస్థ సుమారు 150 మంది నిరుద్యోగులను గార్డులగా నియమించుకుంది. తమ సంస్థ ద్వారా ఉద్యోగం పొందే వారి నుంచి రూ.10వేలు తీసుకునే నిబంధనను విధిం చింది. అయితే దీనిని స్థానిక కార్మిక సంఘాల నాయకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో సదరు సంస్థ నిరుద్యోగ యువతను దోపిడీకి గురిచేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబం గడవడానికి అప్పు.. సప్పు చేసి రూ.10వేలు కట్టి ఉద్యోగంలో చేరిన వారికి ప్రతిరోజు డ్యూటీలు ఇవ్వకుండా నెలలో కేవలం 5 నుంచి 15 మస్టర్లు మాత్రమే ఇస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు బాధితుల ద్వారా తెలిసింది. మస్టర్ల విషయమై ప్రశ్నిస్తే మీకు.. ఇష్టమైతే చేయండి.. లేకుంటే మానుకోండి.. అంటూ నిర్వాహకులు వేధింపులకు గురిచేస్తున్నట్లు వారు వాపోతున్నారు. స్థానిక సెక్యూరిటీ అధికారులు సదరు సంస్థ నుంచి నెల నెలా మామూళ్లు తీసుకుని మాకేమీ తెలియదంటూ తప్పుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సౌకర్యాలు కరువు ఒక్కో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్న సంస్థ గార్డులకు సరైన రక్షణ చర్యలు కల్పించడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. యూనిఫాం ఇవ్వకపోవడంతో పాటు జంగల్లో రాత్రి వేళ విధులు నిర్వహించే ప్రాంతంలో రక్షణ చర్యలు తీసుకోవడంలేదని సిబ్బంది చెబుతున్నారు. ఇద్దరు సిబ్బంది విధులు నిర్వర్తించే అటవీ ప్రాంతంలో ఒక్కరికే డ్యూటీ వేస్తున్నారని, దీంతో అడవి జంతుల దాడిలో గాయపడుతున్నామని గార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్‌కాస్టు పరిసర ప్రాంతాల్లో సరైన షెడ్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో వర్షాకాలం లో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. లైట్లు సైతం నాణ్యతగా లేనివి ఇవ్వడంతో ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటికి తోడు ఇటీవల కాలంలో నెలకు కనీసం 15 మస్టర్లు కూడా ఇవ్వకపోవడంతో సగం వేతనమే వస్తోందని ఆవేదన చెందుతున్నారు. విధులకు వచ్చిన గార్డులను కనీసం రోజుకు 5 నుంచి 10 మందిని తిరిగి పంపుతున్నారు. యాజమాన్యానికి అనుకూలంగా ఉండే కొంత మందికి మాత్రమే నెలలో అన్ని రోజులు విధులు కల్పిస్తూ చెక్‌పోస్టు వంటి ప్రాంతాల్లోనే వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగరేణి అధికారులు తక్షణమే స్పందించి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులందరికీ నెలకు కనీసం 20 నుంచి 25 మస్టర్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని బాధిత గార్డులు కోరుతున్నారు. -
కొండంత అండ
ఎంపీ: తమ్ముడూ నీ పేరేంటి? హాస్టల్లో భోజనం ఎలా ఉంటుంది? విద్యార్థి: నాపేరు వెంకటేశ్ సార్. తొమ్మిదో తరగతి చదువుతున్నా. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. ఈ హాస్టల్లో అన్నీ సమస్యలే సార్. ఎంపీ: బాబూ.. నువ్వేం చదువుతున్నావ్..? విద్యార్థి: నా పేరు సందీప్ సార్, 8వ తరగతి చదువున్నా. ఎంపీ: ఈ హాస్టల్లో బాత్రూంలు, మరుగుదొడ్లు ఉన్నాయా? సందీప్ : పేరుకు చాలానే ఉన్నాయ్ సార్.. కానీ ఏ ఒక్కటీ పనిచేయడం లేదు. ఎంపీ: అందేంటీ? ఉన్నాయంటున్నావ్.. ఎందుకు పనిచేయడం లేదు? సందీప్ : అప్పుడెప్పుడో నిర్మించిన ఈ మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేదు సార్.. ఉపయోగించక పూర్తిగా పాడైనయ్. చెత్తా చెదారంతో నిండిపోయినయ్. ఎంపీ: మీరంతా ఎక్కడ స్నానాలు చేస్తున్నారు? కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నారు? సందీప్: స్నానాలు ఆరుబయట ఉన్న నల్లా కింద చేస్తున్నం. మరుగుదొడ్లు లేకపోవడంతో బయటకి వెళ్తున్నాం. రాత్రివేళలో చాలా ఇబ్బందిగా ఉంది సార్.. ఎంపీ: మీరంతా ఆటలు ఆడుకునేందుకు స్థలం ఉందా? మహిపాల్: వసతి గృహంలో ఎలాంటి ఆటవస్తువులు లేవండి. ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా లేదు. ఎంపీ: మరి మీరంతా ఖాళీ సమయంలో ఏం చేస్తున్నారు? మహిపాల్: స్కూల్ నుంచి వచ్చినంక చదువుకునేటోళ్లు చదువుకుం టరు. మిగతా వాళ్లు ఖాళీగానే ఉంటరు. ఎంపీ: వసతి గృహానికి ట్యూటర్ (టీచర్) వస్తున్నాడా? అన్ని సబ్జెక్టులకు ఉన్నారా? బాలునాయక్: ప్రస్తుతం ట్యూటర్ రావడంలేదు సార్.. మొదట్లో కొన్ని రోజులు వచ్చారు.. మళ్లీ రావడంలేదు. ఎంపీ: హాస్టల్లో రాత్రి వేళ కరెంట్ ఉంటుందా? ఏమైనా ఇబ్బందులున్నాయి? శ్రీకాంత్ : రాత్రివేళలో కరెంట్ ఉంటుంది. కానీ హాస్టల్లో వైరింగ్, లైట్లు, ప్యాన్లు సరిపడా లేవు. రాత్రిపూట కరెంట్ పోతే మాకు భయం వేస్తోంది. ఎంపీ : ఎందుకు భయం వేస్తుంది. అందరూ కలిసే ఉంటారు కదా? శ్రీకాంత్: మా హాస్టల్ గ్రామానికి దూరంగా గట్టుపై ఉండడంతో చుట్టూ ఎవరూ ఉండరు. దీనికి తోడు రాత్రి వేళ బాత్రూంకు పోవాలంటే బయటకు వెళ్లాలి.. అందుకే భయం. ఎంపీ: ఇంకా ఏమైనా సమస్యలున్నాయా? విష్ణు: హాస్టల్‌కు ప్రహరీ లేకపోవడంతో పాములు వస్తున్నాయ్ సార్.. ఎంపీ : పాములు వస్తున్నాయా..? ఎప్పుడైనా లోపలికొచ్చాయా? విష్ణు: ఓ సారి గదిలోకి వచ్చింది. అందరం బయపడిపోయి బయటకు పరుగు తీశాం. వాచ్‌మన్ వచ్చి చూసి పాము పోయిందని చెప్పిన తర్వాత లోపలికొచ్చాం. ఎంపీ: హాస్టల్ గదులను శుభ్రం చేసేవాళ్లు వస్తున్నారా? రోజూ శుభ్రం చేస్తారా? మహేందర్: మా గదులను మేమే శుభ్రం చేసుకుంటాం సార్.. ఎవరూ రారు. ఎంపీ: హాస్టల్లో ఏమైనా సమస్యలుంటే ఎవరికి చెబుతారు? శ్రీనివాస్: వార్డెన్‌కు చెబుతాం. ఎంపీ: వర్షం వస్తే గదులు కురుస్తాయా? గోవింద్: అవును సార్.. గదుల పరిస్థితి బాగాలేదు. వర్షం వస్తే కురుస్తాయి. డోర్స్ కూడా బాగాలేవు. చలి కాలం.. ఇబ్బంది పడుతున్నాం. ఎంపీ: నీటి సమస్య ఉందా? నీళ్లు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి? రజినీకాంత్: హాస్టల్‌కు ప్రత్యేకంగా బోరు లేదు సార్.. గ్రామ పంచాయతీకి సరఫరాచేసే పైపు నుంచే నీళ్లు వస్తాయి. ఎంపీ: నీటి నిల్వకు ట్యాంకులున్నాయా? రజనీకాంత్: లోపల ట్యాంకులు ఉన్నా.. అవి నిరుపయోగంగా ఉన్నాయి. ఆరు బయట వస్తున్న నల్లా నీటితోనే స్నానం చేస్తాం. ఎంపీ: ఇంకా ఇతర సమస్యలు చెప్పండి? సునీల్ : హాస్టల్ లోపల ఫ్లోరింగ్ లేదు సార్.. దుమ్ములోనే కూర్చుని భోజనం చేస్తున్నాం.. వెంకటేశ్: మా హాస్టల్లో అనేక సమస్యలున్నాయ్ సార్.. మీరే వాటిని పరిష్కరించాలి. ఎంపీ: తప్పకుండా పరిష్కరిస్తా.. మీరంతా ఒకే పాఠశాలలో చదువుకుంటున్నారా? వినయ్‌చారి: కొందరం ప్రభుత్వ పాఠశాలలో, మరి కొందరు మోడల్ స్కూల్లో చదువుకుంటున్నం. ఎంపీ: హాస్టల్ వార్డెన్ అందుబాటులో ఉంటున్నారా? లేరా? కార్తిక్:మా వార్డెన్ మ్యాట్రిన్ లావణ్యగారు.. రోజూ వస్తారు. ఎంపీ : బాగా చదువుతున్నారా? గత ఏడాది మార్కులెలా వచ్చాయ్? సరేందర్: అందరికీ గత ఏడాది మంచి మార్కులే వచ్చాయ్సార్.. ఎంపీ: ఈ ఏడాది టెన్త్‌లో అందరూ పాసవుతారా? అర్జున్: అందరం తప్పకుండా పాసవుతాం సార్. ఎంపీ: వెరీ గుడ్. బాగా చదువుకొని హాస్టల్లో ఉన్న వారంతా ఫస్టు గ్రేడ్‌లో పాసవ్వాలి. -
కార్తికం వనభోజనాల విశిష్ట మాసం
ఎవరి నోట విన్నా కేశవనామాలో, శివపంచాక్షరీ జపాలో... ఏ ఇంట చూసినా మనసును ఆనంద డోలికలలో నింపే పూజలు, కనువిందు చేసే దీపాలు... నాసికాపుటాలకు సోకే సుగంధపరిమళాలు... గంధమో, కుంకుమో, విభూదో లేదా ఈ మూడూనో అలంకరించుకుని ఆధ్యాత్మికతతో, అరమోడ్చిన కన్నులతో కనిపించే భక్తులు... ఈ వాతావరణం కనపడిందీ అంటే అది కచ్చితంగా కార్తికమాసమే! అటు హరికీ, ఇటు హరుడికీ, మరోపక్క వారిద్దరి తనయుడైనా హరిహరసుతుడికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైన మాసమిది. వనభోజనాలు, సమారాధనలు, ఉపవాసాలు, అభిషేకాలు, విష్ణుసహస్రనామ పారాయణలతో మార్మోగిపోతూ ఎంత నాస్తికుడికైనా ఆస్తికభావనలు కలుగ జేసే మాసం కార్తికమే. కార్తికమాసం స్నాన, దాన, జప, ఉపవాసాలకు, దీపారాధనలకు ఎంతో ప్రశస్తమైనదని పెద్దలు చెబుతారు. అలాగే తామస గుణాన్ని పెంపొందింప చేసే ఉల్లి, వెల్లుల్లి తదితర ఆహార పదార్థాల జోలికి వెళ్లరాదని, మద్య మాంసాల ప్రసక్తి తీసుకు రాకూడదని, ద్రోహచింతన, పాపపుటాలోచనలు, దైవదూషణ పనికి రావని కార్తిక పురాణం చెబుతోంది. ఏడాది పొడుగూతా యథేచ్ఛగా ఉండే మనం ఈ ఒక్క మాసంలో అయినా అటువంటి వాటికి దూరంగా ఉంటే నష్టం లేదు కదా! వనసమారాధనతో విశిష్టఫలాలు కారుమబ్బులు కానరాని నిర్మలమైన నింగి... ఆహ్లాదకరమైన వాతావరణం... రకరకాల సువాసనాపుష్పాలతో నిండిన పూలమొక్కల మధ్యన విందుభోజనం చేయడం కార్తికమాసం ప్రత్యేకత. తిరుపతి వెంకన్న, సింహాద్రి అప్పన్న, శ్రీశైల మల్లికార్జునుడు, వేములవాడ రాజ రాజేశ్వరుడు, కొమురవెల్లి మల్లన్న, మంగళగిరి నరసింహ స్వామి, అన్నవరం సత్యదేవుడు వెలసింది వనాలలోనే! ఈ విశిష్ఠతను గుర్తు చేసేందుకే వనభోజనం చేయడం మంచిదన్నారు పెద్దలు. అంతేకాదు, భారతీయ ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఉసిరికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ సంగతిని జనావళికి గుర్తుచేసేందుకే ఉసిరి చెట్ల కింద విస్తట్లో జరిగే విందు. శాస్త్రాన్ని, పుణ్యఫలాలను కాసేపు పక్కన ఉంచి, లౌకికంగా ఆలోచించినా వనభోజనాలు ఎంతో హితకరమైనవి. ఎందుకంటే వనాలలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాదు, కాంక్రీటు జనారణ్యాల్లోనూ, బహుళ అంతస్థుల భవనాలలోనూ చాలీ చాలని ఇరుకు గదుల్లోనూ మగ్గిపోయే పురజనులు అప్పుడప్పుడు అయినా వనాల్లోకి వచ్చి, అందరితోనూ కలసి అన్నీ మరచి హాయిగా భోజనం చేస్తే ఎంతో బాగుంటుంది కదా! మన ముందు తరాలవారు ప్రతి చిన్న అనారోగ్యాలకీ మందులు మింగించేవారు కాదు... అందుబాటులోనున్న ఏ ఆకు పసరునో పిండి, వ్రణాల మీద పోసేవారు, లేదంటే ఏ మూలికనో వాసన చూపించేవారు. ఏ చెట్టుబెరడుతోనో కాచిన కషాయం తాగించేవారు. వాటివల్ల ఏ దుష్ఫలితాలూ తలెత్తకుండా ఆయా రుగ్మతలు సహజంగానే తగ్గిపోయేవి. ఇప్పుడు ఆ సంస్కృతి దాదాపుగా అంతరించింది. కొన్ని రకాల మొక్కలు, వృక్షాలను కేవలం పుస్తకాలలోనో లేదంటే అంతర్జాలంలోనో చూసి ఆనంద పడటం తప్ప వాటిని ప్రత్యక్షంగా చూసి అనుభూతి చెందడం కష్టమైంది. అందుకోసమైనా సరే, ఈ మాసంలో పిల్లలను వెంటబెట్టుకుని వెళ్లి, పెద్దలంతా వనభోజనాలు చేయండి. ఎందుకంటే వారికి మంచీ మర్యాదా, ప్రేమ, ఆప్యాయత, నలుగురిలో నడుచుకోవడం ఎలాగో, ఏయే పదార్థాలను ఎలా తినాలో మనం ప్రత్యేకంగా నేర్పకుండానే తెలుస్తాయి. ఇంతకీ వనభోజనాలు చేయమని పెద్దలు ఎందుకు చెప్పారంటే... పత్రహరితంతోనే మానవాళి మనుగడ ముడి వేసుకుంటుందని తెలియజేయడం కోసమే! ఈ అంతస్సూత్రాన్ని గ్రహించిన నాడు మనకు పెద్దలు ఏర్పరచిన ఆచారాలు, సంప్రదాయాల ప్రాధాన్యత తెలుసుకోగలుగుతాం. - డి.వి.ఆర్. -
విషాద రాగం
ఫొటో స్టోరీ కాంతులు నిండాల్సిన కళ్లల్లో నీరు పొంగి పొర్లుతోంది. చురుకుతనం ఉండాల్సిన చూపుల్లో దైన్యత చోటు చేసుకుంది. పాలుగారాల్సిన ముఖం కన్నీటి వరదలో తడిసి ముద్దయ్యింది. హుషారుగా కదలాల్సిన చేతులు వాయులీనపు తీగెలపై విషాద రాగాలను వాయిస్తున్నాయి. ఆ దృశ్యం చూసిన ఎవరి మనసైనా చలించకుండా ఉంటుందా? ఆ చిట్టితండ్రి బాధ చూసినవారెవరి కన్నయినా చెమ్మగిల్లకుండా ఉంటుందా?! బ్రెజిల్‌కి చెందిన ఈ చిన్నారి పేరు... డీగో ఫ్రాజో టార్క్వాటో. పేదరికంలో పుట్టాడు. బాధల్లో పెరిగాడు. అలాంటి సమయంలో వారి ప్రాంతానికి జాన్ ఎవాండ్రో డిసిల్వా అనే వ్యక్తి వచ్చాడు. ఆయన డీగో లాంటి పిల్లలందరినీ చేరదీశాడు. వారికి అండగా నిలిచాడు. సంగీతం నేర్పించాడు. ప్రదర్శనలు ఇప్పించాడు. ఉపాధి మార్గాన్ని ఏర్పరచి పేదరికాన్ని దూరం చేశాడు. కానీ ఆయన ఉన్నట్టుండి అనారోగ్యంతో మరణించాడు. అది తట్టుకోలేకపోయారు ఆ చిన్నారులు. ముఖ్యంగా డీగో కదలిపోయాడు. తమ మాస్టారిని సమాధి చేస్తుంటే తన స్నేహితులతో కలిసి సంగీతాంజలి ఘటించాడు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక ఇలా కన్నీటి పర్యంతమయ్యాడు. అంతకన్నా విషాదం ఏమిటంటే... ఇది జరిగిన మూడేళ్లకి డీగో కూడా మరణించాడు... లుకేమియాతో! -
పురాతనం సనాతనం
శరీరాన్ని క్షాళన చేసుకోవడంతో పాటు, మనసునూ క్షాళన చేసుకోవాలన్నదే ఈ పుణ్యనగరం ఇచ్చే సందేశమని అనిపిస్తుంది. పార్వతిని పరిణయమాడేందుకు కైలాసాన్ని వీడి వచ్చిన శివుడు నివాసం కోసం ఎంచుకున్న నేల వారణాసి అని పురాణ గాథలు చెబుతాయి. ఈ పట్టణానికి ఉత్తరాన ఉన్న వారుణ, దక్షిణంగా ఉన్న అసి (లేదా అస్సి) అనే చిన్న చిన్న నదుల నుంచే వారణాసి అన్న పేరు వచ్చిందని ప్రతీతి. కాశీని పురాతన పట్టణంగా పేర్కొంటుంది ఋగ్వేదం. ‘బెనారస్ అంటే చరిత్ర కంటె పురాతనం... సంప్రదాయం కంటె సనాతనం’ అంటాడు మార్క్‌టై్వన్. అందుతున్న ఆధారాలను బట్టి ఈ పుణ్యక్షేత్రం 30 శతాబ్దాల నాటిది. వేదాలు, రామాయణ-భారతాలు, జైన గ్రంథాలు, బౌద్ధుల జాతక కథలు- భారతీయ ఆత్మతో అనుబంధం ఉన్న ప్రతి అక్షరం కాశీకి కైమోడ్పులర్పించినదే. హిమసానువులలో పుట్టి సాగరం వైపు బంగ్లాదేశ్‌కు సాగే అద్భుత గంగా జలహారంలో కాంతులు వెదజల్లే ఒక మణి... వారణాసి. కాశీ అన్నా అదే. కొద్దిమందికే పరిచితమైన నామం - అవిముక్త. ఆంగ్లేయులు రుద్దిన పేరు బెనారస్ లేదా బనారస్. కాశీ జ్యోతిర్లింగాలలో ఒకటి. శక్తి పీఠాలలోనూ ఒకటి. వారణాసి అంటే పరస్పర విరుద్ధ దృశ్యాల మేళవింపు. ‘హర హర మహాదేవ్!’ అంటూ విశ్వేశ్వరుడి నామస్మరణ ఒకవైపు, ‘అల్లాహో అక్బర్’ అంటూ మసీదుల నుంచి ప్రార్థనలు మరోవైపు కాశీలో సర్వసాధారణం. ఇరుకు ఇరుకు సందులనీ, వాటిలోనే నిరంతరం సంచరించే ఆవుల మందలనీ దాటుకుని వచ్చాక కంటికి నిండుగా, విశాలంగా దర్శనమిస్తుంది గంగా ప్రవాహం. త్రిపథగ, జాహ్నవి, భాగీరథి వంటి పేర్లతో ప్రసిద్ధమైన ఆ గొప్ప నది పవిత్రత గురించి విన్న గాథలు ఓ పక్క గుర్తుకు వస్తుంటాయి. మరో పక్క నదిని అడుగడుగునా కలుషితం చేస్తున్న మనిషి చేష్టలు కంటపడుతూ ఉంటాయి. పరిశ్రమల నుంచి వ్యర్థాన్ని తెచ్చి ఆ పవిత్ర నదిలో కలిపేందుకు నిర్మించిన భారీ పైపులు మరీ బాధ కలిగిస్తాయి. కానీ సగం కాలిన మృతదేహాలను గంగలోకి తోసే పద్ధతికి చాలా కాలం కిందటే స్వస్తి చెప్పారన్న విషయం సంతోషపెడుతుంది. జానెడు గోచీతో, జడలు కట్టిన జుట్టుతో, ఒళ్లంతా బంకమట్టి పూసుకుని లోకం సంగతి పట్టించుకోకుండా గంగ చిరు కెరటాల దగ్గరే గంటల తరబడి ధ్యానంలో మునిగి ఉండే బైరాగులు తీరమంతా కనిపిస్తారు. ఘాట్లకు అవతలే దుకాణాలలో పట్టు వస్త్రాలను కళ్లప్పగించి చూస్తూ ప్రపంచాన్ని మరచే భక్తకోటి కనిపిస్తుంది. కాశీని చూడడమంటే గంగను చూడడమే. సోపాన పంక్తులతో గంగను దర్శింపచేసేవే ఘాట్లు. ఎనభయ్ నాలుగు వరకు ఉన్నాయవి. అస్సి, మణికర్ణిక, దశాశ్వమేధ్, జైన్, మహానిర్వాణ్, హనుమాన్, నారద, మంగళగౌరి, సింధియా ఘాట్ - ఇలా. ప్రతి ఘాట్‌కు ఒక కథ ఉంది. ఇంకా, మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లకు ఎనలేని ప్రాశస్త్యం ఉంది. ఉత్తర జన్మ లేకుండా కాశీలో కన్నుమూయాలని వచ్చేవారు వేలాదిగా ఉంటారు. తమ పార్ధివ శరీరానికి కాశీలో గంగ తీరాన అంత్యక్రియలు జరగాలని కోరుకునే వారూ ఎక్కువే. ఈ రెండు ఘాట్లు వాటికే ప్రసిద్ధి. మోక్షాన్ని కోరి వచ్చే వారితో సహా, కాశీలో ప్రాణాలు విడిచే ప్రతి ప్రాణికి కూడా అంతిమ క్షణాలలో సాక్షాత్తు శివుడే ‘రామ’ నామాన్ని కుడిచెవిలో వినిపిస్తాడని ఓ విశ్వాసం. తరతరాలుగా ఒకే దీపం నుంచి మంటను తీసుకుని తలకొరివి పెట్టే ఆచారం మణిక ర్ణిక ఘాట్‌లో ఉంది. ఈ రెండు ఘాట్ల దగ్గరే కాక, కనీసం ఐదు చోట్ల స్నానమాచరించడం సంప్రదాయం. ప్రపంచంలో అత్యంత పురాతనమైన ఆ నగరంలో మతోన్మాదంతో జరిగిన విధ్వంసానికీ, స్పర్థలతో వర్థిల్లిన విజ్ఞానానికీ కూడా ప్రత్యక్ష సాక్షి గంగ. ముస్లిం దండయాత్రల ఆనవాళ్లు విశ్వేశ్వరుడి సన్నిధిలోనే కనిపిస్తాయి. ఔరంగజేబు ధ్వంసం చేసిన ఆలయాన్ని 1780లో ఇందోర్ మహారాణి అహల్యాబాయ్ హోల్కార్ పునరుద్ధరించింది. తరువాత సిక్కు పాలకుడు రంజిత్‌సింగ్ గోపురానికి బంగారు తాపడం చేయించాడు. పూర్వపు ఆలయాన్ని ధ్వంసం చేసిన స్థలానికి పక్కనే కొత్త ఆలయాన్ని నిర్మించారు. విశ్వేశ్వరుడి గుడి గోపురం, మసీదు గోపురం పక్కపక్కనే కనిపిస్తాయి. ఈ మసీదును జ్ఞానవాపి మసీదు అనే అంటారు. జ్ఞానవాపి అంటే పాత ఆలయం కట్టిన స్థలం పేరు. ఒక్క గోడే అడ్డు. అన్నపూర్ణ మందిరం దాటాక శివాలయం కనిపిస్తుంది. ఎప్పుడైనా కావచ్చు, కాశీలో మొత్తంగా రెండు వేల ఆలయాలు వెలిశాయని చెబుతారు. వాటిలో ఐదు లక్షల ప్రతిమలు కొలువైనాయనీ అంటారు. కాశీ ఆధ్యాత్మికంగా ఎంత ప్రఖ్యాతమో, జ్ఞానానికి కూడా అంతే పేర్గాంచింది. మహామహోపాధ్యాయ మకుటాలను అలంకరించిన కాలం నుంచీ మదన్మోహన్ మాలవీయ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నిర్మించే వరకు ఆ ఖ్యాతి నిలబడే ఉంది. సంస్కృత విద్యకు వారణాసి విశ్వ ప్రఖ్యాతి గాంచిన పీఠం. జైన, బౌద్ధ గురువులూ కాశీని సందర్శించారు. జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడు ఈ నగరం వాడే. బుద్ధుడు జ్ఞానం పొందిన తరువాత తొలి సందేశం ఇచ్చిన సార్నాథ్ కాశీ శివార్లలోనే ఉంది. ‘అష్టాధ్యాయి’ రచయిత పాణిని, ఆచార్య త్రయం (శంకరాచార్యులు, రామానుజులు, మధ్వాచార్యులు) బసవన్న గంగాస్నాన మాచరించినవారే. మొగలుల కొలువులో పని చేసిన జగన్నాథ పండితరాయలు ఆ నది ఒడ్డుకు లవంగితో కలసి వచ్చి 53 శ్లోకాల ‘గంగా లహరి’ని ఆలపించాడు. తన లాక్షణిక గ్రంథానికి రసగంగాధరమనే పేరు పెట్టుకున్నాడాయన. పెద కోమటి వేమారెడ్డితో కాశీ వచ్చిన శ్రీనాథుడు, అపారమైన ప్రేమతో స్కాందపురాణంలోని కాశీ ఖండాన్ని అనువదించే పనికి శ్రీకారం చుట్టాడు. గౌతమి తీరంలో ఆ అనువాదం పనిని పూర్తిచేశాడా ‘ఈశ్వరార్చన కళాశీలుడు.’ ఝాన్సీ లక్ష్మీభాయి ఇక్కడే పుట్టింది. ఆమె వీరగాథతో పాటు కబీర్ కవితలనూ ఆ నది విన్నది. ‘అన్ని జీవుల గొంతుకలు ఆ నది గొంతుకలో ఉన్నాయి’ అంటాడు హెర్మన్ హెస్ తన అద్భుత నవల ‘సిద్దార్థ’లో. కాశీ, పక్కనే కొద్దిపాటి ఒంపుతో ప్రవహించే గంగ ఆధునిక కాలంలోనూ రచయితలనీ, కవులనీ ఆకర్షిస్తూనే ఉంది. అందుకేనేమో, హెస్ తన నవలలోనే మరోచోట, ‘అది జీవ శబ్దం. నిత్యంగా వుంటూ, తెంపు లేకుండా మారుతూ ఉండే శబ్దం ఆ నది’ అంటాడు. గోస్వామి తులసీదాస్ ‘రామ చరితమానస్’ గంగ ఒడ్డున కూర్చుని రాశాడని చెబుతారు. ఆయన పేరిట ఒక ఘాట్ కూడా ఉంది. విభూతిభూషణ్ బంధోపాధ్యాయ పథేర్పాంచాలీ, అపరిచితుడు నవలల్లో, శరత్‌బాబు వాక్యాలలో గంగ గలగలలు వినిపిస్తూనే ఉంటాయి. రవీంద్ర కవీంద్రుడు వంగ దేశంలోని ఘాజీపూర్ నుంచి వారణాసికి పడవ ప్రయాణం చేశారు. ఆ యాత్ర లోనే నౌకాభంగం, చోఖెర్బాలి అనే రచనలకు అంకురార్పణ జరిగింది. గంగాతీరంలోని మార్మికత, కాశీ ఆధ్యాత్మిక శక్తులను అక్షరబద్ధం చేయడానికే ప్రేమ్‌చంద్ ‘సేవాసదన్’ నవల రాశారని అనిపిస్తుంది. కొన్ని పురాతన సంప్రదాయాలను ఆ మహా రచయిత నిరసించినా ఆ చరిత్రాత్మక ఘాట్ల మధ్య ‘ప్రేమ్‌చంద్ ఘాట్’ కూడా వెలిసింది. ఏనుగుల వీరాస్వామయ్య ‘కాశీయాత్ర చరిత్ర’ రాశారు. తెలుగువారు ఎందరు కాశీ పండితులుగా అవతరించారో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారు తన ‘కాశీయాత్ర చరిత్ర’లో ఎంత రమణీయంగా వర్ణించలేదు! వీరంతా అక్షరాలతో ఆ ప్రవాహాన్ని ఆరాధిస్తే, తన షెహనాయ్ నాదంతో పూజించిన మహా కళాకారుడు బిస్మిల్లాఖాన్. మీరొచ్చి అమెరికాలో స్థిరపడకూడదా! అని ఎవరో అడిగితే, అక్కడ గంగ లేదు మరి! అని సమాధానం ఇచ్చిన ఆరాధకుడాయన. ఇక్కడ పుట్టాడు కాబట్టే పండిట్ రవిశంకర్ సితార్ వాదనం గంగా ఝరిలా ఉరుకుతుంది. పగలంతా భక్తుల స్నానాలతో రంగుమారిపోయే గంగ, రాత్రి వేళ కాంతి రేఖలను అలంకరించుకుంటుంది. చీకట్లు ముసిరాక, ఘాట్ల సోపానాల మీద నుంచి నిత్యం గంగమ్మకు ఇచ్చే దీపాల హారతి ఓ అందమైన వేడుక. ఒకే రకం వస్త్ర ధారణతో, భారీ దీపపు గుచ్ఛాలతో, మంగళవాద్యాల నడుమ, భక్తి గీతాలాపన మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనిని నదిలోనే పడవల మీద కూర్చుని వీక్షించవచ్చు. గుహుడి వారసులుగా చెప్పుకునే ఒక తెగవారు పడవలను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. లేదా గట్టునే భక్తకోటితో కూర్చునీ చూడొచ్చు. హారతి పడుతూ మెట్ల మీద నిలబడి గుండ్రంగా తిప్పే దీపపుగుత్తుల వెలుగులతోనూ, పుణ్యస్త్రీలు అరటిదొప్పలలో వెలిగించి నదిలో విడిచిపెట్టే దీపాలు కెరటాల మీద వయ్యారంగా సాగిపోతూ చిందించే చిరు వెలుగులతోనూ కొన్ని గంటల సేపు గంగ కిన్నెరలా మెరిసిపోతుంది. ఆ నిశిలో కన్ను ఎటు తిప్పినా ఈ సుందర దృశ్యమే కనిపిస్తుంది. కాశీ అంటే దీపకాంతుల నగరమని అర్థం. హిందూ చింతనలో వెలుగుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కారణం ఏదైనా నేటికీ ఆ కాంతుల నగరి హిందువుల గుండెలను స్పందింపచేస్తూనే ఉంది. గంగతో శరీరాన్ని క్షాళన చేసుకోవచ్చు. మనసును క్షాళన చేసుకోవాలంటే ఒక్క జ్ఞానంతోనే సాధ్యమన్న సందేశం అక్కడ వినిపిస్తుంది. కాశీ, గంగ, మణికర్ణిక మనకి వెల్లడించే సత్యం ఇదే. మనసుని క్షాళన చేసే జ్ఞానానికి ప్రతీకే వెలుగు. తమసోమా జ్యోతిర్గమయ. - డాక్టర్ గోపరాజు నారాయణరావు -
ఆనంద దర్శనం
జెన్ పథం దీపాలు వేర్వేరు రూపాలలో ఉండొచ్చు. కానీ వెలుగు ఒక్కటే. జ్ఞాని వెలుగు ఒక్కటే చూస్తాడు. అంతే తప్ప అతను దీపాల రూపాలలోని తేడాను చూడడు. కానీ అజ్ఞాని అలాకాదు. దీపాల రూపాలలో ఉన్న తేడాను మాత్రమే చూస్తాడు. వాటి రూపాలను పొగుడుతాడు. అందులోనే లీనమైపోతాడు. దాని గురించే మాట్లాడుతుంటాడు. పెపైచ్చు వెలుగును చూడటం మాని వాటి ఆకారాలనే ఆరాధిస్తాడు. ప్రపంచం అజ్ఞానుల చేతుల్లో ఉంది. అందుకే దీపమైనా అది నరకంగానే ఉంది. కానీ ఆ దీపమే సత్యజ్ఞాని చేతిలోకొస్తే స్వర్గమవుతుంది. ప్రపంచంలో జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు అనేకమున్నాయి. అయినా వాటి మూలం ఒక్కటే. అది సత్య జ్ఞానం. సత్యాన్ని దర్శించడం. ఆకాశానికి ఎల్లలు లేవు. అలాగే ఎత్తుకూ ఎల్లలు లేవు. రెక్కల శక్తి మేరకు ఎత్తుంటుంది. ఎత్తుకు తగినట్లు దర్శనభాగ్యం కలుగుతుంది. ‘‘దేవుడా, సముద్రాన్ని చూసుకుంటూ సాగిపోయే నదుల్లా మేమందరం నీ దిశలో నీ దర్శనం కోసం అడుగులు వేస్తూనే ఉన్నాం. మాకెప్పుడు మోక్షం ప్రసాదిస్తావో తెలియడం లేదు...’’ అని ఒక భక్తుడు మొరపెట్టుకున్నాడు. ఇక ఆనందం. ఆనందం అనేది కాస్సేపు ఉండిపోయే అతిథిలాంటిది. ఆవేదన అనేది ఎప్పుడూ మనతో ఉండే సొంతమనిషిలాంటిది. తత్వార్థంగా చెప్పాలంటే, ఆవేదన అనేది మరేదో కాదు. అది ఆనందంలో కలిసే ఉంటుంది. ఈ నిజాన్ని తెలియని వారు వాటిని వేర్వేరుగా చూస్తారు. బాధ పడతారు. కానీ సత్యజ్ఞాని రెండింటినీ సమానంగా స్వీకరించి స్థితప్రజ్ఞుడనిపించుకుంటాడు. - యామిజాల -
పొదుపు చేస్తేనే వెలుగు
సాక్షి, ఒంగోలు : మనిషి జీవనానికి ఆహారం ఎంత అవసరమో.. సౌకర్యవంతంగా జీవించడానికి విద్యుత్ కూడా అంతే. విద్యుత్తే లేని ప్రపంచాన్ని ఊహించలేం. రోజురోజుకూ విద్యుత్ అవసరాలు పెరిగిపోతున్నాయి. ఆ స్థాయిలో ఉత్పత్తి లేదన్నది వాస్తవం. భవిష్యత్తరాలకు విద్యుత్ వెలుగులు అందాలంటే..? అందుకు పొదుపే శరణ్యం. మరోవైపు పునరుద్ధరణీయ విద్యుత్ వనరులపై కూడా దృష్టిసారించాలి. ఆధునిక యుగంలో ఎన్నో రకాల ఆధునాతన గృహోపకరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నింటికీ విద్యుత్ అవసరం. ఎల్లవేళలా సదుపాయాలు పొందడానికి యథేచ్ఛగా విద్యుత్‌ను వినియోగిస్తుంటాం. దీనివల్ల విద్యుత్ కొరత తలెత్తుతుంది. అందుకే మన వంతు బాధ్యతగా విద్యుత్‌ను పొదుపు చేద్దాం...అదెలా అంటారా...! ఇవిగో సూచనలు. లైట్లు, ఫ్యాన్లు వీలైనంత వరకు సహజమైన వెలుతురు, గాలి ఉపయోగించడం మంచిది. అవసరం లేనపుడు లైట్లు, ఫ్యాన్లు ఆపేయాలి. ఫిలమెంట్ బల్బులకు బదులు తక్కువ విద్యుత్‌తో నాలుగు రెట్లు అధికసామర్థ్యం, అంతే వెలుగునిచ్చు సీఎఫ్ఎల్ బల్బులు ఉపయోగించాలి. టీ5 తరహా ట్యూబ్లైట్లను వాడాలి. బల్బు/ట్యూబ్లైట్లను నెలకోసారి శుభ్రపరచాలి. ఫ్యాన్లకు ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్ అమర్చుకోవాలి. ఎల్ఈడీ బల్బుల ద్వారా విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. 50 వాట్స్ సీలింగ్ ఫ్యాన్లను వాడండి. ఫ్యాన్ బేరింగ్‌లకు ప్రతి సంవత్సరం గ్రీజ్ పెట్టించడం ద్వారా 5 శాతం విద్యుత్ ఆదా చేయొచ్చు. రిఫ్రిజిరేటర్ {ఫిజ్ డోర్ వీలైనన్ని తక్కువసార్లు తెరవండి ఫ్రిజ్ థర్మోస్టాట్‌ను మధ్యస్థంగా సెట్ చేయండి. వేడి ప్రదేశాల నుంచి సాధ్యమైనంత దూరంగా పెట్టండి. ఫ్రిజ్‌ను గోడకు కనీసం అరడుగు దూరంలో, గాలి బాగా వీచే ప్రదేశంలో ఉంచాలి. డిఫ్రాస్టేషన్ రెగ్యులర్‌గా చేసి ఐస్ గడ్డకట్టకుండా చూసుకోవాలి. ఫ్రిజ్ డోరుకుండే రబ్బరు సీలింగ్ టైట్‌గా ఉంచుకోవాలి. ఫ్రిజ్‌లో చల్లదనం లేకున్నా.. ఎక్కువసార్లు కంప్రెసర్ ఆన్/ఆఫ్ అవుతున్నా.. ఫ్రిజ్ బాడీ బాగా వేడెక్కుతున్నా మెకానిక్‌తో చెక్ చేయించండి. వేడి పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టొద్దు. ఫ్రిజ్‌ను పడకగదిలో ఉంచొద్దు. ఎక్కువ రోజులు ఇంట్లో లేనపుడు ఫ్రిజ్ ఆఫ్ చేయండి. గీజర్లు అవసరమైనపుడు మాత్రమే గీజర్ ఆన్‌చేయండి. థర్మోస్టాట్ సెట్టింగ్‌ను 35-40 డిగ్రీల