![Tamilisai Soundararajan wished people new year - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/1/TAMILISAI%20%202.jpg.webp?itok=kpQueM4V)
సాక్షి, హైదరాబాద్ / సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శ్రేయస్సును తీసుకురావాలని, వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకున్నారు.
2024లో సైతం అన్ని రకాల సామాజిక రుగ్మతలపై పోరాటాన్ని విజయవంతంగా కొనసాగించడంతో పాటు, సమానత్వం, శాంతియుత, సుస్థిర, ఆరోగ్యకర సమాజం కోసం కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment