సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం రా త్రి 9 గంటలకు విద్యుత్ దీపాలను ఆ పి 9 నిముషాల పాటు కొవ్వొత్తులు లే దా ప్రమిదలు వెలిగించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. కరోనాపై దేశం సమిష్టిగా చేస్తున్న యుద్ధానికి సంఘీభావంగా దీపాలు వెలిగించాల్సిందిగా కోరారు. ఇళ్ల ముంగిట, బాల్కనీల్లో దీపాలు వెలిగించి సంఘీభావం ప్రకటించాలని, రోడ్లపై బృందాలుగా రావొద్దని గవర్నర్ తమిళిసై సూచించారు.
సహృదయ ఫౌండేషన్ విరాళం
గవర్నర్ పిలుపు మేరకు ‘కొవిద సహృదయ ఫౌండేషన్’శనివారం నీలోఫర్ ఆసుపత్రికి సబ్బులు, శానిటైజర్లు, మాస్కులు తదితరాల ను విరాళంగా అందజేసింది. ఫౌండే షన్ వ్యవస్థాపకుడు జి.అనూఖ్యరెడ్డి రాజ్‌భవన్‌లో ఈ సామగ్రిని నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ జి.అనురాధకు అందజేశారు. 500 సబ్బులు, 250 లీటర్ల శానిటైజర్, మాస్కులు ఇతరాలను అందజేశారు. వీటితో పాటు రాజ్ భవన్ పరిసరాల్లో పనిచేసే జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందికి మాస్కులతో పాటు ఆహార ప్యాకెట్లను కూడా అందజేశారు. లాక్‌డౌన్ కొనసాగినన్ని రోజులు రాజ్‌భవన్ పరిసరాల్లో పేదలకు ఉచితంగా ఆహారం అందజేస్తామని గవర్నర్ సంయుక్త కార్యదర్శి జె.భవానీ శంకర్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment