పుష్కర ఘాట్లకు విద్యుత్ సొబగులు
Published Thu, Aug 11 2016 7:47 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
గుంటూరు (నగరంపాలెం) : పుష్కర ఘాట్లకు విద్యుత్ సొబగులు అద్దుతున్నారు. ఘాట్లలో నిరంతరం విద్యుత్ వెలుగులు అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేశారు. తెల్లవారజాము నుంచి అర్ధరాత్రి వరకు పుష్కర స్నానాలు నిరంతరం కొనసాగనున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. లైటింగ్ ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను విద్యుత్ శాఖకే అప్పగించారు. జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్లు, పుష్కరనగర్‌లలో 8000 కిలోవాట్ సామర్ధ్యం ఉన్న విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. వీటిలో 1000 వాట్ సామర్ధ్యం ఉన్న 1,500 దీపాలు, 500 వాట్ సామర్ధ్యం ఉన్న 1,500 దీపాలతో పాటు ఏ1, ఏ క్యాటగిరీ ఘాట్‌లు, పుష్కరనగర్‌లలో 35 హైమాస్ట్ లైటింగ్ టవర్లు ఏర్పాటు చేశారు. భక్తుల భద్రత దృష్ట్యా జిల్లాలోని స్నాన ఘాట్‌లు, పుష్కరనగర్‌ల వద్ద విద్యుత్ సరఫరాకు 72.95 కిమీ 11 కెవీ కవర్డు కండక్టరును వినియోగించారు. ఏ1, ఏ పుష్కర ఘాట్‌ల వద్ద ఏడీఈస్థాయి అధికారి, బీ, సీ ఘాట్‌లకు ఏఈస్థాయి అధికారి ఇన్‌చార్జిగా ఉంటారు.
సిబ్బంది సిద్ధం..
ఘాట్‌ల వద్ద 549 మంది, పుష్కరనగర్‌ల వద్ద 188 మంది బ్రేక్ డౌన్ సర్వీసులు సరిచేయటానికి 386 మందితో 43 క్విక్ రెస్పాన్స్ టీంలకు మూడు షిఫ్టులుగా విధులు కేటాయించారు. సిబ్బంది పనితీరు పర్యవేక్షించటానికి ఇద్దరు ఏడీఈలపై ఒక డీఈని, నలుగురు ఏడీఈలకు ఒక ఏడీఈని నియమించారు. జిల్లా ఎస్‌ఈ బి జయభారతరావుతోపాటు డిస్కం కార్యాలయం నుంచి చీఫ్ ఇంజనీరు బి. సంగీతరావు, సూపరింటెండెంట్ ఇంజనీరు జి. నాగశయనరావు, డీఈ సీఏ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ప్రత్యేక అధికారులుగా నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించటానికి ఏ1, ఏ ఘాట్లకు విద్యుత్ సరఫరా కోసం 40 జనరేటర్లు సిద్ధం చేశారు. జిల్లాలో అమరావతి, పెనుమూడి, సత్రశాల, మందడం, వీపీసౌత్‌లలో మెటీరియల్‌తో కూడిన కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. విద్యుత్ సిబ్బందితో నిరంతర కమ్యూనికేషన్ కోసం 100 వైర్‌లెస్ సెట్లు వినియోగించనున్నారు. విద్యుత్ సిబ్బందిని వెంటనే గుర్తుపట్టే విధంగా ప్రత్యేక యూనిఫాంతో డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నారు. విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి రక్షణ నిమిత్తం చేతి తొడుగులతో పాటు కటింVŠ Sప్లేయర్లు, ఇన్స్‌లేషన్ టేప్‌లతో సహా పూర్తి కిట్ బాక్స్‌ను అందిస్తున్నారు.
జిల్లా కార్యాలయంలో కంట్రోల్ రూం..
యాత్రికులకు నిరంతరం సేవలు అందించడానికి జిల్లా కార్యాలయంలో 24 గంటలు పని చేసే కంట్రోల్ రూంను ఏర్పాటు చేశాం. ఈ కంట్రోల్ రూం నుంచి సహాయం, సమాచారం పొందాల్సిన వారు 9440817526 నెంబరుకు ఫోన్ చేయవచ్చు. నిరంతరం విద్యుత్ సరఫరా కోసం పటిష్టమైన చర్యలు తీసుకున్నాం. ఘాట్‌లకు, పుష్కరనగర్‌లకు విద్యుత్ సరఫరా చేసే స»Œ æస్టేçÙన్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. ఆల్ట్రానేటివ్ లైన్లు కూడా అందుబాటులో ఉంచాం.
– బి.జయభారతరావు, ఎస్‌ఈ
వైర్‌లెస్ సెట్లతో అప్రమత్తంగా విద్యుత్ సిబ్బంది
ఎస్‌ఈ బి. జయభారతరావు వెల్లడి
Advertisement
Advertisement