మధ్య ఉంచండి. గీజర్ స్విచ్‌ను బాత్రూమ్లో ఏర్పాటు చేసుకుంటే.. వెంటనే ఆఫ్ చేసుకోవడానికి అనుకూలం. అపార్టుమెంట్లు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, కమ్యూనిటీ క్లబ్‌లు, క్యాంటీన్లలో విధిగా సోలార్ హీటర్లు ఏర్పాటు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు సోలార్ హీటర్కే ప్రాధాన్యమివ్వండి. వాషింగ్ మెషీన్లు వాషింగ్ మెషిన్లో దుస్తులు వేసే ముందు వాటిని బాగా నానబెట్టండి. వాషింగ్ మెషీన్లను ఒకటి రెండు జతల కోసం కాకుండా.. ఫుల్ లోడ్ వ ద్ద ఉపయోగించండి. తక్కువ టైమర్‌ను సెట్ చేసుకోండి. సరైన పాళ్లలో మాత్రమే నీటిని, డిటర్జెంట్‌ను వాడండి. రిన్స్ చేయడానికి చల్లని నీరు మాత్రమే వాడాలి. వీలైనంత వరకు ఎలక్ట్రిక్ డ్రైయింగ్ను వాడొద్దు. ఏసీలు సాధారణ చల్లదనానికి 24 డిగ్రీలు సెట్ చేసుకోండి. సెట్టింగ్ తగ్గించడం(డిగ్రీలు పెంచడం) వల్ల ప్రతి సెంటీగ్రేడ్‌కు కనీసం 5 శాతం విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. ఒక సీలింగ్ ఫ్యాన్ ఆన్‌లో ఉంచడం ద్వారా ఏసీని కొంచెం అధిక ఉష్ణోగ్రత వద్ద సెటింగ్ ఉంచొచ్చు. ఏసీ ఆన్‌లో ఉన్నపుడు తలుపులు, కిటికీలు మూయాలి. కిటికీలకు సన్‌ఫిల్మ్/ముదురు రంగు కర్టెన్లు వాడండి. ఇంటి పైకప్పుపై కూల్‌హోమ్ పెయింట్/రూఫ్‌గార్డెన్ పెంచడం ద్వారా ఏసీపై లోడు తగ్గుతుంది. ఏసీకి దగ్గర బల్బులు, టీవీలు ఉంచొద్దు. దీని వల్ల థర్మోస్టాట్ సెట్టింగ్‌పై ప్రభావం ఏర్పడుతుంది. ఏసీ యూనిట్‌పై గాలి నిరోధించకుండా చెట్ల నీడను పడేలా చూసుకోండి. బయటికి వెళ్లాలనుకునేటపుడు గంట ముందుగానే ఏసీని ఆఫ్ చేయండి. ఏసీ రూములో అనవసర వస్తువుల్ని ఉంచొద్దు. టీవీలు, కంప్యూటర్లు అవసరంలేనపుడు స్విచాఫ్ చేయండి. టీవీల రిమోట్ ఆఫ్ చేయడం వల్ల, కంప్యూటర్లు లాగ్ ఆఫ్ చేయడం వల్ల విద్యుత్ వృథా అవుతుంది. అవసరంలేనపుడు సెల్‌ఫోన్ చార్జర్లు, దోమల మెషీన్లు ఆఫ్ చేయాలి. వంట గది పరికరాలు పదార్థాలను ముందుగా నానబెట్టడం ద్వారా మిక్సీ విద్యుత్ వాడకం తగ్గించొచ్చు. సాధ్యమైనంత వరకు పొడి పదార్థాల గ్రైండింగ్ను నిరోధించండి. ఎలక్ట్రిక్ స్టౌలకు బదులు మైక్రోవేవ్ ఓవెన్ వాడకం ద్వారా 50 శాతం విద్యుత్ ఆదా చేయొచ్చు. చెక్ చేసేందుకు మైక్రోవేవ్ ఓవెన్ తెరవడం ద్వారా, ప్రతి ఒక్కసారికి 25 డిగ్రీల వేడి వృథా అవుతుంది. ఎక్కువ పదార్థాలను ఓవెన్లో బేక్ చేయొద్దు. ఎలక్ట్రిక్ స్టౌలు వాడేటపుడు నిర్ధారిత సమయానికి ముందే స్టౌను ఆఫ్ చేయండి. అడుగు భాగాన సమతలంగా ఉన్న స్టౌల వల్ల వేడి సమర్థవంతంగా వ్యాపించి, విద్యుత్ ఆదా అవుతుంది. గ్యాస్ స్టౌలు వాడుతున్నపుడు మంటను నియంత్రించుకుని, నీలి రంగు మంట వచ్చేలా చూసుకోండి. పసుపు రంగు మంట వస్తే బర్నర్ శుభ్రం చేయాలి. ప్రెషర్ కుక్కర్, ప్రషర్ ఫ్యాన్లను వాడండి. కుక్కర్ గ్యాస్కెట్, లిడ్స్ను సరిగా ఉంచుకోవాలి. ఫ్రిజ్ నుంచి బయటికి తీసిన పదార్థాలను వెంటనే స్టౌపై పెట్టకుండా కాసేపు బయటే ఉంచండి. బాగా చల్లని పదార్థాలను ఓవెన్లో పెట్టొద్దు. ఎలక్ట్రిక్ కుక్కర్ కన్నా.. ప్రెషర్‌కుక్కర్ ద్వారా ఇంధనం ఆదాతోపాటు, ఆరోగ్యకరం. కీప్వార్మ్ అనే స్విచ్గల రైస్ కుక్కర్వాడకం ద్వారా 30 శాతం విద్యుత్ ఆదా చేయొచ్చు. వ్యవసాయదారుల పొదుపు చర్యలు పంప్సెట్లకు సరిపడు కెపాసిటర్‌ను వాడండి. ఐఎస్ఐ మార్కుగల మోటార్ పంప్సెట్ల, పైపులను మాత్రమే వాడండి. సక్షన్, డెలివరీలలో మెలికలులేని హెచ్డీపీఈ/ఆర్పీవీసీ పైపులను వాడండి. రాపిడిలేని ఫుట్ వాల్వులు వాడండి. విధిగా చాలినన్ని కెపాసిటర్లను వాడండి.